నిలువరించలేని మనసుకి నిలకడైన నిశీథికి నడుమ
నిశ్శబ్దబేధి టిక్ టిక్మనే ఈ గోడగడియారం
పలుమార్లు పరికించినా పలుకరింపులేవీ మోసుకురాని నా జీవితకొలమానం
సెగల పొగల వీడిపోయే నీటి ఆవిరి వెంట
పొంగి పొర్లిపోయే పాలలా నిట్టూర్పుగానం
వెతల నంటి కమ్ముకొచ్చే కలత చెంత కరిగి చెదిరే కన్నీటిశోకం
విన్నపాలు వినిపించుకో మనసమ్మా?
సొమ్మసిల్లిపోకే చివురుకొమ్మలా, ఎండమావి తీర్చునా నీ దాహార్తి?
కడలి కదులునా తన దరికి రాని నది కొరకు?
సాగి సాగి అలసి సొలసి ఆగి సాగి తానె చేరాలి కాని.
baagundandi.
ReplyDeleteకృతజ్ఞతలు. అనుకున్నంత వతనుగా నా blogని ముందుకు జరపలేకపోతునాను. అది అలసతో, అలసటో తెలియదు. కాని అపుడపుడు మనసు మరీ మనియాద పడ్డప్పుడు ఇలా వ్రాసుకుపోతుంటాను. మీ కవితలన్నీ చాలా బాగునాయి. తమ్ముడి మీద మీరు వ్రాసిననట్లుగా నేను "వాడు-నేను" అని మా అన్నయ్య మీద వ్రాసుకున్ననిదివరలో. చాల దగ్గరి పోలికవుంది. ఇంకా కొన్ని వున్నాయి అనిపించిందీ. మన ఈ భావసారూప్యంతో అడుగుతునాను - నాతో కలం స్నేహం చేస్తారా?
ReplyDeletesure.naa id rrk2k3@gmail.com.
ReplyDelete