ఆ వీధిలో సింహాలగేటు ఇల్లు అంటే తెలియనివారుండరు. దాని ప్రక్కనే చిన్న డాబా ఇల్లు. గుమ్మం నుండి ముందు వసారా వరకు పాకించిన గిన్నెమాలతి తీగ, అటునుండి ఇటు పాకించిన సన్నజాజి తీగ. గుమ్మం వరకు సన్నని బాట. ముందు గదిలో నుండి వినిపిస్తున్న శ్రావ్యమైన సంగీతం. ఓ వారగా గోడకి చేరగిలబడి కూర్చుని, సన్నగా మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరిని చూడగానే వారి నడుమనున్న సన్నిహితత్వం అర్థమైపోతుంది.
నడివయస్కురాలి ఎదురుగా పాతికేళ్ళలోపు యువతి. ఒకరి కళ్ళలో ఆపేక్ష, మరొకరి కళ్ళలో అభిమానం. "మిత్ర, చాలా సంతోషంగా వుందమ్మా. అనుకున్నది సాధించావు. నీమీద నేను పెట్టుకున్న అంచనాలు తప్పలేదు". ఆ మాటలు అన్నది మిత్రాకి అమితమైన ఇష్టమైన సుమతి మేడం. ఆవిడకి అభిమాన శిష్యురాలు.
కళాశాలలో చేరిన మొదటి రోజు నుండి తన చురుకుదనంతో ఆవిడని ఆకట్టుకుంది మిత్ర. అందరికీ హడలుపుట్టించే ఆవిడకి ఒకవిధమైన ఆకర్షణీయమైన నవ్వుతో, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నడతతో ప్రీతిపాత్రురాలైపోయింది. అది మొదలు ఈ రోజు వరకు మిత్ర వున్నత విద్యాభ్యాసంలో ఆవిడ పాత్ర ఎంతోవుంది. స్నేహితులంతా "సుమతీ శతకం బట్టీయం వేసావా?" అని ఆట పట్టించినా, ఇంతకాలం ఆ అనుబంధాన్ని నిలుపుకోవటంలో ఇద్దరి వంతు వుంది.
"ఉద్యోగంలో చేరబోతున్నావు, అదో జీవితం, పోటీ లోకం, కాని నువ్వు వృత్తిపరమైన ఏ విషయంలోనైనా రాణించగలవు..." ఎందుకో అర్థోక్తిగా ఆగిపోయినట్లనిపించింది. అలవాటుగా కుడిచేతి చూపుడు వేలితో ఎడమ అరచేతిలో సున్నాలు చుడుతూ వింటున్న మిత్ర తలెత్తి పరీక్షగా ఆవిడ మొహంలోకి చూసింది. ఏదో తెలియని విచారం. "మేడం! ఏమిటలా వున్నారు? ఉదయం నుండి ఉపవాసమున్నారు, నీరసంగా వుందేమో. కొంచం బత్తాయి రసం తీయనా?" మిత్రా ఆ మాట అంటూనే లోనికి దారి తీసింది.
మరొక పది నిమిషాల్లో చెరొక గ్లాసులో రసం తీసుకుని పెరటి వైపుగా నడిచి, బొడ్డుమల్లి కుదురు ప్రక్కగా వున్న సిమెంట్ అరుగు మీద కూర్చున్నారు. "ఊ ఇప్పుడు చెప్పండి, నేనొక అరగంటలో బయల్దేరకపోతే నానమ్మ కంగారుపడుతుంది, మీకు తెలిసిందే కదా. కానీ మీరిలావుంటే నేను వెళ్ళను" గొంతులో మారాము ధ్వనించింది. "తాతగారు మొన్న ఫోను చేసారు. పెళ్ళికి విముఖత చూపుతున్నావట. నిజమేనా?" ఆశ్చర్యంగా చూసింది. అవివాహిత అయిన మేడం తనని అలా అడుగుతున్నారేం లోలోపల సందిగ్దత.
