విశ్వామిత్ర 4 - ఆ నలుగురు

మరో ఆర్నెల్లు గడిచాయి. సుబ్బాలు వచ్చి ఐదు నెలలైంది. పట్నపువాసానికి అలవాటు పడింది. శోభ, అమృతలతో మరింత స్నేహం దృఢపడింది. అప్పుడప్పుడు ఆదివారాలు ఎవరో ఒకరింట్లో కలవటం జరుగుతుంది. శోభ కన్నడిగ. చదరంగంలో మంచి నిష్ణాతురాలు. మిత్రాకి పట్టుపట్టి నేర్పించింది. అమృత మీరట్ నుండి వచ్చింది. వంటల్లో దిట్ట. మంచి మాటకారి. రోజు మిత్ర ఇంట్లో కలిసారు. భోజనాలయ్యాక మాటల్లో పెళ్ళి ప్రసక్తి వచ్చింది.

సంభాషణ ఎక్కువగా ఇంగ్లీష్ లోను, హిందీ లోను సాగుతుంది. సుబ్బాలు కూడా అక్కడే కూర్చునికుతూహలంగాచూస్తూ కూర్చుంది. మిత్ర సుబ్బాలు విషయం చెప్పింది. ఇద్దరూ సానుభూతిగా చూసారు. మాటలేమీ అర్థం కానీ సుబ్బాలు నవ్వుతూ చూస్తూ కూర్చుంది. సాయంత్రం వరకు వుండి వాళ్ళెల్లిపోయినా ఎడతెగని ఆలోచనలతో కాస్త అలసటగా అలాగే కూర్చుండిపోయింది మిత్ర.

రాత్రికి ఏమీ తిననని గ్లాసుడు పాలలో చిటికెడు తేనె కలుపుకుని, నెమ్మదిగా డాబా మీదకి చేరి ప్రక్కగాకూర్చుంది. ఆకాశంలో మిల మిల మెరుస్తూ తారలు. పున్నమికి చేరువగానున్న చంద్రుడు. ఏవేవో ఆలోచనలు ఆ లెక్కలేనన్ని చుక్కలకిమల్లేనే తన మనసులో.

సుబ్బాలు, నలుపైనా చక్కటి కళవుట్టిపడే మనిషి. నవ్వితే ముత్యాల్లా మెరిసే పలువరస. అమాయకంగా మాట్లాడేతీరు. భర్త చేతిలో శారీరకహింసకి గురై, దాదాపు అపస్మారక స్థితిలో తనకి పన్నెండేళ్ళవయసప్పుడు రాత్రి తమ గుమ్మం ముందుకి వచ్చింది సుబ్బాలు. అప్పటికి సుమారు ముప్పైయేళ్ల మనిషని నానమ్మ చెప్పేది. తాతగారే వైద్యం చేయించి కోలుకున్నాక వివరాలు అడిగినా చెప్పటానికి ఇష్టపడలేదు[]. వాళ్ళవాళ్ళూ వెదుక్కుంటూ మరోమూణ్ణెల్లకి వచ్చినా ససేమిరా వెళ్ళనని మొండికేసి బలవంతంగా పంపితే చావనైనా చస్తాను కానీ ఇక అతనితో నాకు సంబంధం వద్దని తెగేసి చెప్పేసిందట.

తన దగ్గరే నెమ్మదిగా చదవటం వ్రాయటం నేర్చుకుంది. ఇప్పుడు వారపత్రికలు చదవగలదు. చురుకు ఎక్కువ. ఇప్పుడు హిందీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా కళ్ళనీళ్ళు పెట్టుకుని గతించిపోయిన మాటలు చెప్తుంది. అక్కడక్కడా కాల్చిన మచ్చలు. తనే ఇందాక "మళ్ళీపెళ్ళిచేసుకో" అని ప్రసక్తి తెస్తే నవ్వేసింది.

"పదేళ్ళ నాడే మారు మనువన్నపుడు యాభైఏళ్ళున్న మా బావకి మా అక్క వుండగానే దానికి కంటిచూపు తగ్గిందని, నన్ను చేయమని అడిగారు మిత్రమ్మా. తాతగారే కేకలేసి పంపేసారు. ఇక ఇప్పుడు కాటికి కాలు చాచిన ముసలోడు వస్తాడు. ఎందుకమ్మా నాకీ లంపటాలు హాయిమంటూవున్నాను. దేముడే అన్నీ చూస్తాడు." అంది.

నిజమే. సుబ్బాలు మానసికపరిణితి దృష్ట్యా ఎక్కువ ఆలోచనలు వుండవు. రేపు అన్నది తనకి అంత ముఖ్యం కాదు. తనకి తోడు అన్నది ప్రక్క మనిషిలో చూసుకుంటుంది. అది ఒక పురుషుడే కానవసరం లేదు. తను అలా వుండగలదా? ఎప్పటికీ ఇలా ఒంటరిగా .. ఏమో తన ఆలోచన సరైనదేనా?

