నా జీవనమే వ్రతం, నీ దీవెనలె ఫలం!

ధనం, ధాన్యం,
త్యజించగల దాతృత్వం.
విజయం, ధైర్యం
విడనాడని అభయం.
విద్య, వినయం
అందుకున్న సంతానం.
అడగకనే ప్రసాదించిన
వరప్రదాయనీ!
విషయవాసన సంహరించు
మితభాషణమే నాకు భూషణం
అనురాగపుజల్లులు కురిపించు
అదే నాకు కనకధార
చెరగని చిరునగవు వరమివ్వు
అదే నాకు ఆభరణం
సంకల్పసిద్దికి నాలో నెలవుండు
మోక్షమార్గాన నీవే నాకు తోడు.

***************************
నా మాట: సహజమార్గ సోపానానికి పునాది సనాతన సాంప్రదాయాలు. మతం అన్నది నాకు ఒక వాహిక మాత్రమే. ఆత్మ పరమాత్మల అనుసంధానం పట్లనే ఆసక్తి వుండేది. మన రీతి రివాజుల ఔన్నత్యాన్ని, ఆంతర్యాన్ని అన్వేషిస్తూనే ఆ మార్గానికి రాగలిగాను. దేముళ్ళు దేవతలు అడిగిన ధన వస్తు కనక వాహనాలివ్వటానికి కాదు వాటికి అతీతమైన మానసిక బలానికి వారే ఆధారం అని నా చిన్నారికి చెప్పే ప్రయత్నంలో వెలువడిన మనవిది.
***************************

31 comments:

 1. ”దేముళ్ళు దేవతలు అడిగిన ధన వస్తు కనక వాహనాలివ్వటానికి కాదు వాటికి అతీతమైన మానసిక బలానికి వారే ఆధారం”
  మీ చిన్నారికే కాదు అందరికీ ముఖ్యమైనదే.

  ReplyDelete
 2. ఉషాగారు , మీ మాటతో నేనూ ఏకీభవిస్తాను ...ఆధునికత మత్తులో కనుమరుగైపోతున్న మన సనాతన సాంప్రదాయాల్ని మన పిల్లలికి అందజేయడానికి మనవంతు ప్రయత్నమే ఈ పూజలూ ...వ్రతాలూ ..మనసు బలహీనపడిన క్షణంలో ఈ దైవభక్తి నిశ్చయంగా వారికి మానసిక బలాన్నిస్తుంది .తప్పటడుగులు వేయకుండా కాపాడుతుంది .
  ఎంత ఆధునికత పెరిగినా సాంప్రదాయం మన నరనరాల్లో జీర్ణించుకు పోయిందనటానికి ఉదాహరణ ..రోజూ జీన్స్ , మిడ్డీస్ , వేసుకునే కాలేజీ అమ్మాయిలు ఈరోజు పట్టు పరికిణీ ఓణీలతోనూ ...చుడిదార్స్ ,ఫార్మల్స్ వేసుకొని ఆఫీస్ కు వెళ్ళే మహిళలు చక్కటి చీరకట్టులోనూ కనిపించడమే ! కన్నులపండువుగా ఉందండీ ...మీ కవితలాగే ...

  ReplyDelete
 3. చాలా చక్కగా చెప్పారు.
  దైవ ప్రార్ధన వలన మానసిక బలం వస్తుంది.
  ఆ బలం వలన మనం కోరుకొనే విద్యా ఉద్యోగ ధన కనక వస్తు వాహనాలు సమకూరుతాయి.

  నేటి పిల్ల లకు భక్తి లేదన్నది ఎంతమాత్రమూ నిజం కాదు. ఆ దిశగా మనం ప్రోత్సహించటం లేదంతే. నేడు చాలామందిలో కనిపిస్తున్న మనోవికారాలను పోగొట్ట గల శక్తి మన ఆధ్యాత్మిక విధానంలో ఉంది. అది తెలుసుకోవాలంటే వారిచేత అప్పుడప్పుడూ పూజలు చేయిస్తూ ఉండాలి. :)

  ReplyDelete
 4. God is center outside your own self అంటాడు మా ప్రొఫెసర్. మనిషి తన హద్దుల్లో లేని విషయాల గురించి ఆలోచించడానికి ఒక ఆధారం కావాలి. అదే భగవంతుడు. కొందరి ఆ దేవుడి అవసరం ఎక్కువుంటుంది. కొందరికి తక్కువుంటుంది. నాలాంటోళ్ళు అసలు అవసరం లేదు అనో,ఉన్నా సమస్యాత్మకమే అనుకుంటాం.

