చిన్నప్పుడు చదివిన బళ్ళోకి నడుచుకుంటూ వెళ్లి
తరగతి గదిలో ఏదో ఒక బెంచీలో కూలబడి-
అంతవరకూ ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోయిన మనసుతో,
ఖాళీగా ఉన్న ఆ పరిసరాలని పోలిన తీరుతో రవ్వంత సేపు,
కలదిరుగుతూ అసెంబ్లీ సమయానికి ముందు,
ఆటల బెల్లు మోగాకా
కోలాహలంగా ఉండే బడి ఆవరణ వంటి మదితో
కాస్తంతసేపూ గడిపినట్లుగా ఉంది-
6 ఏళ్ళు గడిచిన ఈ బ్లాగు
తొలినాళ్ళ నుంచి ఈనాటి వరకు
అనుభవాలు తలపోసుకుంటుంటే...
పాత బడి మధురిమ
ఎప్పటికీ పాతబడదు.
మధురమైన జ్ఞాపకాల విరిజల్లు బాల్యపు పాఠశాల కబుర్లు.గంటకొక పాఠం చెప్పిన చిన్ననాటి బడే బ్రతుకు పాఠాలకు పునాది కదా! బ్లాగు పాఠశాల వీడినా తలపోతలు ఉక్కిరిబిక్కిరి చేసే జలపాతాలే!
ReplyDelete