వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది

మరువానికి నిత్యమల్లి కలిసింది-
మాట కలిపి మనసు విప్పి
ఎదను తడిమి ఒడిని చేరి
అద్వితీయ కదంబమొకటి సృజన చేసింది

మొగలిపువ్వు వెదురుపొదని వెదికింది-
విడిదిమ్మని ఉత్తరం వ్రాసిపంపి
మొలకనవ్వు వెదురుని వేణువుచేసి
మహతిమీటని సరాగం వెలికివచ్చింది

పిలవకనే ప్రేమ తలుపు తట్టింది
అడగకనే పూల పొదరిల్లు కట్టి
నవరాగంతో స్నేహగీతమొకటి తరంగమై
మొగలితావితో వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది...!

74 comments:

  1. దేని సుగంధం దానిదే చూద్దాం వాసననుబట్టి కనుక్కోగలమేమో ! :)

    ReplyDelete
  2. :-)

    భలే ఉంది. "మొలకనవ్వు వెదురుని వేణువుచేసింది."

    కృష్ణ మాయ! కవిత మాత్రం బాగుంది.

    ReplyDelete
  3. నిద్రలేవగానే ఇటే వచ్చా. 79 :-) అర్థమయ్యి ఉంటుందనే అనుకుంటున్నాను.

    ReplyDelete
  4. చాలా బాగుంది ఉషగారూ...

    ReplyDelete
  5. పిలవకనే ప్రేమ తలుపు తట్టింది
    అడగకనే పూల పొదరిల్లు కట్టింది
    నవరాగంతో స్నేహగీతమొకటి తరంగమైంది

    ఈ లైన్స్ చాలా బావున్నాయి. కందంబ అంటే ఏమిటండి.

    Happy Friendship Day.

    ReplyDelete
  6. 'విడిదిమ్మని ఉత్తరం వ్రాసిపంపింది..' మెయిల్ పంపింది అనాలేమో కదండీ :-) :-) ..బాగుంది కవిత..

    ReplyDelete
  7. veera sekhar Aditya, కదంబం అంటే చాలా అర్థాలు వున్నాయండి. It means a "compilation" వివిధ సందర్భాల్లో దాని రూపు మారుతుంది. ఉదాహరణకి, 1) పూల విషయమైతే సాధారణంగా మల్లెలు/విరజాజులు, కనకాంబరాలు, మరువం కలిపి కట్టిన మాలని "కదంబం" అంటారు. 2) రచనల compilation/సంకలనాన్ని కూడా "కదంబం" అంటారు. 3) ఇక వంటల విషయంలో మన ఇళ్ళలో చేసే అన్ని రకాల కూర ముక్కల mixed veg. పులుసు/దప్పళం ని కూడా కొన్ని ప్రాంతాల్లో "కదంబం" అని అంటారు.
    నేను మొదటి అర్థంలో వాడాను. నిత్యమల్లి సంవత్సరం పొడుగూతా విరిసే పుష్పం. పూజలలో తప్పనిసరిగా వాడతారు. పవిత్రతని ఆపాదించటానికి నిత్యమల్లిని ఎంచుకున్నాను. ఎవరూ కనివినీ ఎరుగని ఆ బంధానికి అద్వితీయ/రెండో రకం లేనిదైన, "కదంబం" అని ప్రయోగం చేసాను. ఆ దండకి దారం అనురాగం అని చెప్పనవసరం లేదు కదా! పరిమళం వెదజల్లు మరువం, పవిత్రతకి ప్రతీక నిత్యమల్లి కలిసి సృష్టించిన ఈ బంధం దైవికం. నెనర్లు.

    ReplyDelete
  8. మరువపు మోము పలు సుగంధాలతో నిఘనిగలాడుతూ నవ్వింది:)
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నేస్తమా!!!

    ReplyDelete
  9. hats off...,

    చాలా చక్కగా చెప్పారు, ఇంకా చాలా తెలియని విషయాలు కూడా..., బోలెడు థాంక్స్ అండి.
    HAPPY FRIENDSHIP DAY.

    ReplyDelete
  10. "అడగకండి నిజం చెప్పనేమో?"
    ఎవరా నిత్యమల్లి ?ఏమా కధ?
    అడగొద్దన్నారుగా? అందుకే ... :) :)

    ReplyDelete
  11. కవిత బాగుంది ఉష గారు. స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. Thank you madam. Very nice one. Really I felt very happy to read this one.

    ReplyDelete
  13. విజయమోహన్, నిజమేనండి, దేని సుగంధం దానిదే. అదే కదా ప్రకృతిలోని విశిష్టత. కనిపెట్టారా మరి? :)

    ReplyDelete
  14. గీతాచార్య, నిజం "కృష్ణ మాయ" లేదా మరో లీల. అనురాగం వేసిన అస్త్రం. ;)

    ReplyDelete
  15. సృజన, అర్థం కానిదేదైనా వుంటుందా ప్రేమలో అమృత సారాన్ని మనసు తన భాషలో కూర్చుకున్న కవితకి... ;) ప్రేమ రాగంలో నిత్యనూతనం కానిదేదైనా కలదా?

