విశ్వామిత్ర ౩ - చూపులు కలిసిన శుభవేళ
సుమారుగా ఏడేళ్ల క్రితం విశ్వ డైరీలో ఓ పేజీ:
ఈ రోజు తను మళ్ళీ కనపడింది. విష్ణు ఇంటిలో పునర్దర్శనం. చాలా ఆనందంగా వుంది. మొదటిసారి చూసినపుడు అక్క పెళ్ళి సందడి. ఎవరు ఎవరన్నది తెలియదు, కానీ మళ్ళీ చూడాలనిపించే ఆ నవ్వుతో అంతమందిలోను ఒక్కసారిగా ఆకర్షణలో ముంచేసింది.
మొదటిసారి నా మొహమాటం మీద నాకు కోపం వచ్చింది, తనని గురించి కనుక్కోకుండానే పెళ్ళి అయిపోయింది. కొన్నిరోజులు గుర్తుకు వచ్చేది. మర్చిపోయానా, మర్చిపోవాలని ప్రయత్నించానా నాకు తెలియదు, కానీ ఇన్నిరోజులకి ఇంత హఠాత్తుగా కలవటం.
"మిత్రవింద"
క్రొత్తగా వుంది పేరు. అక్కకి వరసకి పినమావగారి అమ్మాయట. సల్వార్ కమీజ్ లో కాజువల్ గా వుంది. వుంగరాల జుట్టు మొహమ్మీద పడుతుంటే అలవోకగా వెనక్కి సర్దుకుంటూ సన్న గొంతుతో మాట్లాడుతూ ఓ ప్రక్కగా వొరిగి కూర్చున్న తనని ఒక్కసారి తలెత్తి చూసానా? గడ్డం మీద పుట్టుమచ్చ. మాట్లాడేప్పుడు గడ్డం క్రింద చిన్న చొట్ట. ఎందుకో కళ్ళలోకి చూడలేకపోయాను. బిడియస్తుడు అనుకుందేమో. మళ్ళీ కలవాలని వుంది. కళ్ళలోకి చూడాలనివుంది. ఇదేమి భావన. ప్రేమ అంటారు ఇదేనా.
********************************************************
విశ్వ డైరీలో ఆ పేజీ వ్రాసిన కొద్దిరోజులకి ఓ ఆదివారం. మధ్యాహ్నం భోజనానికి వచ్చింది మిత్ర. విష్ణు అమ్మగారు వర్ధని గారికి వండటం, వడ్డించటం రెండూ ఇష్టమే. సాయంత్రం ఆరు అయినా ఇంకా ఎండతీవ్రత తగ్గలేదు. వర్ధని గారు ఇచ్చిన సన్నజాజులు, ఉప్మా డబ్బా తీసుకుని "వస్తానండి" అంటూ గుమ్మం దాటింది. తోడుగా వస్తున్న విష్ణుతో నెమ్మదిగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా వూర్లు తిరిగే ఉద్యోగం మూలంగా ఇంటిపట్టున వుండటం తక్కువతనికి.
"మిత్ర! విస్సు పరిచయం అయ్యాడట. అమ్మ చెప్పింది. నిదానస్తుడు కాని మంచివాడు. ఏ సహాయం కావాలన్నా మొహమాటపడకు. పైగా మీకు బంధుత్వం కూడ వుంది. అమ్మకి చాలా చేదోడువాదోడుగా వుంటాడు. వాడి మూలంగానే అమ్మ ఆరోగ్యం తక్కువైనా నేను అలా నిశ్చింతగా తిరగగలుగుతున్నాను."
"ఫర్వాలేదు విష్ణు. అలవాటైపోయింది. ఆఫీసులో పరిచాయాలు అవుతున్నాయి. ప్రక్క వీధే కదా. మీ అమ్మగారు వుంటారు. అయినా చిన్న పిల్లనా" నవ్వేస్తూ అంది మిత్ర.
"ఇంకేంమిటి కబుర్లు." విష్ణు మాట పూర్తయ్యేలోగానే మిత్ర వడివడిగా ముందుకు నడిచి క్రింద పడిన ఓ చిన్నారిని లేవనెత్తి, బుజ్జగిస్తూ కనపడింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇంతే. ఎలా అలవడింది ఇంతగా ఒకరికోసం ఆలోచించే తీరు. ఎంత గారంగా పెరిగినా అంత అణకువ అని అమ్మ ఎన్నిసార్లు అంటుందో.