"మిత్ర, నాకు తెలుసు. నీ మనసులో కదలాడుతున్న ఆలోచన." సన్నగా నవ్వేసారు. కోరారంగు గద్వాల్ చీర, ముత్యాల గొలుసు, చెవులకి ఏడురాళ్ళ పోగులు, ముక్కుకి సన్న ముక్కు పుడక, చూడగానే హుందాతనం ఉట్టిపడే ఆవిడ నవ్వులో సందె వెలుగుకి మెరిసే ముక్కెర మెరుపు కలిసి అదో అందం. రసం చివరి గుక్క పూర్తి చేసి గ్లాసు క్రింద పెట్టి, కొద్దిగా కొమ్మల నుండి వీస్తున్న గాలికి కొంగు భుజం చుట్టూత్ర్రిప్పి కప్పుకుని, తిరిగి సంభాషణ కొనసాగించారు.
"నీ వయసులో దేన్నైనా సాధించగలనన్న ధీమా, అక్కని బావ పెట్టిన కష్టాలు, కొడుకులు లేక వృద్దాప్యం ఎలా అన్న మీమాంసలో పడ్డ అమ్మానాన్నలు, సమాజంలోని అసమానతలు నన్ను ఈ నిర్ణయానికి పురికొల్పాయి. కానీ ఒక స్థాయికి చేరాక జీవితం వెలితిగా అనిపించింది. అప్పటికి నా వయసు నలభైకి దగ్గర పడింది. ఒకవిధమైన జీవితానికి అలవాటు పడ్డాను. నా అభిరుచులు, అర్హతలు ఇష్టపడ్డ వ్యక్తి అశోక్ తారసపడ్డాడు. ఇద్దరిదీ దాదాపు ఒకే అనుభవం. తండ్రి చనిపోయి తల్లి, చెల్లెళ్ల బాధ్యతలు చేతిలోకి తీసుకుని అవన్నీ పూర్తిచేసేసరికి నలభైలో పడ్డాడు. ఒకసారి కాన్ఫరెన్స్ కి వెళ్ళినపుడు పరిచయమయ్యాడు. ఇద్దరం మానసికంగా సిద్దపడి పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి మరొకసారి జీవితం నన్ను పరీక్షించింది, యాక్సిడెంట్లో తను మరణించాడు. ఇప్పుడు తోడులేని లోటు తెలుస్తుంది. ప్రేమరాహిత్యాన్ని మనసు తన ఓటమిగా అంగీకరించపోయినా అపుడపుడు అనిపిస్తుంది గృహస్తు జీవితం పరిపూర్ణతని తెచ్చేది అని", గొంతుకి ఏదో అడ్డం పడ్డట్లు ఆగిపోయారు.
క్రొత్తగా వుంది. తెలియని ఉద్వేగం, ఇది నిజమా, మేడం ఒంటరితనాన్ని వ్యతిరేకిస్తున్నారా? స్వేఛ్ఛాజీవితాన్ని సమర్థించటం లేదా? "అవును మిత్రా, ఒకరిమీద ఒకరికి ఆధిపత్యం కాక అనురాగంతో సహకరించుకుంటూ సాగించే సమాజం మీ తరంలోనైనా సాధ్యం కావాలి. నీ మీద నా ప్రభావం చాలావుందని తెలుసు. ఈ ఒక్క విషయంలో నన్ననుసరించి కాక, నా అనుభవం నుండి నిర్ణయం తీసుకోమ్మా. పద పద చీకటి పడుతుంది. మాటల్లో పడిపోయాము" అంటూ లేచారు. ఆలోచన ఇంకా తెగలేదు, పరధ్యాసగానే కదిలింది.
గుమ్మం వరకు వచ్చి "చంద్రయ్యా, జాగ్రత్త" అంటూ హెచ్చరించి కారు కదిలి, సందు మలుపు తిరిగే వరకూ చూసి చిన్నగా నిట్టూరిస్తూ లోనికి కదిలారు. ఐదడుగుల నాలుగంగుళాలు ఎత్తు, సరిపడా ఒళ్ళు, లేత గోధుమ రంగు ఛాయ, తెలియని ఆకర్షణ, నడకలో నాట్యసాధన తాలూకు పోకడ. చక్కని రూపు, అంతకన్నా చక్కని మనస్తత్వం. మిత్రాకి మంచి భవిష్యత్ వుంది. ఆవిడకి తెలుసు మిత్ర కొంచం సమయం తీసుకున్నా తను చెప్పిన మాటల్ని అలక్ష్యం చేయదని.
**********************************************************************
"నాన్నమ్మా, ఇంక చాలు. పొట్ట పగిలిపోతుంది. " మిత్ర మాట పూర్తి కాకమునుపే మరొక ఉలవచారు ముద్ద కూరేసారు లక్ష్మీ దేవమ్మ గారు. వడియాల పాలకూర, తెలగపిండి కూర, ఉలవచారు ఘుమ ఘుమలు గదంతా పరుచుకునున్నాయి. మరొక నాల్గు ముద్దలు గడ్డపెరుగుతో తినిపించటం పూర్తయేసరికి సాంబ్రాణి సిద్దం చేసుకుని సుబ్బాలు రానే వచ్చింది. నడుంకట్టు వరకు గిరజాల నల్లటి కురులు. జుట్టు ఆరి జడ అల్లటం పూర్తయే సరికి జగదాంబ గారు పంపిన విరజాజి మాలతో, బట్టల మూట వీపున పెట్టుకుని ముత్యాలు వచ్చింది.
"రేపు అమ్ములుగారు ప్రయాణం అంటగా అమ్మగారు, ఇక సందడేమీవుండదండి" అంటూ ఓ మూల మూట దింపుకుని కూర్చుంది. ఒక క్షణం దిగులు ఆవరించినా ఆవిడ వెంటనే సర్దుకుని "మరి అంత ఉద్యోగం రావటం మాటలేమిటే? కష్టపడింది. ఇంకా వృద్దిలోకి రావాల్సిన పిల్ల" అన్నారు. నానమ్మ అంటే అందుకే ఇష్టం తన చిన్నతనంలో అయిదో క్లాసుతో ఆగిపోయిన చదువు పట్ల ఆవిడకి వున్న అసంతృప్తి మిత్ర ద్వారాగా తొలగించుకున్నారు. ఉద్యోగరీత్యా వూళ్ళు పట్టుకుతిరిగే కొడుకు, కోడల్ని వప్పించి చిన్నప్పటినుండి తన దగ్గరే వుంచుకుని చదివించారు. టెన్త్ వరకు ఇంటి నుండే పంపారు. ఇంటర్ నుండి మాత్రం దగ్గరలో వున్న టౌన్ లో హాస్టల్లో వుంచి చదివించారు.
"ఇలా తాగివస్తే అమ్మాయిగారు కేకలేస్తారు" వెంకన్న గొంతు గట్టిగా వినిపిస్తుంది. "సర్లేలేరా ఈ భుజాల మీద మోసిన బంగారం కాదా" అజ్జి ముద్ద మాటలతో లేచి ఆ ప్రక్కగా నడిచింది మిత్ర. లేత ముంజలు తాటాకులో చుట్టి పట్టుకువచ్చాడు. "తల్లీ, ఇదిగో నీకు ఇష్టమని బాసిగాడితో దింపించాను." ఆ అప్యాయతకి కళ్ళు చెమర్చాయి.
భుజాలమీద మోసి మామిడి కాయలు కోయించిన అజ్జి తాత. అలాగ పిలవటమే అలవాటు. వీపు మీద కూర్చోబెట్టుకుని తామర చెరువులో ఈదుతూ, కావాల్సినన్ని పూలు కోసుకునేదాక తిప్పేవాడు. గేదల దగ్గర పాలేరుగా మొదలైనవాడు ఏళ్ళ తరబడి తమ కుటుంబాన్నే నమ్ముకుని వుండిపోయాడట. ఎంత ప్రయత్నించినా ఆ కల్లు అలవాటు తప్పించలేకపోయింది. కానీ తను చూపే ప్రేమలో మాత్రం ఏ మార్పూ లేదు. నిన్న వస్తూ అజ్జికి ఇష్టమని కొన్న బేకరీ బిస్కట్స్ తేవటానికి లోపలకి నడిచింది మిత్ర.
