ఇదింక నీది అని నాన్న నా చేతికిచ్చిన వులి,
ఇది కూడా నీదేనని అన్న అందించిన సుత్తి,
నాచేతికింకా రానిదే నావేనని ఎలాచెప్పను మరి.
అందుకే నా కళ ఇప్పటికీ అసంపూర్తి.
సగం చెక్కిన నిన్ను చూపారు, పూర్తిచేసేది నేనేనన్నారు.
వులి తాకిడికి వణుకుతావేమో అని నాన్న,
సుత్తి పోటు నీకు తగలనీయనని మా అన్న,
నా చేతులు రెండూ తమ చేతులతో కప్పి వుంచారు.
శిల్పం నవ్వింది నన్ను చూసేనా?
నన్ను వదలని నా వాళ్ళని చూసా?
మలచటం రాదని నవ్విందా?
మలిచేదింకేమీ లేదని నవ్వుతూ చెప్తోందా?
ఇపుడద్దం ముందర నిలుచుంటే,
నేనే శిల్పంలా తోస్తున్నాను, నేనూ సగంగానే మిగిలున్నాను.
నిన్ను నాకిచ్చిన నీ వారు, నన్ను వదలని నా వారు అలానే వున్నారు.
అవును మనమంతా పూర్తి కాని జీవాలం, ఈ సంఘం చెక్కిన శిల్పాలం!
kavitha baagundi.
ReplyDeletetemplate inka baagundi.
sagam chekkina mi shilpam kanna purtiga chekkina mi template minna.ayina e rojullo evadi shilpam vade chekkukovali tallidandrulu uli sutty ivvadam varake aa tarvata sagam chekkina shilpama , sangham chekkuna shilpama kalame nirnayinchali.
ReplyDeleteసుజ్జీ! మీ మాట అంత మున్ముందుగా చెప్పేసినందుకు కృతజ్ఞతలు + నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteరవి గారు, నిజమేనండి. మీరన్న సత్యం గ్రహించతానికి ఎంతో కాకపోయినా కొంత కాలం పట్టింది, నా మొద్దుబుఱ్ఱకి ;) ఓల్గా గారు ఒకసారి ప్రస్తావించారు - తనకు ఇనప రెక్కలు కట్టి, ఇక నీవు స్వేచ్చ జీవివి పైకెగరవచ్చునని చెప్పినట్లుగావుంటుంది అనని [please note, I have not referred back to my notes for the exact text, lest I must have conveyed the soul of it, however] ఇక కాలం మాటంటారా - ఆగితే బాగుండునన్నట్లుగా వుంటే పరుగులిడి, కరిగితే బాగుండునన్నట్లుగా వుంటే గడ్డకట్టి నన్ను చంపే దాన్నేమ్నమ్ముకోను చెప్పండీ? అందుకని అన్ని పనులు ఆపేసి, ఈ కూడలిల్లో తచ్చాడుతుంటున్నాను, మీ బోటి వారితో ఇలా గోడు వెళ్ళబోసుకోవచ్చని. ధన్యవాదాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఉషగారు రవి ఉషోదయం లో ఉన్నంత అందం గా మిట్ట మద్యాన్నం ఉండడు.మళ్ళి సాయం సంధ్య సమయం లో సముద్రపు వొడ్డున కుర్చుని ఆ ఎర్రటి బింబం సముద్రం లోకి జారి పోతుంటే చూస్తూ ఎంతొ గొప్ప అనుభూతి కి లోనవుతాం. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఒకే రవి వివిధ కాలాల్లో మనలో విభిన్న భావాల్ని కలగ చేస్తాడు. అంటే కాలం బట్టి మనలో భావాలూ మారతాయి.కాబట్టి కాలమనే గాలానికి చిక్కిన మనం మనకి బావునప్పుడు కాలాన్ని ఆస్వాదించి , బాలేనప్పుడు ఆ గతాన్ని తల్చుకుంటూ భవిష్యత్తు లోకి పయనించడమే కాల గర్భం లో కలిసే వరకూ.
ReplyDeleteఅవునవును సంఘం చెక్కిన శిల్పాలమే.సంఘం ఇంకా ఇంకా తనకి అనుకూలం గా చెక్కడానికే ప్రయత్నిస్తూ వుంటుంది.మనం నన్ను మార్చొద్దంటూ బిగుసుకుంటే సంఘం కొట్టిన దెబ్బలకి పగిలిపోవడమో,విరీపోవడమో జరుగుతుంది.
ReplyDeleteఏమని చెప్పాలో తెలీక ఇలా... :)
ReplyDeleteరాధికగారు చెప్పినది నూటికి నూఱుపాళ్లూ నిజం.
సంఘాన్ని చెక్కిన జీవాలమేమో ?
ReplyDeleteభంగాల్ని ఎక్కిన భావాలమేమో ?
శృంగాల్ని తొక్కిన శవాలమేమో ?
స్వకృత శిల్ప వనంలో
వికృత అల్ప ప్రాణాలమేమో ?
రవి గారు! మీరన్నదీ నిజమే there are no eternal truths in here but provisional alone మన సదుపాయం కొరకు ఎంచుకొన్నదే అప్పటి సత్యం.
ReplyDeleteరాధిక! విరిగినవి అతికించుకోవటం కూడా ఒక కళేనని తెలిసాక దాని వెంట పట్టించాలేండి.
రాఘవ! నిజాల్నీ నమ్మలేమండొయ్. తస్మాత్ జాగ్రత్త మరి ;)
ఆత్రేయ గారు! మీ కూర్పు నా భావాన్ని మరింత ప్రస్ఫుటంగా తెలుపుతుంది.
మీ అందరకూ నా ధన్యవాదాలు