విశ్వామిత్ర 1- మాటే మంత్రము

డిశంబర్ మాసం. అమెరికాలో చలి ఎక్కువగా వుండే ఓ స్టేట్, భారతీయులు అంతగా వుండని ఓ వూరు, ఆ అపార్ట్మెంట్స్ లో విశ్వది రెండవ అంతస్తులో సింగిల్ బెడ్ రూం అపార్ట్మెంట్. శనివారం సుమారు ఉదయం 8 గంటల సమయం. ప్రక్క మీద అటునుండి ఇటు బద్దకంగా దొర్లిగింత వేసిన విశ్వ, కంఫర్టర్ తిరిగి సర్దుకుంటూ యధాలాపంగా ఫొన్ వంక చూసాడు. వాయిస్ మెసేజ్ వున్నట్లుగా బ్లింకింగ్. బహుశా మిత్ర చేసివుంటుందనుకుంటూ చేతిలోకి తీసుకుని, అలాగే వెనక్కి వాలి మెసేజ్ విన్నాడు.


"విశ్వ, ఉదయం 6 కి రమ్మన్నాను గుర్తువుందా?" మిత్ర గొంతు వినగానే ఒక్కసారిగా నిటారుగా లేచి కూర్చున్నాడు. బుధవారం సాయంత్రం చెప్పింది, ఒక ముఖ్యమైన విషయంవుంది శనివారం ఉదయం కలుద్దాం అని. సాధారణంగా తన ఫ్లాట్కి రావటానికి ఇష్టపడదు, అలా కాస్త బయట తిరిగినట్లువుంటుందని ఆర్చిడ్ దగ్గర కలుస్తుంది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట నడిచాక ఆమె ఇంటికి వెళ్ళటం, ఫిల్టర్ కాఫీ తాగితను వెనక్కి రావటం పరిపాటి. అలాగని కలవటం తక్కువే. ఇద్దరివీ భాధ్యతాయుతమైన పదవులు, తీరిక తక్కువ. ఇలా ముందుగా చెప్పి కలవటం అలవాటే. దాదాపు తను మరిచిపోవటం మిత్ర సత్య మాదిరి చిరు అలకలు పోవటం ఇదీ మామూలే.


"ప్చ్ ఈ చలిలో వచ్చి 2 గంటలు వేచివుంటుంది. ఎలా మర్చిపోయాను" స్వగతంగా అనుకుంటూ చక చకా బ్రష్ ముగించి, స్నానం వచ్చాక చేద్దాం అనుకుంటూ, కాస్త పెరిగిన గడ్డం చూసుకున్నాడు. పోయిన వారం మిత్రని కలిసినపుడు ఎంత సున్నితంగా చుంబించినా తన గరుకు గడ్డం ఆమె పసిమి బుగ్గమీద ఎర్రని గుర్తు వదిలింది. ఒక క్షణం తటపటాయించి, కార్ తాళాలు, వాలెట్ అందుకుని బయటకి నడిచాడు. ఈ హడావుడిలో సెల్ తీసుకోవటం మరిచిపోయాడు.


కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి చేరగనే ఒకసారి ఫోన్ చేస్తేనో అనుకుంటూ పాకెట్ లో చేయి పెట్టగానే గుర్తుకొచ్చింది సెల్ వదిలేసానని. సరే కానీ ఎలాగూ చీలి రాకాసి ముందుగా అలకలు తీర్చనిదే మాట్లాడదెలాగు అనుకున్నాడు. ఇద్దరివీ so predictable behaviors. I love you Mitra.... రేడియోలో వాతావరణం వింటూ డ్రైవ్ చేయటం మొదలు పెట్టాడు.