"పెద్దయ్య గారేరి?" అజ్జి మాటకి వంట గదిలోంచి వస్తూ లక్ష్మీ దేవమ్మ "శర్మ గారి అబ్బాయి వచ్చాడురా, ఏదో పొలం వ్యవహారమట. ఇద్దరూ కలిసి మెట్టమీదకి వెళ్ళారు" అంటూ "ఏ నువ్వు ఆ ప్రక్కగా రాలేదా" అని అడిగారు.
"మిత్ర, ఎవరొచ్చారో చూడు" మాధవయ్య గారి మాటకి అటుగా వెళ్ళిన మిత్రాకి పలకరింపుగా నవ్వుతున్న యువకుడిని చూడగానే గుర్తుకు వచ్చిరానట్లుగా వుంది. "మాట్లాడుతూ వుండండి." ఆయన లోనికి వెళ్ళాక మరోసారి పరకాయించి చూసింది.
"ఏయ్ ఎర్రకోతి.." ఆ గొంతు వినగానే మొహం మీదకి నవ్వు దూసుకుని వచ్చేసింది విష్ణు, అవును తనని ఆటలుపట్టిస్తూ యేడిపించేప్పుడు కంది ఎర్రబడ్డ మొహం చూసి అలా పిలిచేవాడు. "చాలా మారిపోయావు." మిత్ర మాటకి బదులుగా "మరి నువ్వు మారలేదేమిటి?" సన్నగా నవ్వేసాడు. ఇద్దరు కలిసి మాటల్లో పడ్డారు. టెన్త్ అవ్వగానే తండ్రి చనిపోవటంతో మేనమామ గారి వూరికి వెళ్ళిపోయారు. మాధవయ్య గారే ఇన్నాళ్ళూ వాళ్ళ పొలాలు,కౌలు వసూలు అవీ చూస్తున్నారు. విషయాలు తెలుస్తున్నా కలవటం పడలేదిన్నాళ్ళు.
హైదరాబాదులో ఇల్లు కొనటానికి పొలాలు బేరం పెట్టటానికి వచ్చాడు. రాత్రి గౌతమికి ప్రయాణం. తను కూడా రేపే హైదరాబాదుకి వస్తున్నట్లు చెప్పింది. "తాతగారు చెప్పారు. ఇల్లు దొరికే వరకు మాతోవుండమని చెప్పాను" అన్నాడు. "ఊ, కానీ .." "అదేమీ కుదరదు, కావాలంటే ఒకటి రెండు రోజులు సెలవు పెట్టి ఇల్లు వెదుకుతాను" అంటూ వొప్పించాడు. ఒక సమస్య తీరిపోయింది. తను వుండగలనన్నా తాతగారికి ఆందోళన. ఆయన కోసమైనా తప్పదు. సర్దుకోవాల్సినవి ఇంకా వున్నాయి.
మరో గంటకి భోజనం చేసి విష్ణు బయల్దేరి వెళ్ళటం, తను సర్దుకోవటమ్ పూర్తయింది. వెళ్ళి తాత గారి ప్రక్కన పడుకుంది. ఆయన మాట్లాడటం తక్కువే కానీ మనవరాలితో మాత్రం అన్నీ కూలంకషగా చర్చిస్తారు. "అమ్మలు, ఇంతకాలం ఇక తీరు,ఇప్పుడిక మరోతీరు ఉద్యోగం, క్రొత్త లోకం, జీవితమే గురువు. మనుషులతో కలిసిమెలిసి సాగటమే ఆధ్యయనం. తోడు అన్నది మనిషికి ముఖ్యం. మా నుండి బలవంతం వుండదు కానీ సంబంధాలు వస్తున్నాయి, తల్లీ. నీఇష్టానుసారమే అన్నీను..." అలా చెప్తూనే నిద్రలోకి జారుకున్నారు. దుప్పటి కప్పి తలుపు జారవేసి బయటకి నడిచింది. కాసేపు ధ్యానం చేసుకుని, ప్రక్క మీదకి చేరింది.
