బొల్లోజు బాబా గారి కవిత నాకు అర్థం కాదు ...... ఇచ్చిన స్ఫూర్తి -
******************************************
నేను విడిచి వచ్చిన బాల్యం
నన్ను విడవని నీలో సాక్షాత్కారం.
నీవు నన్ను చేరుసరికి
నా కనులు మూసున్నాయో ఏమో?
అందుకే నీ మృదుస్పర్శ తప్ప
రంగు మాసిన నీ రూపు నాకంటికానదు.
ఆ కంటినీరు తుడవను నీవు కాక
నాకెవరూ లేను కూడా లేరు.
ఆ ప్రక్క అమ్మ, ఈ ప్రక్క నువ్వు
నాకు తెలిసింది అమ్మ మాట చల్లన
నీవొడి మరింత చల్లన అని.
కన్నియ కలలు నిన్ను హత్తుకుని
వలపు వలువగ నిన్నే చుట్టుకున్నాను
అతని పేరు ముందుగా నీకే తెలిపాను
ఆ అధరం అద్దిన ముద్దు నీకూ రుచి చూపాను
తన కౌగిట నిన్నూ జత కలిపాను
విరహాన నిన్నూ వేగించాను
వినోదానా నిను మరువలేదు.
నాతో ప్రసవ వేదన నీవూ పడ్డావు
నా పురిటికందుని నీవె అద్దుకున్నావు.
ఎన్నిమార్లు వోడేసి పిండారో
నీ మెత్తని తనువెంత తల్లడిల్లెనో.
నన్ను నిన్ను దూరం చేసిన కసాయి గుండెలెన్నో
కాళికనై కరకుదేలి నిను చెంతచేర్చున్నాను.
నీ చిరుగుల్లో నేను చలించాను.
నా అతుకుల్లో నీవు చెమ్మగిల్లావు.
నీవు చీకిపోయావు
నేనూ ముగిసిపోతానేమో?
అందుకే ఆఖరి కోరికగా నాకు
నిన్నే కట్టి సాగనంపమన్నాను
ఎవరడిగినా లెక్కచేయని తెగువతో
నొక్కి చెప్తాను నీవు నా " సిల్కు దుప్పటి" వని.
ఏమండీ - ఏమీ అనుకోకపోతే ఒక పేరడీ. మీకు ఇష్టం లేకపోయినా, ఎగతాళి అనుకున్నా చేసేదేమీ లేదు.
ReplyDeleteనేను తన్ని వచ్చిన కుక్క
నన్ను విడవని నీడగా సాక్షాత్కారం
కుక్క నన్ను చేరుసరికి
నా ముక్కురంధ్రాలు మూసున్నాయో ఏమో?
అందుకే నీ నాకుడుస్పర్శ తప్ప
రంగు మాసిన నీ రూపు నా కంటికానదు.
ఆ ఉమ్ము తుడవను నీవు కాక
నీకెవరూ లేను కూడా లేరు
ఇలా బోలెడు వాక్యాలు కుమ్మరించుకుని వ్రాయవచ్చు
మొదటి పంక్తి చదవగానే ఇరవైపుట్ల కఱ్ఱ గాడిపొయ్యిలో కాలిపోయినట్టు ఉంటే ఎట్లా? ఇంకెలా ఉండాలి బాబూ అంటే కోసెడు (బారెడు, జానెడు కాదు) చుట్ట నోట్టో బెట్టుకుని, అది పూర్తిగా కాలిపోయేదాకా కొరివి దయ్యంలాగా మీ వీధి అరుగెక్కి కూర్చోవాలి - అద్దీ కవితంటే. ఇదేమి ఉప్పు పిండి బాబూ - ఇలాగన్నందుకు నిన్ను ఎలక బొక్కలో దాయింతా, రుద్దరాసిగయ్యలు మెడలో ఏయింతా, తాటిసెట్టు మొగుల్లో కూయింతా అంతే అమ్మాయిగోరు, తడిసోయిన నులక మంచం కుక్కిలోగా బిఱ్ఱబిగేసి పోతారండే ఈ కర్ణం గోరు. మరేనండే అమ్మాయిగోరు - ఈ కామెంటు కనపడనిత్తే సంతోసమండే, లేపోయినా సంతోసమండే. ఇగ మీ ఇట్టం.
చాలా బాగుంది.
ReplyDelete//కన్నియ కలలు నిన్ను హత్తుకుని
'కన్నియ' పద ప్రయోగం బాగుందండీ. మీ కవితల్లోని కొన్ని వికృతి పదాల వలన మరింత బాగుంటున్నాయి.
చాలా బాగుంది ఉష గారు. ఈ కింది లైన్ లు మనసుకు హత్తుకున్నాయి. ఎందుకో పండు వృద్ధాప్యం లో ఉండే పెద్దవాళ్ళు గుర్తొచ్చారు.
ReplyDeleteరంగు మాసిన నీ రూపు నాకంటికానదు.
ఆ కంటినీరు తుడవను నీవు కాక
నాకెవరూ లేను కూడా లేరు.
వలపు వలువగ నిన్నే చుట్టుకున్నాను
ReplyDeleteఅతని పేరు ముందుగా నీకే తెలిపాను
ఆ అధరం అద్దిన ముద్దు నీకూ రుచి చూపాను
తన కౌగిట నిన్నూ జత కలిపాను
సిల్క్ దుప్పటి ని చూడగానే ఈ లైన్ లు మరింత అందంగా కనిపించి ఓ అల్లరి నవ్వు పెదవి అంచున మెరిసింది. ఇంత అందంగా ఎలా రాస్తారండీ బాబు!!
>> "బొల్లోజు బాబా గారి కవిత నాకు అర్థం కాదు ...."
ReplyDeleteనాక్కూడా ;-)
అబ్రకదబ్ర గారు :-)
ReplyDeleteABRAKADABRA garu & venu srikant garu, u must read my poems too.
ReplyDeleteకవితలోని లోతైన భావాన్ని సిల్కు దుప్పటి మింగేసింది.
ReplyDeleteఆఖరి రెండు పంక్తుల వరకు ఎంతో ఊహించుకున్నా....
చివరకు సిల్కు దుప్పటి ద్వారా వచ్చిన "ఎలక్ట్రిక్ షాక్" తట్టుకోలేకున్నా...
చివరి వరకు దిండేమో అనుకొన్నాను.
ReplyDeleteచివరికి తెలిసింది - సిల్కు దుప్పటని.
ఏదైనా ... చాలా మంచి కవిత !
" నీవు చీకిపోయావు
నేనూ ముగిసిపోతానేమో?
అందుకే ఆఖరి కోరికగా నాకు
నిన్నే కట్టి సాగనంపమన్నాను " అన్న వాక్యాలు
హృదయాన్ని ఆర్ద్రం చేసాయి.
So nice. Very deep expressions.
ReplyDelete@జలసూత్రం .. మీరెప్పుడూ కుక్కని పెంచినట్టు లేదు.
ReplyDeleteఅగ్గిపుల్ల, కుక్కపిల్ల....
ReplyDeleteఇలా...ఇలా...కాదేది కవితకనర్హం అని మన పెద్దవారు మనకి చాలా స్వేఛ్చ నిచ్చేసారు కదండి. సో దేని మీద రాసినా నో ప్రాబ్లమ్. But ur kavita is very nice. As u said u inspired from Bolloju Baba గారి కవిత. But I think u excelled him in this kavita. ఎందుకంటే ఆయన కవితలన్నీ చాలా డీప్ గా ఉంటాయి. ur kavita is on par with his poems.
Jalasutram గారు, మీ వ్యాఖ్య చదివాక, అశుకవిత్వంతోను, సగం ఆంధ్రం, సగం సీమం కలిపిన మాడలీకంలోను ఎకసెక్కం ఆడిన మీ భాష, శైలి చూస్తే ఒకమాట గుర్తుకు వచ్చింది "అర్హత గలవారికి అహంకారం ఒక అలంకారం". ఆ రెండిటిలోను నా స్థాయి నా బ్లాగుని చదివే ప్రతివారికీ విదితమే. ఇక తనది దురంకారమా, కాదా అన్నది విజ్ఞతకి సంభందించినది. అన్యాపదేశంగా మీకు ఈ కవిత నచ్చలేదన్నది సమయం వెచ్చింది ఈ పంధాలో తెలిపినందుకు ధన్యవాదాలు. తమని గౌరవించుకొనేవారే ఇతరులని గౌరవించగలరు.
ReplyDelete@ వెంకటరమణ, మీ అభినందనకి సంతోషం.
ReplyDelete@ వేణు గారు, నిజానికి దానితో నాకున్న అనుబంధం ఈ మాటల్లో కూడా వెలికి రాలేదు. మిమ్మల్ని అంతగా అలరించినందుకు ఆనందం. నా ప్రతీకల్లోనే అందం కానీ నా భాషలో కాదు సుమండి.
@ అబ్రకదబ్ర గారు, ఏమిటండి అపుడపుడూ ఇలా విహారానికి వచ్చి ఓ పదం కలిపి పోతారు. కానీ ఈ మారు పొసగలేదు సుమండి.
ReplyDeleteSujata, కొత్త పాళీ, Thanks.
ReplyDelete"తమని గౌరవించుకొనేవారే ఇతరులని గౌరవించగలరు." - చప్పట్లు! ఉష గారూ, మీ స్పందన చాలా హుందాగా ఉంది.
ReplyDelete@ ప్రదీప్, నిజానికి అదంటే నాకు ఎంత మమకారమో చెప్పాలంటే మాటలు చాలవు. దశాబ్దాల అనుబంధం. మీకు ఆ గాఢత తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు. నెనర్లు.
ReplyDelete@ డా. ఆచార్య ఫణీంద్ర, మీరు నా కవితాత్మకన్నా నా అత్మని గ్రహించారు. నాన్న గారు ఎంతో వెలపెట్టి క్రొత్త సిల్కుదుప్పటి కొనితెచ్చినా మా తాతగారు నా పొత్తిళ్ళలో పెట్టిన ఈ బెనారస్ సిల్క్ దుప్పటి నాకు నా ప్రాణం కన్నా మిన్న. కృతజ్ఞతలు.
ReplyDelete@అ.గా. గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం. గొప్ప ఇబ్బంది తెచ్చిపెట్టారు మిమ్మల్ని ఎలా సంబోధించాలా అని ;) Thanks a lot for appreciating the sensitivity and depth in my expression.
ReplyDelete@శ్రీనిక, తమరి రాక నాకెంతో సంతోషం సుమండి. :) ఇలా వచ్చి అలా ఆశ్చర్యానందాల్లో ముంచెత్తారు. గురుతుల్యులు బాబా గారి కవితకి సాటిదని నా కవితకి గౌరవాన్నిచ్చినందుకు ముదావహం. వస్తూవుండండి.
ReplyDelete@చదువరి గారు, మీ రాక, ఈ వ్యాఖ్య నన్ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఏమైతేనేం ఈ కవిత ద్వారా ఎన్నో విశేషాలిలా. నా ఈ నడవడికకి మా అమ్మానాన్నలు, గురువులు, స్నేహితులు కారణమండి. ఆ చివరివారి సంఖ్య ఎప్పుడూ పెరుగుతూనేవుంటుంది. కనుక నన్ను సరైన బాణీలో నడుపుతూనే వుంటుంది. చాలా సంతోషమండి.
ReplyDeleteఇంతమంది కామెంట్లు వ్రాసిన తరువాత ఇంక నేను రాయడానికి ఏముంటుంది చెప్పండి. ప్రొద్దున ఈ కవిత బెత్తెడు screen లో చదివినపుడు అక్షరాలన్ని కలిసి పోయి కవిత అర్థాన్నే మార్చి చూపింది. :)
ReplyDeleteభా.రా.రె, మీ వ్యాఖ్య తెచ్చే సంతోషం వేరు, మీ మౌనం కూడా అదే మాట చెప్తుంది. రాకమానరని తెలుసు. ఎందుకు నచ్చలేదో అన్నది ఎక్కువగా తర్కించటం అలవాటు లేదు, కానీ నచ్చింది అన్నప్పుడు మాత్రం స్పందనల్లో ఏక తరంగధైర్ఘ్యం కనపడుతుంది. అంతే... నెనర్లు.
ReplyDeleteఎంత బాగుందంటే... హా ...అంత బాగారాసారు .. :)
ReplyDeleteనేస్తం, మరికనేం. వెంటనే మీ బ్లాగులో ఓ జాజిమల్లి పూవుగా మీకపురూపమైన ఓ వస్తువు గురించి మీ ప్రత్యేకత తెలిపే చక్కని టపా వ్రాసేయండి.. నెనర్లు..
ReplyDeleteముందు నవ్వాగలేదు. కాస్త ఆలోచించాక... మీ word play కి అబ్బుర పడ్డాను.
ReplyDeleteసిల్కు దుప్పటి. Silk == పట్టు. బంధాలనూ, అనుబంధాలనూ ఆద్యంతం ఒక పట్టు పట్టారు. ఒక పట్టు దుప్పటితో. భలే ఉంది మీ ముగింపు. :-)
అనుబంధాలకూ ఆప్యాయతలకూ వస్తు, మనుషుల భేదం లేదు. నిజమే!
"నాతో ప్రసవ వేదన నీవూ పడ్డావు
ReplyDeleteనా పురిటికందుని నీవె అద్దుకున్నావు.
ఎన్నిమార్లు వోడేసి పిండారో
నీ మెత్తని తనువెంత తల్లడిల్లెనో.
నన్ను నిన్ను దూరం చేసిన కసాయి గుండెలెన్నో
కాళికనై కరకుదేలి నిను చెంతచేర్చున్నాను."
Sensationally brought to conclusion. Really great one this is.
@ఉష:
ReplyDeleteవిహారం అప్పుడప్పుడూ కాదు, తరచుగానే. కవిత్వంలో నేను బహు వీకు. అందుకే వ్యాఖ్యలు మాత్రం ఇలా అప్పుడప్పుడూ.
నా వ్యాఖ్య సరదాకే. నొప్పించటానిక్కాదు. ఒకటో నంబరు వ్యాఖ్య తెచ్చిపెట్టిన మూడ్ నుండి దృష్టి మరల్చే ప్రయత్నం నాది. I hope, Mr Baba took it in a good sense.
so nice. That's all. :-)
ReplyDeleteగీతాచార్యా, మాటలు వచ్చీరానప్పటినుండీ రాత్రయే సరికి "అమ్మ" అనో "పాలు" అనో కాక "సిల్కు" అనే వెదుక్కునేదాన్ని. నా "సిల్కుదుప్పటి" అని అనటం అలవాటు. అందుకే ఆంగ్లపదమైన "సిల్కు" వాడాను. "పట్టు" అలవాటు లేదు. నిజానికి దాన్ని తాకినవారో, నేను తాకనిచ్చినవారో అతి కొద్దిమంది. అంత మమకారం, మరింత అనుబంధం. మీకు ముందు నవ్వు వచ్చినా ఈ గాఢత తెలిసినందుకు సంతోషం.
ReplyDeleteసృజన, నాక్కూడా నాకు కోపం ఎక్కువని ఎవరైనా దాన్ని నానుండి లాక్కునే ప్రయత్నం చేసినపుడే తెలిసేది. చంఢిక అని మా అన్నయ్య వేళాకోళం పట్టించేవాడు. మమతలోని తీవ్రత చూసినందుకు థాంక్స్.
ReplyDeleteఅబ్రకదబ్ర గారు, మీ ప్రయత్నం పసికట్టాను కానీ అది నా మీదే [అంటే నా కవితలోని ఏదో పంక్తుల మీద] ప్రయోగించివుంటే సంశయపడేదాన్ని కాదు. పైగా ఈ కవిత చాలా భావ తీవ్రతనుండి వెలికి వచ్చింది. అందువలన కాస్త అన్య మనస్కనయ్యాను. బాబా గారు, నేనూ ఇద్దరం ఏమీ అనుకోలేదు. ;) మీ సహృదయతకి ధన్యవాదాలు.
ReplyDeletedhana, thanks. Likewise your comment says it all, my word of thanks must be conveying it all. I am convinced of something now. Guess what ;)
ReplyDeleteఅద్దీ లెఖ్ఖ అమ్మాయిగారండీ. స్థాయి, గౌరవం , నడవడిక దాకా పరిస్థితి అర్థమైంది. హుందాతనమూ అర్థమైంది. :) చప్పట్లూ నచ్చినాయి. నేను అన్యాపదేశంగా చెప్పనూ లేదు, కుక్కలని పెంచుకోనూ లేదు. సరేలెండి.
ReplyDeleteదురహంకారానికి తగిన శాస్తి అయ్యిందన్న తీర్పు ఉపదేశంగా స్వీకరించి బవిరి గడ్డం పెంచుకోవటం మొదలయ్యిందని సిల్కు దుప్పటి కప్పుకుని మరీ చెప్పటమయినది. మా దొడ్డమ్మ ఇరవై ఏళ్ళ క్రితం ఇచ్చిన సిల్కు పంచే నా పాలిట సిల్కు దుప్పటి.
ఒక్కరయినా నేను రాసినదాన్లో అసలు అర్థం తెలుసుకుంటారేమో అనుకుంటే, అంతా అపార్థాల వైపు పరుగులు తీసేవాళ్ళే. ఇక చెప్పేదేముంది. ఇక్కడ ఉప్పుమా లేకుండా అర్థమవుతుందని చిన్నగా చిన్నమాటల్లో రాసాను. :) సరేలెండి. ఇక శలవు.
మళ్ళీ మరొక్కసారి - భావతీవ్రత తగ్గినతరువాత, ఆవేశం నుండి బయటపడ్డాక నా మొదటి కామెంటులో మొట్టమొదటి లైను, కొరివి దయ్యం లైను చదువుకోండి. జై జండాపై కపిరాజా!
ఏమిటో ఉషా.. ఇంత బాగా ఎలా రాస్తావో నాకైతే అర్ధమే కాదు... లాభం లేదమ్మాయ్ నీ బుర్ర కొంచం దొంగతనం చేస్తే పోతుంది.. :-) బై ది వే విజయమొహన్ గారి బ్లాగ్ లో మీ కామెంట్ చూసేను http://www.flowersofindia.net/catalog/slides/Scarlet%20Morning%20Glory.html కాశిరత్నం పూలకు, ఫ్లిక్కర్ లో కూడా వున్నాయి గూగులమ్మ లో kasiratnam అని జల్లెడ వెయ్యి చాలా దొరుకుతున్నాయి. ఇదుగో నిత్య మల్లె పువ్వు http://images.google.com/imgres?imgurl=http://farm4.static.flickr.com/3573/3523929277_40646ee1e6_m.jpgimgrefurl=http://www.flickr.com/photos/rameye/usg=__LmmZKt9a1wrzDlc9mPNkLHT-B50=h=180w=240sz=24hl=enstart=1sig2=eFiHLITxtVNMoV6X7uUclAtbnid=YmliKUrnD85EaM:tbnh=83tbnw=110prev=/images%3Fq%3Dnityamalle%26gbv%3D2%26hl%3Denei=U2iySr6xAtSX8Ab8nN2oDQ
ReplyDeleteభావన, నిజమా? ఏ ప్రక్క బుర్ర కావాలి, అసలే తక్కువ అని అభియోగం. అయినా మీకైతే సమస్తం ఇచ్చేస్తా. మనం మనం ఒకటి, మీది బందరు, మాది పోరుబందరు అంతే తేడా.. ;) అలా శ్రద్దగా లింక్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం. నాక్రొత్త నేస్తం "నేను" ఇవ్వగా ఆగష్టు లో వ్రాసిన వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది http://maruvam.blogspot.com/2009/08/blog-post.html కవితకి వాడాను. I am touched by the time you spent for me! Thanks a lot...