    ReplyDelete
  16. మాలా కుమార్ గారు, తృష్ణ, ధన్యవాదాలు. happy friendship day to you both.

    ReplyDelete
  17. మురళీ గారు, నిజమే ఈసారి ఆ మాదిరిగా email వ్రాయమని చెప్తానండి.. ;) నెనర్లు

    ReplyDelete
  18. పద్మార్పితా, ఆ నిగనిగలు నిలవాలంటే మీ నగవులు విరియాలీ వనాన నిత్యం...

    ReplyDelete
  19. veera sekhar Aditya ముందుగా సాదర స్వాగతం. శ్రద్దగా మీరడిగిన వివరణ చదివినందుకు నచ్చిందని చెప్పిమ్నందుకు సంతోషం. వస్తూవుండండి, నాకు మరిన్ని మీకు పంచగల అవకాశాన్ని ఇవ్వండి. మీకు తెలిసినవి నాకు తెలుపండి. Life is about live and learn నెనర్లు.

    ReplyDelete
  20. పరిమళం, అహా కొంచం లౌక్యం వచ్చిందన్నమాట అమ్మగారికి ;) అయినా దొరుకుతాననే..

    ReplyDelete
  21. వేణూ శ్రీకాంత్, బహుకాలదర్శనం. ఏమండి బెంగుళూర్ గాలి అంత మనసు మళ్ళించేసిందేమిటి.. మరీ నల్లపూసైపోయారీ వనాన ;) మీకు కూడా అవే శుభాకాంక్షలు.

    ReplyDelete
  22. Dhanaraj Manmadha, warm welcome at maruvam and am so glad for your first comment on this one in specific. :)

    ReplyDelete
  23. ఒక సినిమాలో ఉన్న డైలాగు "పార్టులు పార్టులుగా చూస్తే బానే ఉంది"... అప్రయత్నంగా అదే గుర్తుకొచ్చింది. అయితే ఎందుకా అని ఆలోచిస్తే పైన రాసిన మూడింటి మద్య సారూప్యం వెతకలేకపోయానని అర్ధమయ్యింది.
    మొదటి నాలుగు పాదాలలో ప్రియుల గురించి చెబుతూ, రెండవ నాలుగులో కేవలం ఒకరి గురించే చెబుతూ, మూడులో స్నేహం గురించి...
    ఏమిటో లింకు చెప్తారా కొంచెం

    ReplyDelete
  24. నిత్యమల్లీ, నువ్వు రానంటే నేవూరుకుంటానా మరి. రప్పించాను చూసావా?
    స్పందించిన మిత్రులందరికీ, హృదయపూర్వక ధన్యవదాలు.
    వెదురుపువ్వు - మొగలిపూవు: పచ్చి వెదురును దబ్బలుగా చీల్చి, వాటిని రేకుల్లా కోసి, పుల్లకు వరసగా గుచ్చి చేస్తారు. పారిజాతం కానీ దేవగన్నేరు కానీ చూసిన వారికి అదేమాదిరిగా తోస్తుంది. మొగలిరేకు అంతే, సన్నగా చీల్చిన రేకులు వొద్దిగ్గా అల్లి చూడముచ్చటైన సిగల్లో ముదమార తురుముకుంటారు. వెదురు కన్నా మొగలి ఘాటు అధికం. సహవాస ఫలితంగా ఒకరి వ్యక్తిత్వం ఒకరిని ప్రభావితం చేస్తుంది అని చెప్పేందుకే ఈ శీర్షిక అలా వుంచాను. ఇవి ప్రకృతిలోని వాటికి మనిషి సృజన అద్ది చేసిన పూలు.