శోభకి తల్లి లేదు, ముభావంగా వుండే తండ్రి. చనువు పెరగనీయని మారుటితల్లి. కళాశాలలో పరిచయమయిన సుధీర్ ని ప్రేమించి, ఉత్తరాది వాడని ఇంట్ళో వారు అభ్యంతరపెట్టినా తన నిర్ణయం మార్చుకోలేదు. వచ్చే నెలలో పెళ్ళి. మధ్యాహ్నం మాటల్లో చెప్పింది.

"ఇప్పటివరకు విషయంలోను నన్ను వత్తిడి పెట్టలేదు. మా మధ్య సరైన అవగాహన కలగటానికి ఇద్దరి ప్రయత్నమూ వుంది. ఎప్పటికీ మా మధ్య స్నేహమన్నది వీడదు. ఇది మేము ఒకరినొకరు కావాలనుకున్న నిర్ణయం తప్పితే ఒకరికొరకు ఒకరం మారాలన్న నియమం కాదు." మాటల్లో ఎంత ఆత్మ విశ్వాసం?

అమృత విడాకులు తీసుకుని పదేళ్ళు కావస్తుంది. ఇద్దరు పిల్లలు తనతోనే వుంటారు. చిన్నవాడు బాబుపుట్టినసంవత్సరానికి మరొక స్త్రీని తీసుకువచ్చి, "పెద్దల మాట కాదనలేక నిన్ను వివాహం చేసుకోవాల్సివచ్చింది. కోమల్ నేను మన వివాహానికి ముందే దగ్గరయ్యాం. ఇప్పుడు విడాకులు అడుగుతున్నాను" అన్న అతని మాటల్తో ఐదేళ్ల తమ కాపురంలో అతని అంటీముట్టని స్వభావానికి అర్థం గ్రహించి ఇల్లు వదిలి బయటకి వచ్చేసింది. అప్పటికే ఉద్యోగం చేస్తుంది కనుక పిల్లల పోషణ భారం కాలేదు. కానీ ఒక్కతే అన్ని సంభాళించుకురావటం చాల కష్టమైందని, పెద్ద వయసులోనున్న తల్లి, తండ్రీ అంతగా తనకి సాయపడలేకపోయారని చెప్పింది.

పిల్లలిద్దరూ చక్కని మానర్స్ చూపుతారు. తల్లి పట్ల ఆపేక్ష. అపుడపుడూ వచ్చే తండ్రిని ఒక అథిదిగా మాత్రమేచూస్తారట. నాకంటూ సమయం మిగలదు. ఆలోచన చేసే తీరికా లేదు. ఇప్పటికి నా జీవితం తల్లి పాత్రకి పరిమితం. భార్య పాత్ర నాకు ఎక్కువగా ఇవ్వలేదు బాలాజీ అంటూ నవ్వినా కళ్ళలో నిర్వేదం తన చూపుకి ఇట్టే తెలిసిపోయింది. అందం, చదువు, ఉద్యోగం, వ్యక్తిత్వం వున్న ఆమె జీవితం ఎందుకిలా అసంపూర్ణమయింది? ఎవరిని నిందించాలి. పెద్దలని ఒప్పించలేక పెళ్ళి పేరిట ఆమె జీవితంతో ఆడుకున్న అతనినా? పిల్లల పట్ల మమకారం తో తన జీవితాన్ని పణం గా పెట్టిన ఆమెనా? తండ్రి సంరక్షణ లేని పిల్లలో ఏదైనా అభద్రతాభావన కలిగితే అది ఎవరి భాద్యత? అసలు మన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలా?

నవీన పెళ్లై సిడ్నీకి వెళ్ళిపోయింది. తనలో మార్పు చాలా ఆశ్చర్యంగా వుంది. భర్త భరత్ కోసం ఎన్నోపద్దతులుమార్చుకుంటుంది. సర్దుబాట్లు అలవాటు చేసుకుంది. చిన్న చిన్న విషయాలకి అందరి మీద విరుచుకుపడేనవీయేనా ఇంతగా మారింది. ఫోనులో మాట్లాడే మాటల్లో సగం పైన అతని గురించే. అతన్ని తను చూసినంతలోఆధునిక భావాలతో కనిపించాడు. నవీ మీద వత్తిడి తెచ్చే వ్యక్తిలా కనిపించలేదు. ఇది అతని అనురాగ ప్రభావమా? లేక క్రొత్తదనం కోరుకున్న నవీ మనస్తత్వమా? తన లో మార్పుకి పెళ్ళి దోహదపడిందే కానీ పూర్తిగా కారణం కాదా?

