చెప్పలేదు కదు!?

నేనున్నానక్కడ అంటే తెలుసా? నేను ఇక్కడ మాత్రమే లేను అక్కడ కూడా ఉన్నాను అని అర్ధం. ఎక్కడా అంటావా- నీ ఎదలోను ఎదుటా ను! ఎందుకని అడగవు గానీ,

జీవిత బీజం మొన్న పుట్టి, నిన్న మొక్కై ఇవ్వాళ పూలు కాయలు వేస్తుందా, కాదుగా? జీవితం ఒక మహా వృక్షం అయ్యాక ఒకే ఫలాన్ని ఇస్తుంది: నా జాతి పేరు 'ప్రేమ', నమ్ము ఇది నిజం! అందుకే ఊహాత్మక అనుబంధాల ప్రేమామృతాన్ని తాగుతుంటాను. చెప్పనే లేకపోయానింత వరకు, నిజ జీవితం లో స్వార్థపు అగ్ని పర్వతం చిమ్మే లావాని, కలహాల మథనం లో పుట్టే హాలాహల ద్రవాన్ని తప్పనిసరై సేవించానని. నీకు చెప్పలేదు కదు, నేనొక నిశివేళ ఈ జీవన సంవిధానము అర్ధం చేసుకుని మౌలిక అంతరాలలో దాగున్న రహస్యాలని ఆవిష్కరింప చేసుకున్నానని? నీకు నిజం గా చెప్పడం మర్చిపోయాను నేనొక మామూలు మనిషినని; ఇన్నాళ్ళూ ఈ మరో ప్రపంచపు కోలాహలం లో, మహా జగత్ కల్లోలం లో కన్నీళ్ళు పెట్టుకుంటూనే నా జీవిత ఫలపు విత్తులని నాటటానికొక హృదయసీమకై వెదుకులాడుతున్నానని...నిను కనుగొన్నాక ఆ అన్వేషణ ముగిసిన ఘడియల్లో అలిసి డస్సిపోయి ఉన్నానని ఇంకా చెప్పేతీరాలా? 

4 comments:

  1. ఎందుకని అడగవు గానీ...
    చెప్పనే లేకపోయానింత వరకు...
    నేనొక మామూలు మనిషినని...
    నేను ఇక్కడ మాత్రమే లేను అక్కడ కూడా ఉన్నాను అని...
    ఉన్నానని ఇంకా చెప్పేతీరాలా?

    నా జాతి పేరు 'ప్రేమ...
    ఇది నిజం...

    ReplyDelete
  2. You seem to be carried away with this small write-up...and I must agree, I myself go through such emotions with some! Thanks...

    ReplyDelete
    Replies
    1. can't say how much i loved this small write up...
      the day i first read it...
      and whenever i read it again...
      and again...
      just loved every bit of it...

      Delete