సంధి వలదని సమరం నీవె కోరితివి
అస్త్రశస్త్రాల సంభారమూ నీదైనది
నీవు పరిచిన అంపశయ్య మీద నేను
నీ జ్ఞాపకాల బాణపు గాయంతో
ఎంతకూ రాని సంక్రమణానికై
ఇన్ని యుగాంతాల ఎదురుచూపులో
నీ అనురాగ గంగాతీర్థం గుండె తడుపుతుంటే
ఏ ఏకాదశికో నీవే సర్వాంతర్యామివై
ప్రేమ సహస్ర నామాల నన్నలరిస్తావని
అస్త్రశస్త్రాల సంభారమూ నీదైనది
నీవు పరిచిన అంపశయ్య మీద నేను
నీ జ్ఞాపకాల బాణపు గాయంతో
ఎంతకూ రాని సంక్రమణానికై
ఇన్ని యుగాంతాల ఎదురుచూపులో
నీ అనురాగ గంగాతీర్థం గుండె తడుపుతుంటే
ఏ ఏకాదశికో నీవే సర్వాంతర్యామివై
ప్రేమ సహస్ర నామాల నన్నలరిస్తావని
కలవరపెట్టారండి...ఏదైనా మీకు మీరే సాటి అనుభూతులను పంచడం లో
ReplyDeletejust wonderful!
ReplyDelete"ప్రేమ సహస్ర నామాల నన్నలరిస్తావని "
ReplyDeleteతప్పక అనుగ్రహిస్తాడు.
దానికి కోన సాగింపు గా'' కలలోనైనా అనుకొన లేదే నువ్వు వస్తావని
ReplyDeleteరాక పొతే భయ పెట్టవుగా నే చస్తానని .
గంగా తీర్దం అయిపోతుందని
ReplyDeleteఆ నేరం నా మీద పడుతుందని
బాణం విరిగి పోతుందని
పరుగెత్తుకు వచ్చా నిన్ను లేపుదామని
చాలా బాగుంది.
ReplyDeleteప్రతి ఏకాదశికి ఏకాకినై
ReplyDeleteనీ గత జ్ఞాపకాల ప్రతిమనై
అనురాగ రాగ రంజితనై
వేచి చూడనా యుగయుగాలు.
నీవు పరిచిన అంపశయ్య మీద నేను
ReplyDeleteనీ జ్ఞాపకాల బాణపు గాయంతో
నిరీక్షణ ఎంత బాధాకరమో అంత ప్రేమోద్దీపనం...అదిరింది.
cute one.
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeletea different attempt..good
ReplyDeleteనీవు పరిచిన అంపశయ్య మీద నేను
ReplyDeleteనీ జ్ఞాపకాల బాణపు గాయంతో
Its wonderful!!
ReplyDeleteఅందరికీ ఒకటే మాట - ఏమిటీ దుస్సాహసం అనకుండా భీష్మాచార్యులవారిని పలుచన చేయని నా ఈ ప్రయత్నాన్ని హర్షించి చక్కని స్పందన ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడివిడిగా చిరు పలుకులు...
ReplyDelete@చిన్ని, "కలవరమాయే మదిలో" పాడేసారా మరి? ;) అనుభూతి అన్నది హృదయానికి సంబంధించినది అది గమనించినందుకు థాంక్స్.
@భా.రా.రె. అంతేనండి అపరంజి బొమ్మ జ్వాలాముఖిగా తోస్తే ఇవే వెలువడతాయి. ఇక్కడ తేడా తమరి గోడు తమరే పద్యంగా వ్రాసేస్తారు. నాది ఇరుపక్షాలా ఒకటే కలం.
@అశ్వినిశ్రీ, సుజ్జి, రాధిక, పద్మార్పిత, నేస్తం, వేణు గార్లు, నాక్కావాల్సింది అదే. క్రొత్త ప్రయోగానికి మీ ఆమోదం.
@విజయమోహన్ గారు, మీ కన్నయ్య నడిగి చెప్తారా నా కన్నయ్య జాడ? :)
@రవిగారు, పునరాగమనానికి, మీదైన చమత్కారంతో పూరించినందుకు థాంక్స్.
@ప్రదీప్, మీనుండే కాస్త అభ్యంతరం రావచ్చనుకున్నాను. :) హమ్మయ్యా!
@వర్మ, సగకాలం ఈ వరసే. విలాపం ఆ వెన్నంటి విలాసం. మీకు తెలియనిదా ఈ కవితల పోకడ.
భీష్ముడు-ప్రేమ... మీరు నవలా సాహిత్యం వైపు అడుగేస్తే బాగుంటుందేమో ఆలోచించండి..
ReplyDeletevery nice madam..!!
ReplyDeleteమురళి, తృష్ణ, భీష్మ - అంబ కథ తెలుసు కదండి. ఆమె ప్రేమని నిరాకరించి ఆమెలో పగని రగిల్చి చివరికి మరణశయ్య మీదకి చేరినపుడు వ్యాస మునీంద్రుల వారి కథ - కృష్ణుడు ధర్మ రాజుతో రావటం, అతనికి విష్ణుసహస్రనామాలు ఉపదేశించటం, భగవానుడు ఆమోదించటం. అది నేను, శిఖండిగా మారిన అంబ కారణంగానే అంపశయ్య మీదకి చేరిన భీష్ముని మానసాన, తనలో తన స్వగతం, అంబ పట్ల కలిగిన ప్రేమగా వర్ణిస్తూ, పనిలో పనిగా నా "తనకి" సందేశంగా ఈ కవితని వ్రాసి పడేసానన్నమాట. ఒక దెబ్బకి రెండు పక్షులు. ఎవరూ అభ్యంతరపెట్టలేదు కనుక .... :) నెనర్లు.
ReplyDeleteమురళీ గారు, కథారచన మీ అభినందనతో సాగిస్తానిక మరి. కృతజ్ఞతలు.