తలంతా భారంగావుంది. సుబ్బాలు, శోభ, అమృత , నవీ - నలుగురు తన మీద ఏదో ప్రభావం చూపుతున్నారు. వివాహం పట్ల కుతూహలం, విముఖత రెండూ కల్గిస్తున్నారు.

"అమ్మలు గారండీ, ఇంకెంతసేపలా కూర్చుంటారు?" అన్న సుబ్బాలు అరుపుతో లేచి క్రిందకి వచ్చింది.

"నలిగిపోయావు తల్లీ" అంటూ ఉప్పు తిప్పి పారేసింది. వద్దన్నా వినదు. నెమ్మదిగా మంచం మీదకి చేరి ఆలోచనలోనే నిద్రకుపక్రమించింది.

"మర్చిపోయానమ్మా! ఇందాక విశ్వం బాబు వచ్చారమ్మ విష్ణు వున్నాడా అంటూ. లేరంటే, లోపలికి రమ్మన్నా వద్దని గుమ్మంలోంచే వెళ్ళిపోయారు. మహా సిగ్గరి." అని అంది.

"నిజమేనే ఇన్ని నెలలైనా అతనంతే" ప్రక్కకి తిరిగి పడుకుంటూ అంది. చిత్రమైన మనిషి. విష్ణుతో ఫర్వాలేదు. తనతోనే మరీ దూరం దూరం గా మెసులుతాడు. స్వగతంగా అనుకుంది. మరో ఐదు నిమిషాల్లో నిద్రలోకి జారిపోయింది.

****************************************************************
అదే సమయానికి, సుమారు రాత్రి పది కావస్తుంది. రెండు చేతులూ మడిచి తలక్రింద పెట్టుకుని పడుకుని ఏదోసాలోచనలో పడ్డాడు. ఎందుకు మిత్ర తన మనిషిగా తోస్తుంది? "ప్చ్ సాయంత్రం తను కనపడలేదు. లోపలికి వెళ్ళటానికి కారణం కనపడక వచ్చేసాను". ఎంత చిత్రం ఒక మనిషి నాలుగు విధాలుగా తనని ప్రభావితం చేస్తుంది.

మొదటిసారి తన రూపు చూసే ఆకర్షించబడ్డాడు. ఇప్పటికీ ఆవిషయాన్ని నిజాయితిగానే ఒప్పుకుంటాడు తను. అందం అంతా పెదవి వంపులో వుంది. సన్నగా విచ్చుకునే పెదాలు, నవ్వేప్పుడు వంపు తిరిగే పెదాలు. మూసుకుపోయే చిన్న కళ్ళు. సందేహంలేదు ఆమెది చక్కని అందం. అప్రయత్నంగా తన సాధారణ రూపం గుర్తుకు వచ్చింది. తనది వంటి ఛాయా తక్కువే. ఆమెది గంధపు చెక్క మాదిరి నిగారింపున్న రంగు. కానీ తనని పట్టివుంచున్నది అందమ్ ఒక్కటే కాదు. అంతకు మించి మరేదో తనని ఆమె పట్ల ఆసక్తి పెంచుకునేలా చేస్తుంది. ఇన్నిరోజులుగా గమనిస్తున్నాడు.

తను వచ్చిన చోట ఏదో హుషారు నింపేస్తుంది. పెద్దల్నీ చిన్నవార్నీ కలేసి కలుపుగోలుగా మాట్లాడేస్తూ గలగలాడుతూ అలాగే చూస్తూవుండిపోవాలనిపిస్తుంటుంది. ఎప్పుడూ ఏదోఒక పాట నోటినుండి కూనిరాగంగా పలుకుతూనే వుంటుంది. దృష్టి తన మీద నుండి మళ్ళించటం కష్టమైపోతుంది. మధ్య తన స్నేహితుడు హర్ష అమెరికా నుండి వచ్చినపుడు వారిద్దరి మధ్య జరిగిన చర్చలో ఆమె ఎంత స్పష్టం గా, తన అభిప్రాయాన్ని తెలియజేసింది. తను, విష్ణు చర్చలో వున్నా కూడా వాదనలో వారిద్దరిదీ బలమైన వాదోపవాదం. అప్పుడే విష్ణు చెప్పాడు తనకి వక్తృత్వం, వ్యాసరచనల్లో రాష్టృస్థాయి బహుమతులు వచ్చాయని. ఆమెలోని ధీరవనిత లక్షణం చూస్తే ముచ్చటేస్తుంది.

