మబ్బుపిట్టల రెక్కల హోరులో
మత్తెక్కినగాలిని మందలిస్తూ,
మేలిముసుగు చాటుగా
చిరునవ్వు పింజెలు విసిరినదెవరో
చెలి పలకరింత తొలకరి మొలకై
ప్రియుని ఊసులు పూచిందా,
పూతేనియ వలపు వరదలై
వనమాలి జాడలు తెలిపిందెవరో
ఎదురుచూపున కరగని క్షణాలే
పదాలుగా మారి, పుటలుగా పుడుతూ
కాలమే ఒక కావ్యమౌతుందని,
ఆ కావ్యమే కరుగనున్నదన్నదెవరో
ఎవరెవరన్నది ఎదసొదలకి వదిలి,
చెదరని మనసుల మందిరాల్లో
కరగని మమతల సోపానాలెక్కిన
జంటపక్షుల సురగానాలవి
Nice one Usha gaaru:):)
ReplyDeleteThanks that you liked it... ఆ గరిక పచ్చలు, పక్షులు ఇపుడిపుడే వస్తున్న వసంత జాడలు. in general our mid-west has close to 7 months of dried out lands and the rest 5 are the best of earth with emerald shines and rainbow blossoms...
Deleteఈ పక్షి పేరు Common Grackle. Icterid సంతతి పక్షి. దాదాపుగా నా కిటికీ అంచున వాలతాయి...అప్పుడు పట్టానిలా!
ReplyDeleteఅనురాగానికి అపురూపమైన చిరునామా తో
ReplyDeleteవసంతానికి వన్నె తెచ్చారు . బాగుంది .
నెనర్లు. వసంతం నిజంగానే ఋతువుల్లో రారాణి లా అన్ని మానసిక రుగ్మతలనీ జయింపచేసి అంతో ఇంతో విజయోత్సాహంతో మనసుని వేడుకలోకి నెడుతుంది ఎప్పుడూ!
Delete