    ReplyDelete
  25. ప్రదీప్, ఇది నా వ్యక్తిగత అనుభవానికి సంబందించినదే. ఈ వివరణ అవసరం రాదనుకున్నాను. కానీ మీ ఆలోచన వేరే మార్గాన సాగింది కనుక నాకు చెప్పటం తప్పలేదు. ఈ కవితలో నేను వ్రాసిన అనుబంధం ప్రేయసీ ప్రియులు కాదు. అసలు సంబంధంలేని ఇద్దరి వ్యక్తుల మధ్య ఉదయించిన అనురాగం గురించి. నిజానికి నాకు కలిగిన అనుభవం మాతృభావనకి సంబందించినది.
    "మరువానికి నిత్యమల్లి కలిసింది"
    రెండో వ్యక్తికి పవిత్రతకి గుర్తైన నిత్యమల్లి అంత ఉన్నతమైన వ్యక్తిత్వం వుంది.
    "ఎదను తడిమి ఒడిని చేరింది"
    "అమ్మ" అని నిను పిలవొచ్చా అని పాపాయిలా ఒడిని చేరింది. నా బిడ్డ మాదిరి నా జీవితాన మరో స్మృతుల సంకలనాన్ని మొదలిడింది. నా పిల్లలిద్దరూ నా చేతిలో ఎదుగుతున్నారు, వారి మీద నా ప్రభావం మెండు. కనుక వారి గుభాళింపులు నాకు పరిచితమే.
    "మొగలిపువ్వు వెదురుపొదని వెదికింది" ఆ మది నను వెదుక్కున తీరు. ఇరువురం ఏ తీరుగా చూసినా పూర్తి అపరిచితులం.
    "వెదురుని వేణువుచేసింది
    మహతిమీటని సరాగం వెలికివచ్చింది"
    తన వలన కలిగిన అందమైన అనుభవాలివి.
    "పిలవకనే ప్రేమ తలుపు తట్టింది
    అడగకనే పూల పొదరిల్లు కట్టింది
    నవరాగంతో స్నేహగీతమొకటి తరంగమైంది "
    ఏమండి, ప్రేమకి మరో చిరునామా వుండదా? అది కేవలం స్త్రీ పురుషులకు నడుమనే సాగాలా?
    నా వరకు ఇది మునుపెరుగని అనుబంధం, అపురూపం, కేవలం నా కవితల్లో భావ సామీప్యాన్ని, మనోభావాల తీవ్రతని ఇష్టపడి ఒక వ్యక్తి ఈ రూపుగా నా తరాన్ని తన తరాన్ని అనుసంధానం చేయటం నా జీవితంలో అమోఘం, అద్వితీయం. తన కారణంగా నాకు క్రొత్త స్ఫూర్తి.
    "మొగలితావితో వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది"
    నా సంతోషానికి ప్రతీక.
    ఇపుడు మరోసారి చూడండి, ఈ అనూహ్యమైన బంధాన్ని నేను అలా రకరకాలుగా పోల్చుకున్నాను. మీకు మళ్ళీ నా వివరణకి తగిన భావం అర్థం స్ఫురిస్తుందేమోనని ఆలోచన. మీ వ్యాఖ్యకై ప్రతీక్షిస్తూ.

    ReplyDelete
  26. అర్ధమైంది సుమా...బహుశా ప్రేమ భావనల కవితలు ఎక్కువ రాయడం చదవడం వల్ల కావచ్చు.
    "ఏమండి, ప్రేమకి మరో చిరునామా వుండదా? అది కేవలం స్త్రీ పురుషులకు నడుమనే సాగాలా? " - అది మాటలకందని అనుభూతి.
    ఇప్పుడొక చిన్న వాక్యం గుర్తుకొస్తోంది,
    "తెల్ల కాగితం మీదనున్న నల్ల చుక్కే కనిపిస్తుంది కానీ వెనకున్న స్వచ్చత కనిపించదే?" - అదే రీతిన నేను మూడింటి మధ్యనున్న బంధాన్ని వెతకటంలో విఫలమయ్యాను. నా మెదడుకు పదును పెట్టాల్సిన సమయం వచ్చిందని అర్ధమైంది ఇప్పుడు. (బహుశా కొన్ని మనసుతో చదవాలేమో)
    ఆ నిత్యమల్లి - మరువం బంధం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ...

    ReplyDelete
  27. ప్రదీప్, హమ్మయా! నా మనసు తేలిక పడిందిపుడు. ఇకపోతే "బహుశా ప్రేమ భావనల కవితలు ఎక్కువ రాయడం చదవడం వల్ల కావచ్చు" ఇది మీకని మీరు సూచించినా నాకూ అన్వయించుకుని చెప్పే మాట - ఆ "మాటలకందని అనుభూతి" ని ఏదో తాపత్రయంతో తపనతో వ్యక్తీకరించటం కనీసం ఆ ప్రయత్నం చేయటం నాకొక అలవాటుగా మరిపోయింది. నిజంగా నా మనసు చేసి వచ్చే విహారాలు నేను పూర్తిగా వ్యక్తపరచనే లేదు. ఆ తాకిడిని అల విరిగిన సమయాన వెలికి తెస్తేనే ఇంత వెల్లువౌతాను. తను అపుడపుడు నా ముందరి కాళ్ళకి బంధం వేయకపోతే నిజంగానే ఓ నైషధం రచించేస్తాను సుమా! ;) "బహుశా కొన్ని మనసుతో చదవాలేమో" మీ మనసుకి ఆ పదునుంది, బహుశా నేనే విఫలమయ్యానేమో ;) ఏమైనా కానీ మీ వ్యాఖ్య మటుకు మహదానందం. నెనర్లు.

    ReplyDelete
  28. "ప్రేమకి మరో చిరునామా ఉండదా" అన్నదానిపై ఆలోచించి మళ్ళీ చదివాను, నేనేమి రాసాను అని.
    "మూడులో స్నేహం గురించి" అంటూ స్నేహమే కదా నేను రాసాను... బహుశా మొదటి పాదంపై నా అభిప్రాయం చదవగానే తరువాతి వాక్యాలు మరచారేమో ;)
    అయినా, మీ వ్యక్తిగత భావనను ఆ నిత్యమల్లి కోసం పరిచారని అనుకోలేదు... నేనసలే ఈ మధ్య ఏ "* దినమైనా " (స్నేహితుల, ప్రేమికుల, శాంతి, నూతన సంవత్సర వగైరా ) పట్టించుకోవడం లేదు, మరువం అన్నది కవితకోసం వాడారు అనుకున్నానే కానీ మిమ్మల్ని ప్రతిబింబించడానికి పెట్టారు అనుకోలేదు. ఆ రకంగా ప్రకృతి గురించి ఆలోచించి దెబ్బ తిన్నా..
    ఇప్పుడు మళ్ళీ తాజాగా చదువుతుంటే మీ ఆలోచన అర్ధమవుతోంది....
    ఒక స్నేహానికి మీరిచ్చిన బహుమతి ఇది అని...స్నేహానికి ఇంత కన్నా తీపి బహుమతులేముంటాయి.

