మబ్బులు విడివడి...

అక్కడక్కడా పిల్లకాలువలు కట్టుకుని
భూమిలోకి ఇనకనని మొరాయిస్తున్నాయి వానచినుకులు.
నిన్నలేని కొత్త కాలనీలను చూసి వలస పక్షులు
వింతపడుతూనే నిమ్మళం గా ఒళ్ళు కడుక్కుంటున్నాయి.
ఎప్పుడూ ఉన్న చెట్లు, ఇప్పుడిప్పుడే విచ్చుకున్న పూలు
ఆకాశం నుంచి ఆరాటం గా దిగుతున్న నీటి మబ్బులకి
వసతి ఏర్పాట్లలో హడావుడిగా మాట్లాడేసుకుంటున్నాయి.
కిటికీచట్రాలు అడ్డం పడి ఆగిన ఆ కాసిని నీటిబొట్లు
బాధన్నది ఎరుగనట్లే జారుడుబండ ఆడుకుంటున్నాయి.
వానంటేనే ఆహ్లాదం, వానొస్తే చెప్పలేనంత ఆనందం ఎప్పటికీను...

2 comments:

  1. ఇక్కడ మా రాష్ట్రం లో వాననీటిని చాలా బాగా సేకరించి భద్రపరిచే విధానాలు, పద్ధతులు ఖచ్చితంగా అమల్లో ఉన్నాయి. పైగా నాలుగైదు అడుగుల్లోపే జల పడుతుంది, అందునా ఐదారు నెలలు మంచు తో తడిసి కప్పబడి ఉండి నేలా చెమ్మగిల్లి ఇక చుక్కైనా పీల్చలేను అన్నంత బరువుగా తేమగా తగులుతుంది. నా స్పందన/అనుభూతి స్థానిక పరిసరాల నుంచే పుట్టింది.

    ReplyDelete
  2. నీటి కడగండ్లే కన్నీటి కడగంఢ్లయిన మన దేశంలో అతివృష్టి ,అనావృష్టి రెండు దాడి చేస్తాయి.అయినా మనది ఎడతెగని ప్రాథమిక పరిశోధనలే.పరిష్కారమెన్నటికో!

    ReplyDelete