పాటల సందడి - మా తెలుగు తల్లికి మల్లెపూదండ

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" శిశువులు పశువులు పాములు వశులగుదురు గానమునకు. మరిక మనమెంతవారం ఆ కోవలకి చేరమనేన్దుకు. నాకు నాన్నగారి ద్వారానే మంత్రాలు, పద్యాలు, శ్లోకాలు, పాటలు ఆ వరస క్రమంలో పరిచయం చేయబడ్డాయి. పాఠశాలలో గురు సమక్షంలో అది కొంచం ముందుకు సాగింది. కానీ నాలో ఆసక్తి పొడిగించబడింది మాత్రం ఈ పాటతోనే. అప్పుడు ఎవరు వ్రాసారు, ఏ సందర్భంగా వ్రాసారు వంటి జిజ్ఞాస కలగలేదు. క్రమేణా ప్రతి పంక్తి ఒక క్రొత్త అభిరుచిని నా జీవితంలోకి ప్రవేశపెట్టింది. కృష్ణమ్మ వొడిలో పెరిగి గోదారి తీర్థం పుచ్చుకున్న జీవనమిది. శిలల్లో శిల్పాల్లో తనువు మరిచిన అనుభవాలు ప్రోది చేసుకున్నాను. కవనాలు, గానాలు మనసుకి పసందైన విందులు అందించాను. మన వెనుక తరం వారిని దర్శించాను. వారి గురించి తరిచి తరిచి శోధించాను. మొత్తంగా ఈ నాటి నా వ్యక్తిత్వానికి, మీ చేత మన్ననలు పొందుతున్న నాకు ఈ పాటే మొదటి స్ఫూర్తి.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు


ఎన్నో పాటలు విన్నాను, కొన్ని అలా ఆలాపనలుగా, మరి కొన్ని మళ్ళీ వినేలా, కొన్ని నా మనస్థితిని వ్యక్తం చేస్తున్నట్లుగా. నాకు నచ్చిన, ఇంకా నచ్చనున్న కొన్ని వేల పాటల్లో ఏ ఒక్కదాన్ని తక్కువ చేయలేను అలాగే ఈ పాటకున్న స్థానాన్ని పంచలేను.

ఇక మీ అందరికీ విదితమైన పాట గురించి నేను విదమరిచి చెప్పనవసరం లేదు.

పాట రచయిత: కీర్తిశేషులు శంకరంబాడి సుందరాచార్య

ఈనాటికీ ప్రబోధగీతంగా పలుమార్లు వినిపిస్తుంది. విన్న ప్రతిసారి అంతే పరవశంగా వింటాను. పాడటంలో పెద్దగా ప్రవేశంలేని నేను ఒక వేదికపై దాదాపు వెయ్యిమంది ముందు పాడిన ఒకేఒక పాట ఇది. ఆ అనుభవం చాలు నాకు ఈ పాట అంటే ఎంత ప్రీతో తెలుపను.

************************************
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు ...
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు ...
అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి వుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే ఆడుతాం - నీ ఆటలే పాడుతాం
జై తెలుగు తల్లి ! జై తెలుగు తల్లి !
************************************

పాట వినాలనివుంటే క్రింద ఇచ్చిన లింకులకు వెళ్ళండి.


టంగుటూరి సూర్య కుమారి గారు ప్రైవేటు లలిత గీతంగా అలాపించినదిది:

http://surasa.net/music/lalita-gitalu/tsk/01matelugu.mp3


http://www.esnips.com/doc/a78e518f-8948-4e2c-9d87-6898b5c97890/Maa%20TeluguTalliki


దేశభాషలందు తెలుగు లెస్స.. నేను తెలుగమ్మాయినయినందుకు నా మనసు ఆనంద కడలిలో సాగుతూ పలికింది హైలెస్స..


Get this widget | Track details | eSnips Social DNA

11 comments:

  1. ఉష,

    ఈ మా తెలుగుతల్లికి అనగానే శంకరంబాడి సుందరాచార్య తో పాటు టంగుటూరి సూర్యకుమారి కూడ మనసులో మెదలుతారు కదా.. మంచి పాట ..

    ReplyDelete
  2. అది నిజం, జ్యోతి. సరైన సమయానికి గుర్తు చేసారు. ఒకటి రెండు సార్లు విన్నానిదివరకు, మళ్ళీ ఇపుడే వింటున్నాను.

    http://surasa.net/music/lalita-gitalu/tsk/01matelugu.mp3

    ReplyDelete
  3. పరిమళ౦గారు ఆవిడ టపాలోని వ్యాఖ్యలకు సమాధానమిచ్చినట్టూ, ఆడవార౦దరూ తీసుకున్న నిర్ణయలో మీరూ ఉన్నట్టున్నారే. ఈ పాట బాపూగారి బుల్లెట్ సినిమాలో నాకు చాలా నచ్చి౦ది. ఏక్టర్ల ముఖకవళికలూ, బాలూ గారి గాత్రమూ, బాపూ గారి పిక్చరైసేషన్ అన్ని అద్భుత౦గా ఉ౦టాయి కద౦డీ ఉష గారూ!

    ReplyDelete
  4. ఉష గారు,

    తెలుగు వారి అందరి లొ నిలిచి పోయే పాట.