    ReplyDelete
  29. ప్రదీప్, మీరిది నమ్మే తీరాలి, ఎందుకంటే అంత సవివరంగా చెప్పిన నాకు ఈ ఒక్కటీ దాచాల్సిన పనిలేదు ;) I never knew or realized it was friendship day until after I had posted this write-up. These "days" are brought in to my life very recently when my lil' one started to notice and wish and make me wish. In fact we were in India last year when we found friendship bands in the shops. Here in USA I did not find such. శనివారం మధ్యహ్నం అంతా ఎందుకో ఎక్కువగా ఈ క్రొత్త బంధం గురించి ఆలోచించాను. ఆ సాంద్రత సాయంత్రానికి ఈ పదాలుగా వెలువడింది. నా వరకు అనుబంధం, అనురాగం ఇవే అందులో ప్రతిబింబించిన అనుభూతి. నా టపా పెట్టగానే ఒక మిత్రురాలు పంపిన ఇమెయిలు చూసి ముందు టపా మరొక రోజు ఆపుదామా అని అనుకుని [ఎందుకంటే ఇది ఆ సందర్భానికి వ్రాసింది కాదు కనుక] ఇదీ ఈశ్వరేఛ్ఛ కావచ్చునని వుంచేసాను. కనుక ఇది "ఒక స్నేహానికి మీరిచ్చిన బహుమతి ఇది అని" కావచ్చు కాకపోవచ్చు కానీ ఓ చక్కని అనుబంధాన్ని స్వంతం చేసుకున్న అతిశయం. నా మాటగా "వ్యక్తిగతం" అని సూచించింది అందుకే.

    ReplyDelete
  30. నిత్యమల్లి సరే మరి జాజిపూల సంగతి ఏం చేసారు ..అబ్బో మీ కవితకు ప్రదీప్ గారు అడిగిన ప్రశ్న మీ వివరణ రెండు చాలా బాగున్నాయి ... ఇలాగే ఇంకా చక్క చక్కని కవితలతో అలరించాలని ఆశిస్తున్నాను

    ReplyDelete
  31. మరువానికి స్నేహ మల్లె పూచింది
    పదం కలిపి పాదమయ్యింది
    గళం దాటి గాత్రమయి
    గాలి చేర గానమయ్యింది.

    మరువపు మొలక మదిన మెదిలింది
    కావ్య వనాన విడిదడిగింది
    వనమాలి ఎదురేగి పాడింది
    స్నేహగీతికా స్వర రాగాలు

    ఆత్మీయత తలుపు తట్టింది
    ఆలికించ మాట మూగబోయింది
    అనురాగ రాగ కదంబమంది
    మరువపు మాట మధురమంది.

    ReplyDelete
  32. నేస్తం, మరువం, జాజుల కదంబం తురమని తల కలదా ఇలలో. వాటిని వేరుచేయ ఎవరి తరం చెప్పండి. ఈ క్రొత్త కదంబం మీ అందరి ఆనందం కొరకే. అనురాగంలోని రుచిని చాటిచెప్పటానికేను....ఎవరి స్థానం వారిదే ఇట నేను అభిమానించని వ్యక్తే లేరు...;) మీ అకాంక్షకి సంతోషం.

    ReplyDelete
  33. భా.రా.రె, మాటలు లేవిక. బట్టీయం వేస్తున్నాను మీ పదాల్ని, ఆ జిగిబిగి మరువాన్ని నిత్తరువుని, నను నిరుత్తరాలిని చేస్తుంది. నిజం చెప్పాలంటే మరువంగా ఈ రూపు మరుజన్మగా తోస్తుంది, మీవంటి మిత్రులంతా అమృతాన్ని సేవించి గంధర్వ గానాలు చేసి, నవనీతమంటి పదాలు పలికే స్వర్గ సీమని ఏలే రసరాగ హృదయులనిపిస్తుంది. ధన్యోస్మి నేస్తం!

    ReplyDelete
  34. మీ కవితకు మీరిచ్చిన వివరణ అపూర్వమండి..really great thnougt!!

    ReplyDelete
  35. తృష్ణ, సంతోషమండి. అనుభూతులు ఇచ్చి, వాటిని ఆస్వాదించగలిగే మనసిచ్చి, పంచుకోగల సన్నిహితుల్ని తోడుచేసిన నా జీవితానికి అర్థం వివరించేవే నా కవితలు.

