పదం నేర్చి, పాదం కూర్చి, పథం పరిచి.. మరి ఆపై?

ఆశలు ఆలోచనలు అక్షయపాత్రలు
కలలు కన్నీళ్ళూ కావడికుండలు

కాలం నింపేటి జీవిత
పుటలు
సగం చెక్కి వదిలిన శిల్పాలు

గతం దాచుకున్న లంకెబిందెలు
భవిత అల్లుతున్న పడుగుపేకలు

ఆనంద శిఖరారోహణ అధిరోహణలు
విచలిత మనస్క అవరోహణలు

విభ్రమ తారసిల్లిన మోహావేశాలు
క్షమ మోసుకొస్తున్న ప్రేమానురాగాలు

రాజసమున భాసిల్లు అనుభూతులు
తామసమున బాధించు నిట్టూర్పులు

సాత్త్వమున మమేకమైన రెండు జీవితాలు
సంప్రీత హృదయాల అనుసంధానాలు

24 comments:

  1. ఇది కూడా సీరియల్లో భాగమాండీ?
    లేక మధ్యలో ఇంటర్వెల్లా?

    ఏమైనా,భలే నచ్చింది నాకు..

    ReplyDelete
  2. "సాత్వికాన మమేకమైన రెండు జీవితాలు

    సంప్రీత హృదయాల అనుసంధానాలు"

    కధలోదనే అనిపిస్తోంది....

    ఎదో అత్యాశగా డైరీ చదివేద్దాం అని వచ్చాను, మళ్ళీ ఉపోద్ఘాతం పలుకరించింది....

    ఆడేస్కుంట్నారు.... ;)

    ఒక్క క్షణం Jeffry Archer's "As The Crow Flies"

    గుర్తొచ్చింది..అందులోనూ పాత్రల దృక్కోనం లో కధను భలే మలుపులు తిప్పుతారు రచయిత

    ReplyDelete
  3. హమ్మయ్య.. ఈరోజు కవిత చదవడం పూర్తి అయ్యింది. ముద్రా రాక్షసాలు పంటికింద సుద్ద రాళ్ళవలే మెదిగి పోతున్నాయండి. ఓపికవుంటే ఒకసారి చూడండి.

    ReplyDelete
  4. తెలుగుభాష: సందేహ నివృత్తి? ఈ వ్యాఖ్య చూసిన వారు వివరాలు తెలిసినవారు సమాధానం ఇవ్వమని మనవి.
    1. పుఠలు - పుటలు
    ఏది సరైన పదం - "జీవిత పుఠలు" అన్నది సరైన ప్రయోగమేనా?
    2. రజస తమస సత్వ - త్రిగుణ ప్రవృత్తి
    తామసాన, సాత్వికాన వరకు అవగాహన వినియోగం తెలుసు. మరి "రాజసాన" అన్నదా లేక "రజసాన" అని వాడాలా?

    ReplyDelete
  5. తృష్ణ, లేదండి, ఇది కథలోని భాగంకాదు, నా మదిలోని సవ్వడి. మరీ కవితలని వదిలి అభోజనంగా వుండలేక, మనసుండబట్టలేక, ఇన్ని అనుభవాలు పంచిన తనకీ, తనని ఇచ్చిన ఈ జీవితానికి మరో వెయ్యోమారు నా హృదయం సమర్పించేసుకుంటూ...ఇలా ... ;)

    ReplyDelete
  6. నేను, ఎంత చక్కగా హాజరు వేయించుకున్నారో. కబడ్డిలో నాదే పైచేయండి. ఓ ఆట ఆడేద్దామా? :) I am so glad that am compared to someone else, so am not unique... పైన వ్రాసానుగా. తన అభీష్టం ఈ కథ, నాది కవితాలోకం, మంద వీడిన ఆవు దూడ మాదిరి ఇలా ఏదో మధ్యలో నా కవితాదేవి కోసం ఓ అరుపు...

    ReplyDelete
  7. భా.రా.రె గారు, నేను పూర్తి బలిమితో వాడని రెండు పదాలు ఇక్కడ మనవిలో పెట్టాను. అవే మీరన్న "ముద్రా రాక్షసాలు" కావచ్చు :)

    ReplyDelete
  8. (౧) జీవితపు పుట

    కాకితం అనే అర్థంలో పుట శబ్దం (లఘు టకారం) సాధువు. పృష్ఠ శబ్దం దీని సంస్కృతమాతృక. తెలుగులో పుట ఔతుంది.

    ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే సంస్కృతంలో పుట అన్న శబ్దానికి పొట్లం అని అర్థం. దానికి తెలుగులో రూపం పుటము ఔతుంది. సాధారణంగా ఈ ప్రయోగం ఆయుర్వేదంలో వినబడుతుంది. ఉదాహరణకి, ఒక ప్రత్యేక భస్మం తయారుచేయడానికి పుటం వేసి కాల్చాలి (నాకు సరిగా గుర్తులేదు ప్రయోగం ఇలాగే చేయాలో కూడదో).

    * * *

    (౨) త్రిగుణాలు: సాత్త్వమున-రాజసమున-తామసమున

    పేర్లు సత్త్వము-రజస్సు-తమస్సు. వీటి సంస్కృత మాతృకలు సత్త్వ-రజస్-తమస్, మూడూ నపుంసకలిఙ్గశబ్దాలే. వీటి విశేషణరూపాలు సాత్త్విక-రాజసిక-తామసిక. సాత్త్వ-రాజస-తామస అన్న ప్రయోగాలు ఆ ఆ గుణానికి సంబంధించిన అన్న అర్థంలో వాడుతారు. ప్రయోగాలకై శ్రీమద్భగవద్గీతలో పధ్నాల్గవ అధ్యాయం చూడండి.

    ReplyDelete
  9. మళ్ళీ ఇంత తొందరగా మీ కవితను చదువుతాను అనుకోలేదు. జీవిత సత్యాలను మీ అంత బాగా ఎవరు చెప్పగలరు?

    ReplyDelete
  10. రాఘవ, వివరణకి, reference కి ధన్యవాదాలు. మీ సంస్కృతాంధ్ర భాషల అధ్యయనంలోని విలువ ఇది. నేర్చుకోవాలన్న ఆసక్తిని సమయాభావం అధిగమిస్తోంది. తప్పక ప్రయత్నిస్తాను. కవితలోని ఈ పదాలని మార్చాను. కృతజ్ఞతలు.

    ReplyDelete
  11. వర్మ గారు, అందుకే జీవితంపట్ల అంత మక్కువ నాకు. అన్నీ పరిచయం చేసి అన్నిటినీ నా దరిచేర్చే నెచ్చెలి. అందులో భాగం పంచుకున్నది తాను. ఈ "తను-నేను" ల సవ్వళ్ళే నా కవితలు. నెనర్లు

    ReplyDelete
  12. కవిత చాలా బాగుంది...
    మీ జీవితం పట్ల మక్కువ వ్యాఖ్య ఇంకా బాగుంది...

    ReplyDelete
  13. ఇప్పుడు చదవడానికి బాగుందండి.

    ReplyDelete
  14. ఇప్పుడు పూర్తిగా అర్ధమయింది. మునుపు కవిత వెనుకనున్న థీంను గ్రహించిన సాంత్వనతో రాసాను. నాకెందుకో పండిత ప్రకర్షను చూపించే కంటే సరళంగా పదుగురికీ అర్థమయ్యేట్టు రాసేదే నచ్చుతుంది. ఇది నా అజ్ఞానం వలన కూడా కారణం కావచ్చు. అచ్చమైన తెలుగుకే దూరమైన వాళ్ళం, ఇంక సంస్కృత రాజ భాష ఏమర్ధమవుతుంది. ఏమైనా మీ ఓర్మికి నా నెసర్లు.

    ReplyDelete
  15. వేణు గారు, ధన్యవాదాలు. మరి మీ జీవితం పట్ల మీరు మరింత మక్కువ పెంచేసుకోండిక.

    భా.రా.రె, చేసిందంతా చేసి, :) తీగె మీరు కదిపారు, నేను రాఘవ గారిని మరువపు వనానికి రప్పించాల్సివచ్చింది. నెనర్లు. ఈ రకంగా కాస్త అధ్యయనానికి వీలైంది.

    వర్మ గారు, మనుషులు వేరైనట్లే ఆసక్తులూ వేరు కనుక ఏదో నా ఇష్టాన్నిలా కానిచ్చేద్దాం. :)

    ReplyDelete
  16. మరి నాది చిన్నప్పట్నుంచి నూరు శాతం హాజరుగా...
    i'm a very good girl
    said me all teachers :)

    ReplyDelete
  17. నేను, guess who would have been your dearest enemy then if we both were in the same school? ;) హాజరు పట్టిక నాచేతిలోనే వుండేది. I was DEO's pet then...When I visited my school after 12 years, I did not have to tell anyone as each and everyone just recognized me. Thanks for sending me to go back to school days. I was my convent's pride [in humble tone!] in deed :).

