నాయిక నోరు విప్పిన వేళ..

కాలసర్పం కాళీయుడైన ఆ క్షణం
మర్ధించగ నందనందనుడు
అనురాగ క్షీరమధనం ఆ వైనం
మురిపించగ జగన్మోహనుడు
ఆమె లోకాన అతడు అనీషుడు

మౌనభాష్యాల మేఘసందేశాలు
కినుకలెరుగని చిరుదరహాసాలు
జీవనం వేదసమాన్వితం
సఫలీకృతాలు ఆ జీవితాలు
ఆమె నుడువగ అతడు ధీపతి

ఆమెయందు అష్టనాయికల చందం
లాలించువేళల నారిమనోవల్లభుడు
కవ్వించువేళల బహు చతురుడు
ప్రియమార ఆలింగనాల అతిరధుడు
ఆమెనబ్బురపరచు అతడు ధీరోదాత్తుడు

అధరాల అపురూప సవ్వళ్ళు
హస్తద్వయాలు సంకెళ్ళు
శుభఘడియల రేయిపవళ్ళు
సురగంగ తలవంచు పరవళ్ళు
ఆమె ముసినగవున అతడు రాజీవుడు

సింహమధ్యముని చిహ్నం ఆ శౌర్యం
ఆజానుబాహువు ప్రతీక ఆ రూపం
రవితేజమునరికట్టు ఆ యశస్సు
నిర్మల మానసమున అజాతశతృవు
ఆమె ముదమార అతడు మహిమాన్వితుడు

నాయిక హృదయమందిరాన బందీ ఈ నాయకుడు!!!

*********************************************
నా నాయిక-నాయక చరితార్థులు, ఒకరికొకరు ప్రేమాన్వేషణ మజిలీ. నేనున్నా లేకున్నా ఈ లోకాన అమరులు.

నాయిక భావనలు -
అష్టనాయికలూ నేనేనై, నీ ఒక్కడికై వేచానిట...
నాయిక మురిపాలు - నేనూ నండూరి ఎంకికేం తీసిపోను
నాయిక నివేదనలు - కాలంతో సాగే నా ఈ గానం, కాదనవనే నీకు అంకితం!

41 comments:

 1. "నాయిక హృదయమందిరాన బందీ ఈ నాయకుడు!!!"

  Wow.

  ReplyDelete
 2. మౌనభాష్యాల మేఘసందేశాలు
  కినుకలెరుగని చిరుదరహాసాలు

  I like these words. :-)

  ReplyDelete
 3. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. "అధరాల అపురూప సవ్వళ్ళు
  హస్తద్వయాలు సంకెళ్ళు.."
  శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 5. Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
  Download from www.findindia.net

  ReplyDelete
 6. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు...

  ReplyDelete
 7. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు...

  శీర్షికకు
  మొదటి నాలుగు పాదాలకు
  మిగతా పాదాలకు మద్య
  అంతః ప్రవాహంలో
  ఏదో తక్కువ అనిపించింది.

  ReplyDelete
 8. ఈ కవితకు అర్థం వివరించి నా జన్మ ధన్యం చేయగలరని మనవి - ధన్య వాదములు

  ReplyDelete
 9. కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  ReplyDelete
 10. ఆగష్టు నెలలో వచ్చే అన్నీ పండగలకు కలిపి శుభాకాంక్షలు. జాన్‌హైడ్ గారు చెప్పినదే నాకు మీపద్యం చదువుతున్నప్పుడు తోచింది.

  ReplyDelete
 11. నాయిక, నాయకులారా, నన్ను మన్నించండి. మీకు మీరే. నా మాట నమ్మండి.
  ఇప్పటి వరకు స్పందించిన మిత్రులకు, ఇకపై రానున్న చదువరులకు ఒక మనవి. "నాయిక-నాయక" నా కల్పన. వారిది మరో లోకం. కృష్ణుడో, మరొకరో మీకు గోచరిస్తే అది మీ మనసులోని స్పందన మాత్రమే! :) వివరాలు తీరిగ్గా...
  That said అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

  ReplyDelete
 12. "మౌనభాష్యాల మేఘసందేశాలు
  కినుకలెరుగని చిరుదరహాసాలు"
  మొత్తం బాగుందండి .ఐదు సార్లు చదివాను ఇష్టంగా.:)