నిన్న సుమతి మేడం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంతవరకు ఈ ఇరవై రెండేళ్ళు చదువుకోవాలి అన్న ధ్యాస తప్పితే స్త్రీ సహజమైన భావనలు ఎందుకు కలగలేదు. సాలోచనగా మగత నిద్రలోకి జారుకుంది. ఆ ఆలోచన అతి త్వరలో తన మీద ఏ ప్రభావం చూపనుందో?
pleasant ,narration బావుంది
ReplyDeleteచాలా serious గా ఉంది అని నా కంప్లైంట్
"బట్టల మూట వీపున పెట్టుకుని ముత్యాలు వచ్చింది.."..చదవగానే నాకు మా మామ్మగారి ఇల్లు గుర్తు వచ్చింది..తువ్వాళ్ళ దగ్గర్నుంచీ,దుప్పట్లు దాకా అన్ని బట్తలూ రేవుకు బట్టలు తీసుకెళ్ళే మా ఇంటి చాకలి..వెళ్లగానే,అమ్మయిగారు బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించి,ఉన్నన్నాళ్ళూ దొడ్లో పువ్వులన్ని కోసిపేట్టిన లక్ష్మి(30ఏళ్ళుగా మా ఇంట్లో పని చేస్తూ వచ్చిన మనిషి)..రొజూ సైకిలు మీద వచ్చే కూరలబ్బాయి..అందరూ గుర్తు వచ్చారండి..మా ఊరెళ్టే ఓ చిన్న సామ్రాజ్యానికి రాణీనే అయిపోయేదాన్ని...ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసారు..
ReplyDeleteఎంత కల్పితమనుకున్నా నాకు మాత్రం ఎక్కడో..కొద్దిగా ఆటోబయోగ్రాఫికల్ టింజ్ తగులుతోంది...ఏమంటారు??
ఉష వచ్చిన క్రొత్తలో అసలు ఎలా రాయాలో ఎలా పోస్ట్ చేయాలో తెలియని తికమకలో పేరాలు విభజించకుండా నేనూ రాసేదాన్ని .. అప్పుడు చాలా మంది పేరా గ్రాఫ్ లు విభజించమని సలహా ఇస్తే మెల్లిగా పేరాలు పెట్టాను.. ఇప్పుడు అర్ధం అవుతుంది ఎందుకు విభజించమన్నారో.. కళ్ళు లాగుతున్నాయి .. ఇంత చక్కని కధను ఇంకా ఆహ్లాదం గా చదవాలని ఉంది పేరాగా విడకొట్టడానికి కుదురుతుందా మీకు :)
ReplyDeleteనారేషన్ బావుంది. కానీ చిన్న ప్రశ్న, రెండవ భాగం చివరలో డైరీ తీసుకున్నది విశ్వ, మూడవ భాగం లో కనిపిస్తున్నది మిత్ర కధ. ఎందుకిలా ?
ReplyDeletemeere raasara? raayinchara?hahahha... just kidding.
ReplyDeletenarration is good enough. Wish u all the best
అబ్బ ఎక్కడి కి తీసుకెళ్ళారండీ ! సిమ్హాల గేటు, గిన్నె మాలతీ పూలు, సన్నజాజి తీగె , బొడ్డు మల్లె చెట్టు ఏటో వెళ్ళి పోయింది మనసు.
ReplyDeleteఇవన్నీ మాకాలం వి కదా ?
భుజాన మూటతో చాకలి , మా అమ్మమ్మ గారి వూళ్ళో చాకలి,పనమ్మాయి మస్తాన్ ,అమ్మమ్మా ,తాతగారు , మామయ్యలతో పోట్లాటలూ ఏమిటో ఏకాలానికి వెళ్ళామో !