  ReplyDelete
 5. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే!

  ReplyDelete
 6. "చెరగని చిరునగవు వరమివ్వు
  అదే నాకు ఆభరణం"

  :-) ఇచ్చితిమి. తీసుకొనుడు.

  ReplyDelete
 7. చాలా బాగా చెప్పారు.... మీచిన్నారికే కాదు మాకూ వర్తిస్తుందండి.

  ReplyDelete
 8. చాలా బాగుంది ఉష. "విషయవాసన సంహరించు" ఎన్ని జన్మ ల కృషి కావాలి దానికి! దీనికోసం మాత్రం ప్రార్ధించవలసిందే, సహాయం లేకుండా సాధించలేంది కదా.. చాలా బాగుంది మీ చిన్నరికి కే కాదు అందరికి కావాలి ఈ సందేశం...

  ReplyDelete
 9. ఈ చిరు ప్రార్థననే ఎంతో మక్కువగా తమదైన థృక్పథంతో స్వీకరించి ఎంతో ఉన్నతత్వాన్ని ఆపాదించిన సాహితీ మిత్రులందరికీ పేరు పేరునా ఇవే నా వందనాలు. దేముడు అన్న అంశమే ఒక మహా సంద్రం. దాన్ని ఈదటం అటుంచి కనులారా కాంచగలగటమే ఈ జన్మకి ధన్యత చేకూరుస్తుంది.

  ReplyDelete
 10. లక్ష్మి, అరుదుగా మీ ఆగమనం. తొలివ్యాఖ్యకి నెనర్లు
  విజయమోహన్, మీరు ఆమోదమిస్తే నాకు మహా ప్రమోదమండి.
  పరిమళం, ఎంతలోతుగా తరిచారండి!

  ReplyDelete
 11. విజయ్, అతి పిన్న వయసున మీ అవగాహనకి ఎందుకో సంతొషం.
  ప్రసాద్ గారు, అర్థం వివరించరా? నకు బోధపడిందో లేదో పొల్చిచూసుకుంటాను.
  మాలా గారు, ప్రియ, it's so nice to bag such a comment from you

  ReplyDelete
 12. మహేష్, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. వ్యక్తిగతాలకు, వ్యక్తిత్వాలకు నేనెపుడూ అభిమానినే.
  సృజన, లెస్సపలికించింది అమ్మలగన్నా అమ్మ తన ముద్దుల తనయ నోట! ;)
  పద్మార్పిత, అంతేనంటారా, హఠాత్తుగా పెద్దరికం వచ్చేసిన భావన! ;)
  భావన, చిరకాల దర్శనం! ముదావహం. మీబాణీ మీదే. మళ్ళీ కళ్ళు మూసేసుకుని నిశ్చలంగా జన్మాంతం వరకు అలాగే వుండాలనివుంది. నాకు అరుదుగా వచ్చే స్పందన ఇది. నమ్ముతారు కదూ?

  ReplyDelete
 13. My life is my message. Nice post. Simple yet inspiring.

  ReplyDelete
 14. గీతాచార్య, నేను అలవరచుకునేకొలదీ ఇంకా ఇంకా నిరాడంబరంగావుండేవారో, మానవసేవాతత్పరతలో మునిగినవారో, ఆధ్యాత్మికతలో పరిణితిచెందినవారో ఇలా ఎవరోఒకరు విశ్వమానవీయంపట్ల, ఏ ఆశింపులేని అనురాగంపట్ల మక్కువని పెంచుతూ స్ఫూర్తి పెంచుతుంటారు. ఈ కాలపు గృహస్తుజీవితం తఫస్సంత తీవ్రతరమని ఈ పరీక్షలే అరిషడ్వర్గాలని అధిగమించేందుకు ఉపకరిస్తాయని నాకు చెప్పబడిన సందేశం సందేహంలేకుండా నమ్ముతూ, నా జీవితం అలా మలుస్తున్న విధాతకి మరోసారి కృతజ్ఞతలు తెల్పుతూ మీకు నెనర్లు