    ReplyDelete
  36. "మరువానికి నిత్యమల్లి కలిసింది
    ఇల మోహన గీతమై విరిసింది
    ప్రతి మనసుతో తన ప్రేమ
    సుగంధాల ఊసులెన్నొ చెప్పింది"

    చాలా బాగుంది మీకవిత :)

    ReplyDelete
  37. కవిత మనసుకు హత్తుకునేలా ఉందండి...మీరు నిత్య మల్లి చిత్రం అడిగారుగా ఇది చూడండి

    http://naachitraalu.blogspot.com/2009/01/blog-post.html

    కాశిరత్నాలు ఇవిగో

    http://naachitraalu.blogspot.com/2008/07/blog-post_21.html

    http://oammayi.blogspot.com/2008/07/blog-post_24.html

    ReplyDelete
  38. ఉష గారూ, ఏమిటండీ ఆ పొగడ్తలు? మరీ ఎక్కువై కొమ్మకున్న ఊహల ఊయల ఊరంతా ఊరేగుతుంది.

    ReplyDelete
  39. అంత మాతృప్రేమని అనుభవించారంటే... ఆ అదృష్టం ఆ నిత్య మల్లిదా? లేక ఆ మరువానిదా?

    మరువలేని మధురానుభూతినందించిన మీకు మాటల్లో చెప్పలేను సలాం. మీరు సైన్టిస్టు అన్నారు కదా. యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫోర్సెస్ సాధించినంత ఆనందం కలిగింది.

    ReplyDelete
  40. నేను గారు,

    నిత్యమల్లి ఫొటో నన్నూ ఆనందపరిచింది. అందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  41. ఉష గారు,

    ఇన్ని చెప్పిన మీకు ఒక చిన్న కానుక. పై టపా కూడా నలబై రెండు. క్రింది టపాలానే. :-)

    ReplyDelete
  42. మొలకనవ్వు వెదురుని వేణువుచేసింది
    మహతిమీటని సరాగం వెలికివచ్చింది
    నవరాగంతో స్నేహగీతమొకటి తరంగమైంది
    మొగలితావితో వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది
    అధ్బుతం గా వుంది మీ భావ ప్రకటన ఉష.

    ReplyDelete
  43. భా.రా.రె. ఛా మీకలా అనిపించిందాండీ? నేనేమో రాచ మర్యాదలు, రాయలవారి ముత్యాల సరాలు అనుకున్నానే ;) ఓ క్షణం భువన విజయం, పెద్దనామాత్యులు, రాయలవారి దేవేరిని వూహించేసుకోండి, అంతా సహజంగా తోస్తుంది. jk అవి నిజంగా మనసులోంచి వచ్చిన మాటలండి. ఆ వూయల ఆపకండి.

    ReplyDelete
  44. విశ్వప్రేమికుడు గారు, మరువపు వనానికి వచ్చేసారు కనుక మళ్ళీ రావాలనే ఆకాంక్ష, వస్తారనే ప్రగాఢ నమ్మకం. నాకవితలకు స్పందించి కవిత రాసి, ఇంతటి మురిపాన్ని, అదృష్టాన్ని నాకు కలగచేసినందుకు సదా నేనెప్పుడూ ఋణపడేవుంటాను. మీ బ్లాగు టపాలు 18 వీలునిబట్టి చదువుతాను. just skimmed through and pics are so good. ధన్యవాదాలు.

    ReplyDelete
  45. నేను గారు, మీరంత శ్రద్దగా చిత్రాల లింకులు ఇచ్చినందుకు కళ్ళు చెమర్చాయి. అంతా అపరిచితులం అభిమానం ఇచ్చిపుచ్చుకుంటూ. నిత్యమల్లి ఎంత చక్కగా వుందో. కాశీరత్నాలతో అనుబంధం ఏనాటిదో. రెండూ ఇలా అగపడటం, ఇది నా నిత్యమల్లి వచ్చిన వేళావిశేషం కావచ్చు. మీ ప్రొఫైల్లోని సితాకోకచిలుక మునుపొకసారి చూసిన గుర్తు. వారాంతంలో తీరిగ్గా మీ బ్లాగు మళ్ళీ మళ్ళీ చూసి మురుస్తాను. నా కవితని మెచ్చినందుకు నెనర్లు. ఈ ప్రత్యేక టపాలో మీ ప్రత్యేక ముద్ర శాస్వతంగా నా మదిలో చెక్కబడిపోయింది.
    BTW, more than half of your favorite books are my fav too... :)

    ReplyDelete
  46. గీతాచార్య, దీన్నే తొండి అంటారేమో కదా? మీరు 41వ వ్యాఖ్య వ్రాయగానే అనుకున్నాను. ఇక లాభం లేదు ఈ పిల్లాడు నాకెలాగూ 42 వ్యాఖ్య పెట్టే అవకాశం ఇవ్వడు అని. మీరే అన్నారు కదా, అంతా కృష్ణ మాయ అని. ఈ మధురానుభూతి ఆ కొంటెవాడి లీలేనేమో? మాతృప్రేమ ఒక వరం అయితే దాన్ని పూర్తిగా ఆస్వాదించే ఈ అదృష్టం నాకొక అపురూపమైన అనుభవం. ఇది మరువం నిత్యమల్లి కలిసి తెచ్చుకున్న పుణ్యఫలం, జన్మ సాఫల్యం. వెరసి ఈ అతిశయం. "యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫోర్సెస్ " yes a very true and apt feeling for me too! నెనర్లు.