  ReplyDelete
 13. హ్మ్మ్ ... మనసును ఎక్కడికో... ఎప్పటి కాలానికో... తీసుకుని వెళ్ళేరు... ;-)
  మురిపించగ జగన్మోహనుడు
  ఆమె లోకాన అతడు అనీషుడు
  సింహమధ్యముని చిహ్నం ఆ శౌర్యం
  ఆజానుబాహువు ప్రతీక ఆ రూపం
  రవితేజమునరికట్టు ఆ యశస్సు
  నిర్మల మానసమున అజాతశతృవు
  ఆమె ముదమార అతడు మహిమాన్వితుడు

  నాయిక హృదయమందిరాన బందీ ఈ నాయకుడు!!!

  ఉషా.. మీకు మీరే సాటి... అధ్బుతం..

  ReplyDelete
 14. నాయికలు నోరు విప్పితే...నాయకులు మాటాడరు ;)


  అధరాల అపురూప సవ్వళ్ళు
  హస్తద్వయాలు సంకెళ్ళు
  శుభఘడియల రేయిపవళ్ళు
  సురగంగ తలవంచు పరవళ్ళు
  ఆమె ముసినగవున అతడు రాజీవుడు

  ఓహో మీ నాయిక సోనియా నా ? ;)

  http://chiruspandana.blogspot.com/2009/08/blog-post_14.html

  ReplyDelete
 15. మీకు జన్మాష్టమి శుభాకాంక్షలు. మీ కవితా మందిరాన బందీలు తెలుగు బ్లాగర్లు.

  ReplyDelete
 16. yey, గీతాచార్య to be the first to comment and says 'wow'. a good start of reviews for the post. Thanks.

  ReplyDelete
 17. Srujana, to be frank of all the fiction went in here and for that small proportion of reality, these two are in deed from real life experiences. That's his strength. It does the trick often times. Smile buys me. ;) Thank you much!

  ReplyDelete
 18. విజయమోహన్ గారు, మీ టపాలో చెప్పల్సినవన్నీ చెప్పేసాను. మీ రాకకి సంతోషం. మళ్ళి మళ్ళీ రావాలని అడగను కాని వస్తున్నారా లేరా అని మాత్రం ఆరా తీస్తాను సుమీ! నెనర్లు.

  ReplyDelete
 19. మురళి, మరంతే కదండి, ఆ సంకెళ్ళలో బందీలవటం మించిన మధురానుభూతేది ఇలలో. ఈ పొందుకే కదా మానవుడై మాధవుడు ఆనందతీరాలు చేరింది? నెనర్లు.

  ReplyDelete
 20. Ram, Thanks for the info. I will look in to it when time permits. I rather go by the count of good reviewers and readers than the mere floating traffic in my garden. Yet your tip is so considered as a good thought for me. Thank you so very much. keep coming not sure if you could read in telugu though.

  ReplyDelete
 21. జాన్‌హైడ్, సాయ్ ప్రవీణ్ గార్లు, మీ సద్విమర్శకి ధన్యవాదాలు. ఇవి నాయిక పరి పరి విధాల వర్ణించిన నాయక ప్రతిరూపాలు. ఇంతకు మునుపు నాయిక ఎలా ప్రమద్వర నుండి పరవశించి పరిమళ గా రూపాంతరాలు చెందిందో, అవే ఇప్పుడు నాయక పరంగా చెప్పటమైంది. అయినా కొంత అంతః ప్రవాహంలో వెలితివుండి వుండవచ్చు. అతన్ని ధీయుతునిగా చెప్పాలన్న తాపత్రయంలో ఈ మాట మరిచివుండవచ్చు నీ నాయిక. ;)

  ReplyDelete
 22. చిన్ని, ఛ్ఛా ఐదేనటండి. కనీసం ఓ 116 సార్లైనా లేనిదే నా నాయకుని వర్ణన అంతుబట్టదనుకున్నాను. Thanks మంచి ప్రశంస.

  ReplyDelete
 23. భావన, నిజమేనండి "నాయిక హృదయమందిరాన బందీ ఈ నాయకుడు!!!" ఈ స్థాయి రావాలంటే నాకు నేనే సాటి ;) నెనర్లు.