చాలా చాలా బాగుంది. మీరిలాగే రాస్తూవుండండి ప్లీస్
హరేకృష్ణ, థాంక్స్. మీ పిర్యాదు త్వరలోనే వెనక్కి తీసుకుంటారు. ఈ కథలో కొంత లోతైన చర్చలు వస్తాయేమో... అయినా మీరు రావటం మానకండి.. :)
ReplyDeleteతృష్ణ, మీరాపనిలోనేవుండండి. ఎంత కల్పితం, ఎంత వాస్తవం అన్న బేరీజులువేస్తూవుండండి. ;)మీ జ్ఞాపకాలు కదపగలిగినందుకు సంతోషం.
ReplyDeleteనేస్తం, మార్చాను. మిగిలిన టపాలు చదివినపుడు ఇక ఆ ఇబ్బంది కలుగదు. నెనర్లు. very good feedback. beginning hiccups for a person to write stories... :)
ReplyDeleteప్రదీప్, విశ్వాకి తన డైరీ వ్రాసుకునేసరికి తెలియని మిత్ర గతం ఇది. కథలో ఈ అతుకు ముక్క వేయటం తప్పనిసరైంది.
ReplyDeletecommon sujjii, I can not afford any ghost writers and I can not imagine "maruvam" to borrow from others. This is my land of heartfelt moments and experiences. :)
ReplyDeleteమాలా గారు, మా వూర్లో చితికి పోయిన కుటుంబాలు వున్నాయి కానీ, అక్కడక్కడా స్వార్థం కనిపిస్తుంది కానీ దాదాపు 10 ఏళ్ళ క్రితం వరకు ఈ దృశ్యాలు సర్వ సాధారణం. ఇప్పటికీ ముత్యాలు స్థానే వరహాలు, సుబ్బాలు స్థానంలో సత్యవతి కనిపించవచ్చు. గతవైభవం అంతా పోలేదు. మీ కాలం అంటూ ఈ కాలాన్ని తక్కువ చేయకండి మరి! ;) మా అన్నయ్య తోటల్లో వేసే మొక్కలు పూలు ఈ వర్ణనలకి ఏమీ తీసిపోవు. అందుకని ఇది మరీ గతించిపోయిన కాలం నాటి కథ కాదు....
ReplyDeleteమేడం కథ మరీ ఫ్యూడల్ వాసనలతో నిండి పోతోంది. ఇలా అంటే కోపమొస్తుందని తెలిసినా నా ఫీల్ చెప్పక పోతే బాగుండదని.
ReplyDeleteవర్మ గారు, తప్పక మీ భావాలు పంచుకోండి. మరువంలోని అన్ని పోకడలనీ మీరు ఆస్వాదించారు. ఇదీ అంతే. కొన్ని మన ఆధీనంలోవుండవు. ఇది పూర్తి కల్పితం కాదు కనుక నా చిన్నతనం తాలూకు ఛాయలు ఈ భాగంలో వుండి వుండవచ్చు. నాకు రచనల పట్ల పట్టు లేదు కనుక జీవితానుభవాలనుండే ఎక్కువగా నా ఆలోచనలు వెలికివస్తాయి. I have long way to go to claim even I am a writer. ప్రదీప్ గారి కిచ్చిన సమాధానమే మీకూను. ఇదొక పునాది రాయి మాత్రమే. కథలో ఎన్నో కట్టడాలు రావచ్చు, మీరు కొన్నిటిని ఇష్టంగా మరిన్నిటిని అయిష్టంగా అధిరోహించక తప్పదు. నెనర్లు.
ReplyDeleteI can not afford any ghost writers and I can not imagine "maruvam" to borrow from others. This is my land of heartfelt moments and experiences. :)
ReplyDelete*** *** ***
abba emi cheppaarandee. It's really true that having our own things without any influences. Unable to write in telugu, and comment on complete post. Wil be back later.
