ఎందుకో మరిలా

అపుడపుడు మనసు ముసురేసుకుంటుంది 
మాటల చినుకులు రాల్చి తెరిపిన పడుతుంది
తెప్పరిల్లిన ఘడియల్లోకి పొద్దు వాలుతుంది 
నిదుర ముసుగులోకి మెల్లగా ఒదిగిపోతుంది 
పెదవులపై నవ్వుల నెలవంక మెరుస్తుంది 
కలలకు కారణాలు వెదక వద్దంటుంది...

3 comments:

  1. సద్దుమణిగిన క్షణాలలో తిరిగి నెమరేసుకుంటుంది...

    ReplyDelete
    Replies
    1. మీ పొడిగింపు ఎందుకో మరలా బావుందండి nmraobandi గారు. నెనర్లు!

      Delete