"సుబ్బాల్ని నాకు తోడుగా పంపుతున్నారు. తాత గారు వద్దన్నా వినిపించుకోవటం లేదు. వచ్చే వారం వెళ్ళినపుడు నాతో తీసుకువస్తాను" మాటల్లోనే మిత్ర అద్దెకి తీసుకున్న ఇంటికి చేరారు. "విస్సుని కూడా కలవాలి. ఇక వెళ్తాను మరి" అంటూ గుమ్మం లోంచే వెనక్కి తిరిగాడు.
********************************************************
మరొక నెలా నెలన్నరకి, ఈ సంఘటన జరిగింది.
కాలింగ్ బెల్ మ్రోగుతుంటే చదువుతున్న పుస్తకంతోనే వెళ్ళి తలుపుతీసింది. ఎదురుగా విస్సు. "విష్ణు చెప్పాడు, కంప్యూటర్ లో ఏదో ప్రాబ్లం అన్నాడు" తడబడుతున్నట్లు, కళ్ళు దించుకునే అన్నాడు. ప్రక్కకి జరిగి "రండి" అంటూ లోనికి దారి తీసింది.
దాదాపు గంట పట్టింది అతనికి ఫిక్స్ చేయటానికి. పొడి పొడి మాటలు. మధ్యలో "ఇఫ్ యు డోంట్ మైండ్" అంటూ గది బయట పిట్టగోడనానుకుని సిగరెట్ కోసం ఓ పది నిమిషాలు గడిపాడు. ఒకసారి కాఫీ కలిపి ఇచ్చింది. దుస్తుల మీద శ్రద్ద తక్కువనుకుంట. నలిగిన టీ షర్ట్. మాచింగ్ సరిగ్గాలేని పాంట్. నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు. సాదాసీదాగా వున్నాడు. నిజానికి ఏ ప్రత్యేకత కనపడలేదతనిలో.
తనే మాటలు కలపటానికని వివరాలడిగింది. విశ్వనాథ్ అట. పేరు మాత్రం నచ్చింది. అనంత వదినకి ఇతనికి అసలు రూపులో కానీ, మాట తీరులో కానీ పోలికే లేదు. అతను వెళ్ళిపోయాక నాలుగు అగరవత్తులు వెలిగించింది.
********************************************************
అదే రోజు రాత్రి సుమారు 11 గంటలకి కిటికీ ప్రక్కగా కూర్చుని ఆకాశాన్ని తదేకంగా చూస్తూ కాసేపు గడిపాక, మిత్ర తన ప్రాణమిత్రురాలు నవీ(న)కి ఉత్తరం వ్రాయటం పూర్తిచేసి, బద్దకంగా వళ్ళు విరుచుకుని మళ్ళీ ఒక్కసారి చదివి చూసుకుంది.
నవీ,
ఎలా వున్నావే? అప్పుడే నేనీ వూరు వచ్చి మూడు నెలలై పోయింది. మన మధ్య ఉత్తరాలు తగ్గిపోతున్నాయి కదు. వ్రాసే తీరిక లేదా అని నిష్టూరాలాడకు. క్రొత్త ప్రదేశం, ఒంటరి జీవితం ఇలా ఒకటొకటి అలవాటు కావాలి కదా?
విష్ణు గురించి మునుపటి ఉత్తరంలో వ్రాసాను కదా. వాళ్ళ అమ్మగారు వర్ధని ఆంటి నాకు చాలా నచ్చారు. ఇద్దరం బాగా కలిసిపోయాం. ఉదయాన్నే యోగా చేస్తున్నాము. వంట నేర్పుతున్నారు. విష్ణు స్నేహితుడు విస్సు పరిచయం అయ్యాడు. విశ్వనాథ్ అసలు పేరు. మా రాఘవ చిన్నాన్న గుర్తున్నారా? నాకు లోకల్ గార్డియన్. వాళ్లబ్బాయ్ దేవేంద్ర అన్నయ్యకి బావమరిది. ఆఫీసులో శోభ, అమృత కాస్త పరిచయమైన వారిలో నేను చనువుగా మెలిగేది. కోటేష్ అని వున్నాడు. కాస్త విసిగిస్తున్నాడు.
