చేపా చేపా అంటూ నా మీద కథ కట్టి
అనగనగా అంటూ పాపతో ఊ కొట్టించి
ఏమయ్యా మనిషీ ఎన్నేళ్ళిలా?
విన్న నాకే వెగటాయే...
ఇక నేను ఓ కథ నీకు వినిపిస్తానిక
నేనున్న చెరువు నీళ్ళు మక్కువగా
మబ్బు రంగు పులుముకుని
ఒడ్డునున్న రాయి రప్పని ఒరుసుకుని
వెనక్కి ముందుకి వొళ్ళిరుసుకునే యేళ
నీలికళ్ళ చిన్నాడు వేటకనివచ్చినాడు
నా జతగాళ్ళు ఎగిసెగిసి పడి నవ్వినారు
ఏరా ఏరా ఎందుకు నవ్వినారంటే
చూడు చూడు అబ్బాయి వెనక చూడమనే
బంగారుఛాయ వొంటిదా ఆమె కురులదాన్నట్లు
చూడచక్కని చిన్నది వయ్యారి నడకల వచ్చినాది
పిలగాని చేయి గేలం నా వైపు విసిరితే
సొగసరి చూపు వల వాని వంక విసిరేను
చేత చిక్కిన నను చలాగ్గ తిరిగి నీట విసిరే ఆ యువ జాలరి
వోరకంట చిక్కిన చెలికాని పెదవి పంటి క్రింద నొక్కే నా సింగారి
ఇది కదా ఎప్పటి కథ అని నా జతగాళ్ళు మళ్ళీ కిసుక్కుమనే
ఈ సిత్రాలు చూడను చుక్కపొద్దాయే
సందమామ నడుమ సర్దుకుని కళ్ళిప్పి చూసేను
ఇసుక పక్క మీద ఆ పడుచుజంట చేయి చేయి కలిపి
కనుల వెన్నెల్లు, కబుర్ల తెమ్మెరలు కలబోసుకుని
వలపు వొలకబోస్తే చుక్కంటి ఓ చేపపడుచు నా వంక కనుగీటి నవ్వేను.
అనగనగా అంటూ పాపతో ఊ కొట్టించి
ఏమయ్యా మనిషీ ఎన్నేళ్ళిలా?
విన్న నాకే వెగటాయే...
ఇక నేను ఓ కథ నీకు వినిపిస్తానిక
నేనున్న చెరువు నీళ్ళు మక్కువగా
మబ్బు రంగు పులుముకుని
ఒడ్డునున్న రాయి రప్పని ఒరుసుకుని
వెనక్కి ముందుకి వొళ్ళిరుసుకునే యేళ
నీలికళ్ళ చిన్నాడు వేటకనివచ్చినాడు
నా జతగాళ్ళు ఎగిసెగిసి పడి నవ్వినారు
ఏరా ఏరా ఎందుకు నవ్వినారంటే
చూడు చూడు అబ్బాయి వెనక చూడమనే
బంగారుఛాయ వొంటిదా ఆమె కురులదాన్నట్లు
చూడచక్కని చిన్నది వయ్యారి నడకల వచ్చినాది
పిలగాని చేయి గేలం నా వైపు విసిరితే
సొగసరి చూపు వల వాని వంక విసిరేను
చేత చిక్కిన నను చలాగ్గ తిరిగి నీట విసిరే ఆ యువ జాలరి
వోరకంట చిక్కిన చెలికాని పెదవి పంటి క్రింద నొక్కే నా సింగారి
ఇది కదా ఎప్పటి కథ అని నా జతగాళ్ళు మళ్ళీ కిసుక్కుమనే
ఈ సిత్రాలు చూడను చుక్కపొద్దాయే
సందమామ నడుమ సర్దుకుని కళ్ళిప్పి చూసేను
ఇసుక పక్క మీద ఆ పడుచుజంట చేయి చేయి కలిపి
కనుల వెన్నెల్లు, కబుర్ల తెమ్మెరలు కలబోసుకుని
వలపు వొలకబోస్తే చుక్కంటి ఓ చేపపడుచు నా వంక కనుగీటి నవ్వేను.
gravatar
ReplyDeleteఅడ్డ గాడిద (The Ass) had this to say, September 28, 2009 8:49 PM
chala bagundi kavitha. identi vere vallavi kuda ila prachuristhara?
Neways this is a beautiful gesture, and wonderful poem.
"ఇసుక పక్క మీద ఆ పడుచుజంట చేయి చేయి కలిపి
కనుల వెన్నెల్లు, కబుర్ల తెమ్మెరలు కలబోసుకుని
వలపు వొలకబోస్తే చుక్కంటి ఓ చేపపడుచు నా వంక కనుగీటి నవ్వేను."
abba! what an expression. Really magical. A touch of golden expression
super usha .. దశమి శుభాకాంక్షలు
ReplyDeleteOh this time Usha garu? Wow. After book reviews, and adventure, it's time for poetry!!! Nice. Very nice.
