అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత?

అమ్మ అమ్మే ...
ఆనందవేళల "అమ్మ" అని పిలిచినా
ఆసరాకొరకని "అమ్మా" అని అడిగినా,
ఆపన్నసమయాన "అమ్మా" అని అరిచినా,
అసలేమీ అనకుండా ఆమె చెంత చేరినా,
అవేమీ కాకున్నా తానే నా దరికి చేరినా,
అమ్మ అమ్మే, అనురాగాన ఆమెకన్నా ఎవరు మిన్న?

ఆకలని నాకెందుకు తెలియలేదు మా అమ్మకన్న ముందు?
అలిగి అరిచానని తిరిగి నవ్విందే కాని అసలేమీ అనదేం?
నాన్న కసిరితే అమ్మ వంతు మినహాయిస్తే నాకేం మిగలదేం?
నన్ను మందలించిన వారెవరైనా ఆగగలరా మా అమ్మ ఎదుట?
ఎవరేమన్నా నా చిరుచేతలే పొరుగూరు వరకు పాకేనెలాగట?
అసలేమిసంగతంటే అది కాదా నను కన్న అమ్మ ఆరాటం?

అలా వాగువంక పోతే ఆ ఒరవడి అమ్మ ప్రేమంత,
ఇలా మబ్బువంక చూస్తే ఆ వైశ్యాల్యం అమ్మ మనసంత,
పూల కొమ్మ విరబూస్తే ఆ సోయగం అమ్మ నవ్వంత,
పళ్ళ కొమ్మ బరువుగ వాలితే ఆ నిండుతనం అమ్మ వాత్సల్యమంత,
నిజానికి నేనెంత మా అమ్మైనా ఆమెను వర్ణించను?
అమ్మ ఒక అనాది దేవత, నేనూ కాదా ఆ అమ్మతనాన్ని అందుకున్న ఓ అతివ!

11 comments:

  1. మాతృ దినోత్సవ ప్రత్యేక కవిత... బాగుంది

    ReplyDelete
  2. అమ్మ మీద కవితలు ఎన్ని అన్నా రాయచ్చు ఎన్ని అన్న వినచ్చు .. అయినా ఇంకా రాయలనిపిస్తుంది ఇంకా వినాలనిపిస్తుంది

    ReplyDelete
  3. "ఆమె కోపం కర్పూర హారతి
    ఆమె శాంతం సాంబ్రాణి దూపం
    ఆమె మనసు హిమశిఖరాగ్రం " కొన్ని రోజుల క్రితం నేను రాసిన చిన్న కమిత(really??) ( from http://pradeepblog.miriyala.in/2009/04/blog-post_18.html )

    ReplyDelete
  4. ప్రదీప్, విజయమోహన్ గారు, నేస్తం, ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఉదయాన సుమారు 4 గంటలకి వేగుచుక్క వంక చూస్తూ లేచినపుడు అందులోనుండి అమ్మ నా వంక ఆపేక్షగా చూస్తున్నట్లుగా అనిపించింది. ఆమె ఆ లోకాల్లో నుండే నన్ను దీవిస్తున్న భావన. అదే ఈ కవితకి ప్రేరణ. నిజంగా మాతృ దినోత్సవమన్నమాట జ్ఞప్తికి లేదపుడు. మీ వ్యాఖ్యలు చూస్తే గుర్తుకొచ్చింది. బహుశా అమ్మ అందుకే అలా కనిపించారేమో?

    నేస్తం, అవును మరి అమ్మని మించిన ఆది దైవం ఎవరు? ఆమెను పొగడగ ఎన్ని కావ్యాలైనా చాలునా?

    ప్రదీప్, మీ చిరు కవిత ఎంతో చెప్తుంది. చిన్న ఒక పంక్తి పొడిగింపు,

    "ఆమె కరుణ జగతికి ఊపిరి"

    ఇదివరకు పృథ్వీ గారి తల్లిని తరువుగా వేసిన చిత్రానికి నేను వ్రాసిన కవిత ఇది.

    ఆ తరువు వేరు మొలకలం.
    ఆ మమత చేతి మణులం.
    ఆ కరుణ కంటి కలలం.
    ఆ మనిషి ప్రాణ వాయువులం.

    ReplyDelete
  5. మీకోసం ఓ మెయిల్ రెడీ అయ్యింది. మీకెలా చేరవేయాలో తెలియటం లేదు. దయచేసి తెలియచేయండి.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. ఉష గారూ ! అమ్మ మీద కవిత అద్భుతంగా రాశారు.
    అవునండీ ....అనాదిగా అమ్మే మన దేవత
    నేనూ అందుకున్నానావరం....
    నేనూ పొందానా వాత్సల్యం !
    ఈ అదృష్టం కోసమే పది జన్మలెత్తాడు
    భగవంతుడు కూడా ....

    ReplyDelete
  7. Nice poem Usha garu. I started writing poems in 1997 on Aug 14th. So now you know what my first poem was about. And the second poem was about mother. In your free time,

    http://ayodhya-anand.blogspot.com/2009/02/blog-post.html

    ReplyDelete
  8. బాబా గారు, పరిమళం, ఆనంద్, కవితావ్యాఖ్యానంగా మారుతున్న ఈ ప్రక్రియ నా బ్లాగుకి ఎంతో కళతెస్తుంది. ఒక్కొక్క మనసు ఒక్కో తీరుగా వ్యక్తపరుస్తున్న భావపరంపర వైనం ఇంకా బాగుంది. అమ్మని మించిన తొలి స్పందన ఏదీలేదు. అమ్మ లేనీ లోకమే లేదు.

    హృదయపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  9. ఉష గారూ,
    అమ్మ గురించి ఎంత అద్భుతంగా చెప్పారండీ.! ఎంత నచ్చిందో చెప్పడానికి సరిపోయే మాటలే రావడం లేదు.
    మాటలకి అందనంత మధురమైన భావాన్ని కలిగించింది మీ కవిత. సహజంగా ప్రేమ మూర్తి అయిన అమ్మను మీ కవితాపటిమతో ఇంకా ముచ్చటగా తీర్చిదిద్దారు... ఇంత చక్కటి సాహితీ సుమాల్ని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  10. నిజమేనండి ఇదంతా అమ్మ అన్న పదంలోని మధురిమ అమ్మతనం లోని మహిమాను. మా అమ్మగారి గురించి ఆలోచిస్తుంటే ఇంకా ఎన్నో జ్ఞాపకాలు అలలు అలలుగా ఎగిసివస్తాయి. ఆ మధ్య ఎవరో పంపిన మాటలివి. అన్నీ కాకపోయినా కొన్నైనా నిజం కదా. ఇపుడు నేను అమ్మ దూరమయ్యాక మాతృసమానుల్లో అమ్మతనాన్ని వెదుక్కుంటున్నాను.
    The Images of Mother:
    ==============
    4 YEARS OF AGE My Mommy can do anything!
    8 YEARS OF AGE My Mom knows a lot! A whole lot!
    12 YEARS OF AGE My Mother doesn't really kno w quite everything.
    14 YEARS OF AGE Naturally, Mother doesn't know that either!
    16 YEARS OF AGE Mother? She's hopelessly old-fashioned.
    18 YEARS OF AGE That old woman She's way out of date!
    25 YEARS OF AGE Well, she might know a little bit about it.
    35 YEARS OF AGE Before we decide, let's get Mom's opinion.
    45 YEARS OF AGE Wonder what Mom would have thought about it?
    65 YEARS OF AGE Wish I could talk it over with Mom. . .

    ReplyDelete