***********************************************************************

5 మైళ్ళే అయినా మంచు కురిసిన కారణంగా అక్కడకి చేరేసరికి 20 నిమిషాలు పట్టింది. పార్కింగ్ లాట్ లో అక్కడక్కడా మాత్రం కార్స్, అన్ని కలిపి ) 10 వుంటాయి. ఓ మూలగా వున్న మిత్ర కార్ ప్రక్కగా తీసి ఆపాడు. డోర్ తీసుకుని దిగి, తన కార్ దగ్గరకి వెళ్ళి, విండో మీద చేయి వేయబోయి ఆగిపోయాడు. తనకిష్టమైన నల్ల చీర, తలస్నానం చేసినట్లు ఆరీ ఆరని కురులు, చిన్న బొట్టు, బ్లాక్ పెర్ల్ డ్రాప్తో సన్న గొలుసు, చేతికి వాచ్. సాధారణంగా చెవులకి ఏమీ పెట్టుకోని తను, ముత్యాల జుంకీలు వేసుకుంది. ఆ మధ్యనే చెప్పాడు తను, పొడుగాటి లోలకులు నీకు బాగుంటాయి అని.


కళ్ళు మూసుకుని సన్నగా తల వూపుతూ పాటలు వింటూ కొద్దిగా సీట్ సరిచేసుకుని వెనక్కి వాలి వుంది. కొద్దిగా ఆశ్చర్యమనిపించింది, వాకింగ్ చేయనపుడు ఇంత ఉదయానే ఇక్కడికి ఎందుకు రమ్మందో అని. అలాగే తదేకంగా చూస్తూవుండిపోయాడు. ఆమె మొహంలో ప్రశాంతత యోగినిని గుర్తు చేస్తుంది. ఇపుడు తనని చూస్తే ఆ కళ్ళు కొద్దిగా అరుణిమ దాలుస్తాయి అంతకు మించి ముక్కు ఎర్రబడుతుంది, అతని పెదాలపై చిలిపి నవ్వు కదలాడింది, మాటలు కూడా సిద్దం చేసుకునేంత సమయం ఇచ్చి మరీ వచ్చాడు.


"నా లేత బంగారు" మురిపంగా అనుకుంటూ సన్నగా శబ్దం చేసాడు. ఉలిక్కి పడినట్లుగా సన్న కదలిక, కనులు తెరిచి చిర్నవ్వుతో కార్ తెరుచుకుని దిగింది. కుడిచేతి గుప్పిట్లో ఏదో వున్నట్లు బిగించి పట్టుకుంది. సన్నగా వణుకుతూ అతని చేరువకి వచ్చింది, తన కోట్ బటన్స్ తీసి ఆమెకీ కలిపి చుట్టి పొదివిపట్టుకుని నుదిటి మీద చిన్న ముద్దు అద్దాడు. నెమ్మదిగా అతని కుడిచేయి తన చేతిలోకి తీసుకుని, గుప్పిట విప్పి అతని చేతిలో ఏవో పెట్టి చలికి సన్నగా వణుకుతున్న గొంతుతో మిత్ర అడిగిన మొదటి మాట "మన బంధాన్ని శాశ్వతం చేసుకుందామా, కన్నా?" అంత చలిలోనూ అతని మొహం మీడ వేడి ఉద్వేగపు తాలూకు ఆవిరి, గుప్పిట విప్పి చూస్తే, ఒక పగడం, ముత్యం, చిన్న నల్ల పూస వున్నాయందులో. వెంటనే గుర్తువచ్చింది, తనకి ప్రాణమైన నానమ్మ మంగళ సూత్రం నుండి చివరి గుర్తుగా మిత్ర దాచుకున్నవవి. మిత్ర ఆ పిలుపు తన మీద ప్రేమాతిశయం అధికమైనపుడే "కన్నా" అని సంభోదిస్తుంది.


"అమ్మలూ, ధన్యుడిని రా, ఈ జన్మకిది చాలు నాకు.." విశ్వ మాట తడబడుతూ అక్కడే ఆగిపోయింది. "మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం" చుట్టూ మంచుతో కప్పబడిన చెట్లు మంత్రాలు జపిస్తున్నాయి, ఆ జంటని దీవిస్తున్నాయి.


***********************************************************************

ఆ రాత్రి విశ్వ డైరీలో పుఠని నింపిన మాటలివి. "మిత్ర, నేను ఈ ఉదయం కలిసాం. తనకి ఇష్టమైన సూర్యోదయపు వేళలో, ఒకరిలో ఒకరం ఒదిగున్నపుడు సన్నగా చలికి వణుకుతూ, తానడిగిన మాట "మన బంధాన్ని శాశ్వతం చేసుకుందామా, కన్నా?" ఈ ఒక్క మాట నాకు పూర్తిగా అర్థం అయింది.