Very nice narration. Refreshing? Can't say. But have taken in to a deep and affectionate atmosphere. Will hasve to sink the lines u wrote. Probably may come back again
ReplyDeleteగీతాచార్య, సృజన, ఈ కథ రచనా ప్రయత్నమే నేను ఈ ప్రక్రియలో ఎదగటానికి దోహదం కూడా కావాలి. ఈ ప్రయత్నం నా వరకు ఎన్నో అనుభూతులని, అనుభవాలనీ తరచి చూసుకునే అవకాశం ఇచ్చింది.నెనర్లు.
ReplyDeleteవర్ణన, వివరణ చాలా బావుంది :)
ReplyDelete"బొడ్డుమల్లి కుదురు ప్రక్కగా వున్న సిమెంట్ అరుగు"
ఒక్క క్షణం అమ్మమ్మ వాళ్ళపాతింటికి వెళ్ళిపోయాను, తులసి మొక్కలు దట్టంగా ఉండేవి, పక్కనే అరుగు ఉండేది.
ఉదయన్నే అమ్మ కూర్చోబెట్టి చేయించిన లెక్కలు (అప్పట్లో హాలిడే హొం వర్క్ ఇచ్చేవారు దుష్టులు )
మధ్యాహ్నం కూర్చుని పాత వార్త పత్రికలతో చేసిన కాగితం సంచులు, 5*5 చుక్కలతో కలపగలిగిన ముగ్గుల రకాలతో ప్రయోగాలు...ఎవరు పెద్ద రధం ముగ్గు పెడతారో అని పోటీలు, వాన గుంటలు....
సాయంత్రం అమ్మ మాల కట్టడం చూస్తూ నేర్చుకునేటప్పుడు పూలు వృధా ఐపోతాయని, జామ ఆకులతో నేర్చుకున్న మాల కట్టడం, రాత్రి భొజనాలయ్యాకా, అందారూ నిద్దరొచ్చే వరకూ పాడుకునే అంత్యాక్షరి....
ఏదో పూర్వ జన్మ జ్ఞాపకాల్లా ఉన్నాయ్....
నేను గారు, సంతోషం. పాఠకుల్లో ఇటువంటి స్పందన, జ్ఞాపకాల నెమరేయటం రావాలనే నా ప్రయత్నం.
ReplyDeleteఉష గారు, విశ్వ డైరీ చదువుదాం అని ఎదురుచూస్తుంటే మిత్ర కధ ఎదురవడం తో కాస్త తడబడినా మీ అందమైన వర్ణన తో మరోమాట మాట్లాడనివ్వకుండా కట్టి పడేశారు :-) చాలా బాగుంది.
ReplyDelete"ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం కాక అనురాగంతో సహకరించుకుంటూ సాగించే సహచర్యం.." చాలా చక్కగా ఉంది నా మనసులోంచి తీసి రాశారా అనిపించింది.
వేణు గారు, విశ్వ మిత్రల్ని సమవుజ్జీలుగా సమాంతర వ్యక్తిత్వాలుగా తీర్చి దిద్దాలనుకోవటం మొదటి రచనలో నేను చేసే సాహసమే. కానీ మీవంటి వారి ప్రశంస ధైర్యాన్నిస్తుంది. కృతజ్ఞతలు.
ReplyDeleteమీ రచనా శైలి చదివింప చేసేట్లుగా ఉంది. విశ్వ-మిత్ర పూర్తి వ్యక్తిత్వాలు ఇంకా పూర్తిగా విశదమవ్వలేదు. వారి మధ్య ఆకర్షణ,ప్రేమ,ఆరాధన ఎలా కలిగాయో తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది.
ReplyDeleteపాత్రలు-సంభాషణలు సామాన్యులకి కొంత దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది.
వెంకటరమణ గారు, మీ ప్రశంసకి ధన్యవాదాలు. పైన వేణు గారికి ఇచ్చిన జవాబే మీకూను. తొలి ప్రయత్నం కనుక వాస్తవ-కల్పనల సమతుల్యం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నానేమో. ఏమైనా మీ వ్యాఖ్యలోని చివరి వాక్యం ఇకపై తప్పక గుర్తువుంచుకుంటాను. సందర్భం కనుక, ఈ టపాలోని పాత్రలు-సంభాషణలు చాలావరకు స్వానుభవం. ఇకపై ఏమిటన్నది చదివి మీరు వూహించుకోండి. నెనర్లు.