  ReplyDelete
 15. దేహిమే పార్వతీపతే = O Lord! give me
  వినా దైన్యేన జీవితం = a life without pleading someone
  అనాయాసేన మరణం = an easy natural death
  దేహాంతే తవ సాయుజ్యం = ability to reach your abode after leaving the body

  ReplyDelete
 16. ప్రసాద్ గారు, "వినా దైన్యేన జీవితం" అన్నది "దైన్యమైన స్థితి లేని జీవితం ఇవ్వు" అన్నట్లుగా తప్పించి మిగిలినది మీరు వివరించినట్లే అనుకున్నాను. కృతజ్ఞతలు.

  ReplyDelete
 17. Thanks to థెరెస గారు. I fixed the typo and reposting it.

  Every morning I start my day after meditation followed by reading this quote from "Swami Vivekananda".
  ******************************
  “When I Asked God for Strength
  He Gave Me Difficult Situations to Face

  When I Asked God for Brain & Brawn
  He Gave Me Puzzles in Life to Solve

  When I Asked God for Happiness
  He Showed Me Some Unhappy People

  When I Asked God for Wealth
  He Showed Me How to Work Hard

  When I Asked God for Favors
  He Showed Me Opportunities to Work Hard

  When I Asked God for Peace
  He Showed Me How to Help Others

  God Gave Me Nothing I Wanted
  He Gave Me Everything I Needed.”

  ReplyDelete
 18. Teresa gaaru, Welcome to my blog and thanks for your first comment on this very deep subject. I believe I come across your comments at Kalpana Rentala's posts. Just thought of sharing an experience I had this mroning. Be its' called intution or something beyond explanation. I was a bit lazy to take out my flash drive where in I saved this quote. So quikly browsed for it, copied from http://thinkexist.com/quotation/when-i-asked-god-for-strength-he-gave-me/1329562.html and pasted it here. Then on second pass my eyes were stuck on this "line with typo" for a moment and I ignored a strange thought before it solidifies and moved on. Went out for 2 hours walk mostly dwelling over the responses and the concept of "life and god". Just checked the comments' updates and found your's comment with correction. And also apparently my flash drive version too had this typo. So, I am introduced to you by whoelse, it's him GOD. God looks after me. I feel GOD everywhere and do nothing special to have god within me. Thanks for your time.

  ReplyDelete
 19. I decided not to comment on this subject after so much discussion and comments...

  No comments.

  ReplyDelete
 20. భా.రా.రె. "No comments." but why? అలా ఎందుకో, ఎన్ని చెప్పినా ఎంత తరిచినా ఎవరి ప్రత్యేకత వారిదే. మీ మానసవీణ మరో రాగంలో మరిన్ని స్వరాలు ఇక్కడ కూర్చవచ్చు సుమీ! అపుడపుడూ నా మానసం నాతోపాటు కొందరి మనోగతాలను వెలికి తెస్తుంది ఇలా.... తిరిగి లౌకిక జీవితం రమ్మని పిలుస్తుంది.

  ReplyDelete
 21. మన దురదృష్టమేమంటే పురాణాలలో రాయబడ్డ గొప్ప తపస్సులన్నీ రాక్షసులు చేసినవో లేక కోరికతో చేసినవో... అయితే నిత్య తపోధారులు ఇద్దరు కనిపిస్తారు
  హరుడు శంకరుడు, లోకాలకు అధిపతి... అయినా నిరాడంబరుడు. సామాన్యుడిలా కనిపిస్తూ అసమాన్యమైన పనులు చేస్తాడు. శంకరుని కన్నా ప్రేరణ ఎవరు ఇవ్వగలరు...
  నారద మహర్షి, ఏ కోరికతో లోకాలను పావనం చేస్తున్నాడాయన...