మనిద్దరం కలిసి పుస్తకాలు చదివేవాళ్లం, కాసేపు అందులోని పాత్రల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు నాకు అవి, వాటికి నేను తోడు. సుమతి మేడం మాటలు ఇంకా నన్ను వదలలేదు. అలా అని అప్పుడే పెళ్ళికి మానసికంగా సిద్దంగా లేను. నిజానికి ఆ విషయం గురించి అప్పుడే ఆలోచించాలనిలేదు.
నీ విషయాలతో వ్రాయి.
-మిత్ర
Subscribe to:
Post Comments (Atom)
కధను ఫ్లాష్ బాక్ కింద చెప్పడంలో ఉన్న సమస్యే ఇది. రచయితకు స్వాత్రంత్యం పోతుంది. ఫ్లాష్ బాక్ ఎవరు చెప్తున్నారో లేదా ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళ దృష్టిలో నుంచి మాత్రమే చెప్పాలి.
ReplyDeleteఇక్కడ గతం చెప్తున్న డైరీ విశ్వ రాసాడు, మొదటి పేరా తప్పిస్తే మిగిలిన సంఘటనలు చెప్తున్నది (లేదా చూపుతున్నది) మిత్ర. ఈ ఒక్క విషయం తప్పిస్తే నాకింకేమీ ఫిర్యాదులు లేవు.
ఇది విశ్వామిత్ర డైరీనా ?
ReplyDeleteమిత్ర డైరీనా ? అర్ధము కాలేదు.
కాని సింపుల్ గా చూపులు కలసినవేళ బాగుంది.
usha I couldnt comment in telugu. Story is good. I heard the karma siddaantam from saankhya yOgam (chapter 3) in gita class, our mastar is explaining to a question "if every thing is predetermined then why do we have to work and act up on" he said " you dont have a choice for not making choice" tha nature law will bring you to the situation, but in this nature only human has the power to make choices by thinking, when u make choice then the nature laws applies... I remembered that when I see the relation between them...
ReplyDeleteWaiting for the next post!
ReplyDeleteకొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉన్నా బాగుంది...waiting for the later parts..!
ReplyDeleteభావనగారూ, మీ వ్యాఖ్య బాగుంది.
The narration is good even-though it's not racy. I have so many doubt. I agree with "మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్" garu.
ReplyDeleteనాకేవో దౌట్లున్నాయని కథ బావోలేదని అనను. బావుందో లేదో చెప్పాలంటే ఇంకా కొన్ని వాయిదాలు చదవాలి కదా. :-)
Congrats on crossing 30000 hits. :-) మీ టపాలనంత తేలికగా "మరువం" అని జనం చెప్పటానికిదో గుర్తు.
ReplyDeleteకథ ఆహ్లాదంగా ఉంది. మీ భావుకత షరా మాములే, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. చెప్పే విధానం బాగుంది. కాకపోతే కథ ముందుకి వెనక్కి ఊగుతుంటం మూలానేమో ఏ భాగానికి ఆ భాగం చదివితే ఓ పట్టాన అర్థం కాదు.
ReplyDeleteఅక్కడక్కడా వాక్యనిర్మాణం కొంచం చూసుకోండి, మీ రచనకి ఇంకా అందం వస్తుంది. వాక్యాల మధ్య కాస్త ఖాళీలుంచండి చదవటానికి బాగుంటుంది.
"పుస్తకాలు ఇద్దరం కలిసి చదివేవాళ్ళం. కాసేపు అందులోని పాత్రల గురించి మాట్లాడుకునేవారం"
ఇక్కడ పుస్తకాలు ఎవరు కలిసి చదివేవాళ్లు.....మిత్ర, నవి(బహుశా నవీన)నే కదా!
ఆ వాక్యం ఇలా ఉంటే బాగుంటుందేమో!