ReplyDeleteకవితకు ప్రాణం అనుభూతి. ప్రాణం పోసారు.
ReplyDeleteవర్మ, నన్నెరిగిన వారికి నా ఈ మమతలూ పరిచితమే. ఎన్నో ఏళ్ల క్రితం నా దగ్గర ఓ గులాబీ మొక్క తీసుకున్న స్నేహితురాలు, ఇప్పటికీ "నీ మొక్క కి పూలు పూసాయి" అనే అంటుంది. అనుభూతులే నా వూపిర్లు, నెనర్లు.
ReplyDeleteమనవి: కాసిని బఠాణీలో, చిప్సో, పాలో, కప్ ఆఫ్ టీ, ఇలా మీకు కాలక్షేపానికి అవసరపడే ఆధరువు ఒకటి తెచ్చుకు ఈ వ్యాఖ్య చదవటానికుపక్రమించండి. చదివి పొరమారింది అంటే ఆ పూచీ నాది కాదు. ;)
ReplyDeleteజలసూత్రం గారు, లాభం లేదండి, ఇక కబడ్డీనే... మీరు "ఇక్కడ ఉప్పుమా లేకుండా" చెప్పారు కనుక నేను సరదా కలిపి ఇస్తున్న జవాబిది. :) మీవంటి కొందరు భాషాకోవిదులు, నావంటి మరెందరో భాషనభ్యసించే వారికి కాస్త నవ్వులు పంచుదామని. మీకు ఇష్టం లేకపోయినా, ఎగతాళి అనుకున్నా చేసేదేమీ లేదు.
నన్ను "అమ్మాయిగారండీ" అన్నందుకు మిమ్మల్నెలా సంబోధించాలోనని కాసింత బుర్ర బద్దలు కొట్టుకుని ఆ సంగతి ప్రక్కనుంచి విషయంలోకి వస్తున్నాను.
ఏమిటో "మన చుట్టరికం" ఈ టపా నూడిల్స్ కి ఇంగువ పోపు వేసినట్లుగా మారింది. సిల్కుపంచెలో బవిరిగడ్డం [అతి త్వరలో నిమురుకుంటూ] - నాకు మాత్రం పాత సినిమాల్లో దొంగసాధువులు, క్రొత్త సినిమాల్లో విలన్లు గుర్తుకొచ్చారు.
స్థాయి అన్నది నా భాష, శైలిని గురించి ప్రస్తావించాను. నాకు తెలిసింది కొంతేనని ఎప్పుడోనే చెప్పాను. అంతకు మించి ఎదగటానికి నాకు సమయం, ఆసక్తి రెండూ లేవు. అయినా, నాకు రాష్ట్రస్థాయి వ్యాస రచన, వక్తృత్వ పోటిల్లో మొదటి బహుమతి ఇచ్చిన న్యాయనిర్ణేతలని ఓ మారు శపించేయండి. నా మీద ప్రేమతో లంచాలివ్వటానికి సిద్దపడే మా మరియట్టా సిస్టర్, ఇవాంజలీన్ టీచర్ నాతో రాలేదే, వాసిరెడ్డి సీతాదేవి గారికి, మిగిలిన వారికి నేను నచ్చానో, నా భాష నచ్చిందో మరి!
అపరిచితులం, ఏ సన్నిహితత్వం లేనివారం మీ ఆంతర్యం, మీ మాటల్లోని అంతరార్థం నాకు ఎలా బోధపడుతుంది? మీరు దొడ్డమ్మ అన్నారు, నాకు పెద్దమ్మ అలవాటు. మరొకరికి పెద్ది. ఇలా సామాన్య జననీకంలో వాడుక పదాల్లోనే ఇన్ని విధాలు వున్నపుడు, శైలి, భావాలు రకరకాలుగా వుండవా? ఒక్కసారిగా మీ తొలివ్యాఖ్య "పాస్తాలో ఆవకాయ" కలిపినట్లు వ్రాసారు. ఏమండి, నా కవితకి మీరు పేరడి వ్రాయగాలేనిది, నా వ్యాఖ్యకి చప్పట్లు వస్తే వింత ఏముంది? :) గౌరవం సంపాదించుకునేది. హుందాతనం మరొకరు గుర్తించేవీను.
"ఒక్కరయినా నేను రాసినదాన్లో అసలు అర్థం తెలుసుకుంటారేమో అనుకుంటే, అంతా అపార్థాల వైపు పరుగులు తీసేవాళ్ళే" ఈ విషయంపై మీరు శ్రద్ద పెడితే మీకే అర్థం అవుతుంది ఇలా ఎందుకౌతుంది అన్నది. మీది సదుద్దేశ్యం కావచ్చు. చెప్పినది సదుద్దేశ్యమైనా బ్లాగులోకంలో ఒక్కరికైనా అర్థమైందేమో ఒక్కసారి ఆత్మ పరిశీలనన చేసుకోండి. ఏ విషయానికైనా చెప్పే తీరు వుంటుంది. మీరు కూడా సరైన అవగాహనతో నా జవాబు అంగీకరిస్తారని సెలవు తీసుకుంటూ, లేదూ చుట్టమై వచ్చి దెయ్యమై పట్టి పీడించిన వైనమూ కావచ్చని..ఓం శాంతి. ;)
నాకైతే జలసూత్రం గారి కామెంట్లు తలపైనుంచి వెళ్ళిపోతాయి.ఆయనకు చుట్ట ఎప్పుడూ నోట్లో వుండటం చేత మామూలు భాష పలకక ఇలా మాండలీకంలో... ;)
ReplyDeleteవారు చెప్పాలనుకున్నది సిల్కు పంచెను దుప్పటి గామార్చుకోవడంలోనో , గడ్డం నిమురుకోవడంలోనో కలిసి చివరకి ఆ కామెంటుని ఎలా అతుకు వేసుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటుంటాను :)
జలసూత్రం గారూ,
>>మా దొడ్డమ్మ ఇరవై ఏళ్ళ క్రితం ఇచ్చిన సిల్కు పంచే నా పాలిట సిల్కు దుప్పటి.
అంటే మీ వుద్దేశ్యం సిల్కు దుప్పటి మీద కవితేమిటి అనా? కొంచెం వివరిస్తారా?
చాలా .................................బాగుంది .
ReplyDelete@భా.రా.రె. శుక్రవారం హుషారంతా మీ మాటల్లోనేవున్నట్లుంది. :)
ReplyDelete@చిన్నీ! నా మనసు నాకే తెలుస్తుందా ఇతరులకి అర్థం కాదా అనుకున్నపుడు మీవంతివారి వ్యాఖ్యలు ఆ సందేహనివృత్తి చేస్తాయి. థాంక్స్.
మీకోసం ఈ పాట "సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని తుర్రుమని నువ్ వెళ్లావంటె తూరుపు దిక్కు ఆపేస్తుంది ఉరిమురిమీ చూసావంటే ఉత్తరదిక్కు ఊపేస్తుంది..." ;)
నా మిత్రురాలు జ్యోతి వలబోజు నుండి...
ReplyDeleteచాలా అందమైన, గాఢమైన భావంతో నిండి ఉంది .. నిజంగా అంత బాగా ఎలా రాయగలుగుతున్నావ్ తల్లి. ఆ పదాలన్ని ఎక్కడివి??
overall i can only say "beautiful expression ""
i couldnt comment in ur blog so mailing you ... (some problem with my sys only)
అమ్మాయిగారండీ - మహేంద్రజాలం బాగుంది. నిజంగానే బాగుంది. నవ్వులూ విరబూసాయి. :)
ReplyDeleteఈ దయ్యం పగటిపూట దయ్యమేనండీ - చింతచెట్టెక్కే చుట్టాన్ని కాకపోయినా, ఇలాటి ఉషస్సు చూసి "అలంకారం" చేసుకునే దయ్యాన్నే. ఇక్కడున్నోరికన్నా, రాసినోరికన్నా కొంచెం చురుకు పాలు ఎక్కువని, ఉప్పుమా లేకుండా రాసిందయినా, చెప్పిందయినా కొద్దిగా అయినా పసిగడతారనే సిల్కు దుప్పటి ముసుగేసుకున్న "అపరిచిత" బవిరిగడ్డం దయ్యాన్నయినా - నేను పసిగట్టాను. :) కానీ అటేపునుంచి అదే "ఇది" రాలా. :)
ఏది రాసినా అర్థం కాకుండా కొట్టుకునే బ్లాగ్ లోకంలో జనాల ఊసెందుగ్గాని గానీండి, నేను చూపు సారించాల్సిన విషయ "శ్రద్ధ" , చేసుకోవలసిన ఆత్మపరిశీలన, అవగాహన గడులు దాటి వైకుంఠపాళీలోని విష్ణు ద్వారం దగ్గర నుంచునున్నాను. భాషాకోవిద భేతాళులకి భేది మాత్ర వేసి భయం పుట్టించండి. ఈ గజకర్ణ గోకర్ణ టక్కు టమారాల బవిరి గడ్డం దయ్యం దగ్గర సిల్కు దుప్పటుంది కాబట్టి భేది మాత్రలు పనిచెయ్యవు. :)
ఇసిత్రంగాపోతేనండే - శైలి, భావం, భాష, స్థాయి, హుందాతనం అయ్యన్నీ కొరివి దయ్యాలకీ - మనక్కాదు అని అనేసుకోని ఓ పాలి పండు సింతపండు ముక్క బుగ్గనెట్టి, ముక్కి ఆ ముక్కేసారనుకోండి - గౌరవం పెరుగుద్దీ ? ఆంతర్యం అర్దం కాలేదుగానీ ఇంకోముక్క సెప్పయ్యా అంటేనండే - "సూరి" భగవానులోరు గుఱ్ఱాలెక్కి లగెత్తుతూ, పొద్దటేల ఈ పుడమి తల్లి మీద ఏసే ఆటినట్టుకోని హుందాగా సప్పట్లు కొట్టుకుని కూసోచ్చు గదండే ! మరేనండే ఆ సప్పట్ల సబ్దం ఇని శాపాలెందుగ్గానీ - వాసిరెడ్డోరు తెగ సంతోసిత్తారు.
కబడ్డీలో కాటుకకాంతులు కొండెక్కుతాయి, కాబట్టి కూత కొక్కిరాయికిచ్చేసి కూర్చోటమే. కాదూ కాచుకో కిట్టయ్యా అంటే అందుకూ సిద్ధమే.. :)
సరే ఉంటానండీ అమ్మాయిగారు - మళ్ళీ వీలుంటే కలుద్దాం.
జలసూత్రం గారూ,
ReplyDelete" వైకుంఠపాళీలోని విష్ణు ద్వారం , బవిరిగడ్డం ,కూత కొక్కిరాయికిచ్చేసి కూర్చోటమే " ఇయ్యన్నీ సూత్తుంటే అయ్యోరు మహా పెద్దోరిలాగున్నారు.అయినా సిల్కు గోసీ పెట్టుకోని సుట్ట నోటెట్టుకోని కైతలు పద్దేలు సమ్మంగా ఇనాలనుకుంటే ఇమర్శతో పాటి సప్పట్లు సపోర్టులు కూసింత కావాల గందా? మీబోంటోళ్ళు సింతసెట్టు ఎగబాకకుండానే సింత కాయలు కోత్తారేమో గానీ మా పిల్కాయల గతేంది? రాళ్ళతో పాటి దోటీ కఱ్ఱ గూడా కావాల కదా మారాజా?
ఇంగో లెక్కండే "సూరి" భగవాన్లోరు గుఱ్ఱాలెక్కి లగెత్తుతూ పుడమితల్లి మీదేమేసినా ఊషా కిరణాలకు ఇట్టే తెలుత్తదండీ .. అది మంచో చెడో అనండయ్యా..సప్పట్ల సప్పుడా లేక ఇక్కట్ల సప్పుడా అనండయ్యా..అంతలేసిదానికి ఓ సింతపండు తెగ దిని సీదెయ్యాలటండయ్యా..భేది గొట్టాలెందుకు మీ సిల్కు గోసీ వుంటేనూ..
పెద్దోరని మరో మాటయ్యా కౌల కైతలు పద్దేలు నచ్చలేదన్కో సుట్ట రచ్చబండ కేసి గీకి సెవులో పెట్టుకోని థూ నాయాల్ది ఇట్టెట్టా రాత్తున్నారని పరుగు లంకించుకోవాలి లేదా గోసీ పీకి ఇద్గో ఓ పోరగా కైతంటే ఇట్టుండాలని సెప్పాలి. అదీ ఇదీ మానేసి ఓ లొల్లి లొల్లి సేస్తే మూగోడు నోరు మూసినా తెరిసినా ఒకటే గందా..అద్గదీ లెక్క ! ఇయ్యన్నీ గాదండీ " చప్పట్లు తో గర్వం తెచ్చుకోని కవితలు / పద్ద్యాల్లో పస తగ్గుతుందని" సెప్పడానికి ఇరవై ఏళ్ళ సిలుకు పంచె అవసరమా కిట్టయ్యా? సెప్పేసినా మారాజా..
