నవ్వు పరిచిన దారిన అడుగు పడేలోపు
కన్నీటి వరద గతుకులు నింపిపోతుంది
జరుగుబాటు పాట్లు రోజుల్ని మింగేస్తుంటే
ఎడబాటు రాసిచ్చి అనుభూతి కనుమరుగౌతుంది
యాంత్రిక మంత్రం జపిస్తూ జీవితం ఏకాంతాన
నిర్లిప్త స్వరంతో నిర్వేద గీతం పాడుతుంది
అరచేతి గీతల్లో అన్ని భాగ్యరేఖలున్నా
లెక్కకందని చింతలకి లేదు భారమితి
లయ తప్పని హృదయానా రణగొణ ద్వనులే
ఎందుకిలాగ అని ఎడతెగని యోచనలే
ఇందుకు అని ఏ ఒక్కరైనా వివరించరా?
ప్రేమలేమి అని నాతో అంగీకరించరా?
"యాంత్రిక మంత్రం జపిస్తూ జీవితం ఏకాంతాన
ReplyDeleteనిర్లిప్త స్వరంతో నిర్వేద గీతం పాడుతుంది" ...బాగుందండి..
వివరణకు సాధ్యమైతే జీవితం ప్రశ్నెందుకౌతుంది?
ReplyDeleteప్రేమ లేమిని భరించడం శులభమైతే ప్రేమ దైవత్వమెందుకౌతుంది?
తోడు లేదనుకున్న కవిని కవిత ఎలా విడిచివెళుతుంది?
మీ గుండెలో ఆ కవిత దాగున్నాక ప్రేమ లేమెక్కడుంది?
ఎదురుచూస్తున్న ఆ కవిత కన్ను మీ ప్రేమకై తడిసిపోతోంది.
వెళ్ళి పలకరించరూ ఓ సారి!
ప్రేమలేమి అని నాతో అంగీకరించరా?
ReplyDeleteప్రేమ లేమి కాదేమో! ప్రేమని అనిత్య వస్తువుల వైపు మళ్ళించడం వలన నేమో!
అదే ప్రేమని సత్య జ్ఞాన అనంతు డైన పరబ్రహ్మ వైపు మళ్లిస్తే నిర్లిప్త నిర్వేద చిన్తామయ యోచనలు అదృశ్యమై అఖండానందం ప్రత్యక్షం అవుతుంది.
good show
ReplyDeleteయాంత్రిక మంత్రం జపిస్తూ జీవితం ఏకాంతాన
ReplyDeleteనిర్లిప్త స్వరంతో నిర్వేద గీతం పాడుతుంది
wonderful..!!
adbhutamgaa undanDi.nEnu kuDaa monnoka kavita raasaanamdOy..vIlumTE chUdamDi.
ReplyDeletehttp://trishnaventa.blogspot.com/2009/07/blog-post_21.html
Out of the context, FYI -
ReplyDeleteఈరోజు చారీజీ గారి పుట్టినరోజు. అందరూ తిరుపూరు వెళ్ళారు ఆశ్రమానికి.
రామరాజు గారు, మాస్టారి 83 వ పుట్టిన రోజని తెలుసండి. మా వూర్లో 6 గురు మున్నాము. ప్రతి బుధవారం గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటాము. నెలకొకసారి సత్సంగ్ జరుతుంది అపుడు ప్రక్కవూర్ల వారు కలిసి ఎక్కువ మందిమి అవుతాము. మీకు తెలిసేవుంటుంది http://www.sahajmarg.org/live-from-tiruppur మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారక్కడికి. మిమ్మల్ని అపుడపు తలుచుకుంటూనేవున్నాను. బహుశా నాలో ఆ కవితలోని వేదన, శోధన మాస్టారు కలిగించిందేకావచ్చును.