అపరిచితులుగా, విభిన్న మనస్తత్వాల మేము స్నేహితులమవటం, ఐదేళ్ళ సహవాసం, ఒకరి మనసులోకి మరొకరి పయనం. This journey has brought us so close and bridged the gap కవితలల్లే తన ఆవేశం, మాటలు వెదికే నా ఆలోచనలు, క్రమేణా నాపై తన ప్రభావం, She had taught me the way to look at things. అన్నీ వెరసి ఈ మధుర క్షణం. ఈ నిమిషాన విశ్వ విజేతనయిన ఫీలింగ్. మిత్ర రూపుదిద్దిన నా వ్యక్తిత్వం, నాకు నన్ను క్రొత్తగా పరిచయం చేసిన తీరు ఇంకా నమ్మలేనట్లుగా వుంది. లోకం కొత్తగా కనిపిస్తుంది, మనుషులు కొత్తగా కనిపిస్తున్నారు. ఇన్ని మార్పులకి కారణమైన నా బంగారుకి కూడా తెలియని సత్యం ఈ నా డైరీ. మా కథ మళ్ళీ చదువుకోవాలనుంది." వెనక్కి వాలి పడుకుని బెడ్ ప్రక్కన చెస్ట్ నుండి పాత డైరీ చేతిలోకి తీసుకున్నాడు.

[సశేషం]

46 comments:

  1. ఇటివలే పరిమళంగారు తమ ముచ్చటైన పెళ్ళి కధను సిరియల్ గా రాసి పాఠకులందరినీ ఉత్కంఠంలో ముంచివేసారు..మీరు కూడా ఆ బాటలోనేనా..
    మొదలే రమ్యంగాఉంది..ఇక ముందు ముందు ఎంత బాగుంటుందో..

    ReplyDelete
  2. తృష్ణ, ఏమిటండోయ్ ఇలా పొరబడ్డారు? ;) ఒక్కసారి దీని ముందు టపాలు రెండూ చదివిరండి మేడం... విశ్వనాథ్, మిత్రవింద - ఈ ఇద్దరి కథే నా "విశ్వామిత్ర". ఎంత కల్పనో, ఎంత వాస్తవమో మీ మీ వూహకే వదిలేస్తున్నాను సుమా!

    ReplyDelete
  3. మీ కల్పనా కథ మేమూ చదువుతున్నామండీ :)

    ReplyDelete
  4. ఇలా సస్పెన్స్ కథలు చెప్తే ఎలా మేడం గారు..వాస్తవమైతేనేం కల్పనైతేనేం బాగా రాస్తున్నారు 'రమ్యంగా'.....నిజమే ప్రేమ ఎక్కువైతే,కన్నా ,చిన్న ,బంగారం వచ్చేస్తాయి,మీ కథల్లో లాగ -:)

    ReplyDelete
  5. మరువంలో కధలా?
    బావుంది
    మంచి ప్రయత్నం :)
    eagerly waiting for next part

    ReplyDelete
  6. ఈ రోజు కధ చదివేసాను కదా!:)

    ReplyDelete
  7. ఈ వేచి వుండడం నావల్ల కాదు బాబు....మీరిలాగే రాస్తూ ఉండండి, నేను నెల తరువాత పుస్తకంలా చదువుకుంటా :)

    ఇంతకీ కధకి మొదలు ఇదా లేక మిత్రవింద కవితా....?

    ReplyDelete
  8. ఇంక రోజూ మీ బ్లాగ్ చూడాల్సిందే...వదలనుగా:)

    ReplyDelete
  9. నేను చిన్ని గారితో ఏకీభవిస్తున్నా!!!

    ReplyDelete
  10. ఊఁ హృద్యంగా బాగుంది. కాకపోతే నాకు ఇంత సున్నితత్వం అన్నిసార్లూ పడదు.