వర్థని ఆంటీ తో మాట్లాడేటప్పుడు ఆథ్యాత్మిక పరమైన ఎన్నో విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంతుంటారు. తనలెక్చరర్ సుమతి గారి మూలంగా తనకి విషయాల పట్ల అవగాహన వచ్చిందని, పుస్త పఠనం, ధ్యానం మరి కాస్తపురోగతిని కల్పించాయని చెప్పింది. సత్సంగ్ అనీ, ఆత్మశోధన అని ఎంతో అనుభవసారం గడించిన పెద్దవారిలామాట్లాడేస్తుంటే తనకి ఆశ్చర్యంగా వుంటుంది. అన్నింటికీ మించి తన జ్ఞాపకశక్తి అమోఘం. చిన్నప్పటి పద్యాలతో సహా గుర్తే. యోగ సాధన కూడా ఎంతో నిష్టగా, క్రమంగా చేయటం గమనించాడు. ప్రతి దాన్ని ముందుగా అనుకున్న తీరులో చేస్తుంది. అంత నిబద్దత తనలో ఏనాడూ లేదు. మనసుకి తోచింది చేసేయటమే కాని. అవును ఎందుకు తన ఇలా తమిద్దరినీ పోల్చి చూస్తున్నాడు. అతని పెదాల మీదకి నవ్వు దూసుకువచ్చింది.

ప్రక్క ఉద్యోగం చేస్తూనే సామాజిక సేవా సంస్థ ఒకదానికి వాలంటీర్ గా వెళ్తుంటుంది. ఎంతో అంకితభావంతోఆకార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటుంది. ప్రక్కవారిని ఉత్సాహపరుస్తూ అలసట కనపడనీయకుండాపనిచేస్తుంది. రెండు మూడు సార్లు విష్ణుతో కలిసి వెళ్ళాడు. మిగిలినవారంతా కూడా మిత్ర ఇదిలా వుంది, మరి అలాగ చేద్దాం అంటూ తనని సంప్రదిస్తూనేవున్నారు. ఒక్క లక్షణం తనని ఇప్పటికీ అబ్బుర పరుస్తుంది. ఒక్కతే కూతురు, అదీ కలవారి కుటుంబం. తనకి వ్యక్తిత్వం ఎలా అలవడింది. విషయాలన్నీ చాలా సహజంగా తన జీవితంలో భాగంగా ఎలా మలుచుకుంది!

మిత్ర - అందం, ధీరగుణం, ఆథ్యాత్మికత, సేవాతత్పరత. అన్నిటా తనలోని అంకితభావం, స్పష్టత, జంకులేనితనం, స్నేహం కోరే గుణం - నాలుగు రూపాల్లో తనని పూర్తిగా ఆమె వైపుకు తిప్పుకున్న అందాల అతివ. విశ్వాకి చిత్రలేఖనంలో మంచి ప్రవేశం వుంది. నిద్ర పట్టేట్లు లేదని, లేచి ఆమె చిత్రిస్తూ దాదాపు తెల్లవార్లూ అలాగే గడిపేసాడు. మిత్ర తన ఇంటిలో లేచి ఉదయం ధ్యానం చేసుకునే సమయానికి విశ్వ మూసుకుపోతున్న కళ్ళతో మంచం మీదకి చేరాడు. అతని కళ్ళ నిండా ఆమె రూపే!!!!!!!!

25 comments:

 1. చదువుతుంటే హాయిగా ఉంది. కథనం కూడా బాగున్నది కానీ కాస్త narration pace సరిచూసుకోవాలి. వీలుంటే ఏవన్నా బొమ్మలు జోడించండి. మరింత అందం వస్తుంది. ఇది నా ఉద్దేశ్యం మాత్రమేనండి.

  ReplyDelete
 2. మొత్తానికీ కథనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్న మాట. First to the presentaation... it is stylish. ఎందుకో కథనంలో కాస్త శ్రద్ధ అవసరం ఏమో అనిపిస్తున్నది. మెదడుకన్నా మనసే డామినేట్ చేస్తున్నా ఫీలింగ్. అక్కడే ఏదైనా పట్టుతప్పుతుంది. ఇవన్నీ అందమైన కవితలందించే మరువలేని ఉష గారు వ్రాస్తున్న కథ కూడా మరువలేని రీతిలో ఉండాలనే.

  కథనంలో వేగం పుంజుకోవటానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. అప్పటికి కానీ మీ కథ గురించి చెప్పలేను. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం. ఉరుకుల పరుగుల కాలంలో, కాస్త మనుషుల మధ్య అనుబంధాలని అందంగా ప్రొజెక్ట్ చేస్తారనే ఆశ కల్పించారు. Nice.

  ReplyDelete
 3. బాగుంది. హీరో వర్ణన. హీరోయిన్ చీనీ పిల్ల అయితే హీరో పాత్రలో నన్ను నేను ఊహించుకునే ప్రయత్నం చేసేవాడిని. ;-)

  మొత్తానికీ మిత్ర బుద్ధిమంతురాలు అని చెప్తున్నారు. చూద్దాం.