    ReplyDelete
  47. భావన, ఇక am sweating, దేముడా! ఇంకొకర్ని వ్యాఖ్య వ్రాయమని చెప్పు. నాకు 50వ వ్యాఖ్య పెట్టే అవకాశం ఇవ్వు అని ;) మీ మెచ్చుకోలు మాత్రం బోనస్ అండి. మీరు ఎంచుకున్న ఆ నాలుగు పంక్తులే నాకు ముందుగా తోచిన స్పందన. వాటికి వెనకా ముందు పదాలు చేర్చి, ఈ అల్లిక కూర్చాను. కనుక నిజ నాడి మీరే పట్టారు ఎంతైన కృష్ణగీతాలు కట్టిన మానసం తనదైన శైలిని పట్టదా... నెనర్లు.

    ReplyDelete
  48. ఉష గారు,,మీ బ్లాగ్ లో బాగా నచ్చిన పోస్ట్ లో ఇది ఒకటి..చాలా బావుంది

    ReplyDelete
  49. హాఫ్ సెంచరీ చేసేసారు కదా..కంగ్రాట్స్ :)

    ReplyDelete
  50. హరే కృష్ణ, మీ 50వ వ్యాఖ్య "హాఫ్ సెంచరీ చేసేసారు కదా..కంగ్రాట్స్ " ;) - మొత్తానికి మీ క్రికెట్ అభిమానాన్ని నా [Did I get it right? కవిత + వ్యాఖ్యానం == ] కవితోఖ్యానానికి కూడా అప్ప్లై చేసేసారన్నమాట. వతనుగా వచ్చేవారు కదా అనుకున్నాను, సరేలే వేసవి విరామం కావచ్చు కదా అనీ సరిపెట్టుకున్నాను పలుమార్లు. "మీ బ్లాగ్ లో బాగా నచ్చిన పోస్ట్ లో ఇది ఒకటి..చాలా బావుంది" అనుభూతి వూహనుండి కన్నా వాస్తవంలోంచి జనించినపుడు సహజత్వానికి దగ్గరగా మనసుకి అంగీకారమయ్యేలా వుంటుందేమో. నేను చాలా ఎమోషనల్ అని అంతాంటారు. కాదో అవునో ఇంకా తెలియదు. మీకు నచ్చినందుకు నెనర్లు.

    ReplyDelete
  51. యాదృఛ్ఛికం - ఎన్నో రకాలు: ఈ కవితకి స్పందించిన అందరికీ మరో మారు హృదయపూర్వక వందనాలు. ఇన్ని యాదృఛ్ఛికం అయిన ఘటనలు చూసాక నాది ఒకటే ఐఛ్ఛికం, మరిన్ని అంకెల అతిశయాలు నను చేరాలి. అభిమానధనాలు నేను మూట కట్టుకోవాలి.

    1. మరువం జననం - యాదృఛ్ఛికం
    2. ఈ బంధం - యాదృఛ్ఛికం
    3. ఆ అనుభూతి 100 వ కవితగా వెలికి రావటం - యాదృఛ్ఛికం
    4. స్నేహితులదినం నాడు టపాగా రావటం - యాదృఛ్ఛికం
    5. ప్రదీప్ స్వల్ప విరామం తర్వాత పునరాగమనం - యాదృఛ్ఛికం
    6. భా.రా.రె. చక్కని కవిత గా స్స్పందించటం
    7. "నేను" గారి పరిచయం అదీ అరుదైన నిత్యమల్లి చిత్రాన్ని పంచుకుంటూ పరిచయమవటం - యాదృఛ్ఛికం
    8. ఆదిత్య, ధన, విశ్వప్రేమికుడు గార్లు ఈ వాస్తవానురాగాన్ని గుర్తించటం - యాదృఛ్ఛికం
    9. ఈ ఉదయం హరేకృష్ణ గారి 50 వ వ్యాఖ్య - యాదృఛ్ఛికం
    10. వస్తారని నమ్మకంగా అనుకున్న ఓ నలుగురు నిరాశ పరచటం - యాదృఛ్ఛికం

    ReplyDelete
  52. అయితే శ్వేతం కాదా శతక కవిత
    నేను వస్తూనే ఉంటా, కాకపోతే అమెరికాలో కన్నా ఎక్కువ బిజీగా ఉన్నాను అంతే

    ReplyDelete
  53. ప్రదీప్, మీరు యక్ష లోకమ్నుంచి వచ్చారనుకుంటున్నాను కనుక నేను సమవర్తి సంతతిదాన్నని మనవి చేస్తూ ;) మహా శ్వేతం నా 100 వ టపా. కేవలం కవితల్ని లెక్కిస్తే ఇది 100 వ దని ఈ ఉదయానే తెలిసింది. ఎందుకో ఈ ప్రశ్న మీనుండి వస్తుందనీ ముందే తోచింది... రండి మీరు రావాలనే నా ఆకాంక్ష. వెనకా ముందుల గణింపు కాదు ముఖ్యం, రాసి కాదు నాకు వాసి కావాలి [మీకది తెలుసు] నెనర్లు.