    మీకీ కన్నా, చిన్నా, అమ్మలూ, బాగా ఇష్టమేమో మరి ;-)

    మధ్య మధ్యలో narration లో ఆంగ్ల పదాలు వస్తున్నాయి. సంభాషణల్లో వచ్చినా పర్లేదు కానీ, narration లో కాస్త ఎందుకో కృతుకంగా అనిపించింది. మీ సాధరణ శైలికి అలవాటు పడి. ఏమనుకోకండి. మీకున్న భావుకత్వం, శిల్పం నాకు లేవు. అయినా ఏదో తోచిమ్ది చెప్పేశాను.

    The style of narration is cute. And sensitive. Nice beginning. Expecting more beauty from your fingers... (Typing కదా)

    ReplyDelete
  11. భా.రా.రె, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలటండీ చదువుతున్నానని? :) మీ లెక్క హాజరు పట్టికలో ఎన్నోదని మాత్రమే ... కథల్లో కల్పన సహజం కాదేమిటీ...

    ReplyDelete
  12. చిన్ని, సునీత గార్లు, చాలా సంతోషం. ఏ ప్రేమ కథైనా రమ్యంగానే వుంటుంది. మిమ్మల్నిలాగే అలరించాలని నా చిన్ని ఆశ. అయినా కల్యాణంతో మొదలైన కథలో ఇక సస్పెన్స్ యేముందిక, ఏదో నిష్టూరాలకి పోవటం తప్పించి. ;)

    ReplyDelete
  13. హరేకృష్ణ, ఈ కథకి కొంత స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి కోరిక నేను కథ వ్రాయాలని, తప్పలేదు. ఇక మరి మీకూ తప్పదు నా కథనం విసుగ్గానో, భారంగానో చదవక... :) నెనర్లు

    ReplyDelete
  14. పద్మార్పిత, సృజన, ఇది వారపత్రికలో సీరియల్ మాత్రమే. దినపత్రికగా నడిపే సామర్థ్యం నాకు లేదు నేస్తాలు. :)

    ReplyDelete
  15. నేను గారు, ఈ టపాకి ముందు వ్రాసిన "విశ్వామిత్ర - ఉపోధ్ఘాతం", "విశ్వామిత్ర 0 - ప్రేమాన్వేషి : మిత్రవింద" ఈ తొలి భాగానికి ప్రారంభ వచనాలు. మరీ నెలకొకసారి అంటే నా బ్లాగుకి హిట్స్ తగ్గిపోతాయి, చిన్ని, బుజ్జి, వారానికో సారి రావా ;) అయినా 5 ఏళ్ళు వేచిన ప్రేమికులకి వున్న సహనంలో సగమైనా లేని చదువరా మీరు, మరీను... jk

    ReplyDelete
  16. గీతాచార్య, తొలి, మలి వ్యాక్యల్లోని సాభిప్రాయానికి, నడుమ ఇచ్చిన సద్విమర్శకి కృతజ్ఞతలు. అవి ఇకపై రాకుండా చూస్తాను. సున్నితత్వం అసలు పడని సాంగత్యాలు అలవాటైన దాన్ని కనుకనే మరీ భావుకతపు+సున్నితత్వపు పొరల్లో కూరుకుపోయానేమో? ;) అవును, "కన్నా, అమ్మలు" నాకు మహా నచ్చే పిలుపులు. Looking forward for your feedback on next parts as well. Thanks!

    ReplyDelete
  17. మరువపు వనం లో విరిసిన మైత్రీ పుష్పపు ప్రేమ సరాగం బాగుంది.... మితి మీరిన ప్రేమ భావం మనసును కుదిపినపుడు గుండెకు అలదుకొనే విషాద వీచిక వూయల లూపినటైంది వూపిరిని..

    ReplyDelete
  18. ఔనా, ఇదే మొదలనేస్కోవచ్చన్నమాట :)

    రామా...! ఎంతమాట....నాకు సహనం చాలా ఎక్కువండి అందుకే, కధానాయకునిలా హాయిగా వెనక్కి వాలి కధ మొత్తం ఒకేసారి చదవాలనుంది......ప్రపంచం పడుకున్న తరువాత, నిశబ్దంలోంచి లీలగా వినిపించే వేణుగానం వింటూ.....కిటికీ లోంచి తెరను తోసుకుంటూ వచ్చి తాకే చల్ల గాలి తోడుగా....