  ReplyDelete
 4. కథ చాలా ఆహ్లాదముగా సాగి పోతోంది . ఎక్కడ బోర్ కొట్టటము లేదు.
  బాగుంది .

  ReplyDelete
 5. chakkaga rasharu. palleturi nunchee malla patnamlo ki teesukuni vachharu. waiting for more

  ReplyDelete
 6. పెళ్ళి గురించి ఆలోచన రాగానే మొదట మనకి తెలిసిన మిగిలిన జంటల గురించి ఆలోచించేయడం సాధారణమేమో కదా.. పెళ్ళనే కాదు లెండి ఏదైన ముఖ్యమైన నిర్ణయానికి ముందు ఇలానే ఇది వరకు ఆ పని చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆలోచించడం సహజమే.

  హ్మ్ నాలుగురూపాలతో తనని ఆకట్టుకున్నదనమాట మిత్ర :-)

  "మిత్ర తన ఇంటిలో లేచి ఉదయం ధ్యానం చేసుకునే సమయానికి విశ్వ మూసుకుపోతున్న కళ్ళతో మంచం మీదకి చేరాడు." ఈ వాక్యం తో వారిద్దరి జీవన వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.

  కథ అందంగా సాగుతుంది ఉషగారు. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

  ReplyDelete
 7. విశ్వాని తలచుకోగానే మనసు డామినేట్ చేస్తూ కధనం కుంటు పడుతోంది .మీరు పాఠకులకి కుడా పాత్రలందరూ సుపరిచితులే అనుకుని రాసుకుంటూ పోతునట్టు గా అని పించింది . సడన్ గా వొక కొత్త పాత్ర వచ్చి మాట్లదేస్తూ వుంటే confusion వస్తుంది .వుదాహరణకి సుబ్బాలు వచ్చి అయిదు నెలలు అయ్యిందని రాస్తే అసలు యి సుబ్బాలు ఎవరు ?అన్న ఆలోచన వస్తుంది కదా ఆమె రూం మెటా?సహాయం కోసం వురినుంచి తీసుకుని వచ్చారా అన్నది పాఠకుడికి తెలియాలి కదా ,కొంత ముందుకు వెళ్ళాక అర్ధం అవుతున్దనుకోన్డి .మీరు మరింత బాగా రాయాలనే నా తపన అందుకే యి చొరవ మీరు పాజిటివ్ గా తీసుకుంటారనే నమ్మ కం తోనే చెపుతున్నా పదండి ముందుకు పదండి రాసుకు పదండి పోదాం సాహితి లోకానికి .

  ReplyDelete
 8. చొరవ తీసుకుంటున్నందుకు సారీ ఉషగారు పాఠకుడి తరపునుండి జవాబిస్తే బాగుంటుంది అని రాస్తున్నాను.

  That's a bad example రవిగారు :-) మూడవభాగం లోని ఈ కింది వాక్యం తో సుబ్బాల్ని ముందుగానే పరిచయం చేశారు.
  "సుబ్బాల్ని నాకు తోడుగా పంపుతున్నారు. తాత గారు వద్దన్నా వినిపించుకోవటం లేదు. వచ్చే వారం వెళ్ళినపుడు నాతో తీసుకువస్తాను".
  బహుశా సీరియల్ గా వారం వారం చదవడం వలన మీకు కలిగిన అసౌకర్యం అయి ఉండవచ్చు.

  ReplyDelete
 9. మిగిలిన వారికి తర్వాత సమాధానం ఇస్తాను [lack of time in crunch]

  వేణు గారు, అది చొరవ కాదు నా రచన పట్ల మీ శ్రద్ద. నిజంగా చాలా ఆనందం ఒకరింత అభిమానం చూపుతారు అన్నది నా రచన పట్ల. Mere words can't say it all.

  రవిగారు, వేణు గారు చెప్పినట్లే ఇది విడివిడిభాగాలుగా అదీ వారం గడువు తో వస్తున్న ఇబ్బంది అండి. Besdies what Venu has put up.

  సుబ్బాలు పరిచయం http://maruvam.blogspot.com/2009/09/2.html మరొక "నాల్గు ముద్దలు గడ్డపెరుగుతో తినిపించటం పూర్తయేసరికి సాంబ్రాణి సిద్దం చేసుకుని సుబ్బాలు రానే వచ్చింది"

  మళ్ళీ కలుద్దాం. నెనర్లు.