  ReplyDelete
 24. భా.రా.రె, కాసింత చమత్కారం కలిపారేం? ఇక కదిలి వచ్చిన కనక దుర్గ మీ టపాలో ప్రభంజనం సృష్టిస్తుంది కానీ ప్రతి-కవితకి ధన్యవాదాలు. ఈ సున్నిత అంశం అంతే పదిలంగా ఉన్నత పదాల రచనలని అలంకరించుకోవటం నాకు ఆనందం. అన్ని మిళితం అవ్యక్తానందం.

  ReplyDelete
 25. వర్మ, ఈ లెక్కేదో బాగుంది సుమీ, ఇంతకీ నాకెంతమంది బందీలో భా.రా.రె. గారి లెక్కల పుస్తకంలో వెదుకుతాను. నెనర్లు.

  ReplyDelete
 26. వేణూ శ్రీకాంత్, ఓహో మీరు మాటల పొదుపు నేర్చారన్నమాట! ;)
  సుజ్జీ, లెస్స పలికావు. ఈ కవితలో అంతర్లీనమైన భావన అదే. ....Thanks to you both

  ReplyDelete
 27. ప్రభాకర్, సరి నాకే ఒకరొకరు మొట్టికాయలేసి నేర్పుతున్నారు మీకు నేను చెప్పటం ;) తప్పకుండానండి. ముందు కవితకి వివరణ ఇచ్చి ఇది చెప్తాను. This is a sequel to the previous post. నెనర్లు.

  ReplyDelete
 28. పద్మార్పిత, నేస్తం, మీ మాట పేజీ క్రింద note మాదిరేను, అవి లేకపోతే తిరిగి చదివినపుడు కాసేపు సాలోచనలో పడతాను. "రాలేదా" లేక "నచ్చలేదా" అని! నెనర్లు my dear friends ;)

  ReplyDelete
 29. మీ కవితలు సమయాభావం వల్ల ఒక్కొసారి చదవకపోయినా తీరిక దొరికినపుడు మరలా చదువుతాను తప్ప మిస్ చేయను..కాకపోతే ఒక్కోసారి అద్భుతం అద్భుతం అని రాయాలంటే నాకే ఇష్టం ఉండదు ...ఇంకేదన్నా మంచి పదం దొరికితే బాగుండుననిపిస్తుంది..అలా అని మీ కవితలను విశ్లేషించే భాషాపటిమ నాకు లేదు మౌనం గా ఆ వాఖ్యలను చదువుతూ ఉంటాను :)

  ReplyDelete
 30. "సురగంగ తలవంచు పరవళ్ళు
  ఆమె ముసినగవున అతడు రాజీవుడు"
  ushagaaruu!!!! ha! ha! ha! suragangani nettineasukuni moeyyaalsinochchinappuDuu... aamea musi navvulu sahajamea! mari aayana raajiivuDaa...adeamdabbaa?

  ReplyDelete
 31. నిజానికి ఈ కవితలో పీకడానికి ఈకలు బాగానే కనిపిస్తున్నాయి. కానీ మొదటిసారి చదివినప్పుడు పదాల నడక వేగంగా ఉండడంతో భళీ అనిపించింది. అయితే ఆ వేగంలో యుగయుగాలనే దాటవేచాయి, దేవదేవులనే కలిపివేసాయి పదాలు పాదాలు. బహుశా ప్రియుని వర్ణనలో ఆమె లోనైన భావావేశం కారణమవవచ్చు.

  ReplyDelete
 32. నాయిక నోరు విప్పిన వేళ: అశ్వినిశ్రీ, అదేనబ్బా, ఇక్కడ లాజిక్కు అడగకూడదు, నాయిక లోనైన స్థితి అది. ;) అర్థం చేసుకోరూ..... నాయిక ఆవేశం ఆ సురగంగని మించిన వైనం. అంత పరవశంలోను అతడూ అంతటి ఘనుడని మరో మురిపెం. అబ్బా పో అబ్బా ఇక నేను చెప్పను. చెప్పి చెప్పి నోరు నెప్పి వచ్చింది. :) ha ha hhaa

