అక్షరాలు

అవి ఒక్కోసారి ఒక్కోమాదిరిగా అగుపిస్తాయి సుమా! ఒక్కోసారి మాటకి అందవు, మరోసారి మనసుని నిలవనీయవు. ఓ మారు తోటకి నీళ్ళు పెడుతూ, ఓ మొక్క వెంట కళ్ళు పాకిస్తే, మూడురకాలుగా జారిపడ్డాయి.

.. ఆకుల జారుడుబండల మీద కేరింతలు కొట్టే నీటిబొట్టు గుసగుసలు తుమ్మెద రెక్కలకి బదిలీ అవుతున్నాయి. 

.. కొమ్మల మీద పాకే చీమలు వంతెన నిర్మాణకూలీల్లా ఎంత క్రమశిక్షణగా మెలుగుతున్నాయో, మరా పోకడ మదిలో మెదిలే ఆలోచనలకి రాదేమి? రద్దీలో బస్సో, రైలో ఎక్కే జనాల తొక్కిసలాటకి పోటీ వస్తాయెప్పుడూను. 

.. పూలకుంచెలతో కళ్ళ కాన్వాసు మీద ఊహల కందని లోకాతీతమైన చిత్తరువులు తీర్చిదిద్దుతున్నదెవరో! ఆ రెమ్మల చేతుల్లో రవివర్మ ఆవహించినట్టుగా లేదూ!!!

2 comments:

  1. ఆకులు,కొమ్మలు,రెమ్మలు!అన్నిటిని అందించిన అక్షరవృక్షపు నీడలో సేదదీరే భావుకులం మనం.మీ అక్షరాలోచనలు ఎప్పటికప్పుడు వికసించే సరికొత్త మొగ్గలు!

    ReplyDelete
    Replies
    1. ఉమాదేవి గారు, ఆత్మీయంగా పలుకు కలుపుతున్నారు. నెనర్లు! అంతా ఫేస్బుక్ లోకి వలస వెళ్లాక ఇంకా తెలిసినవారొకరు ఉన్నారిక్కడ అనుకుంటే హాయిగా ఉంది.

      Delete