మా వూరి మబ్బుకి నాకు మల్లే మమతలెక్కువనుకుంట,
నీరు, నింగి అన్నీ తనకే స్వంతం కావాలనుకుంటుంది.
కరిమబ్బులా తోచినా, కరివేరు మొగ్గలా ఆనినా అదేంటో,
గాలి తోడుచేసుకుని తేలిపోతుంది, వంటి బరువు ఓర్చుకుంటుంది.
ఉన్నదూరుకోదు మళ్ళీ మెరుపు లేఖలు రువ్వుతుంది.
ఉరుమురిమి తుళ్ళిపడేలా తుంటరి పనులు చేస్తుంది.
ఉత్తర దిక్కుగ వర్ణించలేనన్ని వన్నెల్లో వరసలు కడుతుంది.
ఉన్న రంగులు చాలవని వెన్నెల వేళల వింతవన్నె అద్దుకుంటుంది.
చినుకుల కబుర్లు అపుడపుడు మాత్రం పంచుకుంటుంది.
వూరు నిద్రలో వుండగా లేపి మరీ కడుపు విప్పిచెప్పి పోతుంది.
చోద్యమేమంటే ఆ చినుకు కూడ పడ్డచోటే గట్టిపడిపోతుంది.
మనసుపడ్డ చోటే గట్టిపడ్డ నీ వలపు మాదిరే నేనూ చిక్కనేనంటుంది.
అమ్మో!! బాగానే సంబందం కుదిర్చారే వాన తడికి మనసు వేడికి..:D
ReplyDeleteఅనిపించిన భావాలు వానచుక్కల వలపు తుళ్ళింతల్లో బాగా చెప్పారండి.
chaalaa baagundi
ReplyDelete'మమతలెక్కువనుకుంటా' అనుకుంటానండి ... బాగుంది..
ReplyDeleteఇంత సున్నితముగా ఎలా రాయగలరండి.
ReplyDeleteఎందుకో శీర్షిక కొంచంగా మార్చాలనిపించి ఇపుడే ఆ మార్పు చేసాను! ("చుక్క" అన్న పదాన్ని "చినుకు" గా )
ReplyDeleteపృథ్వీ, భలే కనిపెట్టారే, ఈ మధ్యనేనండి మనసు వేడి కబుర్లు వాడి మాటలు నేర్చుకుంది. ఇంద్రధనుస్సు మాదిరే రోజుకో వర్ణంలో రాగాలు పలుకుతుంది.
నేస్తం, "పలుకే బంగారమాయనె" అనే లోపుగా తొంగిచూసారు. సమయానికి వచ్చేసారు.
మురళి, "మమతలెక్కువనుకుంటా" - నన్ను నేను వర్ణించుకుంటే ముందు గుణం అదేనండి. ఒక్కోసారి దాన్నుంచే ఇబ్బందులొస్తాయి.
మాల, ఏమోనండి. నా ఈ అతిగా స్పందించే సున్నితత్వం కూడా మరో బలహీనతే లౌకిక పరంగా. అందుకే ఇలా కవితల్లో బలిమిగా రూపాంతరం చెందింది. "పలుకలేని పలుకులన్ని పాటగా వ్రాసుకుంటాను" అన్న కవి గారి బాణిలో సాగిపోతుంటాను.
ఆ నలుగురు మాదిరిగా నిన్న రేయి మబ్బు వంక చూసి నేను స్పందించి వ్రాసిన ఈ చిరు కవితకి ఉదయాన్నే మీ ప్రతిస్పందనలు చూసుకుంటే చాలా ఆనందంవేసింది. ధన్యవాదాలు.
సబాసు
ReplyDeleteమోద౦ ని౦డిన మేఘ౦ మళ్ళీ గేయ౦ అయ్యి౦ది.
ReplyDeleteవలపుల చినుకే కవితకు స్ఫూర్తై ఆమోద౦ తెలిపి౦ది.
తడిసిన పుడమికి తడిసిన మనసు లేఖ రాసినట్టు౦ది.
మీ కవిత భలే ముద్దుగా ఉ౦ది.
చాలా బాగుంది.
ReplyDeletechala baagundi..!
ReplyDelete"ఉత్తర దిక్కుగ వర్ణించలేనన్ని వన్నెల్లో వరసలు కడుతుంది.
ReplyDeleteఉన్న రంగులు చాలవని వెన్నెల వేళల వింతవన్నె అద్దుకుంటుంది." --- ఈ ప్రయోగం భలే ఉంది.
===
మొదటి వ్యాక్యంలో మీలోని మమతల గురించి చెప్పారు
ఇక మలి వ్యాక్యంలో మళ్ళీ మీ గురించి చెప్పకనే చెపుతూ ముగించారు.
ఎక్కడ మొదలుపెట్టారో అక్కడ ఆపటమన్నది మంచి ప్రయోగం
===
కానీ
" చినుకుల కబుర్లు అపుడపుడు మాత్రం పంచుకుంటుంది.
