విశ్వామిత్ర - ఉపోధ్ఘాతం

విశ్వ,మిత్ర - వారి జీవితాలే వారి పయనం. ఒకరి ప్రేమ అన్వేషణ ఆఖరి మజిలీ మరొకరు. సహవాసులు, సహజచిత్రాలు. గలగల గోదారి మిత్రవింద. నల్లనయ్య అష్టభార్యల్లో నిదానస్తురాలి పేరున్నా సత్యభామవంటి స్వాధీనపథిక. అపురూప సౌందర్యవతి. అసమాన ప్రతిభాశీలి. లక్ష్యసిద్దికి తపించే ధీరోదాత్త.

ఆ పరవళ్ళ గోదావరి చుట్టుకు ప్రవహించే నిశ్చల కీలాద్రి విశ్వనాథ్. తనని తాను ఆమె ప్రేమలో ఆవిష్కరించుకున్న మౌనమూర్తి. సాదాసీదా జీవితాన్ని కోరుకునే అసమాన వ్యక్తిత్వం కలవాడు. మంచికి మారుపేరు.


ఇరువురి కలయిక చిత్రం. కలవరేమోననిపించే వైరుధ్యం. అయినా కలిసిన మనసులవి.
ఈ ఇద్దరి కథే నా "విశ్వామిత్ర". ఈ సజీవశిల్పాలని చెక్కేందుకు సమయం కావాలి, కాస్త అనుభవాన్ని పునశ్చరణ చేయాలి. మరికాస్త శైలి మీద పట్టుకై అధ్యయనం చేయాలి, అంతవరకు కాస్త గడువు కోరుకుంటూ స్వల్ప విరామం తీసుకుంటున్నాను.
ఇంతవరకు మీ మనసుకు ఏర్పడిన అభిప్రాయాన్ని నాతో పంచుకోమని మనవి.

25 comments:

 1. త్వరలో మీ కలం నుండీ ఓ కథ రబోతోందన్నమాట. మీ కథ రసవత్తరంగా సాగాలని అభిలషిస్తున్నాను.

  all the best :)

  ReplyDelete
 2. మీరు మరీ కవిత్వం రాస్తారు మేడం. మాలాంటి ప్రాణులూ ఉంటారు కదా! కవిత్వాన్ని ఆస్వాదించలేని వాళ్ళు అవే పదాలు వచనంలో ఉంటే చదివేస్తాను,కొంచం వచనం లో ఐతే బావుంటుంది.మొదలు పెట్టండి. ఎదురు చూస్తున్నాం.
  (నా వ్యక్తి గత అభిప్రాయం-- ఎందుకో నేను వచనాన్ని ఇష్ట పడినంతగా వేరే ఏరూపం లోనూ చదవలేను. బద్దకం. తీరుబడిగా తరువాత అనుకుంటాను. అది అంతే ఐపోతుంది.)

  ReplyDelete
 3. ఆసక్తితో ఎదురు చూస్తున్నాం!

  ReplyDelete
 4. విశ్వప్రేమికుడు, సునీత, పద్మార్పితా, నేస్తం, ఆ నలుగురు అన్న మాదిరిగా, మీ నలుగురి సాభిప్రాయం చాలు, ఎందుకా క్రొత్త ప్రక్రియ, మా మీద ప్రయోగాలు అనకుండా వెన్ను తట్టినట్లు మీ వ్యాఖ్యలు. ధన్యవాదాలు.

  ReplyDelete
 5. కవయత్రి ఉష రచయత్రి కానున్న తరుణం లో అందుకోండి మరి మా మనః పూర్వక శుభాకాంక్షలు. You can do it Usha. All the best.

  ReplyDelete
 6. ఓ మీరు కథలు కూడా రాస్తారా ? తొందరగా రాయండి మరి.ఎదురుచూస్తూవుంటాను.

  ReplyDelete
 7. నేను సునీత గారికి పూర్తి వ్యతిరేక భావం కలవాడిని. వచనం కంటే కవిత్వాన్ని ఆస్వాదించడం ఎక్కువ ఇష్టపడేవాడిని. అలాగని కథలు చదవని వాడ్ని కాదు కానీ మీ కలం నుండి ఈ సీరియల్ తో పాటు మాలాంటి వాళ్ళకోసం మధ్యలో కవితలు కూడా రాస్తారని ఆశిస్తూ...

  ReplyDelete
 8. విశ్వామిత్ర పేరుతో కవితా !! ఏం రాసుంటారా అని ఆసక్తిగా వచ్చాను. కధ అని తెలుసుకుని అనందించాను. మీ కథ కై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

  ReplyDelete
 9. అయితే భావయుక్తమైన రచనలు ఆశ్వాదించబోతున్నామన్న మాట.

  ReplyDelete
 10. భావన, నా మీద మీరుంచిన నమ్మకాన్ని వమ్ముచేయననే నా భావన.
  మాలా గారు, అలాగైనా మిమ్మల్ని ఈ వనాన కట్టిపడేయగలనేమో?