    ReplyDelete
  54. ఓహో అలా వచ్చారా, అయితే నా శతక టపా "అనంత వృత్తాన్ని" చూడండి.... శతక కవితకు బోలెడు దూరములో వున్నా

    ReplyDelete
  55. ఇంత సుదీర్ఘ సంభాషణల తరువాత ఇంకానా నేను. వెదురు పువ్వును ఎంచుకోవడంలోనే దాగివుంది మీ స్వచ్చత. వనవాసంతో అనుబంధం వున్నవాళ్ళకే అది అనుభవైకం. మిమ్మల్ని మరీ కవ్వించి మీలోని అంతర్మధనాన్ని చిలికింప చేసిన మిత్రులందరికి నా నమస్కారం.

    ReplyDelete
  56. ప్రదీప్, అద్భుతం, శతకానికి సరైన అంశం. వ్యాఖ్య వ్రాసే భాగ్యం కలిగినందుకు సంతోషం. మీ ప్రభంజనం మొదలవ్వాలే గానీ ఎంతట శతకాన్ని చేరటం. పదండి మళ్ళీ కలిసి ఓ శతకం చేసేద్దాం.

    ReplyDelete
  57. వర్మ, వెదురుపువ్వు నవ్విక మరింత విరుస్తుంది :) పైన చెప్పిన పది సంగతుల్లో ఆఖరుది ఇపుడు 25% తగ్గిపోయింది. అర్థం అయింది కదూ. ఇట ఎవరి స్థానం వారిదే. నా పట్ల మీరు వ్యక్తీకరించిన అభిమానం మీ వ్యక్తిత్వానికి ఋజువు. ఈ కాలంలో ఎంతమంది ఎదుటివారిని మనస్ఫూర్తిగా స్వీకరించగలరు చెప్పండి? నాకు అమితానందంగా వుంది. కలిసి అంతా ఇలా సాహితీపయనంలో శిఖరాగ్రాలు చేరాలి.

    ReplyDelete
  58. శతాధిక కవితా కవనామణిశిఖామణులందరూ కలసి అవధానాస్వాదనలో ఉన్నట్టున్నారే? నాలాంటి పసివారికి ప్రవేశముందా?
    పసివారంటేనే కాళ్ళమధ్య దూరతారని కదా, దూరిపోతాను.

    ఉషగారు కవిత రాస్తే వ్యాఖ్యోధృతి ఇలా ఉల్కాపాతమే అన్నమాట! మీ కవిత కన్నా, మీ కవితాపాఠకుల జోరు "మీ పాఠకుల" కులంలా కనిపిస్తూ భలే సంతోషాన్నిస్తోంది. నాదీ అదే కులం అనుకోండీ, కాస్తాగొచ్చానంతే!

    మరువానికి నిత్యమల్లి కలిసింది
    పచ్చదనానికి తెలుపు మనసిచ్చింది
    మనసూ, ప్రేమా కలసి ప్రేమలో పడినట్టు
    కన్నుకీ, కనుపాపకీ ఉన్న సంబంధం గుర్తొచ్చింది.
    నా కన్ను కూడా రెప్పవిచ్చి నవ్వింది.

    ReplyDelete
  59. ""అమ్మ" అని నిను పిలవొచ్చా అని పాపాయిలా ఒడిని చేరింది. నా బిడ్డ మాదిరి నా జీవితాన మరో స్మృతుల సంకలనాన్ని మొదలిడింది."

    through blogs? Am I reading right? Or my eyes are fooling me? Yes. god is there still.

    ReplyDelete
  60. మొలకనవ్వు వెదురుని వేణువుచేసింది

    అద్బుతమైన భావన.

    చాలా బాగుంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  61. హేయ్ ఆనంద్, "నా కన్ను కూడా రెప్పవిచ్చి నవ్వింది." ఆ కవనం మీకే సాధ్యం. నిజంగానే ఇది ఉల్కాపాతం మీ వ్యాఖ్యా ధార. :) పసివాడు కృష్ణుడు కాదా నోట బ్రహ్మాండాన్ని చూపింది, బాలకుడు వామనుడు కాదా మూడు లోకాలు కొలిచిందీను. మీదీ అంతే ప్రతిభ. అనువంశికం మీది ఆకతాయి వూసులు నావీను ;)

    ReplyDelete
  62. NoBody, welcome to my blog. let me ask this. In your blog post "నేను ఎవరిని? అంటే Who Am I?" you said 'అద్సరే కానీ నాకు దేవుడంటే నమ్మకం లేదు।' and in your comment above you stated "Yes. god is there still." So what made you to change your opinion? Whatever force/thought made you to wonder "నాకు నేనే తెలియదు। " is what some call god. Your quest must have brought you to that belief. Just an observation of your writings and my hobby of relating things. Thanks for the comment and keep coming.

