ఆకుల కాకులు అల్లరిగా ఎగిరెగిరిపోతే,
కొమ్మల పందిర్లు వెలవెలబోతూ,
రాలుగాయి గాలులకి,
ఆకతాయి వానలకీ చిక్కాయని,
కిటికీ అద్దం కబురు చెప్పింది.
చక్రాలు ఉండుండి ఉలిక్కిపడి,
కుదుపొకటి ఊహని చెదరేస్తే,
మాటల మాటున మనసుని,
పాటల రూపుగ చిత్రిస్తూ,
నాకు నేనే ఊసులు చెప్పాను.
కిటికీ అవతలి ఆకాశం,
బొగ్గుల కుంపట్లా ఉంది.
జొన్నకంకులు లేని చేలు,
చిన్నబోయి నేలలోకి కృంగాయి.
నీలాకాశం, పచ్చనిపైరు జ్ఞప్తికొచ్చాయి.
కంటికీ, ఆలోచనకీ లంకెలు వేస్తూనే,
ఒప్పేసుకున్నాను నిన్ను మరవలేనని.
అసలు విహారం, నీ తలపుల్లోనే అనునిత్యం
ఇక రేయికీ వేకువకీ నడుమ కలలగమనం,
నిదుర మెలుకువల సహగమనం, నీ అనురాగం తోడుగా...
కొమ్మల పందిర్లు వెలవెలబోతూ,
రాలుగాయి గాలులకి,
ఆకతాయి వానలకీ చిక్కాయని,
కిటికీ అద్దం కబురు చెప్పింది.
చక్రాలు ఉండుండి ఉలిక్కిపడి,
కుదుపొకటి ఊహని చెదరేస్తే,
మాటల మాటున మనసుని,
పాటల రూపుగ చిత్రిస్తూ,
నాకు నేనే ఊసులు చెప్పాను.
కిటికీ అవతలి ఆకాశం,
బొగ్గుల కుంపట్లా ఉంది.
జొన్నకంకులు లేని చేలు,
చిన్నబోయి నేలలోకి కృంగాయి.
నీలాకాశం, పచ్చనిపైరు జ్ఞప్తికొచ్చాయి.
కంటికీ, ఆలోచనకీ లంకెలు వేస్తూనే,
ఒప్పేసుకున్నాను నిన్ను మరవలేనని.
అసలు విహారం, నీ తలపుల్లోనే అనునిత్యం
ఇక రేయికీ వేకువకీ నడుమ కలలగమనం,
నిదుర మెలుకువల సహగమనం, నీ అనురాగం తోడుగా...
...కిటికీ అద్దం కబురు చెప్పింది...
ReplyDelete...కంటికీ, ఆలోచనకీ లంకెలు వేస్తూనే
ఒప్పేసుకున్నాను నిన్ను మరవలేనని...
...విహారం, నీ తలపుల్లోనే అనునిత్యం...
అద్దం చెప్పిన కబుర్లు...
అల్లరి అమ్మాయి షికార్లు...