వూరు నిద్రలో వుండగా లేపి మరీ కడుపు విప్పిచెప్పి పోతుంది. "
ఎందుకో కవితావేగాన్ని మార్చినట్టనిపిస్తోంది.
కొత్త పాళీ, ఆత్రేయ, సుజ్జీ గార్లకు, ధన్యవాదాలు
ReplyDeleteఆనంద్, మీ ప్రతిస్పందన మరింత ముద్దుగావుంది ;)
ప్రదీప్, ప్రయోగం గుర్తించినందుకు సంతోషం. మీకు నచ్చినందుకు ఆనందం. ఇక వేగమంటారా, వేగంగానే వెలికి వచ్చిన పదాలవి. నాకు ముచ్చటవేసినవీ అవే. మీ ఉద్దేశ్యంలో ఎలా అయితే కవితాధార సమంగా వుండివుండేది. సమస్యా పూరణంలా ఆలోచించి చెప్పరా? ఎందుకంటే నా మనసు కూడా అలాగే అర్థ రాత్రుల్లో లేపి కూర్చోపెట్టి నాకే గుర్తులేని వూసులు కురిపిస్తుంది. అవే మబ్బుకి అన్వయించి వ్రాసాను. మీ జాబుకై ప్రతీక్షిస్తుంటాను.
బ్యూటిఫుల్
ReplyDeleteబాబా గారు, ఈ మధ్య మళ్ళీ మీరిలా దర్శనమిచ్చి నా పదాల లాలిత్యాన్ని హృద్యంగా చిరు అభినందనల్లో తెలుపుతున్నందుకు ధన్యవాదాలు. ఒక్కోసారి ఆ చిలకరింపులే మరువపు చివురులకి ఆధారం.
ReplyDeleteఉషగారు,
ReplyDeleteసమస్యా పూరణమని నాకు మంచి పనే ఇచ్చారు. నా ప్రయత్నం చూడండి
" నిద్రలోనున్నా సరే వూరిని లేపి మనసారా చినుకుల కబుర్లు కురిపిస్తుంది
ఆ తడి చినుకుల కబుర్లతో మళ్ళీ మా వూరిని జోకొట్టి వెళ్ళిపోతుంది "
ఈ మధ్య నేను కొంచెం ఎక్కువగా స్పందిస్తున్నానేమో అనిపిస్తోంది. మీ కవితలకు వంక పెట్టాలని కాదు, చదివిన తర్వాత నాకొచ్చిన ఆలోచనలు అంతే. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి, మీ కవితలను నా వైపు నుంచి మాత్రమే విమర్శిస్తూ తప్పు చేస్తున్నాననిపిస్తోంది.
మరో మంచి కవిత కోసమెదురు చూస్తూ
ప్రదీప్
బాగుంది ప్రదీప్. అలా అనుకోవద్దు, నిజంగా ఇలా మీ సద్విమర్శలు మూలంగా నాకూ నేర్చుకునే అవకాశం, పైగా రెండో దృష్టి ఎలావుంటుందీ అన్నదీ తెలుస్తుంది.
ReplyDeleteమీరు వ్రాసిన పంక్తి "ఆ తడి చినుకుల కబుర్లతో మళ్ళీ మా వూరిని జోకొట్టి వెళ్ళిపోతుంది" తో నాకు నాదే మునుపటి కవితలో వ్రాసుకున్న పంక్తులు గుర్తుకువచ్చాయి. సంబంధం లేనివే కానీ ఏదో జ్ఞాపకం.
http://maruvam.blogspot.com/2008/12/blog-post_21.html
నిదుర కూడా రాత్రంతా దాగుడుమూతలాడి,
నే దిగులుగా కూలపడ్డాక,
తనవారిని తిరిగి లేపుకోను ఖుషీగా పోతుంది.
పగలు కూడ పట్టలేవని ఈలవేసి చెప్తుంది.
దినమూ ఇదే నా వేతనం లేని వెర్రి చాకిరి.
బ్రతుకు కినుక నా పైనా? ఇక చాలించని తన పైనా?
శాంతాదేవిని ఆహ్వానించి చింతాదేవికి వీడ్కోలు చెప్పి
ReplyDeleteఆరోగ్యదేవికి అభిషేకం చేసి
తామసవీధులకు రాగానే కర్మేంద్రియాలకు విశ్రాంతినిస్తే
నిద్రాదేవి ప్రత్యక్షం
తప్పకుండా పాటిస్తానికి ప్రత్నిస్తాను. ఫలితంవుంటుందనే నమ్ముతున్నాను. ;)
ReplyDeleteఆహా.. ఎంత చక్కని పోలిక.. వలపుకీ, వానకీ..!
ReplyDeleteనిజంగా కదూ, అలా వూహించుకుంటే ఈ జగతిన వున్నది వలపే అన్న కొంటె భావన చిలిపి వూహల్ని రేపుతుంది. ;)
ReplyDelete