భా.రా.రె. ధన్యవాదాలు. మరి కొందరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే బాగుండేది.
ReplyDeleteJalasutram /కిట్టయ్య మాష్టారు,
ReplyDelete>> మహేంద్రజాలం బాగుంది. నిజంగానే బాగుంది.
హమ్మయ్య కాసింత వూపిరి సలిపింది. మీరు నవ్వేసారు. ;) నాకు కూడా ఇపుడు మీ భాషలోని అందం అగపడుతుంది. బ్రతుకు అందంగా తోచి మది నెమలి మాదిరి నాట్యమాడుతుంది. నిజ్జంగా నిజం.
>> ఇక్కడున్నోరికన్నా, రాసినోరికన్నా కొంచెం చురుకు పాలు ఎక్కువని...నేను పసిగట్టాను. :) కానీ అటేపునుంచి అదే "ఇది" రాలా. :)
ఏంటో మాష్టారు, చురుకు తగ్గింది, కాని ఆ "ఇది" వచ్చేసిందోచ్.
>> వైకుంఠపాళీలోని విష్ణు ద్వారం దగ్గర నుంచునున్నాను.
దక్షకుడు మింగిన ఆట మాదిరివుంది నాకు. నిచ్చెనెక్కి పరమపదసోపానం చేరాలనీ వుంది.
>> గజకర్ణ గోకర్ణ టక్కు టమారాల బవిరి గడ్డం దయ్యం దగ్గర సిల్కు దుప్పటుంది కాబట్టి భేది మాత్రలు పనిచెయ్యవు. :)
అయితే నాకు వశీకరణ విద్య నేర్పరా? :)
>> ఇసిత్రంగాపోతేనండే - శైలి, భావం, భాష, స్థాయి, హుందాతనం అయ్యన్నీ కొరివి దయ్యాలకీ - మనక్కాదు అని అనేసుకోని... - గౌరవం పెరుగుద్దీ ?
సరే పెరగదు. అయ్యన్నీ అమ్మయిగారికీ, దయ్యాలకీ సమంగా కావాలి. ఒప్పుకున్నాం బేతాళా! :)
>> వాసిరెడ్డోరు తెగ సంతోసిత్తారు.
ఆ సంగతిక వదిలేయండి కానీ మీతో సప్పట్లు కొట్టించుకోవాలి, అందుకేమి చేయాలో శెలవీయండి గురుదేవా!
>> కబడ్డీలో కాటుకకాంతులు కొండెక్కుతాయి, కాబట్టి కూత కొక్కిరాయికిచ్చేసి కూర్చోటమే.
కాటుక అలవాటు పోయింది. కన్నీరు ఇంకిపోయింది. ఆట ఓడినా ఎదుటివాడిని గౌరవించే వరస వుంది. అయినా ఓడననే ధీమా కూడా వుంది. కనుక ఆటకి సిద్దమే కానీ ఈ తోట అందుకు అనువు కాదేమో. హమ్మయ్య "కొక్కిరాయి" ఇదేదో క్రొత్త పేరు బాగానే నామకరణం చేసారు. "మా అజ్జికి చెప్తే మీ నాలుక చీరేస్తాడు. వయ్యారికి చెప్తే చింతచెట్టుకి వురేస్తాడు" అని మాత్రం అనదీ అమ్మాయిగారు.
గురువు గారు, మీరు ఎవరోగానీ నాకు మంచి స్ఫూర్తినిచ్చారు. చండామార్కుల వారి వలెనో, సాందీపుని మాదిరో కాస్త నాకు మీవద్ద శిష్యరికం చేసే అవకాశం ఇస్తారా? నిజానికి మీ ప్రశ్నల్లనిటికీ ఒకటే జవాబు. నాలో మీరు చూసిన లోపాలు నాకు అర్థమయ్యే రీతిలో చెప్పండి, మీ నిర్వచనానికి తగిన శైలి, భావం, భాష, స్థాయి నేర్పండి. ఈ వంతు మీరు తీసుకుంటానంటే అపుడు చెప్పండి. మీ సవాళ్ళు స్వీకరించి నేను సాధన చేస్తాను. మీకివన్నీ అనవసరం అనుకుంటే ముమ్మారు నాకు సమాధానం ఇచ్చివుండేవారు కాదని నాకనిపిస్తోంది. దక్షిణగా మా తాత ముత్తాతల మాదిరి కావిళ్ళలో నూకల్లో కలిపి కాసులీయను, రూకల బస్తాలు పంపను. నా తర్వాతి తరానికి భాష, శైలి నేర్పుతాను. మీ అంత చతురత కూడిన సంభాషణ నాకు రాదు. ఒక ఆలోచన వచ్చాక ఎక్కువ కాలయాపన చేయను.
>> సరే ఉంటానండీ అమ్మాయిగారు - మళ్ళీ వీలుంటే కలుద్దాం.
తప్పక కలుస్తాం అని నా నమ్మకం. ఎపుడన్నది మీరు నా ఈ జవాబుని అర్థం చేసుకున్నపుడు. ఇంతదాకా చదివి నేను పరాజితని అనుకోకండి. సమరానికి సిద్దపడుతున్నానంతే, కిట్టయ్యా! సెలవిక.
ఇదంతా మీ వినోదానికంటారా మంచిది, అందరికీ తగు కాలక్షేపం ఇచ్చాము. అయినా ఇంతకన్నా వేరే రీతిలో ఎందుకు మీరు పరిచయం అవలేదు. విధివ్రాత.
ఆశ్చర్యం !ఇంత యద్రుచ్చికమా....!జీవనజ్యోతిలోని ఈ పాటని ఫోన్ లో నేను నా ఫ్రెండ్ పాడుకున్నాము ...నిన్ననే. ....ఇక్కడ చూస్తె మీరు నాకోసం ....థన్క్యు...థన్క్యు ఉషాజీ .
ReplyDeleteనాకు చిన్నప్పుడు ఒకబాయి బొమ ఉండేది. మా నాన్నగారి శిష్యుడు చెన్నై వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చింది. అదెందుకో నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచీ అదలాగే నాతోనే ఉంది. ఇప్పుడాడుకోవటంలేదనుకోండి. నేనైతే నాకు రాబోయే పిల్లకి ఒకటే కండీషన్. నా బొమ్మ గాడికి కూడా నాతోనే పెళ్ళి జరగాలి కనుక కట్నం గిట్నం వద్దుగానీ ఆ బొమ్మగాడి అందానికి తగిన బొమ్మ గత్తె (!!! ;-)) తెమ్మంటాను.