  ReplyDelete
 10. తేడా ఎక్కడో తెలీయట్లేదు internet explorerలో చూస్తే చుక్కలు ఆశ్చర్యార్ధకాలు తప్పించి ఓ పదో పదిహేనో పదాలు కనిపిస్తున్నాయంతే :(

  నిన్న బానే కనబడింది, రాత్రంతా జ్వరం "అదే రోజు పది గంటలకి" దగ్గరకొచ్చేసరికీ కళ్ళు మండిపోయాయి, ఇంక ఒపిక లేక చదివేసి పడుకున్నాను...నిన్న అనుకున్నాను

  మిత్ర మరీ మంచి పిల్ల,
  అలాంటివాళ్ళు మన వీధిలోనే ఉంటే... బాబోయ్, ఇంకేమన్నా ఉందా
  అమ్మలందరూ, చిన్న పిల్లల్ని పట్టుకుని, మిత్రక్కలా ఉండాలి అని సతాయించేస్తారు పాపం...... ఇంకా పెద్దవాళ్ళనైతే, నీకన్నా చిన్నాది చూడు ఎంత చక్కగా ఉదయన్నే లేస్తుంది, అందరితోనూ ఎంత కలుపుగోలుగా ఉంటుంది, నువ్వూ వున్నావ్ అంటూ తిట్టి పోసేస్తారు....

  ఇంకా,
  విశ్వ కళా సృష్టిపై మిత్ర కవితా దృష్టి పడే తరుణమునూహకే వదిలేసి
  వారము వేచియుండమనుట అన్యాయముకాక న్యాయమా....

  ఆక్షణం బోల్డంత ఆశ్చర్యం, నా అనుమతి లేకుండా నా చిత్రం గీసేస్తాడా అని రవ్వంత రోషం, ఐనా "బావుంది" అనప్పుడు,

  "నా కుంచె తిప్పిన ప్రతి మలుపుకీ నువ్వే స్పూర్తి" అన్న దానికి ఆమె జవాబేమైఉంటుందో.....

  ReplyDelete
 11. ఉష గారు ఐ స్టాండ్ కర్రెక్టేడ్ వారం వారం గ్యాప్ వల్ల. ,నిన్న రాత్రి బానే వున్నా మీ పేజి పొద్దున్న కి చుక్కలు తప్ప ఏమి కనబడటం లేదు ?మీ పాపులారిటీ చూసి ఏదన్నా విదేశి కుట్రా?మీ పేజి లో నిన్న రాత్రి కనిపించిన కదలొ సింహ భాగం ఎగిరి పోయి చుక్కలు కని పిస్తున్నాయి?గమనించి సరి చెయ్య గలరు .

  ReplyDelete
 12. @ రవి గారు, నేను గారు, సరిదిద్దానండి. గమనించనేలేదు నేను అక్షరాలు ముసుగుదొంగలమాదిరి అలా చుక్కల్లా, ఆశ్చర్యార్ధకాలుగా పరకాయప్రవేశం చేసాయని, నిన్న రాత్రి [ఆదివారం 1am కి] ఒకసారి చూసినా ఇంకాపేజీ complete load అవలేదేమోనని అనుకున్నానని గుర్తు, అలసట నన్ను అంతకు మించి ఆలోచించనీయలేదు. శుక్రవారం ఉదయం 6 గంటలనుండి శనివారం రాత్రి 12 గంటల వరకు పనుల్లో మునిగిపోయి, ఆ వంకతో ప్చ్! మరువాన్ని ఇలా అలక్ష్యం చేసానా?. Thanks a lot! I am touched. Many must have noticed it, yet only you two took time to bring to my attention. At this point blame it on the tool's limitation and my negligence. I am not 100% sure on what could have gone wrong.

  ReplyDelete
 13. usha gaaaru pedda katha ela vragalugutunnaaru?good!

  ReplyDelete
 14. తాజా సంచిక "విశ్వామిత్ర 4 - ఆ నలుగురు " మీద స్పందించిన అందరికీను, "మనసులో మాట" సుజాత గారి "అలగకపోతే చూడాలి !' గారి టపాలో వ్రాసాను నా పిల్లల మీద అలుగుతానని - శనాది వారాలు కూడా చదివేసుకుంటాడని, నాతో డి వి డి సినిమాలు చూడడని యువ మీద, అంతవరకు నాతో ఆడి తన ఫ్రెండ్స్ రాగానే నన్నొదిలేసి పోయే స్నేహ మీదాను. ఇప్పుడు అందరిమీదా అలిగేస్తున్నాను, బాగుంది బాగుంది అని నాతో ఈ కథ వ్రాయించేస్తున్నారనీను, పనిలో పనిగా ఇంకొంచం కష్టాలు కొనితెచ్చిపెడుతున్నారనీను. ఏదో ఈతరాని కృష్ణ గారు ఎలాగో ఒడ్డుకుచేరి "పడలేదు, నేనే దూకాను" అన్న మాదిరి లాగించేద్దామీ కథా కథనం కమామీషు అని నేను చూస్తుంటేను ;)

