అంతే అంతకన్నా ఏమీ లేదు కూడా...

చిన్నప్పుడు చదివిన బళ్ళోకి నడుచుకుంటూ వెళ్లి
తరగతి గదిలో ఏదో ఒక బెంచీలో కూలబడి- 
అంతవరకూ ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోయిన మనసుతో, 
ఖాళీగా ఉన్న ఆ పరిసరాలని పోలిన తీరుతో రవ్వంత సేపు, 
కలదిరుగుతూ అసెంబ్లీ సమయానికి ముందు, 
ఆటల బెల్లు మోగాకా  
కోలాహలంగా ఉండే బడి ఆవరణ వంటి మదితో 
కాస్తంతసేపూ గడిపినట్లుగా ఉంది- 
6 ఏళ్ళు గడిచిన ఈ బ్లాగు 
తొలినాళ్ళ నుంచి ఈనాటి వరకు 
అనుభవాలు తలపోసుకుంటుంటే...
పాత బడి మధురిమ
ఎప్పటికీ పాతబడదు.

1 comment:

  1. మధురమైన జ్ఞాపకాల విరిజల్లు బాల్యపు పాఠశాల కబుర్లు.గంటకొక పాఠం చెప్పిన చిన్ననాటి బడే బ్రతుకు పాఠాలకు పునాది కదా! బ్లాగు పాఠశాల వీడినా తలపోతలు ఉక్కిరిబిక్కిరి చేసే జలపాతాలే!

    ReplyDelete