  తపమంటే ముక్కు మూసుకు కూర్చుని చేసేది కాదులే... చేసే పనిని నిష్కామంగా కొత్త పుంతలు వెతుకుతూ ముందుకు దూసుకెళ్తూ ముందుకు లాక్కుపోయేది...

  ReplyDelete
 22. ప్రదీప్, నాకు అదే బాధ కలుగుతుంది, ఆధ్యాత్మిక ఔన్నత్యం కప్పేసే ఈ అనౌచిత దృష్టాంతరాలు ఎందుకు మనకి అందించబడ్డాయా అని. అంతలోనే అవి తెలియబట్టే కదా జీవన స్రవంతిలోనే తపస్సమానమైన ఆచరణ సాధ్యమయిందీ అని అనిపిస్తుంది. మీ వ్యాఖ్య మీ మానసానికి దర్పణం. ధన్యవాదాలు.

  ReplyDelete
 23. మీ బ్లాగును మరియు ప్రదీప్ గారి బ్లాగు చూస్తుంటే నాకు తెలుగు భాష, ఆ మాటకొస్తే ఏ భాష కూడా సరిగ్గా రాదనే భావన కలుగుతోంది. మీ బ్లాగు నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఇంకా ఈ టపాలో మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. నేను మీతో ఏకీభవిస్తున్నాను. నాకు ఈ ఆలోచన ఉండేది. కాని వ్యక్తపరిచే విధానాన్ని నేర్చుకోవలసి వుంది.

  ReplyDelete
 24. saipraveen, Thank you so much for finding my blog and these posts on spirituality. Just read your comments, will respond in detail alter. Meanwhile please comment if you could on
  జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు? at:
  http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html

  ReplyDelete
 25. saipraveen జీవనమే వ్రతమని అంగీకరించిన మీ వ్యాఖ్యని సవినయంగా స్వీకరిస్తున్నాను. మీరు ముందుగా నా బ్లాగులో ఈ టపాలు చదవటం యాదృఛ్ఛికం కాకపోవచ్చును. కారణం దైవసంకల్పం కావచ్చు. భాష విషయంలో నేనింకా విద్యార్థినినే. ఈ బ్లాగ్లోకంలోని మహామహుల చెంత పిపీలకాన్నే. నెనర్లు.

  ReplyDelete
 26. ౧ ధనధాన్యాదిదాతృత్వమూ విజయాభయధైర్యాలూ విద్యావినయయుతసంతానమూ ఇచ్చిన వరప్రదాయినీ అని భలే ముడిపెట్టారు. ఇంతకూ ఎవరండీ ఆ వరప్రదాయిని? :)

  ౨ త్యజించగల దాతృత్వం అనడంలో (వేఱైనా) దానం త్యాగం రెండూ ధ్వనిస్తున్నాయి. బావుందండీ.

  ౩ భూషితం అంటే అలంకరింపబడినది, భూషణం అంటే అలంకరించేది కదండీ. మితభాషణమే భూషణం వ్రాయబోయి వేఱే వ్రాసినట్టున్నారు. అలాగే, వ్యాకరణరీత్యా అనురాగపుజల్లులు అనాలనుకుంటానండీ (వేఱే ఎవరినైనా అడగాలి).

  ౪ మోక్షమార్గాన నీవే నాకు తోడు... మంచి ముగింపు ఇచ్చారు. చక్కటి ప్రయత్నమండీ ఇది, బావుంది.

  ReplyDelete
 27. రాఘవ, "ఇంతకూ ఎవరండీ ఆ వరప్రదాయిని?" మీకు తెలియకటండి నన్ను చమత్కరించటానికి కాకపోతే? ;)
  "మితభాషణమే నాకు భూషణం" సరిదిద్దాను. భూషితం అన్న ప్రయోగంతో ముందు వ్రాసిన పంక్తి సవరింపులో ఇది వదిలేసాను. పట్టుకున్నందుకు ధన్యవాదాలు.
  "అనురాగపుజల్లులా" అన్నది నాకూ తెలియలేదండి. వదిలేసానందుకే. మీకు నచ్చినందుకు సంతోషం. సమయం వెచ్చించి సరిదిద్దినందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete