నీకొక లేఖ - ఇట్లు నీ అభిసారిక!

ఎంత మౌనమీ ఉదయం!
గలగలల కొబ్బరాకుకే కదలిక రాని మౌనం,
విడివడని మొగ్గల్లో విడదీయలేని మౌనం,
అంతటా స్తంభించిన గాలిలో మౌనం,
తెల్లగా విస్తరించిన మబ్బులో మౌనం,
ఇవే నీకు నా రాయబారం!

ఇన్నిటా మరింత మౌనంగా చలించే నా హృదయం,
మెల్లగా సాగుతున్న నా నిరీక్షణం,
చల్లగా వస్తున్న మన సంగమతరుణం,
నీకై నాకై నేల్కాంత వేసిన పూపొదరిళ్ళు,
తరువులు పరిచిన చివురు పరుపులు,
నీ ఒడిలో నిదురించే నా కళ్ళు,
అవిగో అక్కడే నా వూహల వేణువులు,
నాలోని మౌనం తటాలున పరుగిడే నీ దర్శనం!

సెలవిక ప్రియా! అపూర్వమీ ప్రేమ జీవనం,
అంతులేనిదీ మధుర కవనం.

7 comments:

  1. మీ అభి సారిక బావుంది .మీ మరువపు పరిమళాన్ని మధురంగా మాకందిస్తున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    ReplyDelete
  2. బాగుంది ఉషా గారు

    ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీకు

    ReplyDelete
  3. పరిమళం గారు, ఆత్రేయ గారు, మీకు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా మరువపు వనానికి మీరు మళ్ళీ మళ్ళీ రావాలని మనవిచేసుకుంటున్నాను. క్రొత్త సంవత్సరం ఇలా మిత్రుల్ని పిలుచుకొచ్చి మరీ స్వాగతం పలికించుకోవటం నాకు బోలెడు సంబరంగా వుందండి ;)

    ReplyDelete
  4. 'నీ ఒడిలో నిదురించే నా కళ్ళు'
    మీరిరువురి కవితల్లో చిక్కుక పోవడం చాలా సులభమైపోయిందండి నాకూ..
    కవితావిషయం నచ్చేసిందోచ్.చ్...

    ReplyDelete
  5. అమ్మో అమ్మో నాకూ గుండె పట్టలేనంత సంబరమొచ్చేసిందోచ్! ;) Thank a lot పృథ్వీ!

    ReplyDelete
  6. మౌనమా నిశ్శబ్దమా మీరు చెప్పదలచుకున్నది... ఎలా తీసుకున్నా అర్థమొస్తుంది. కానీ మీ అసలు భావమేమిటా అని! బావుంది మీరు తీసుకున్న విషయం.

    ReplyDelete
  7. నిశ్శబ్దంగా పరుచుకున్న ప్రకృతిలో మౌనంగా సాగిన ప్రేమగానమది.

    ReplyDelete