ReplyDeleteతథాస్తు
ReplyDeleteజలసూత్రం గారు పరిచయస్తుల్లా ఉన్నారు. కొద్ది కాలం అంటే ఏడాది క్రింద కూడలి కబుర్లలో ఈ కిట్టయ్యతో నేను మాట్లాడినట్టు గుర్తు..
ReplyDeleteమరువం మరో 50 కంగ్రాట్స్..
ReplyDeleteస్పందించిన ప్రియనేస్తాలందరికీ నా సంతోషం ముప్పావు పంచుతున్నాను. మిగిలిన పాతిక నాకు. ;)
ReplyDelete@ చిన్ని, ఇవే జీవితం మనకి అందించే అరుదైన ఆనందాలు. నేనూ మీ ఫ్రెండ్నే కనుక అదే అనుభూతికి లోనయ్యామేమో! ;)
@ గీతాచార్య, నన్ను వెంటతీసుకువెళ్ళండి ఆ పెళ్ళికి. అలాగే ఓ అందాల ఆడబొమ్మని మీ అబ్బికి తోడుగా రప్పిస్తాను.
ReplyDelete@సృజన, నాదీ అదే మాట.
నిజానికి ౩౦౦౦౦ ఈ టపాలోనే దాటాను. మొదటి వ్యాఖ్య వ్యక్తిగతంగా పంపింది...
""congrats On reaching 30000. A milestone . May be a number.
But beyond that there is more behind it. The interesting journey.
Keep it going"
మీ అందరి పరిచయ భాగ్యం, ఆదరణ ఈ పయనానికి ఎంతో దోహదం చేస్తున్నాయి. థాంక్స్.
జ్యోతి, జలసూత్రం గారి హఠాత్ రాక అదీ ఇలా ఓ మైలురాయి మీద కావటం, అన్నిటికి అర్థాలు, కారణాలు వెదుక్కునే నాకు ఏదో సందేశాన్నిచ్చింది. ఇకపై ఏ మలుపా అని నేనూ కుతూహలపడుతున్నాను. అన్నీ మనం అనుకోవటం లోనే వుంటుంది అని నా ముందరి కాళ్ళకి బంధం వేసే ఓ తోడుందిగా తన మాటలివి - "he is too good. It is only literary exchange with different perspectives." ఆ అండ నాకున్నంత కాలం, ఇలా నాకు ఎదుగుదల అవకాశం ఇచ్చే ప్రతి పరిచయం నాకు ముఖ్యమే.
ReplyDeleteహరేకృష్ణ, అంతా మాయ, అప్పుడే వేలవేల దర్శనాలు, పదులు, వందలు వ్యాఖ్యలు. నలుగురితో పరిచయాలు. భాగ్యశీలి నా మరువం. నెనర్లు.
ReplyDeleteహమ్మయ్యా కధ సుఖాంతం అయ్యిందన్నమాట. సంతోషం. :-)
ReplyDelete(ఇంతసేపు ఎక్కడున్నానని అడగొద్దు, ఇదిగో ఈ స్క్రీను పక్కనే ఉన్న "గోడమీద" ఉన్నాను ఎవరికీ చెప్పకండే)
బాబా గారు, మీరూనా వినోదం చూస్తున్నది? :)
ReplyDeleteఅంతం కాదిది ఆరంభం గురువు గారు. ఎదురెదురు కాక ఒక పక్షాన .... JK
Usha garu,
ReplyDeleteAntha kannaanaa? Konallaa pampamd... Sorry. konallaa teesukuni randi. ;-)
గీతాచార్య, చిత్ర విచిత్రాలు అంటే ఇదేనేమో? ఈ టపాకి "మన చుట్టరికం? " శీర్షిక ఏమంటూ పెట్టానో కానీ కొత్త బంధుత్వాలు, విరోధాలు ఎక్కువైపోయాయి. నా సిల్కు కూడా రాత్రి వేడిగా తోచింది. విధివైపరీత్యం. :(
ReplyDeleteచివరికి పెళ్ళిపెద్దని కూడా అయిపోయాను. విధిబలీయం. ;)
అమ్మాయిగారండీ అన్ని దానాల్లోకీ "నిదానం" ఉత్కృష్టమైంది. ఆ దాన పుణ్యం మీదగ్గర స్వచ్ఛంగా కనపడుతోంది. ఓడిపోయే ఓజఃస్తేజోమణి కాదన్న నమ్మకం వుండబట్టే, తోకచుక్క తోక పట్టుకుని ముమ్మారు (దీనితో నాలుగు!) ఈ గడపలోకి వచ్చింది, నమ్మకం వమ్ము కానివ్వనందుకు సంతోషం. వ్రాసిన వ్రాత అర్థం చేసుకోవాలనుకున్న, కొద్దిగా చేసుకున్న మనిషి ఇన్నాళ్ళకు కనపడ్డందుకు ఆనందం. పరమానందం. దయ్యపు జీవితం నుండి విముక్తి కలిగి, చుట్టపు జీవితం ప్రారంభించడానికి పయనం ఆరంభం. ఈ ఏటి దసరా వైశిష్ట్యం.
ReplyDeleteవినోదాలూ, కాలక్షేపాలకోసమూ వచ్చే దయ్యాన్ని కాదు నేను. అది కూడా ఇంకొకరికి ! :) విధి వ్రాతల మీద ఆధారపడి వచ్చే చుట్టాన్నీ కాదు. మీరు అడిగిన వంతు నేను తప్పక తీసుకుంటాను. కాపోతే చండామార్కుల వంతూ కాదూ, సాందీపుని వంతూ కాదు, "కవిగండరగండ దుష్కవి కాలభైరవుండ" వంతు మాత్రమే. అమ్మాయిగారండీ - నేను వ్రాసింది అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నిరూపించారు కాబట్టి, అత్తెసరులోని గంజి లోపలికి ఇంకింది కాబట్టీ ఎప్పటిలానే దయ్యపు వ్రాతలే వ్రాస్తాను. విధి విధానాలు మార్చుకోను. మార్చుకోలేను. సరళంగా చెపితే చివరికి పరుషంగా తేలుతుంది. అందుకు! మీ నోట్లో నుంచి ఊడిపడ్డ దక్షిణ మాత్రం అడిగి మరీ తీసుకుంటాను. గుర్తు చేస్తాను. మాట తప్పితే ఎన్నటికీ మర్చిపోను. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మాట ఎలా తప్పారన్న విషయం ఈ గండభేరుండ దయ్యానికి తెలుస్తూనే వుంటుంది. కాబట్టి పారాహుషార్!