ReplyDeleteప్రసాద్ గారు, మళ్ళీ వివరంగా వ్రాస్తాను ఇంకొక వ్యాఖ్య. కానీ మీరూపంలో నా అధ్యాత్మిక గురువులు మాత్రం నను సరైన మార్గానికి మళ్ళిస్తుంటారు. బహుశా మీ పరిచయభాగ్యం అందుకే కలిగిందేమో. పైన రెండూ వ్యాఖ్యలు చదివితే మీకు వివరం తెలుస్తుంది.
ReplyDeleteఉష గారు చాలా బాగుంది.
ReplyDeleteగతుకులు నింపిన వరద
గంతలూ తీసుండాలే ?
కనుమరుగయిన అనుభూతి
కనులు తెరిచుండాలే ?
నిర్వేద గీతానికి ఆవల
నిశ్శబ్దమంతా ఆవరించుండాలే ?
అరచేతి గీతల్లో అందలాల వెదుకులాట,
చాపక్రింద చేరే చింత దాచిందేమో ..?
ప్రేమచూరు తలదాచుకోడానికే..
వాన ఆపే దారి మనకులేదు...
మా అమ్మగారు కూడా సహజమార్గం పాటిస్తుంటారు. మా అమ్మగారు కూడా ఎక్కడికో ఈమధ్య వెళతానన్నారు. బహుశా తిరుపూరే కావచ్చు. మళ్ళీ కనుక్కోవాలి.
ReplyDeletemy comment :)
ReplyDeletehttp://chiruspandana.blogspot.com/2009/07/blog-post_24.html
కన్నీరు నిండిన గతుకులు
ReplyDeleteచిర్నవ్వులతో పూడ్చుకుంటూ
యాంత్రికమైపోయిన జీవితాన్ని
బృందావనిగా మలచుకుంటూ
నుదుటి గీత ఎలా ఉన్నా
బతుకుబాటలో పూలుపరుచుకుంటూ
కాంక్రీట్ కీకారణ్యం కలుషితమైపోయినా
నీ ప్రేమనే శ్వాశిస్తూ జీవిస్తున్నా .....
ఇక ప్రేమరాహిత్యానికి చోటెక్కడిది ?
ప్రేమ లేమి అని అంగీకరిచలేనేమో ఉషాగారు మరోలా భావించరుకదా ?
పరిమళం గారూ, ఉషారాణి గారు ఓట్లకౌంటింగ్ మొదులెట్టారు. రిగ్గింగ్ చేయడానికి రడీగా వుండండి :)
ReplyDeleteమురళి, మధుర, బహుశా బ్రతుకులోని అనివార్యమైన యాంత్రికత్వంతో మీరూ విసిగివుంటారు కనుక ఆ పంక్తులు మీ మనసుని తట్టాయి. ఆ రక్కసికి బందీని కాలేకే ఈ నిస్పృహ కేకలు పెడతాను, నా అనుభూతి తిరిగి నన్ను చేరే వరకు అనాధ మాదిరి అల్లాడిపోతాను. నెనర్లు.
ReplyDeleteకొత్తపాళీ, నెలబాలుడు, తృష్ణ గార్లు, మీరు మెచ్చినందుకు ముదావహం. వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీతో సంపూర్ణంగా అంగీకరిస్తున్నా? హృదయాల మధ్య కమ్ముకుంటున్న పొరలను తొలగించేది ప్రేమే కదా?
ReplyDeleteఆనంద్, ఎక్కడిదీ మీకీ అభిమానం ఈ మరువం పట్ల? వివరం చెప్పమంటే నన్ను ప్రేమలోక ద్వారం వరకు నడిపించారు. కవితల పుష్పాలు మాలగ అల్లి ప్రేమని పంచే ప్రతి హృదికీ సమర్పిస్తాను. మనసు చెదిరిన మరుక్షణం వెలికి వచ్చే వేదన ఈ కవితకి జన్మ నిస్తే మీ వ్యాఖ్య ఆ మనసుకి క్రొత్త జన్మనిచ్చింది. ఇది అతిశయోక్తి కాదు, ఎందుకిలా అని ఇక అడకూడదనే నిర్ణయం. నెనర్లు నేస్తం.