ReplyDeleteUsha garu, very romantic poem by you. Really it suits the mood of the blog. The words are magically written by you. Especially the last stanza is simply super.
Hope this time we will have more frequent posts.
Quite nice. Now it's the changed story? The first stanza is hilarious. Beautifully written.
ReplyDeleteచాలా బాగుంది కవిత, విజయదశమి శుభాకాంక్షలు
ReplyDeleteSo nice a poem. Every word contributes to the beauty. The last stanza is... :-)
ReplyDeleteఉష గారూ,
ReplyDeleteచాలా బగా రాశారండీ. చక్కని భావయుక్తంగా ఉంది. చిలిపి ఊహలు రేకెత్తిస్తూ, ఆహ్లాదకరంగా.
మీ గురించి చెల్లి చెప్తుంటే విన్నాను. ఒకసారేదో కవిత కూడా చూశాను. చాలా బాగుందనిపించింది. తీరిక చూసుకుని అన్నీ చదవాలి.
వేదన , విరహం లోంచి సరసం లోకి వచ్చిన ఉష గారికి అభినందనలు .కొన్నాళ్ళకి వేటగాడికి విసుగు పుట్టింది , కడుపులో ఆకలి కర్తవ్యాన్ని భోదించింది ,పిల్ల వలలో పడకుండా తన వలలో పడిన చేపని బుట్టలో వేసుకుని బజారు కి సాగి పోయాడు , పిల్ల బేజారై ఇసకలో చతికిల బడింది అని మాత్రం రాయకండెం.
ReplyDeleteనేనయితే ''అక్కడికి '' వెళ్ళిపోయాను .....అధ్బుతం
ReplyDeleteయువ చేపని చూసి యువతి చేప ఇలా పాడుకుంటుంది తనేం అందో అన్దోలేదో
ReplyDeleteతెలిలేదో నిజంగా
మదెం విందో విందో లేదో
కలెం కాదె ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశం లో మునిగి పొతే పైకి రాగలమా
ఇదే క్షణం శిలై నిలవని
సదా మనం ఇలా మిగలని
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీకంటే ఇవాళ్ళే జీవించాను నూరేళ్ళు
ఉషగారి కలం ఆ వైపు విసిరితే
ReplyDeleteసొగసైన కవిత ఈ వైపు రమ్మంది
పొద్దు పొద్దున్నే ఈ సిత్రాన్ని చదువగ
సిన్నదాని రూపు కళ్ళముందు కదిలె
తప్పు తప్పని తప్పుగో బోతిని
వెనకకి పోవ దారి కరువాయె.
అవునండీ యువ చేపలు చూటునున్న చేపల్ని గమనించలేదా? :)
వావ్ ఉష గారు, అందమైన సన్నివేశానికి మరింత అందాన్ని చేకూర్చే కవిత. అద్భుతంగా ఉంది.
ReplyDeleteవేణూ శ్రీకాంత్!!!
ReplyDeleteఇదన్న్యాయం. అక్కడ కామెంటేయకుండా ఇకడా? ఇక్కడొద్దని అనను కానీ, కాస్త పేట్రియాటిజం చూపాలి కదా...!!! :-D
చాలా బాగుంది. సరళమైన పదాలతో అందరికీ అర్ధమయ్యేలా. ఈ మధ్య చూసిన మీ పద్యాల్లో భావ గాఢత ఎక్కువగా ఉండేది.అంత సులభంగా అర్ధమయ్యేవి కావు. ఈ కవితైతే శ్రామికులు పాట పాడుతున్నట్లు ఉంది. నాకు బాగా నచ్చింది.
ReplyDeletewow!
ReplyDeleteravigari kavita kuudaa baagaanea vundeamoe!
ReplyDeleteచేప కన్నుల సొగసరిని చూసి అసూయ పడ్డ చేప,
ReplyDeleteరాజు గారి కొడుకుల వలలో పడని గడసరి చేప
సైకత పానుపు ఊసులు చెప్పే ముద్దుల చేప
నీటిలో దాగి వలకు చిక్కి వలపులు పెంచు ముదురు చేప
అందుకే ఇది ప్రపంచపు ఎనిమిదో వింత, అందమైన మీ ఎనిమిదో చేప
హ హ గీతాచార్య గారు, రెండు చోట్ల ఒకే కామెంట్ ఎందుకని రాయలేదు :-) అక్కడ కూడా ఒక కామెంటాను చూడండి.
ReplyDeleteప్రదీప్ మీ కామెంట్ సూపర్ :-)
ReplyDeleteCongrats Madam...
ReplyDeleteచేపా చేపా ఎన్ని వూసులు నీకు - అమ్మో నేనిక మోసుకురాలేనమ్మా. ఎంత గొప్పదానివైపోయావు :) ఇంచక్కా కథ వినిపించావు. అందరి అభిమానాన్నీ కొట్టేసావు. ఇంకింన్ని సిత్రాలూ చేసావు.