ఇప్పుడు చివరిగా మీకో ప్రశ్న - పుటకి ముప్ఫైయ్యారు పంక్తులు, పంక్తికి 45 అక్షరాల చొప్పున రాస్తూ ఉంటే 100 పేజీల పుస్తకం వ్రాయటానికి ఎన్ని గంటలు పడుతుంది ? మీ చుట్టాల్లో (బ్లాగ్ చుట్టాల్లో - ప్రత్యేకించి ఈ చుట్టరికం టపా చుట్టాల్లో) వినేవారి చెవులు ఊర్లో చెరువులో పౌర్ణానికి దీపాల్తో వదిలే దొప్పలు అవటం మూలాన్నూ, చూసే కళ్ళు కత్తిపీట కత్తికి చివర వుండే వంకీలుగా కనపడుతుండటం మూలాన్నూ కొద్దిగా కష్టమే అయినా కావిడిబద్ద తిరగేసి వెన్నుపూస విరక్కొట్టేట్టుగా ఆలోచించి చెప్పండి.
సిల్కు దుప్పటి వేడిగా ఉండబోదు లెండి ఇకముందు. ఆ దయ్యపు హామీ నేనిస్తున్నా. వుంటాను అమ్మాయిగారూ. మళ్ళీ కలుస్తాను. పిల్లులతో జాగ్రత్త ! - Just Kidding (JK)
కిట్టయ్య మాష్టారు, ఉభయకుశలోపరి. మరిక దసరాకి అయ్యవారికి ఆరు వరహాలు ఈనాం చాలా? :)
ReplyDeleteసంకుల సమరం ముగిసింది. చుట్టమైపోయారు. కానీ మళ్ళీ ఈ మడతపేచీలేమిటీ? లెక్కలు, ఎక్కాలు... ఇలాగైతే నేను దయ్యమైపోతా చెట్టు చిటారు కొమ్మకి చేరిపోతానంతే. :)
నిజానికి నాకు మావూరి మూడు తూముల దగ్గర వుందన్న దయ్యమన్నా, పొలిమేరల్లో తిరుగాడుతుందన్న ముత్యాలమ్మన్నా, కొందరు చుట్టాలన్నా ఒకటే భయం, భక్తీను.
నేను కూడా కొన్ని విధి విధానాలు మార్చుకోను. మార్చుకోలేను. వ్రాయటం మానను, భాష, శైలి, భావం - మూడింటా మార్పు ఈరోజే వస్తుందని కల్లబొల్లి కబుర్లాడను. మీరడిగిన ప్రతిదానికీ సంజాయిషీ ఇవ్వను. మీది పరుష వాక్కైతే నాది సరళప్రవృత్తి. అదే మనకి పొసగటానికి వీలు కల్పిస్తుంది. ఇక మీవంతు నిర్వహించండి. పారాహుషార్! అని హెచ్చరిక అవసరపడనీయను.
> ఇప్పుడు చివరిగా మీకో ప్రశ్న - పుటకి ముప్ఫైయ్యారు పంక్తులు, పంక్తికి 45 అక్షరాల చొప్పున రాస్తూ ఉంటే 100 పేజీల పుస్తకం వ్రాయటానికి ఎన్ని గంటలు పడుతుంది ?
అంత సులువుకాదు సమాధానం. నియమాలు తెలియాలి ముందు. నా స్వంత రచనా, ఒకరిది చూసి వ్రాయటమా, అనువాదమా, కలం తో వ్రాయాలా? వ్రాయటంలో విరామం కలపాలా? గడువు ఎంతో చెప్తారా? ఏ భాషలో వ్రాయాలి? వ్రాయాల్సింది పద్యమా, గద్యమా? వచన కవితా? ఇలా వేలకొలదీ అనుమానాలు తీరనిదే నేను జవాబీయను.
ఇంకో కోణం లో చూస్తే నన్ను ఈ సమయాభావ తరుణంలో కథలు వ్యాఖ్యలు అని గంటల కొలదీ సమయాన్ని వృధా చేస్తున్నానని పరోక్షంగా వ్రాసిన దయ్యపు వ్రాతా ఇది?
మీకో ప్రశ్న: నా జవాబు కోసం ఎన్నిసార్లు చూసివెళ్ళారు? ;)
చివరిగా మనవి: ఇలా పదుగురి ఎదుటా కాక గురుకులం వెదుక్కుందామా? కాదూ కూడదు ఇక్కడే ఉతికి ఎండగట్టి నిగ్గు తేలుస్తాను అంటారా?
ఒక పూలతోటలో ప్రతి మొక్కనీ మాలి ఎంతో శ్రద్దగా పోషణ చేస్తేనే అవి విరబూసి నవ్వుతాయి. ఆ పోషణలో వాటిని పొందిగ్గా ఎదిగేలా కత్తిరించటం కూడా ఓ భాగం. నా వరకు మీకు ఆ వనమాలి హక్కులు ఇచ్చేస్తున్నాను.
వారాంతానికి మరో నాలుగడుగులైనా మీరనుకున్న దిశగా తగు ప్రేరణ వైపుగా మనం కలిసివేస్తామని ఆశిస్తూ..
Jalasutram /కిట్టయ్య మాష్టారు, ఏమైపోయారు? జలసూత్రం ఏమంటున్నారు? ఆయనేమీ అన్నట్లు లేదేం? ఆరాలు ఎక్కువైపోయాయ్ మాష్టారు. మీ చిరునామా నాకెలా తెలుస్తుందని వారెవరికీ తెలియదేమో? "మళ్ళీ కలుస్తాను" అన్నారు ఎప్పుడండి? మొన్న సాయంత్రం మా ప్రక్కింటి కప్పు మీద మౌనంగా కూర్చునివున్న [కృష్ణ పక్షిని చూస్తే] "ఈ గండభేరుండ దయ్యానికి " అన్న మీ మాటలు గుర్తుకొచ్చాయి, అయినా "దయ్యపు జీవితం నుండి విముక్తి కలిగి, చుట్టపు జీవితం ప్రారంభించడానికి పయనం ఆరంభం. ఈ ఏటి దసరా వైశిష్ట్యం." అనేసాక ఇంకా దయ్యం అన్న పదం వదిలేద్దాం, ఏమంటారు? విజయదశమి లోపుగా పలుకరిస్తారా లేదా?
ReplyDelete