  మీ అమూల్యమైన సమయంతోను, సలహాలతోను నాకు ఇంకా బాగా వ్రాయాలి అన్న పట్టుదల పెంచుతున్నారు. మొదటిభాగం కన్నా రానున్న భాగం నాటికి నా రచనా తీరు మారిందంటే అది మీ అందర ఆదరణ, అభిమానమూను. ఇప్పటికి నా వరకు సెల్ఫ్ ఎనలైజ్ చేసుకున్నదిది. కవితలు ఒకవిదమైన భావావేశం నుండి ధారాళంగా వచ్చేస్తాయి. 90% 5 నిమిషాల్లో వ్రాసేస్తాను. కానీ కథకి 5 రోజులు అలా అలా ఆలోచించి ఒక గంటలోపు ఒక్కో భాగం వ్రాస్తున్నాను. బహుశా ఆ సమయం చాలదేమో. ఇంకాస్త ఆలోచన, శ్రద్ద అవసరమేమో. ఇక శైలి, కథనం అన్నవి క్రమేణా మెరుగుపడే నేర్పు కావచ్చు. ప్రయత్నిస్తాను.

  @ సృజన, నా మాటలతో పాఠకుని మనసులో ఏర్పడే వూహాచిత్రం కన్నా వేరే చిత్రాలు జోడించాలనిలేదు. అయినా ఆ పరంగా ఆలోచిస్తాను.

  @ గీతాచార్య, మీరందిస్తున్న మెళుకువలకి ప్రత్యేక థాంక్స్.

  @ ధన, మా ఇంటికి వస్తే కావాల్సిన చినీ పిల్ల, చినీచీనాంబరాలతో స్వాగతిస్తాను. :)

  @ మాలా గారు, సునిత, అశ్వినిశ్రీ, అ.గా., భా.రా.రె, నెనర్లు.

  @ వేణు, ఆ పంక్తి వ్రాసిన ఉద్దేశ్యాన్ని పట్టినందుకు చాలా సంతోషం. ఆ వైరుధ్యమే వారి నడుమ బంధానికి ఆధారం. మరో సారి, రవిగారికి వివరణ ఇచ్చినందుకు థాంక్స్.

  @ నేను, ఏమనను. నా రానున్న రచనా భాగం మీరు ఎలా చదివేస్తున్నారు, నా మనసులోకి అంతగా ఎలా చొరబడిపోయారు అనటంకన్నా. I am touched so much that you read with fever and remembered to add a comment and send a heads up of the messed up post.

  మిత్రాని నిజ జీవితంలో దగ్గరగా ;) చూసాను. అంతకన్నా తరిచి అడగకండి మరి ప్లీజ్. కల్పన వుంది కథ వుంది నా జీవితానుభవం వుందీ కథలో. ఏదో మనం మనం ఒకటని చెప్పేసా....

  >> "నా కుంచె తిప్పిన ప్రతి మలుపుకీ నువ్వే స్పూర్తి" అన్న దానికి ఆమె జవాబేమైఉంటుందో....

  ఖచ్చితంగా మరో పదీ పన్నిండు వారాల్లో చెప్పేస్తా... :) JK

  @ రవి గారు, అన్నమాట మీద నిలబడబట్టే కదా హరిశ్చంద్రునికి అన్ని కష్టాలు, మీరాయన దారిపట్టి పాపం కాదండి ఇలా మరువాన్ని కాపు కాస్తున్నారు. :) thanks a lot! మీరిచ్చిన అభిప్రాయాన్ని తప్పక లెక్కలోవుంచుకుని మరీ వ్రాస్తాను ఇకపై.

  ReplyDelete
 15. baagundi. nijame kadaa prayatnam munduku saguthuntene kada edugudala. meru chakkani saililo rasthunnaru. One can see the change in the way of writing, and improvement in the story telling. Waiting for more.

  ReplyDelete
 16. @ అ. గా. గారు, విజయ దశమి రోజున పచ్చజెండా వూపి మరి కాస్త ధైర్యం, సాహసం కలిగించారు. ఇకనేమి వ్రాస్తూ పోతాను, నిజంగా ఈ సంవత్సరం కథ వ్రాస్తాననుకోలేదు - ప్రతి జనవరికి కొన్ని లక్ష్యాలు పెట్టుకోవటం, నడుమ సమీక్షించుకోవటం, చివర్న మరోసారి ఎక్కడ ప్రయత్న/అంచాన లోపంవుంది ఎక్కడ అనుకోని గెలుపు వచ్చిండి ఇలా బేరీజులు అలవాటు.

  "అనుకోనిది నిజమైనది, కలకానిది కళ్ళేదుట నిలిచింది.." just a remix of old and new songs and jumbled up the words too. Did you get the hint, sir. I will move in to lyrics writing soon! And you MUST support it as well. JK. Thanks a lot for the constant push.

