చీకటి రంగు పులుముతుండగా,
తెలతెల్లని మొగ్గలు విచ్చుకుంటుంటాయి,
అప్పుడొక పరిచిత భావన మనసుకి తడుతుంది
స్వయం సమృద్ధమనిపించే సత్యమేదో గోచరిస్తుంది
అప్పుడు; వస్తుంది నీ తాలూకు జ్ఞాపకమొకటి,
గాలి కూడా కదల్లేని మత్తులో కూరుకుపోయే
సంపెంగి వాసనల వెల్లువ గా.
అప్పుడిక ఊరడిల్లుతాను, ఎందుకంటే:
ఒక పూవు వాడిపోతే, ఒక మొగ్గ రాలిపోతే,
వేయి గుత్తులు విరిసి పిలిచిన గతాలు దూసుకొస్తాయి
ఎద లోని తావి తలపుకి కనులెదుర పూవు అవసరమా?
ఇక ఇప్పుడు చెప్పు,
కళ్ళని బతికించాలా? దృగ్గోచరం కావాల్సిందే అంటావా?
ఎన్ని అరలు నింపుతున్నా కొత్త ఖాళీలు వెదికిచూపే,
నీ హృదయం, నా హృదయం కలిసి బతకాలి
వెలితిపడ్డ మనసు తో తేలిక పడాలి
ఆర్తి నిండిన కళ్ళ ఎరుపు కాంతులీనాలి.
adbhutamgA undandi. very sweet and sensitive poem.
ReplyDeleteప్రసూన గారు, నెనర్లు! కొన్ని లోతుల నుంచి, గాయపు కోతల నుంచి స్రవించే అక్షరాలు కనుక ఇలా వాటి వంతు ఎమోషన్ అనుభవాల రక్తమాంసాల నుంచి పిండుకుని వస్తాయి. మీకు ఆ తడి తాకినందుకు ఆనందం.
Delete