నవ్వులు పంచే పాఠాలు నేర్చుకోవాలనుందా? కాస్త ఇది చదవండి మరి.
జనవరి నెల కాస్త చలికి వణుకుతూ, బుల్లి బుల్లి బన్నీల్లా, టెడ్డీ బేర్ బొమ్మల్లా, పాపం, మానకుండా వచ్చారు అన్ని క్లాసులకీ దాదాపుగా. మానినవాళ్ళ మాటలివి.
"ఏమ్మా ఎందుకు రాలేదురా?"
.. నేను "అదుర్స్" సినిమాకి వెళ్ళాను. [నేను అదిరిపడ్డానని చెప్పాలా?] :)
.. అమ్మ షాపింగ్ లో లేట్ చేసి నా క్లాస్ మిస్ చేసింది
.. నాకు నిద్ర వచ్చింది
.. మా డాడీకి టాటా చెప్పటానికి ఏర్పోర్ట్ కి వెళ్ళాను
మంచి పంతులమ్మని కనుక "దొంగ జ్వరాలు" రావు వీళ్ళకి. :) రావాలనే పరుగులు తీసి వస్తారు. పదిమంది పిల్లకాయలు, ఒక గురువాంటి అని లెక్కలూ వేస్తారు. ;)
ఈ నెల అంతా పదాలు వల్లె వేయటం, వ్రాయటం మీదనే సాధన జరిపాము.
నేను పదాలు ఇలా విడగొట్టి వ్రాయటం నేర్పాను.
౧. ముందుగా రోమనైజ్డ్ పదంగా వ్రాసి విడగొట్టటం.
iTuka -> i|Tu|ka
౨. తర్వాత ఒక్కో అక్షరం కూర్చటం
i = ఇ
Tu = ట + ఉ = టు
ka = క
iTuka = ఇటుక
ఆ పై విధంగా ప్రతి గుణింతానికీ పదాలు, దాదాపుగా అన్ని హల్లులు వాడి నేర్చాము.
మరి రెండు ఉదాహరణలివి.
bhaarya -> bhaa|rya
bhaa = భ + అ = భా
r!ya = ర ++ య = ర్య [వాళ్ళకి గుణింతం కి వత్తుకి తేడా ఇలా నేర్పాను]
bhaarya = భార్య
attammaa -> a|tta|mmaa
a = అ
t!ta = త + త = త్త
m!maa = మ + అ ++ మ = మా ++ మ = మ్మా
attammaa = అత్తమ్మా
నెలాఖరుకి పిల్లల స్థాయి ఇది.
వైష్ణవి, సాహితి, స్నేహ,నేహ, మేఘన, స్ఫూర్తి, అనీష(సంతు): ఈ ఏడుగురు పిల్లలు "అమ్మ మాట చల్లన, ఆవు పాలు తెల్లన..." పాట మొత్తం తెలుగులో వ్రాయగలిగారు.
శ్రీవల్లి, అలేఖ్య, అనూష, అనీష: నలుగురు తేలిక పదాలు వ్రాయగలుగుతున్నారు.
లలిత్, తేజస్, సంహిత్ : ఈ ముగ్గురు అక్షరాలు వ్రాస్తున్నారు. వీళ్ళు మరీ బుజ్జాయిలు కనుక ఇదే పెద్ద జంప్. మరదే కదా మగపిల్లలు వెనకపడిపోయారు, వెనగ్గా పుట్టారు కాదా మరి. ;)
***************************************
వ్యతిరేక పదాలు : నేను నేర్చిన పాఠాలు
పాత-కొత్త, పెద్ద-చిన్న, పొడుగు-పొట్టి, ఉంది-లేదు, పైన-క్రింద, లోపల-బయట
ఈ వరకు నేను చెప్పి ఇక వాళ్ళని చెప్పమంటే ఇదిగో ;)
పుట్టింది - చచ్చింది [ ఈ మాట కి అంతా నవ్వే సరికి, ఇది ఇదేదో గొప్ప ప్రయోగమనుకుని..]
వచ్చాడు - చచ్చాడు [నేను నవ్వి నవ్వి చచ్చిపోయాను నిజ్జంగా.. ఇది సినిమా పరిజ్ఞామని వేరే చెప్పాలా?]
బతికింది - చచ్చింది [ఆరేళ్ళ సంహిత్ ఈ మాట చెప్పటం వింతే సుమీ!]
అమ్మాయి- అబ్బాయి [ఇదెక్కడి లెక్కబ్బా! ;)]
***************************************
నెమరువేత: పది పదాలు వల్లె వేయించి, తిరిగి చెప్పమన్నాను.
దాదాపుగా అందరికీ ఐదారు పదాల వరకు గుర్తున్నాయి. ఇద్దరు మూడు, మరిద్దరు ఎనిమిది చెప్పారు. ఇది వాళ్ళలో జ్ఞాపకశక్తికి కసరత్తు.
***************************************
జోడు పదాలు : ఇవి వాళ్ళకి తమ చుట్టూ పరిసరాల్లో చూసేవి గొలుసుకట్టుగా రావాలని నేర్పాను.
పిల్లి-ఎలుక; పాలు-పెరుగు; మొక్క-పువ్వు; కాయ-పండు; ఉప్పు-కారం
***************************************
లెక్కలు పెద్దగా చేయలేదు. నూట పదహార్లు, వెయ్యినూట పదహార్లు వంటివి చెప్పుకుని, వందల్లో అంకెల్ని తెలుగులో చెప్పటం ఎలాగో సాధన చేసాం. కొద్దిపాటి కూడికలు కూడా.
***************************************
పాటలు: ఒకటీ అరా పాడినా పైన సాధనకే పెద్దపీఠ ఈ నెల.
త్వరలో ...
ఫిబ్రవరి నెల నుండి అంతా రైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. దాదాపుగా అన్నీ మన రాష్ట్రానికి చెందిన అంశాలే. ప్రదేశాలు, నదులు, వృక్షాలు. వివరాలు వచ్చే నెలాఖరుకు...
బావుందండీ
ReplyDeleteబాగుందండీ,మీరు వాళ్ళకి తెలుగు నేర్పిస్తే మి పొస్ట్ చూసి తెలుగు నుంచి english తప్పులు వ్రాయకుండా ఎలాగో నేను నేర్చుకుంటున్నాండి.
ReplyDeleteమీ మరువం లో కామెంట్ పెట్టడానికి రావడం లేదండి. స్నేహమా కవిత నాకు చాలా చాలా నచ్చేసిందండి.అద్బుతంగా వ్రాసారు.
జీవని గారు, క్రమం తప్పకుండా నా బడికబుర్లు చదివి, వ్యాఖ్యానిస్తున్నందుకు చాలా థాంక్స్.
ReplyDeleteరఘు గారు, నా పాఠాలు అలాగ కూడ ఉపయోగపడుతున్నయన్నమాట. అవునండి "మరువం" బ్లాగు కామెంట్స్ అనుమతించదు. మీకు "స్నేహమా" కవిత నచ్చినందుకు చాలా థాంక్స్. అందులోని అపురూపం స్నేహం లోని గొప్పదనమే కదండి.
ReplyDelete