ReplyDeleteకధేదొ బాగుందండి. ఇంకా రాశారా?
ReplyDeleteఅరే అ.గా. గారు, చటుక్కున వచ్చేసారే! ఇది వారానికొక భాగంగా [వారాంతంలో] వ్రాస్తున్నానండి. మీకు ఈ ప్రయత్నం కూడా నచ్చినందుకు సంతోషం. ఇది నా కన్నా అదే నా సామాన్యుడి http://maruvam.blogspot.com/2009/08/blog-post_17.html కోరిక. :) లేకపోతే ఈ రచనాప్రయత్నం జరిగేది కాదు. thanks. You might have noticed, this is the 3rd part. There are 0 and 1 prior to this. This serial would be coming till end of this year, just FYI.
ReplyDeleteమీరేమైనా చెప్పండి !
ReplyDeleteసిమ్హాల గేట్ కు ముందు రెండు వైపులా ఎత్తైన అరుగులు , ద్వారముదాటి లోపలకి వెళ్ళగానే నిగ నిగలాడే గుర్రము ( తాతగారి వాహనం ), కొద్దిగ ముందు కెళ్ళగానే ఎత్తైన వరండా , దాని కొద్ది పైన ఇంకో వరండా , అక్కడ కరణం బల్ల మీద సిరా బుడ్డీ , అందులో పొడుగాటి కలం, బల్ల వెనుక నిలువెత్తు రూపము తో పచ్చగా మెరిసి పోతూ ,తాతగారు, ఆయన పక్కన పెద్ద రాగి చెంబు తో నీరు, వరండా దాటి లోపలికి వెళ్ళగానే ఏడుగజాల చీర కాసపోసి కట్టుకొని ,రూపాయి బిళ్ళంత బొట్టు తో నవ్వు మొహము తో ఎదురొచ్చే అమ్మమ్మ ,గతకాలపు వైభవమే అనిపిస్తుంది మరి !
వేణూ శ్రీకాంత్ గారు,
ReplyDelete" విశ్వ డైరీ చదువుదాం అని ఎదురుచూస్తుంటే మిత్ర కధ ఎదురవడం తో కాస్త తడబడినా మీ అందమైన వర్ణన తో మరోమాట మాట్లాడనివ్వకుండా కట్టి పడేశారు :-)" అన్నారు. పరుల డైరీ చదవటం తప్పుకదండీ. :-D
ఉష గారు,
అందుకేనా డైరీలో విషయాలెక్కువ చెప్పలేదు.
@ మాలా గారు, సరే మరిక ఏమంటాము. మీరంత 1942 దంపతులని కళ్ళేదుటకి తీసుకొచ్చి చూపెడుతుంటే. కాకపోతే మేడం... కర్నూలు కొండా రెడ్డి బురుజు గురించి కూడా ఇలాగే వాదించారా? అవునింతకీ అది ఏ సినిమాలో చూపారో తెలుసా. సింహాలగేట్లు, అద్దాల మేడలు ఇంకా మనవారికి కనీసం మా ప్రక్కవారికి కొండగురుతులే మేడం. వీటికి, కథాకాలానికి లంకె వేయకండి. జీవన విధాల్ని, సమకాలీన పరిస్థితులనీ నేను ఏదైనా వివరిస్తే బేరీజు వేసి నన్ను నిలదీయండి. కానీ మీ వ్యాఖ్య కాస్త హుందాతనం తెచ్చింది నా రచనకి. :)
ReplyDelete@ ధనా, ;) మరి మీ MOTORCYCLE DIARIES చదివేసానెలగబ్బా? థాంక్స్. అంతా డయరీస్ గా వ్రాసి కథని పట్టుగా నడపలేననే కాస్త అన్నీ కలిపి ఇలా సాగిస్తున్నానీ కథనం.
ReplyDelete