    ReplyDelete
  19. భావన, మన మానసిక స్థాయిలో ఏదో సాపత్యం. మౌనంగా నా మాట చెప్పాలనివుంది. ప్రేమే నేను అన్న నా అహం కలిగిస్తున్న స్పందన.
    "మౌనంలో రాగాన్ని నేను
    రాగంలో భాష్యాన్ని నేను
    భాష్యంలో భావాన్ని నేను"
    అర్థమైంది కదూ. నాకు జగమంతా ప్రేమమయం. నెనర్లు.

    ReplyDelete
  20. నేను, "ప్రపంచం పడుకున్న తరువాత, నిశబ్దంలోంచి లీలగా వినిపించే వేణుగానం వింటూ.....కిటికీ లోంచి తెరను తోసుకుంటూ వచ్చి తాకే చల్ల గాలి తోడుగా" ఎంత భాగ్యదాత మీ మనసు. ఇటువంటి అభిరుచి వుండటం అరుదు. ప్రపంచమంతా నాకు సంభందించనిది అన్నంత సుదూర వూహాలోకంలో నేను, తనే మిగిలిన క్షణాల్లో, మనసు నుండి వీచే మలయ పవనాలే ఈ కథలు, కవితలు. నేను కూడా వాటిని మీ మాదిరే చదువుతాను. కిటికి ప్రక్కన కూర్చుని చందమామకి చదివి వినిపిస్తాను. అవి మీవంటి వారిని ఇలా అలరించటం నా అదృష్టం.

    ReplyDelete
  21. ఉష గారు,
    చాలా బాగుంది. నిజానికి మొదటి భాగం లో కవిత చూసి, కవులు(కవితలు రాసేవారు) కధలు రాసేప్పుడు తడబడతారు అనుకున్నా. అయితే తరువాతి భాగంతో నా అనుమానాలు పటాపంచలు చేసారు.
    నేను గమనించిన ఒక విషయం, మీ కధ చదువుతుంటే నాకు యండమూరి వారి శైలి గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా మొదలై ప్రళయమై నిలిచి శాంతి మిగులుస్తుంది.
    మీరు మిగతా భాగాలు కూడా త్వరత్వరగా పూర్తీ చెయ్యాలని, మనసును రంజింప చెయ్యాలని ఆశిస్తున్నాను.
    చిన్న సలహా, ఇది కధ కనుక కవితా శైలిని తగ్గించండి. (ఆఫ్ కోర్స్ నా బోటి వాళ్లకు కవితా శైలి ఇష్టమే)

    ReplyDelete
  22. బోలెడంత ప్రేమా, కవితా శైలి వెరసి నాకు చాలా నచ్చేసింది ఉషగారు, మిత్రవింద రాసుకున్న ప్రేమాన్వేషి కూడా చాలా బాగుంది. విశ్వ డైరీ చదువుతూ మేం కధ తెలుసుకుంటున్నాం అంటే బహుశా మిత్ర కవితలు మిస్ అవుతామేమో అనిపిస్తుంది నిజమేనా.

    కథంతా అయ్యాక ఒకేసారి ప్రింట్అవుట్ తీసుకుని ఏ మల్లెపందిరి నీడలోనో, డాబా పై కొబ్బరాకుల మాటునుండి మబ్బుల దుప్పటితో దోబూచులాడే జాబిలి ని చూస్తూనో చదవాలని ఉంది, కానీ మీరు తరువాయిభాగం ప్రచురించాక చదవకుండా ఎదురు చూడడం కష్టమే అందుకే పూర్తయ్యాక మళ్ళీ ఒక సారి చదువుకుంటాను లెండి.

    ReplyDelete
  23. చేయితిరిగిన శిల్పికి శిల్పాన్ని చెక్కటానికెంత సమయం కావాలేంటి ?
    మీరే శిల్పం చెక్కినా అది సజీవమయ్యే వరం మీకుందని మాకుతెలుసు ...కధ ప్రారంభం ఇంతందగా ఉంటే ...మరిన్ని మలుపులు మా గోదావరిని తలపిస్తాయేమో ....
    అన్నట్టు ఆ సీలి రాకాసి అన్న పదాన్ని నేను తీవ్రంగా ఆబ్జక్ట్ చేస్తున్నా ....ఎందుకని అడక్కండి అదంతే !