ReplyDelete* అ.గా. గారి అభినందనతో చిందులేయటం మొదలెట్టావు.
* నేస్తం, ప్రియ, Nobody, సృజన, వైష్ణవి వంటి యూత్ ఫుల్ చప్పట్లు వీపున కట్టుకున్నావు.
* విజయమోహన్ గారికి మరో మాటాడను వీలివ్వకపోతివి ;)
* రవిగారి చేత మేళమాడించావు, అంతటితో ఆగావా! కథకులు రవిగారిని కవిగారిని చేసావు. అశ్వినిశ్రీ గారి చేత "శభాష్" అనిపించావు.
* భా.రా.రె గార్ని భామిని పాల్జేసావు
* చిన్నీని ఎక్కడికో పంపేసావు, పాపం పిచ్చిపిల్ల ఇల్లు చేరిందో లేదో.. ఎవరినడగాలి?
* ప్రదీప్ చేత ఎనిమిదో వింతగా పొగడబడ్డావు. నీకు సరి కైత రాయించావు నెరజాణవి మరి ;)
* వెంకట రమణ గారికి "ఓ రంగయో పూల రంగయో. ఓరచూపు చాలించి సాగిపోవయో." మాదిరి పాటలు గుర్తు చేసావు.
* గీతాచార్యతో వంతులాడించావు.
* మంచి బాలుడు వేణు గార్ని ముమ్మారు నీ చుట్టూ తిప్పించుకున్నావు
* కుమార్ గారికి వంటి వతనుగా వచ్చేవారికి రెండు పనులప్పజెప్పావు. లేకుంటే గీతాచార్య వూరుకోరుగా అన్నావు.
మీ అందరికీ మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు.
@ రవిగారు, అన్యాయమండి, మొత్తం ఒకసారి గాలించండి ఈ వనాన ఎన్ని అఘ్రాణింపులు దొరుకుతాయో! సరసం అనురక్తి లేనిదెలాగా చెప్పండి అన్నీ సమపాళ్ళు.
@ వైష్ణవీ, స్వాగతం. ఇదే మీ పునరాగమనానికి ఆహ్వానం కూడాను. ప్రియ కి థాంక్స్ చెప్పండి మనని పరిచయం చేసినందుకు.
@ ప్రదీప్, "జలపుష్పవిలాసం" కలిసి వ్రాద్దామేంటీ?
*************************************************
మరిక ప్రస్తుతానికి సెలవు. చేప చెప్పిన వూసులు గుర్తుకొస్తున్నాయి... :)
నేను సిద్దం జలపుష్పాభిషేకానికి
ReplyDeleteఉష గారూ,
ReplyDeleteకథ.. అదేనండీ మీ కవిత చాలా చాలా బాగుంది. ఇంత చక్కని కవిత రాయడానికి మీకు దొరికిన స్ఫూర్తి మరింత ముచ్చటగా ఉంది. ఒకవేళ నాబోటి వారికి అలాంటి స్ఫూర్తి కలిగినా ఇంతందంగా భావవ్యక్తీకరణ చేయడం సాధ్యమా చెప్పండి. ఎంతయినా మీరు మీరే మరి ;)
చాలా బాగుందండి..కవిత.(ఇవాళే మళ్ళీ వచ్చానండీ బ్లాగ్లోకం లోకి..)
ReplyDeleteఅయ్యో అయ్యో అయ్యో! ఏదో చిన్న పిల్లాడిని అంత పెద్ద ":-D" స్మైలీ పెట్టినా వంతులాడానంటారా? హయ్యో! నేనెవరికి చెప్పుకునేది?
ReplyDeleteGags apart, and not as a person of B&G, I'm telling you as a common reader of my age group... (25) it's a cute feeling to visualize things. I like to have such romantic experiences. రవిగాంచని అందాన్ని ఉష గారు మాకు అందించారు. వేన వేన కృతఙ్ఞతాభివందనాలు. నమోషస్సులు.
జలపుష్పాభిషేకం!!! సంకలనం వైపు దారి తీసిన ఈ టపా ఒక మైలురాయి మరువపు వనాన. మీరంతా ఆ టపాని కూడా ఒకసారి పలుకరించివెళ్ళండి.
ReplyDelete@ ప్రదీప్, అన్నమాట వెంటనే నెరవేర్చేసారుగా!
@ తృష్ణ, మధుర, ఇలా మీరంతా ఇస్తున్న ప్రోత్సాహమే కదా ఇది...
@ గీతాచార్య, మీతో నేనూ అంగీకరిస్తున్నాను. ఈ భావనలు, సున్నిత స్పందనలు మనసుకి సంబంధించినవి, వయసుకి కాదు. అనుభూతికి సమయం, సందర్భం వుంటాయా? మనసుండాలి కానీ. మీకు నా కృతజ్ఞతలు.