    ReplyDelete
  18. ఆహా ఐతే ఇంకేముంది..... చక్కగా మీ పుణ్యమా అని ఏ సోషల్ క్లాసో ఎగ్గొట్టేసి హాయిగా గ్రంధాలయంలో కూర్చుని, చందమామలూ, పంచతంత్ర కధలూ చదివేస్కుందును ;)

    ReplyDelete
  19. నేను, సోషల్ క్లాస్ ఎగ్గొట్టనిచ్చేదాన్ని కాదు. నాకు మా ఇవాంజలిన్ టీచర్ కి నడుమ ప్రేమ ఎక్కువ. ఫిజిక్స్ అయితే ఓ కే. ;)

    ReplyDelete
  20. అబ్బో....! ప్రియ శిష్యురాలు :)
    నాకు సోషలు తప్ప ఏ క్లాసూ ఎగ్గొట్టాలనిపించదు;) పైగా భౌతిక శాస్త్రంలో అంతరిక్షం గురించి పాఠాలు భలే ఉండేవి, మమ్మల్ని కంప్యుటర్ లాబ్ కి తీస్కెళ్ళి super nova exlplosion చూపించారు ఎంత బావుందో....
    ఇంకో కచ్చి ఎంటంటే నా 10 లో సోషల్ వల్లే మొత్తం ఏవరేజ్ 4శాతం తగ్గిపోయింది :( డొక్కు సామాజిక శాస్త్రం, తిక్క సామాజిక శాస్త్రం....(no offence meant)

    ReplyDelete
  21. నేను, ఒక పాత/మోటు సామెతవుంది. "గిల్లి ముద్దు పెట్టటం" అని. ;) ఇదీ అంతేనేమో. నాకు ఇష్టమైన టీచర్ గారి సబ్జక్ట్ ని [అంచేత నాకూ ఇష్టమని తెలుపుతూ] పట్టుకు తిట్టేస్తే వూరుకుంటానా. అసలు కామేశ్వరి, సరస్వతి గార్ల వలనే నాకు ఫిజిక్స్ మీద కోపం. మనకిక పడదు సుమీ. నేను వ్యక్తిపరంగా ఇష్టాయిష్టాలు పెట్టుకున్నాను. నా వరకు అన్నీ చదవగలననే ధీమా ఎక్కువ. అప్పట్లో దాన్నే టెక్కు అనేవారు[ట!]. మా నవీ చెప్పింది. మీరు సబ్జక్ట్ పరంగా వస్తున్నారు. :) ఏమిటో జీళ్ళపాకం పట్టాము ఈ వ్యాఖ్యోపాఖ్యానం తో. జనాలిక శపించేస్తారు అమ్మీ! అర్థం చేసుకోవు... ;)

    ReplyDelete
  22. రామా...! అంత పాపం నాకెందుకు, ఇక ఈ నోటికి తాళం వేసేసి, తాళం చెవి మీ చేతికే ఇచ్చేస్తున్నాను, అసలే మంచి పిల్లను ;)

    ReplyDelete
  23. naa kavita "inteanaa! inteagaa"--koddigaa ii bhaavaala toe vundani naa kanipistoendandi!

    ReplyDelete
  24. @ నేను, Thanks. Let's bake a cake on my next post.

    @aswinisri, ఉదయాన్నే ఎంత పని పెట్టారు మేడం. :) Dec '08 - May '09 at http://himakusumaalu.wordpress.com/2009/05/ గాలించి మీరన్న కవిత పట్టుకున్నాను. అప్పుడే చదివాను కానీ వ్యాఖ్యానించలేదని ఇప్పుడు గుర్తుకొచ్చింది. పోలిక తక్కువ, నాది a mix of all and ending in contentment. Am a happy camper ;) not that you're not. నాకు చిన్ని ఆనందాలతో తృప్తిపడిపోవటం భావోద్వేగాన్ని వొలకబోసి తిరిగి పేర్చుకోవటం రెండూ అలవాటే! అందుకే ఒకపరి విలాపం తదుపరి విలాసం...

    ReplyDelete