కోన దాపున ఆమని శోభ

పటమటి నుదుటి బొట్టు నీడలు
నీటి వాలులో పసిడి దీధితులు

తెలవారి తిరిగొచ్చే ధవళ కాంతులు
గరికె మేనికి గంధపు చెమరింతలు

శిఖరకేతనపు పచ్చల వీవెనలు
మూసిన గుప్పిట మేల్కొలుపులు

విరిసీ విరియని నవ్వుల దొంతరలు
కిటికీ రెక్కకి తగిలించిన జ్ఞాపకాలు

6 comments:

 1. "కిటికీ రెక్కకి తగిలించిన జ్ఞాపకాలు.." nice..

  ReplyDelete
 2. విరిసీ విరియని నవ్వుల దొంతరలు
  కిటికీ రెక్కకి తగిలించిన జ్ఞాపకాలు nice expression:):)

  ReplyDelete
 3. తృష్ణ, ఎగిసే అలలు...., Hima bindu మీ మీ వ్యాఖ్యలకి నెనర్లు!

  చిన్ని, అక్కడక్కడా రాసినవి, రాస్తున్నవి ఇక్కడ పొందుపరుస్తున్నాను, సమయాభావ పరిస్థితుల్లో ఇదే సరైన మార్గం అనిపించింది...

  ReplyDelete
 4. ...గరికె మేనికి గంధపు చెమరింతలు...
  ...మూసిన గుప్పిట మేల్కొలుపులు...
  ...కిటికీ రెక్కకి తగిలించిన జ్ఞాపకాలు...

  మీకు మాత్రమే స్పురించే
  విశిష్టమైన భావ ప్రకటనలు...

  అభినందనలు ...

  ReplyDelete
  Replies
  1. nmraobandi గారు, నెనర్లు! మీరు కోట్ చేసిన 1,3 పంక్తులే అసలీ కవితకి ప్రేరణ. బహుశా ఒకరి రాతలు వాతానుగా చదివితే ఆ కలపుజాడలు, కలంకలలు త్వరగా స్ఫురిస్తాయేమో!? ఏదేనీ గానీండి, మీ వ్యాఖ్యకి సంతోషం!!!

   Delete