వానతల్లి - వేగిరపడకే కూసింత పరుగాపవె

లక్షపత్రి నోము పట్టి ధరణిబాల
కోటిదివ్వె పూజ చేసి మేఘమాల
వానతల్లికి వాయనానికి కబురు పంపాయట!
మెరుపు బిడ్డని ఒడిన పట్టి,
ఉరుము బిడ్డని వీపున కట్టీ,
తెగ హైరానాగా వురుకులెడుతుంది,
నుదిటి బొట్టు మంచు కుప్పలుగా ఒలకపోసుకెళుతోంది!!

7 comments:

  1. Chalaa baaguntunnaayandi mee kavitvalu.

    By the way, please disable word verification for comments

    ReplyDelete
  2. సరళంగా, భావయుక్తంగా బావున్నాయి, ఉషా. ఇంతవరకూ నేను చూడనేలేదు. మీరు మధ్యలో చాలాకాలం ఏం రాయడంలేదే అనుకున్నాను. తిరిగి మొదలు పెట్టినందుకు సంతోషం.

    ReplyDelete
  3. ధన్యవాదాలు లక్ష్మి గారు. I've disabled the word verification. Please do visit me again and again.
    పొగడ్త పన్నీరువంటిది చల్లుకోవటానికే కాని తాగటానికి పనికి రాదు [చదివి మనసుకి వంటబట్టించిన పాఠం]
    ఇక ఈ బ్రతుకు పయనంలో, వేల మజిలీల్లో నేర్చినవి...
    ప్రశంస పాలవంటిది - దాహం తీర్చలేదు
    కళాదాహం తీర్చేవి - భావసారూప్యం, సహవాసుల సామీప్యం. That's why please see me soon in here.
    హమ్మయ్య! వచ్చి చూసి వెళ్ళారు,అదే చాలు మాలతి గారు. నాకు సాహిత్యపరంగా చదవటం జలాహారం, వ్రాయటం ఘనాహారంవంటివి. ఈ మధ్య ఉపవాసాలు చేయటం వ్యసనమైపోయింది. అందులోనూ బద్దకానికి బంధువుని, అపుడపుడు వచ్చితిష్ట వేస్తుంది. ఆ పై "చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నట్లు" వదిలి వెళ్ళనని ఏడ్చి మారాం చేస్తుంది :) దాని గాలి నా మీద మళ్ళనంత వరకు నేను నేనే తదుపరి దాని ఆటబొమ్మనే. అయినా ఈ కూడలికొచ్చి నిజ్జం కూడు,నీళ్ళు వదిలేస్తానేమొనని కొంచం భయం కూడావుందిలెండి. మనసుకి పూనకం పట్టినట్లో, గుండెరోగికి రక్తం ఎక్కించినట్లో అపుడపుడూ మటుకు ఇలా ... చాలా చాలా ధన్యవాదాలు.

    ReplyDelete
  4. ఉషగారూ
    "ఉరుము బిడ్డని ఒడిన పట్టి, మెరుపు బిడ్డని వీపున కట్టీ" కంటె "ఉరుము బిడ్డని వీపున కట్టి, మెరుపు బిడ్డని ఒడిన కట్టి" అంటే ఇంకా బావుండేదేమో! మొదట మెరుపు కనబడుతుంది కాబట్టి!?

    ReplyDelete
  5. ధన్యవాదాలు, మార్చేస్తాను లేండి, నాకు భేషజాలు లేవు. నేనూ మీ కట్టులా అనుకున్నాను. కాని వురుము లోని "వు" కి "ఒడిని" లోని "ఉ" కి, మెరుపులోని "ఎ" కి "వీపు" లోని "ఏ" కి ప్రాసగా ఇలా వ్రాసాను.

    ReplyDelete
  6. వావ్! చాలా బాగుంది.

    కానీ వానను ఆపద్దూ.. పడనివ్వండి.. అదెప్పుడూ నాకోసమే వస్తూ ఉంటుంది! :-)

    ReplyDelete
  7. అలాగేలేండి, పూర్ణిమ. అవసరపడితే జలయజ్ఞం కూడా చేద్దాం. చిరునామా చెప్పండి, ఆహ్వానమంపిస్తా ;)

    ReplyDelete