  ReplyDelete
 11. వర్మ, కవనం నా వూపిరి, అది లేకుండానా? వచనం నాకు కత్తి మీద సామే. తనకిచిన మాట ప్రకారం సరళంగా ఈ కథ వ్రాయాలి. కవితకి స్వల్ప వ్యవధే కానీ వీడ్కోలు కాదిది. మనం మనం కవితా రథ సారధులం. కృతజ్ఞతలు.
  వేణూ గారు, ఒకటనుకున్నాక ఎక్కువ కాలయాపన చేయటం అలవాటు లేదు, త్వరలో వస్తుంది మీ ముందుకి నా తొలి నవలిక. ఒకింత సంశయం, రవ్వంత భయం. చూద్దాం, ఎలా నడిపిస్తానో. నెనర్లు.

  ReplyDelete
 12. రాధిక, రాక రాక వస్తారు, ఇలా ముందరి కాళ్ళకి ఓ బంధం వేస్తారు. మీఅంచనాలని చేరగలనోలేదో?

  ReplyDelete
 13. బాబా గారు, కొత్తపాళీ గారు, మీ ఇరువురు నా తొలివచన టపాకి వ్యాఖ్యాతలు. ఈ తొలి నవలికకి కూడా మీ ఆకాంక్ష అందజేయటం నాకు చాలా సంతోషం. తిరిగి త్వరలో మీ ముందుకి వస్తాను.

  ReplyDelete
 14. ఓహో ..ఏమీ మా భాగ్యము ...మరువంలో ఇకనుండి కవితలే కాదు కధల వెల్లువన్నమాట !

  ReplyDelete
 15. మీరు ఏమి చేసినా అదుర్సేనండి. మీ కథ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

  ReplyDelete
 16. ఎక్కడో విన్నాను.

  ఓం నా "రా" యణాయ నమ: అనే మంత్రంలోని రా అక్షరాన్నీ,
  ఓం న "మ" శ్శివాయ అనే మంత్రంలోని మ అక్షరాన్నీ తీసి కలిపితే దశరథ తనయుడు "రామ" అయ్యాడని. కాని అదే పదానికి అర్ధం "రమింపజేయువాడని" అట! అలా ఇప్పుడు మీ మిత్రవింద, విశ్వనాథులు కలిస్తే ఊహించని రీతిలో మేనక సరాగామృతాన్ని ఆస్వాదించకుండా మనసునాపుకోలేనీ, ఆ త్రిశంఖు స్వర్గ బ్రహ్మైన విశ్వామిత్రుడు కనిపించాడన్నమాట! అంటే మాయా మద మచ్చరాలనే సహజ మానవ గుణాలతో రంజింపజేయబోతోందన్నమాట మీ కథ. భలే ఉందండీ మీ పాత్రధారుల సృష్ఠి. అందుకేనేమో అన్నారు, కలవరేమోననిపించే వైరుధ్యం అని! ఏది ఏమైనా అక్షరాలతో సయ్యాటలూ, పదాలతో భాషలతో సరసాలూ కవులకూ, కథకులకే చెల్లు!!

  మీ విశ్వమిత్ర మీ మాట వినాలని మనసారా కోరుకుంటున్నాను. మా అందరికీ ఓ మంచి మాట చెప్పాలని కూడా ఆశిస్తున్నాను.
  శుభాకాంక్షలు!!!

  ReplyDelete
 17. చూద్దాం ఎప్పటికి వస్తారో?

  చదవటం మేము మరువం,
  వ్రాయటం మీరు మరువకండి.

  A nice and complete writing ahead for u.

  ReplyDelete
 18. Waiting. ఈ లోపల రాయటం మాత్రం మానకండి.

  ReplyDelete
 19. పరిమళం, ప్రదీప్, సైయిప్రవీణ్, ధన్యవాదాలు. ప్రవీణ్, అంతగా అంచనాలు పెంచేస్తే భయమేస్తుందండి.
  గీతాచార్యా, స్రుజన, వ్రాయటం మానలేకే కదండి ఇలా వెల్లువలయేది. నెనర్లు.

  ReplyDelete
 20. ఆనంద్, ఇలా ఆశ్చర్యాద్భుతాలలో నను ముంచేయటం మీకు అలవాటైపోయింది. మీ వ్యాఖ్య ఎంత బాగుందో. నా శీర్షిక "విశ్వామిత్ర "అని పెట్టటంలోని ఉద్దేశ్యాన్ని మటుకు చాలా దగ్గరగా వూహించారు. ఈ కథ కూడా నా ఆలోచనలకి దగ్గరగా వెలికి తేగలననే నా నమ్మకం. త్వరలో మీ ముందుకు... ఈలోగా నా కవనం కొంచం ఉత్ప్రేరకంగా ...

  ReplyDelete
 21. సీరియల్ ప్రారంభం బాగుందండీ.. చదువుతాను వరుసగా..

  ReplyDelete