    ReplyDelete
  5. నిజంగా చాలా గొప్ప పాట. ఒక జ్ఞాపకం (అప్పట్లో వార్తా పత్రికలో చదివినదే అందరూ అంటే అప్పటి వారన్నమాట). శ్రీ జలగం వెంగళ రావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు హైదరాబాదులో జరిగాయి. అలనాటి సభలో వేదిక మీద (బహుశా శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారే అనుకుంటా.. అంతగా గుర్తు లేదు) ఈ పాతపాడుతున్నప్పుడు సభికులలో ఒకరు రోదిస్తూ ఉన్నారు. ఆ ప్రక్క ఈ ప్రక్క వారు ఆ వ్యక్తిని గుర్తుపట్టి నిర్వాహుకులకి తెలియ చెస్తే ఆ నిర్వాహకులు ఈ మహానుభావుడకి క్షమాపణలు చెప్పి వేదిక పైకి సాదరంగా తోడ్కొని వెళ్ళారు. వారే శ్రీ శంకరంబాడి సుందరాచార్య. ఇక మీరు ఇచ్చిన లింకు ద్వారా పాట విన్నాను.. అమరావతి నగర్ అని మీరు రాసారు.. కాని అమరావతి గుహలు. అలాగే ఆఖర్లో నీ పాటలే పాడుతాం... నీ ఆటలే ఆడుతాం. మీకు నా అభినందనలు.

    ReplyDelete
  6. ఈ సారి నుంచి మా తెలుగు తల్లికి అనగానే మీరే గుర్తుకొస్తారు.

    ReplyDelete
  7. బాగా రాశారు ఉష గారు, మంచి పాట గురించి.

    ReplyDelete
  8. ఆనంద్, ఆ సినిమా నేను చూడలేదు, కానీ బాపు గారి ఫెయిల్యూర్ ఖాతాలోనిదని విన్నాను. ఇక దొరకదేమో! అవునండి స్త్రీ బ్లాగర్ల initiative ఇది. నేనూ సరదాగా పాలు పంచుకున్నాను.

    మాల గారు, సాదర స్వాగతం. వ్యాఖ్యకి సంతసం.

    కృష్ణా రావు గారు, ముందుగా నా బ్లాగుకి సాదర స్వాగతం మరియు మీ జ్ఞాపకాల్లోని విశేషాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు. లోపాలు సరిదిద్దాను. అంధ్ర జ్యోతి వారి "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" ప్రచురణలో "నగరి" అని అచ్చువేసారు, దాని ఆధారంగాను, కొంత సమయాభావంతో అలక్ష్యంగా [మన్నించాలి అది తగదని తెలిసీ చేసాను] ఆన్ లైనులో దొరికిన సాహిత్యాన్ని తీసుకున్నాను. దాని వలన ఆ లోపాలు తొంగి చూసాయి. I had an intuition which I ignored ఇకపై అటువంటివి దొర్లకుండా చూసుకుంటాను.

    హేమ, బాగున్నారా,రాజముండ్రిలో వున్నంత ఆనందం మీ తొలి వ్యాఖ్య చూడగానే.

    వేణు గారు, మంచి పాటకి మంచి వివరణ/స్వగతం ఆపై మంచి ఆదరణ. అహో నా రోజు బాగుందోచ్.

    ReplyDelete
  9. ఉష గారు ! నిన్న దురదృష్టవశాత్తూ నా నెట్ డౌన్ అవటం వల్ల ప్రమదలందరి టపాలు చూడలేక పోయా ! ఎంత మంచి పాట ఎన్నుకున్నారు ! పాట వింటున్నంత సేపూ హాయిగా ...చివర కొచ్చేసరికి జై తెలుగు తల్లీ ...అంటూంటే ఉద్వేగంతో మనసుప్పొంగుతుంది .ఎన్నిసార్లు విన్నా ఇదే అనుభూతికి లోనవుతాను .
    @ కృష్ణారావు గారు , మీరు చెప్పిన సంఘటన చదివాక బాధనిపించింది .ఇప్పటికి ఎంతోమంది మహానుభావులు ..కళాకారులూ ..రాష్ట్రపతి నుంచి అవార్డులు తీసుకున్నవారు కూడా ..గుర్తింపు లేక , ఆర్ధిక , ఆరోగ్య పరమైన ఇబ్బందులతో వృద్దాప్యమే శాపంగా కాలం గుపుతున్నారు .ప్రజలు ,ప్రభుత్వము కూడా పట్టించుకోవటం లేదు .ఎవరైనా అదృష్టావశాత్తూ ఏ మీడియా కళ్ళలోనో పడితే , ఏ వృద్దాప్య పించనో , లేక ఎంతోకొంత నగదో ప్రకటించి చేతులు దులిపేసుకుంటారు. అవి వారికి సక్రమంగా అందుతున్నాయో లేదో కూడా పట్టించుకోరు . ఇది చాలా బాధాకరమైన విషయం . మీ జ్ఞాపకాన్ని మాకందించినందుకు కృతజ్ఞతలు .

    ReplyDelete
  10. పరిమళం, మీరంతగా చెప్పాలా, మీరొకపరి ఇటు తొంగిచూస్తారని నాకు తెలుసు సుమీ, తొందరేల అని వేచివున్నానంతే, మీ గున్న మావి కొమ్మమీది చిలక, గోరింకల మాదిరే ఈ మరువపు వనాన మన సాహితీ మైత్రి. ఒకరికొకరం సహవాసులం.

    ReplyDelete
  11. It is an excellent song, and am listening to it since seeing ur post.

    ReplyDelete