నా మానసవనాన తలవాల్చిన తరువు అనురాగం.
తల్లివేరుచీడ పూరేకుని తాకకూడదని తలపోసానాశగా.
కొమ్మంటు వేరుచేసా పదిలంగా నీ ఆనగా.
నీ హృదయసీమన నాటాను నా అభిమతంగా.
ప్రేమ తీర్థమిస్తావో? వలపు వేడి పంచుతావో?
మళ్ళీ చివురు వేసినా, మొగ్గతొడిగి పూలు పూసినా,
ఆ చివురల మాల అల్లినా, ఆ పూల పక్కపరిచినా,
అవి నీకే స్వంతం, నీకు మాత్రమే పరిమితం.
ఏ కలల్లోనూ నీకై వెదకబోను, వూహల్లోనూ నీకై నిరీక్షణ మాత్రం ఆపను.
ఈ ప్ర్రాయమాని నను ప్రశ్నించుకోను, నీ రాకకై అనునిత్యం వేచివుంటా.
ఇది తరుణమాని నిను నిలదీయను, కల,ఇల,వూహ అన్నిటా స్వాగతిస్తా.
నా మానసమే నీకు కోవెల చేస్తా, ఈ సమర్పణమే నా కానుకగా ఇస్తా!
నా చిన్ని కొనసాగింపు (నిజానికి కొనసాగింపు కాదు, ఆఖరి పేరాను మళ్ళీ రాసా అంతే)
ReplyDelete"నీ దర్శనమే పరమార్ధంగా ప్రతీక్షణం నా ప్రతీక్ష, తపము నీకోసమే
నా ఊహల కొలను పక్కన నా మానసకోవెలలో నిన్ను ప్రతిష్టిస్తా
నా ఊహలతో నిన్ను నా ప్రేమలో అభిషేకిస్తా"
కవిత బాగుందని మళ్ళీ చెప్పాలా....
కానీ మళ్ళీ అందుకోండి నేను పీకుతున్న ఈకలు
" కల, ఇల, ఊహ అన్నిటా స్వాగతిస్తా... " అని మూడవ పాదంలో అని "ఏ కలల్లోనూ నీకై వెదకబోను" అన్న మొదటిపాదానికి పూర్తి వ్యతిరేకంగా అన్నరెందుకో ?
నిజంగా బావుంది, మార్చి వ్రాసేయాలనివుంది ;)
ReplyDeleteఇకపోతే వెదకను కానీ, వేచివుంటాను, స్వాగతిస్తాను అన్నానుగా. మళ్ళీ చదవండి. అలిసిపోయింది వెదుకులాటలోనే. వేచివుండటానికి, స్వాగతించటానికి ఎపుడూ సిద్దమే.
ఉషగారు..... నీడపట్టున నిరీక్షించండి...
ReplyDeleteఎండ దెబ్బకు మరువం వడలిపోతే నేను తట్టుకోలేనండి...(just kidding really its good)
మరువం లానే వుందండి మీ కవిత ........రియల్లీ టెండర్ ..
ReplyDeleteపద్మార్పిత, చిన్ని, అలాగే మరువాన్ని నవ నవలాడేలా వుంచుతాను ;) వాడినా వాసన వీడదు కనుకనే సమయానికి అనునయించి అనురాగం చివురింపచేసే నేస్తాన్ని అది వెదుక్కుంది. స్నేహమన్న అమృతం అనునిత్యం సేవిస్తుంది కనుకనే వాడని నమ్మకం కలిగిస్తుంది. ధన్యవాదాలు.
ReplyDeleteకనులు కనే కలలు నిజమవ్వాలని మనసు పడే ఆరాట౦ నిరీక్షణ.
ReplyDeleteకనుల కలలపై మనసు దిగులుపై ఇలా కవిత రాస్తే అది సమర్పణ.
మీ నిరీక్షణ తన రాకకి సమర్పణ.
మీ కవిత మీ నిరీక్షణకు సమర్పణ.
భలే ఉ౦ది. నిరీక్షణ - సమర్పణ!!!
ఆనంద్, కవితగా వ్రాసిన మీ వ్యాఖ్యాప్రశంసకి చాలా చాలా సంతోషం. ఇలా ఆనందాలకి కొంగ్రొత్త నిర్వచనాలు ఇస్తున్న ఈ కవితాజీవనం నాకు చాలా తృపిగావుంది. ఇటువంటి నిరీక్షణల్లో మనసుకి స్వాంతన మీ కవిత.
ReplyDeleteచాలబాగుంది.
ReplyDeleteబాబా గారు, నిజానికి దీని ముందు కవిత, మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా? పై మీ అభిప్రాయాన్ని కోరుకుంటున్నాను. వీలునిబట్టి ఒకసారి అటు కూడా తొంగి చూడండి. తప్పకుండా కొత్తపాళీ గారి సూచన అమలు చేయాలనివుంది. కాని ఆ పద్దతెలాగ అన్నదే తెలియటం లేదు. మీకా పరిస్థితే ఎదురైతే ఏ విధంగా ఆత్మ పోకుండా, మనసు నొవ్వకుండా, క్లుప్తత తెస్తారో చెప్పితే అది మా అందరికి విలువైన మార్గ దర్శకమౌతుంది. మీరు వెచ్చించే సమయానికి ముందుగానే ధన్యవాదాలు తెల్పుకుంటూ, మీ వ్యాఖ్యకై ప్రతీక్షిస్తుంటాను.
ReplyDeleteమీ కవిత చదివినప్పుడల్లా నాకు తెలిసిన తెలుగు మీద సందేహం వస్తుంది. ఇక కవిత్వమంటారా top class.
ReplyDeleteమహేష్ కుమార్ గారు, ఇంతకన్నా వేరు అభినందన ఎందుకు చెప్పండి. క్లుప్తంగా, సూటిగా మీదైన బాణీలో ఇచ్చిన ఈ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
ReplyDelete