చెలిమికేది చెలియలికట్ట, ఆగుతుందా సాగకుండా...

ఆ కొమ్మమీద పిట్టకి ఎందుకోనమ్మ అంత కినుక
నా కందనంత ఎత్తున ఎందుకే ఎగిరావన్నందుకా?
ఆ ప్రక్కపూవు మీద వాలిన తుమ్మెదకెందుకో నవ్వు
నే చెయ్యలేని దూర యానాలు తనొక్కతే చేసినందుకేమో?

పిట్ట పేరూ ఎరుగను, తుమ్మేదకింకో పేరు తలవను
ఇట్టె వాలి అట్టే పోయే ఆ పిట్ట రెక్క మాత్రం అరువడుగుతా
ఎక్కడినుంచో వచ్చి వాలి ఇంకేడకో పోయే తుమ్మెద దారి పడతా
నేనెగరలేని ఎత్తులు చేరిపోతా, నేచెయ్యలేని యానాలు పూర్తిచేస్తా

కొండలమీద కోయంటా, లోయల్లోకి తొంగిచూస్తా
వాగుల్లో మునకేస్తా, వంకల్లో వాలి సోలిపోతా
కొమ్మలమీద వూయలూగుతా, రెమ్మలతో వూసులాడుతా
పూవుల్లో దాగిపోతా, పుప్పొడితో తనువు కప్పుతా

పిట్టవుండగా నా తోడు, తుమ్మెద చేయదా నాతో చెలిమి
మరి నాకెందుకు వగపు, వారీ, వీరి తలపు
ఎకసెక్కమాడేటి కాలం ఇక జారుకోదా ఈ క్షణం
సరి ఎవరు నాకు ఎండమావిలో కూడా దప్తి తీర్చుకోను

6 comments:

  1. ఉష గారు, పాటైతే బాగా రాశారు అలాగే ఒకసారి పాడి కూడా వినిపిస్తే బాగుండేదేమో :)

    ReplyDelete
  2. మీరు ఇలా మంచి కవితలు రాస్తారా...
    నాకేమో మెచ్చుకునేంత భాష రాదు.
    చదివి ఆనందించటం తప్ప ఏమీ చేయలేను.

    ReplyDelete
  3. ఉష గారు , బావుందండీ ...

    ReplyDelete
  4. హ హ ఉషగారు ఒక్కసారి చదవగానే అర్దం అయిపోయింది మీ కవిత ఈ సారి .. మీరు సరళమైన బాషలో రాసారనుకునే కంటే ,నాకు తెలుగొచ్చేసింది అని సంభరపడిపోవడం లో గొప్ప ఆనందం ఉంది కాబట్టి రెండోదే పిక్స్ అయిపోతామరి :)

    ReplyDelete
  5. చాలా బాగుంది ఉష గారు.

    ReplyDelete
  6. పద్మార్పిత, ఇలా అపుడపుడు తొంగి చూస్తే నాకు చాలా ఆనందంవేస్తుంది.

    భాస్కర రామి రెడ్డి గారు, పాటల స్థాయికి ఇంకా ఎదగలేదండి. త్వరలో ఓ పట్టు పడతా, మీకే తొలి ఆహ్వాన పత్రిక వస్తుంది మరి. కాస్కోండిక.

    భవాని, మీ బ్లాగులో టపాలు చూసి నాకూ అదే అభిప్రాయం. మన మన ప్రకటన వేదికలు వేర్వేరు కాని మన బలాలు ఒకటే.

    పరిమళం, నా టపాకి మీరిల పరిమళం అద్దితేనే దానికి అందం నాకు ఆనందం.

    నేస్తం , అదే మరి మీ మార్కు సహజగుణం. మీకు మీరే సాటి మరి మాకు మేమని అన్యాపదేశం అన్నమాట. మీకేం జాజులు విరబూయిస్తారు కదా!

    వేణూ గారు, ఈ మధ్య మీ రాకలు మాకు ముదావహం.

    అందరికీ ధన్యవాదాలు. సమయాభావం వలన వెంటనే వ్యాఖ్య పెట్టలేకపోయాను,మన్నించండి.

    ReplyDelete