"మనిద్దరం కలిసి పుస్తకాలు చదివేవాళ్లం, కాసేపు అందులోని పాత్రల గురించి మాట్లాడుకునేవాళ్లం"
మీ టపాల ఫాంటు(సైజు కాదు)చదవటం కళ్లకి కాస్త ఇబ్బందిగా ఉంది, కాస్త దాన్ని మార్చకూడదూ!
ఇన్ని సూచనలా అనుకోకండి. విమర్శ అని మాత్రం అసలు అనుకోకండి:)
స్పందించిన మీఅందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ జవాబు ఈ వ్యాఖ్యలో వుంచటానికి ప్రయత్నిస్తున్నాను. ఇకపై రానున్న వాయిదాలకి ఈ సద్విమర్శలు నాకు చాలా దోహదపడతాయి.
ReplyDelete@భావన, నాకు కర్మసిద్దాంతమ్మీద చాలా గురి. మీ మాటలు సరిగ్గా ఈ తొలికలయిక మీద రావటం యాదృఛ్ఛికం మాత్రం కాదు అని నా మనసు నమ్ముతుంది. ప్రత్యేక కృతజ్ఞతలు.
@ప్రదీప్, @గీతాచార్యా, బహుశా నేను ముందు భాగం విశ్వ పరంగా --- "మా కథ మళ్ళీ చదువుకోవాలనుంది." వెనక్కి వాలి పడుకుని బెడ్ ప్రక్కన చెస్ట్ నుండి పాత డైరీ చేతిలోకి తీసుకున్నాడు --- అని ముగించటం ఇలా మీరు అనుకోవటానికి దారి తీసిందా? కథని అతని పరంగా చెప్పాలనుకోలేదు. ఇద్దరి వైపు నుండి జరపాలనుకున్నాను. మొదటి కసరత్తు కదా, కాసిని ఇలా ఢక్కామొక్కీలు తప్పవేమో. నిజానికి ఈ రచన ఓ ఓటమిగానే అంగీకరించాల్సివస్తుందేమో. నా పరిధి స్వీయానుభవంలోకి వస్తుంది.
@మాలాగారు, తృష్ణ, మీరన్న దానిపై దృష్టి పెడతానికి ప్రయత్నిస్తాను. ఇలా సరిదిద్దుతూ వుండటం మానకండి.
@సునిత, సృజన, నెనర్లు.
@సిరిసిరిమువ్వ, చాలా చాలా థాంక్స్. అభిమానం వుండబట్టే కదండి ఇన్ని సూచనలు ఇచ్చారు. తప్పక పాటిస్తాను.
ప్రోధ్బలం తనదైనా మీ అందరి ప్రోత్సాహం లేనిదే ఈ బండి లాగలేను. ఏ మాటకామాటే ఈ రచనా ప్రక్రియ నాకు ఇష్టమైన కష్టాన్ని, అందులోని సుఖాన్ని, సంతృప్తి ఇలా అన్నీ మిళితిమైన అనుభవం.
hmm విశ్వ గారిది Love at first sight అనమాట, అయితే ఆకర్షణే నా... అగరొత్తులు బాగున్నాయ్ :-) చాలా సున్నితంగా చెప్పారు. ఒకో భాగానికీ ఒకో శీర్షిక కూడా ఆసక్తి కరం గా ఉంది.
ReplyDeleteఇప్పుడు జల్లెడ లొ కూడా అదే పరిస్థితి మిగతా అందరికి 25% మరువానికి మాత్రం 75% వాటా..అన్యాయం :)
ReplyDeleteనాకు అయితే మెమొంటో మూవి లా పాత టపాలను తిరగేసా..flashback కి వెళ్ళాల్సి వచ్హింది..
@ హరేకృష్ణ, ఇది మరీ అతిశయోక్తండి. అసలే ఎరక్కపోయి నేనిరుక్కుపోయానిక్కడ. :) Thanks for the implied compliment.