    ReplyDelete
  63. బాబా గారు, మీ పలుకు మంచి గంధం చినుకు. అరుదైన మీ రాక అనుకోని చిరుజల్లు. BTW my disappointment is down to 25% :) "మొలకనవ్వు వెదురుని వేణువుచేసింది" అదే నా తొలి స్పందన, దాన్నుంచే మిగిలిన అల్లిక. నెనర్లు.

    ReplyDelete
  64. Usha garu..
    నిత్యమల్లి
    మొగలిపువ్వు
    వెదురుపొద
    మొలకనవ్వు
    స్నేహగీతం
    తేలిక పదాల మీ సృజనకు నా అభినందనలు..

    and congrats for ur efforts on Maruvam.

    ReplyDelete
  65. సుజ్జి, తేలిక పదాలకి ఈ గళం కూర్చేసరికి గుండెలో మూటకట్టిన ప్రేమ వాటికి జతచేరి తూచలేనంతదైంది ఈ కవిత. జన్మాంతం గురుతుండే వేణుగానం. all my efforts are to keep your excitement up all the time. ;) నెనర్లు.

    ReplyDelete
  66. "మాతృప్రేమ ఒక వరం అయితే దాన్ని పూర్తిగా ఆస్వాదించే ఈ అదృష్టం నాకొక అపురూపమైన అనుభవం. ఇది మరువం నిత్యమల్లి కలిసి తెచ్చుకున్న పుణ్యఫలం, జన్మ సాఫల్యం. వెరసి ఈ అతిశయం."

    కళ్ళు చెమర్చాయి.

    ReplyDelete
  67. గీతాచార్య, గుండె చెమర్చటం ఎపుడైనా చవిచూసారా, నిజానికి ఈ బంధం గురించి తలుచుకుంటే నాకు కలిగే అనుభూతి ఆ పాటిది. యశోదమ్మ బహుశా కృష్ణుని పెంచినపుడు చెందున తాదాత్మ్యం కావచ్చది. మాతృప్రేమ కనటంలో కాదు పెంచటంలోనే వెలువడుతుంది అన్నది అందుకే బలీయం. మానసిక భావన మరింత బలోపేతం

    ReplyDelete
  68. మనసు మళ్ళించడం ఏమీ లేదండీ.. ఇక్కడ బెంగళూరు నుండి అమెరికన్ క్లైంట్స్ కి పని చేసేప్పుడు సాయంత్రాలు మన చేతిలో ఉండవు, దానితో నాకోసం నే గడిపే సమయం కుదించుకు పోతుంది. అందుకే మరువపు వనవిహారమే కాదు, బ్లాగ్వీక్షణమే కాస్త తగ్గింది:-)

    ReplyDelete
  69. వేణు గారు, నాకు తెలుసండి మీరన్న ఇబ్బందులు. నేను ఇక్కడి నుండి చైనా, బెంగుళూర్ టీంస్ తో పనిచేసానిదివరలో. నిజానికి ఈ మధ్యనే మాటలు, మన్నిపులు మాని బ్లాగుల్లో మునిగానని ఒక ఆరోపణ వచ్చింది. ఆ వారా కాస్త దృష్టి మళ్ళించి మరువం మరీ బెంగ పెట్టుకున్నపుడే వచ్చాను కొద్ది రోజులు. ;) ఏదో ఇలా ఉధృతం ఒకసారి, ఉలుకు పలుకు లేకుండా పోవటం ఒకసారి నడిపిస్తున్నాను. నెనర్లు.

    ReplyDelete
  70. ఉష గారూ ఇన్నాళ్ళూ మిస్సయ్యనండీ. మీ మాతృ భావన నిజంగా అద్భుతం. ఎవరండీ ఆ అదృష్టవంతురాలు/డు (లు అనే అనుకుంటున్నాను ;-))? ఆఁ ఆఁ వద్దులెండీ. కొన్ని ఎమోషన్స్ ప్రైవేట్ అయితేనే అందం.

    Anyway, మీ కవితా, ఆ వ్యాఖ్యలూ, మీరిచ్చిన వివరణలూ... వాహ్! నాకు మా అమ్మ గుర్తొచ్చింది.

    ReplyDelete
  71. ప్రియ, మీ వలన మరో సారి నేను కూడా కవిత, వ్యాఖ్యలూ చదువుకుని మురిసాను. ఈ కవిత అమ్మతనానికే అర్పణ. నెనర్లు.

    ReplyDelete
  72. :-)

    inkemi cheppagalanu. intha chadivaaka. emi cheppinaa aa nitya malli, ee maruvam... andaanni chedagottatame. Gr vaddule.

    ReplyDelete
  73. అ.గా.గారు, 10 నిమిషాలు వెచ్చించి ఈ మమతానురాగ మాలికని చూసినందుకు థాంక్స్!!!! :)

    ReplyDelete