  ReplyDelete
 33. నాయిక నోరు విప్పిన వేళ: ప్రదీప్, ఇక్కడ నాయికది ఏకఛత్రాధిపత్యమే కానీ నిరంకుశత్వం కాదు. కనుక మీరు నిరభ్యంతరంగా ఈకలు పీకండి, KGEP మీకు మహా ఇష్టం కదా? ;) యుగాల తరబడి నిలిచివుంది ప్రేమ ఒక్కటే, ఏ యుగ చరిత్రలో ప్రేమకథ లేని అంకం వుంది? నాయికది నిర్మలమైన భక్తి తో కూడిన ప్రేమ. నాయకునిలో తన లోకాన్నే నింపున్న స్త్రీ. ప్రియునే యుగ పురుషునిగా జపించే ఆత్మ ఆమెది. ;) ఇక మీ పని కానిండి మరి... నెనర్లు. మీ వ్యాఖ్యతో తులసిదళం పడ్డ తులాభారం నా కవిత.

  ReplyDelete
 34. నాయిక నోరు విప్పిన వేళ: నేస్తం, కొన్నిసార్లు కళ్ళతో కృతజ్ఞత తెలపాలనిపిస్తుంది ఎందుకంటే అందులోనే ఆ భావానికి తగ్గ స్వఛ్ఛత బాగా ప్రకటితమౌతుంది. అర్థం చేసుకున్నారనుకుంటాను. మీరు ఎదురుగావుంటే బాగుండుననివుంది. నెనర్లు.

  ReplyDelete
 35. నాయిక నోరు విప్పిన వేళ: Prabhakar అర్థం వివరించమన్నారు, ఏమని చెప్పను, ఇది నాయిక-నాయక అని నేను సృష్టించుకున్నా ఇరువురి నడుమ సాగే భావావేశాలు. నాయిక మాటకారి, సున్నిత మనస్కురాలు, భావావేశం ఎక్కువ. నాయక మృదుమనస్కుడు, గంభీరుడు, మితభాషి, సహనశీలి. అతని ప్రతి చర్య ఆమెని పలు భావావేశాలకి లోనుచేస్తుంది. కొన్ని యుగాల నాటి దేవదేవుల సాపత్యాలు, మరికొన్ని ఆమె అనుభవాల మిళితాలు. అనీషుడు అంటే ఆద్యంతం లేనివాడు. ప్రతి ప్రేమిక మనసులోనూ తన ప్రియుని పట్ల అదే భావం వుంటుంది. అనంతమా ప్రేమవాహిని. ధీపతి అంటే వేదములు చదివిన వాడు, బృహస్పతి సాటి/సమం. అతని జీవనం అందులోని వేదం ఆపాటివి. ధీరోదాత్తుడు ఆమెని జయించిన విశ్వవిజేత, ఇలా ఈ కవిత అంతా అతని స్తుతించటంలోనే సాగింది. అంతటి వాడు మరెవరు నా నాయకుడు కాక! :) నెనర్లు.

  ReplyDelete
 36. " నాయకునిలో తన లోకాన్నే నింపున్న స్త్రీ. ప్రియునే యుగ పురుషునిగా జపించే ఆత్మ ఆమెది. " - ఇంక పీకేదేముంది. సమాధానం ఒక్క ముక్కలో చెప్పాక.

  ReplyDelete
 37. మీ వివరణకు చాల కృతజ్ఞున్ని .. ధన్య వాదములు

  ReplyDelete
 38. ఆ నాయకుడు వేరెవరు ?మీ నాయకుడు మరెవరు ?
  ఆ వంశీ మోహనుడు కాదా ?
  శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కాస్త ఆలశ్యంగా ...

  ReplyDelete
 39. పరిమళం, మీరూ పొరబడ్డారా? అబ్బా శ్రీకృష్ణా, ఎందుకు నీ జన్మాష్టమికి నా నాయక గురించి చెప్పానోనయ్యా నల్లనయ్యా, నా కన్నయ్యని నీవు overtake చేసి override చేసేసావు. కాదు కాదు కాదు ముమ్మాటికీ ఈ నల్లనయ్య అతడు కాదు. నా వాడు నా నాయకుడు. :)

  ReplyDelete