ReplyDeleteవేణు గారు, స్త్రీ, పురుష తత్త్వాల్లో ఇదొకటి స్పష్టమైన తేడా అని నా అభిప్రాయం. స్వానుభవం. ఆకర్షణగా మొదలై అనురాగానికి దారి తీయొచ్చేమో కానీ అకారణ సాన్నిహిత్యం సాధ్యమంటారా? ఈ మధ్య సైకాలజీ మీద వచ్చిన ఓ శీర్షిక కూడా దీన్నే బలపరిచింది. There could be some out liers on both sides. I just took the most common trend that I observed. No one can deny the role the physical looks play in a relation or in an encounter at least to some extent. My intent is not to present Viswa any inferior to Mitra. Just a striking difference in their personalities alone. He is very sensitive and she is first love and only love! Thanks.
ReplyDeleteఉష గారు, పాఠకులు ఇచ్చిన సూచనలను వెంటనే అమలు పరచి మరింత ఆహ్లాదకరంగా వ్రాస్తున్నందుకు అభినందనలు. రాత్రి కాస్త కష్టపడి చదివినా ఈ ఉదయం ఇంత స్పష్టంగా ఉండటం చూసి మళ్ళీ ఒకసారి చదివాను :-)
ReplyDeleteఅయ్‍బాబోయ్..నేను "అయితే ఆకర్షణే నా" అన్న మూడు మాటలకి ’అహనాపెళ్ళంట’ లో నూతన్ ప్రసాద్ ఆటో బయోగ్రఫీలా అంత వివరణ ఇచ్చేశారేమిటండీ బాబు. ఇది మీకథ, మీరు రాస్తున్నది నేను అలానే చదువుతాను ఇందులోని భావాలు నా అభిప్రాయాలతో కలవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక నా వ్యాఖ్య, విశ్వ ని అర్ధం చేసుకునే ప్రయత్నం లో పైకే అనేసిన నా స్వగతం మాత్రమే.
ఇక స్త్రీ పురుష తత్వాలు అంటారా... there could be some outliers అని ముందే నా చేతులు కట్టి పడేశారు :-) కాకపోతే రాన్రాను ఈ outliers ఎక్కువ అవుతున్నారు అనుకుంటున్నాను :-) ఆకర్షణ తో మొదలవడం అన్నది common trend కరెక్టే లెండి. కానీ భౌతిక ఆకర్షణ తో ప్రమేయం లేకుండా, పరిస్తితుల ప్రభావం వలనో, అభిరుచులు కలవడం వలనో మొదలైన సాన్నిహిత్యం తో ఒకరినొకరు తెలుసుకునే కొద్దీ వ్యక్తిత్వ ఆకర్షణ కు గురై ఒక్కటైన ప్రేమ కథలూ చాలా ఉన్నాయ్.
మలుపులు బా తిప్పుతున్నారు :)
ReplyDeleteనిన్న రాత్రి చూసి, ఏ కలర్ కోడింగో మధ్యలో నాలుగు నక్షత్రాలో పడేస్తే బావుండు అనుకున్నాను, ఇప్పుడు చూసేసరికీ మీరు బోల్డు పెట్టేశారు...పెద్దగా ఆలోచించకుండా అలా చదువుతూ వెళిపోవడానికి బావుంది...
వేణు గారు, మళ్ళీ మళ్ళీ రావాలిలాగే! TIA, a.k.a Thanks In Advance ;) మూడే విషయాలు
ReplyDelete(1) నిజంగా హాప్పి.... :) మీరు ఇప్పటి నుండి స్వగతాన్ని మరింత గట్టిగా బయటకి అనేయాలని నా మనవి. jokes apart నాకు మీ అభిప్రాయాలు కావాలి. ఇక విశ్వకి కొంచం టైం ఇద్దాం. ఇది కథే కానీ వాస్తవ-కల్పనల కలగలుపు. కొంత తడబాటుతో, మీరంతా సరిదిద్దుతుంటే లాగేస్తాను మరి బండి.
(2) స్త్రీ పురుష ఆలోచనల సారూప్యం, వైరుధ్యం భావసామీప్యం, స్పందనలు అనుభూతుల్లో కొట్టొచ్చే తేడాలు నాకు కేవలం ఇద్దరితోనే చర్చించిన అనుభవం, ఓక్రు తను, రెండొది నా మిత్రరాలు. మిగిలినది పుస్తకల్లో చదివినదే. మీ కోణం బాగుంది.