  ReplyDelete
 17. మిత్ర చుట్టూ ఉన్న నలుగురి పాత్రలను బాగా చిత్రించారు. విశ్వ, మిత్ర గురించి స్వగతంలో అనుకొనేవి కూడా ఆహ్లాదంగా సాగాయి.
  5 నిమిషాల్లో కవిత వ్రాస్తారా!!. ఆశ్చర్యంగా తోస్తుంది.
  అవునండీ, కవితతో పోలిస్తే కధ గురించి ఎక్కువగా ఆలోచించాలేమో అనిపిస్తుంది. మరి అన్ని రకాల పాత్రలను నడపాలి కదా!

  ReplyDelete
 18. వెంకట రమణ గారు, మీవంటి సాహిత్యాభిమాని నా కథకి ప్రశంసనీయటం చాలా సంతోషం. కథ పట్ల మరింత శ్రద్ద కనపరుస్తానండికపై. ఇక కవితలు విషయం అది నిజమేనండి, మనసులో కదలిక వెంటనే యధాతథంగా వెలికితెచ్చేస్తాను అతిశీఘ్రంగా ;) - అందుకే ఒక్కోసారి చురకలు వేస్తారు పాఠకులు, అనుభవజ్ఞులూను. ఆ భావోద్రేకానికి "కవితాదేవి పూనకం" అని పేరు పెట్టుకున్నాను. వ్రాసాక చాలా వరకు పదాలో పంక్తులో మర్చిపోతాను. శీర్షిక, ఆత్మ మాత్రం గుర్తులోవుంటాయి. అందుకే మళ్ళీ చదువుకుని "ఇవి రాసింది నేనేనా!" అనుకుంటాను. అందుకు నాకు నేనే అభిమానిని ముందుగా. :)

  ReplyDelete
 19. నెమ్మదిగానైనా ఆహ్లాదంగా సాగుతోంది కధ,
  కధకు అవసరమైన పాత్రలనే తీసుకువస్తారనుకుంటున్నాను. ఈ వారం మరో రెండు కొత్త పాత్రలు ప్రవేశపెట్టారు కదా.
  మరో మాట, "విశ్వామిత్ర - 4" అంటే సరిపోయేది కదా. మరలా ఇంకో టైటిలు తోక తగిలించారు. రెండు పేజీలు ఒక అధ్యాయమనా ?
  ఒక అధ్యాయం ఎన్ని భాగాలుగా రాసినా పర్లేదు, కానీ ఒక్కో భాగం ఒక్కో అధ్యాయం అనడం ఎందుకో అంగీకరించలేకపోతున్నాను

  ReplyDelete
 20. ప్రదీప్, ముందుగా థాంక్స్. ఇక తోక అంటారా, నా మనసు కోతి కనుక దాని రాతలకి కూడా ఓ తోక పెడదామని అలా. ;) ఎందుకో అలా ప్రతివారం భాగానికి ముఖ్యంగా చెప్పిన విషయం అలా ఉపశీర్షికగా పెడదామని అంతే. ఆధ్యాయాలుగా విడతీయటం కాదు. అదో సరదా అనుకోండి. క్రొత్త ప్రక్రియ క్రొత్త రూపు అంతే. కొత్తదనం కోసం నిరంతరం వెదుకులాటే కదా! ఇక పాత్రలు కొన్ని వచ్చిపోతాయి నిడివి వుండకపోవచ్చు. మూల కథతో పాటుగా కొన్ని అంశాలు కూడా వ్యక్తం చేయటానికి అవి అవసరపడతాయి అని నా ఉద్దేశ్యం.

  ReplyDelete
 21. చాలా ఆసక్తికరంగా ఉందండీ కధనం..next part చదవాలని తొందరగా ఉంది.

  ReplyDelete
 22. "సుబ్బాలు మానసికపరిణితి దృష్ట్యా ఎక్కువ ఆలోచనలు వుండవు. " హ్మ్మ్ ఒక్కోసారి అలాంటి వాళ్ళే అదృష్టవంతులనిపిస్తుంది నాకు ఈ ఆలోచన, తర్క వితర్కాలే కదా ఈ బాధ కు ఆనందానికి కూడా మూలం అని.. బాగుంది ఉష అమాయకం గా భావుకత తో సాగే ఈ కధ...

  ReplyDelete
 23. తృష్ణ, భావన, కథ నచ్చింనందుకు థాంక్స్. మరంతే కదా మన ఆలోచనలో ఒక్కోసారి మనుషులకన్నా బాధిస్తాయి. ఆ క్షణం లో సుబ్బాలు వంటి వారు యెంతో అదృష్టవంతులుగా తోస్తారు.

  ReplyDelete