మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం,
మాకెందుకిక దిగులని.
గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది,
వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది,
పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది,
అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
ఋతువు కూడా ఒప్పేసుకుంది,
శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి,
తాను తరలి వెళ్తదేమో.
కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా
నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.
ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ...
అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!
రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...
మాకెందుకిక దిగులని.
గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది,
వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది,
పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది,
అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
ఋతువు కూడా ఒప్పేసుకుంది,
శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి,
తాను తరలి వెళ్తదేమో.
కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా
నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.
ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ...
అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!
రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...
మీ కవిత చాలాచాలా బాగుంది.
ReplyDeleteమీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీకు నా హార్థిక నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteమీరిరువరకూ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా మరువపు వనానికి మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మనవిచేసుకుంటున్నాను. క్రొత్త సంవత్సరం ఇలా క్రొత్త క్రొత్త మిత్రుల్ని పిలుచుకొచ్చి మరీ స్వాగతం పలికించుకోవటం నాకు బోలెడు సంబరంగా వుందండి :)
ReplyDeleteనూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteఉషా మీ బ్లాగు టేంప్లేట్ అదిరింది సుమా
ReplyDeleteఉష గారు, మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ReplyDeleteబ్లాగ్ టెంప్లేట్ చాలా బాగుంది.
మీ అందరకూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteలలితా, వేణూ, ఇదంతా జ్యోతి గారి పుణ్యమండి. నా మరువపు దీనరూపు చూసి, ఇలా పదిలంగా క్రొత్త కుదురు కట్టిపెట్టారు.