నైమిత్తిక జీవిత ఆనవాళ్ళ వెంట నిలవని క్షణాల బతుకురణ సారథ్యం లోనూ
మనసు భాష్యాలకి కొదవ లేదంటే కంటి ఆవరణకీ అవధి ఉండదు-
ఉరుకుల పరుగుల్లో ఒకింత మన వైపుగా దృక్కులు సారించే ఉడుత కావచ్చు,
కొమ్మలంచున తాళం వేస్తూ శ్రుతిలయలు తప్పని గీతాలాలపించే పిట్టా కావచ్చు
'జీవన సౌందర్య రసావిష్కరణకు ఆరో ఇంద్రియం మరేదీ కాదు హృదయమే'నని చెప్పేందుకు!!!
బాగుంది.. పక్షులను రక్షిద్దాం.
ReplyDeleteHimaja prasad నెనర్లు. మా ఇంటి చుట్టూ ఇలా చాలా రకాల పక్షులు, backyard animals (++కుందేలు, రెడ్ ఫాక్స్) వస్తూనే ఉంటాయి. నా వంతు చేస్తున్నాను, అవీ నాతో చెలిమిలోని అభయాన్ని అర్థం చేసుకున్నట్లే వస్తూ పోతుంటాయిలా! పరిరక్షణ సామాజిక బాధ్యత గా మారే రోజు రావాలని అభిలషిస్తూ-
Delete