    ReplyDelete
  24. మీ పూతోట ఫొటోల తో , మీ స్నేహం తో నన్నెప్పుడో మీ వనం లో కట్టేసారు. ఇక ఇప్పుడు మీ నవల తో అక్కడినుండి కదలనీయరా ?విశ్వామిత్ర డైరీ కోసం ఎదురుచూస్తూ అక్కడే వున్నాను . మరీ ఎక్కువ రోజులు వుంచుకోకండి మావారు , నామనవడు బెగపెట్టేసుకుంటారు.

    ReplyDelete
  25. uu ...la...la...laa...uuhu..la...la..laa..ek bagiya mein rehti ek hai ek mainaa ,puuchtii hai bolo kya hai kehnaa?????
    :)

    ReplyDelete
  26. ప్రపంచమంతా నాకు సంభందించనిది అన్నంత సుదూర వూహాలోకంలో నేను, తనే మిగిలిన క్షణాల్లో, మనసు నుండి వీచే మలయ పవనాలను ఆశ్వాదించగలగడం మా సుకృతం :)

    ReplyDelete
  27. A sensitive lookin' lovestory in the US? Oh wow. Looking interesting. Hehehe.

    I have never seen such people in the US in the two yrs I spent there even in the Indians. But the beginning sequence is cute. Will come back to read atleast the next one.

    ReplyDelete
  28. శైలి ఒక కవి వచనం రసినట్టే ఉంటుంది అనుకున్న నా అంచనా తప్పలేదు. కవులు కథలు రాస్తున్నప్పుడు వాస్తవిక విషయాల్ని కోంచెం మర్చిపోవడం సహజమే కదా! :) డిసెంబరు అమెరికా చలిలో ఓపెన్‌గా ఉన్న పార్కింగ్ లాట్లో రెండు గంటల పైన కారులోనే కూర్చుని ఉన్న స్త్రీ అలా అరవిడిన గులాబి మొగ్గంత ఫ్రెష్‌గా ఎలావుందో అన్న లాజిక్కు ఆలోచన్ని గొంతు పిసికి కప్పెట్టేస్తే, .. కథాప్రారంభం బహు రసవత్తరంగా ఉంది!
    తరువాయి భాగాలకోసం వేచి చూస్తుంటాము.

    ReplyDelete
  29. ఇందాకే మా తోడికోడలు ఒక మాట అంది ఇలా కవితా హృదయంతో చక్కగా వర్ణనలు చేసేవారి కధలు చదివితే మిగిలిన వారి కధలు చదవ బుద్దివేయదంట ..అదన్నమాట.. మీరిలా రాస్తూ ఉండండి నేను అలా చదివేస్తూ ఉంటాను

    ReplyDelete
  30. అది కల్పిత కధ అని అర్ధమైందండి..పాత టపాలు చదివాను... నేనన్నది ఆవిడ లాగానే మీరూ సస్పెన్స్ సీరియల్ మొదలేట్టేసారా అని....!
    కధలో పాత్రలు ప్రేమికులు కాబట్టి 5ఏళ్లేంటి..10ఏళ్లైనా ఎదురు చూడగలరు..ప్రేమ కున్న శక్తి అలాంటిది..
    కాని మేమంతా సామాన్య పాఠకులం కదాండీ....ఎక్కువ ఎదురుచూడలేము..త్వర త్వరగా..మా ఉత్కంఠతని తీర్చేయండి... :) :)

    ReplyDelete
  31. పరిమళం గారి మాటే నామాట. కొత్త పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.

    ReplyDelete
  32. నా బ్లాగు సహవాసి ఒకమారు చూడమని అభ్యర్ధన.

    ReplyDelete
  33. @ మధుర, మెనీ థాంక్స్.
    @ ప్రదీప్, మీ అభిప్రాయం తప్పక పరిగణలోకి తీసుకుంటాను. మీ ప్రశంసతో కాస్త సంశయం తొలగింది. నెనర్లు. కానీ యండమూరి వారితో పోల్చటం, తగుదాననా? :)
    @ వేణు గారు, మీ అభిమానానికి ధన్యవాదాలు. నిజంగా ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. మిత్ర కవితలు తప్పక వస్తాయి. ఆరంభం నుండి ఆఖరి వరకు ఇద్దరి ప్రయాణం ఈ కథ.