(3) "అహ నా పెళ్ళంటా" డి వి డి పంపుతారా? ఏమిటో పాదరసంలో కుంకుడురసం కలిసినట్లుంది. ఒక్కాసారె అదీ 12 సం. క్రితం చూసాను. కోట కోడిని ఎదురుగ పెట్టుకుని భోజనం చేసే సీన్, రాజేంద్ర ప్రసాద్ అగ్గిపుల్లలు ఏరటం, ఆగిన బస్సుల్లో వారికి టి, కాఫీలు అమ్మే కోట, బ్రహ్మానందాల్ని చూసి చొక్కా చింపుకుని వెఱిఱిగంతులు వేసే సుత్తి వీరభద్రరావు మాత్రం గుర్తున్నారు. :)
My detailed reply must convey to you howmuch I value a comment and specifically a candid one. Maruvam must be a overloaded term that you should always see you don't "maruvam" :) +ve selfishness sir.
నేను బంగారం, మలుపులు తప్పవుగా కథకైనా, జీవితానికైనా. sure I won't let you down and make you feel you wasted time here. :) నిదానంగా బాణీలోకి వస్తున్నాను. ఓ న మా లు రానివాడు వేదం చదివిన తీరు అనుకోండి. సిరిసిరిమువ్వగారు, మరొక ఇద్దరు చెప్పాకనే ఈ font issue తెలిసింది.
ReplyDeleteఉషా ఎంత తొందరగా మార్పులు చేసేసారు! మీరు మీ మరువపు వనాన్ని ఎంత ఆపేక్షగా చూసుకుంటున్నారో తెలుస్తుంది. ఇప్పుడు కళ్లకి సుఖంగా మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంది.
ReplyDeleteసిరిసిరిమువ్వ గారు, నా ఈ అల్లుకుపోయే తత్వం నాకే ఒక్కోసారి వెరపు కలిగిస్తుంది. నా సిల్కుదుప్పటి ఎంత ఇష్టమో ఇప్పుడు మరువం అంత ప్రియమైపోయింది. :) మీరన్నట్లు ఏదో గాఢమైన అపేక్ష. మళ్ళీ తొంగిచూసినందుకు ఆనందం.
ReplyDeleteఉష గారు :-) నా అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తాను.
ReplyDeleteఅహనాపెళ్ళంట డివిడి పంపించ లేను కానీ ఇక్కడ ఆన్లైన్ లో చూడచ్చు ప్రయత్నించండి. server1 కింద part1 and part2 అన్న లింకు లు బాగానే పని చేస్తున్నాయ్. మంచి సీన్స్ గుర్తు పెట్టుకున్నారు :-)
sorry ఇందాక లింక్ మరిచాను. http://www.123onlinemovies.com/2007/07/aha-naa-pellanta.html
ReplyDeleteచాలా సంతోషం వేణు గారు. త్వరలో చూస్తాను.
ReplyDeleteఇప్పటి వరకు జరిగిన భాగాలన్నీ చదివేశానండీ.. బహుశా మీరు మార్పులు, చేర్పులు చేయడం వల్లనేమో ఫిర్యాదులేమీ లేవు.. నాక్కూడా 'నాలుగు అగరొత్తులు వెలిగించడం' బాగా నచ్చింది.. నాయికా నాయకులు బావామరదళ్ళేనన్న మాట :-) ఇందాక భీష్మ ఏకాదశి టపాకి మీరు నవల రాస్తే బాగుంటుందని వ్యాఖ్య రాశా.. ఆల్రెడీ మొదలు పెట్టేశారని తెలియక... ఆసక్తికరంగా ఉంది కథ.. కొనసాగించండి...
ReplyDelete@ మురళీ గారు, క్రొత్త వూర్లో ఓ నలుగురు పరిచయమయ్యాకనో, పూర్వాశ్రమంలోని పరిచయస్తులు కనపడ్డప్పుడు కలిగే భావన మీ వ్యాఖ్య చూస్తే. మీకు తెలియనిదటండీ నాది కవితా బాణీ, ఈ కథారచన కాస్త కుస్తీయేనని. :) అభినందించినందుకు చదివి ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు. చివరి భాగం వరకు వ్రాయించే భారం మీవంటి పాఠకులదే [అని నా మనవి!].
ReplyDelete