    ReplyDelete
  34. @ పరిమళం, మాలా గార్లు, ఏమిటో అప్పుడే పెద్ద రచయిత్రినయిపోయినంత ధీమా కల్పిస్తున్నారు.
    @ అశ్వినిశ్రీ, మైనాకి మాటలు నేర్పిందెవరు, ప్రేమే ;)

    ReplyDelete
  35. @ నేను, ముచ్చటగా మూడు వ్యాఖ్యలతో కాస్త అతిశయం పెంచేసారు. ;)

    ReplyDelete
  36. dhana, I won't deny nor accept your opinion. This is not a complete fiction. Not the next one. Come every now and then, this story would change some of your views about love. USA is not an exception nor Indians here are not any different. Love makes the wonders. You just get spell bound with it. Got to be lucky to find one that loves you unconditionally. Thanks for sharing your opinion on this very first post.

    ReplyDelete
  37. @ కొత్తపాళీ గారు, ముందుగా రసవత్తరంగా వుందని వెన్ను తట్టినందుకు కృతజ్ఞతలు. చమత్కారం కాకపోతే మీరెక్కడ ఆలోచన నొక్కేసుకున్నారు, యథాతధంగా వెలికి తెచ్చారు. ;) ఈ పాట విన్నారా?

    మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
    మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో

    అది నా స్వానుభవంలోనే అంటే మండే ఎండల్లో విరిసే పూలు మంచు రాత్రుల్లో వికసించటం చూసాను. ఇకపోతే కార్లో హీటింగ్ సంగతి మరిచారా? గంటల తరబడి చలిని లెక్కించక ప్రయాణాలు చేయమా మనం? మిత్రది విలక్షణమైన తీరు అన్నది తెలపటానికే ఆ సంఘటన.

    ReplyDelete
  38. baabaa gaaru, I am so delighted. Not an easy task to get appreciated by you in deed. Thanks. :)

    ReplyDelete
  39. @ నేస్తం, ఏదో నామీద అలాగే అభిమానం వుంచుకోండి. ఈ కథ ఒక్కటీ చదివించేసి మళ్ళీ కవితల బండి ఎక్కేస్తాను. మీ తోడికోడలు గారికి కూడా నా కృతజ్ఞతలు.

    ReplyDelete
  40. @ తృష్ణ,వర్మ గార్లు, మీ వంటి వారి అభిమానం వుంటే ఇది రాధామాధవీయం కన్నా మధుర గాథ అవుతుంది. నెనర్లు.

    ReplyDelete
  41. ఎక్కడికో తీసుకెళ్ళిందండీ మీ కథ ఉష గారూ. ఇంకా మొదలే కనుక తెలియటం లేదు కానీ, ముందు ముందు ఎలాంటి చమకులు చూపుతారో అని ఆసక్తిగా ఉంది.

    ReplyDelete
  42. ప్రియ, నిజానికి జంకుగానే వుంది. కల్పన యథాతధంగా వెలికి తేగలనా అని. చూద్దాం నా కలం నన్నెటు తీసుకువెళ్తుందో. బహుశా నవలికలిక వ్రాయలేనేమో. కవితావేశం, రచనాపటిమలోని తేడా మాత్రం అనుభవంలోకి వచ్చింది. మరొక్కసారైనా మీ అభిప్రాయం పంచుకోవటం మరవద్దు.

    ReplyDelete
  43. chala bagundi. motham chadivanu nenu. koncham techinicalities miss aina kuda katha kanuka, andulonu romance kanuka okandee. meru rasthunna teeru chala bagundi.

    ReplyDelete
  44. అ.గా. గారు, సద్విమర్శతో కూడిన మీ సాభిప్రాయానికి ధన్యవాదాలు. మొదటి ప్రయత్నం పడిలేవక తప్పదు. ప్రేమ వరకు మాత్రం కథ కాదు సుమా, వాస్తవం ;)

    ReplyDelete