ReplyDeleteరామరాజు, శరత్ గార్లు, సహజమార్గ ప్రస్తావనతో మనసుకి ఓ నిబ్బరాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteప్రసాద్ గారు, మీరన్నది నిజమే కావచ్చు. లౌకిక బంధాలు ఏర్పరచింది, భవసాగరాన ముంచేసిందీ ఆ పరంధాముడే. ఓ క్షణం విరాగినిగా మారుస్తాడు మరు క్షణం అరిషడ్వర్గాల ఓలలాడిస్తాడు. కనుమాయతో ఈ భావనలు స్వైరవిహారం చేస్తాయి, అంతర చక్షువు తెరుచుకోగానే నాదంటూ కానిదాన్నే నాదని భ్రమిస్తూ, భ్రమరమై, భ్రాంతి చుట్టూ భ్రమణం చేస్తున్నానని గ్రహించుకుంటాను. మీరన్న ఆ గమ్యం చేరటానికి ఈ పయనంలో ఈ ఒడిదుడుకులు తప్పవేమో.
ReplyDeleteభా.రా.రె. గారు, మీ బ్లాగులో అన్నీ రంగరించేసాం. మీకే వోటుబలం వుంది కనుక కుర్చీ ఖాళీ చేస్తున్నాను. ఇక మీదే రాజ్యం. :)
ReplyDeleteఆత్రేయ గారు, మీ మాటే "మనము మనసు చివుక్కుమన్న సంఘటనలనే ఎక్కువగా.. గ్లోరిఫై చేసి మన కాగితాల్లోనూ.. కవితల్లోనూ రాసుకుంటామేమో.." నాకు లోతైన గాయం తగిలింది అందుకే ఇంతగా వేదనపాలైంది. కానీ నా మనసుకే తెలిసిన భాష్యం కనుక కారణభూతునికి ఇంకా చీమ కుట్టలేదు. లేదా తేలుకుట్టిన దొంగ మాదిరే గమ్మున వున్నట్లున్నాడు. మీరింతమంది ఈవలి ఒడ్డుకి లాగినందుకు ఆవల ఊబిలో కూరుకుపోయే గతి తప్పించినందుకు ధన్యవాదాలు. మీ పార్టీలో చేరిపోయానిక.
ReplyDeleteపరిమళం, కలిమిలేములు ప్రేమలోనూ తప్పవండి. ఒకపరి అత్యంత భాగ్యశాలిగా నిలిపే అదే మరోపరి పేదరాలిని చేసి వెక్కిరిస్తుంది. అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. అడిగి పుచ్చుకునేది కాదు ప్రేమంటే అలాగని ఆడిన మాట తప్పిన వారిని మన్నించనూ లేను. తన మౌనం నను నిలువున చీల్చాకనే నేనిలా నీరుగారాను. నాది కుంచించుకుపోతున్న దృష్టో అంచనాలని పెంచుకుపోతున్న దృక్పథమా అని పునరాలోచన. ఏదైనాగాని నా మనోవాంచ మీ అందరి మానసాన్ని పంచుకునేలా చేసింది. నెనర్లు.
ReplyDeleteవర్మ గారు, ఆ తెరల్ని దించివేయాలనే ఈ యత్నం. బీడువారిపోతున్న ఆ హృదయాల్లో ప్రేమ విత్తులు నాటి వేవేల ఏరువాకలు సాగి కోటిప్రేమ ధాన్యాల సేద్యం చేయాలనుంది. జగమంతా ఆ ప్రేమదానం చేయాలనుంది. ఈ మనుషులకి ప్రేమ మనసుకి సంబంధించింది మాటలో, కానుకలో తనని చూపవని ఎలా తెలుస్తుందో. నెనర్లు.
ReplyDelete@ భాస్కర రామి రెడ్డి గారూ :) :)
ReplyDeleteఉషాగారూ ! ఈలింక్ ఒకసారి చూడండి కవితలోనే పరిష్కారముంది .
http://anu-parimalam.blogspot.com/2008/11/blog-post_8573.html
పరిమళం గారూ, అలాగే కానీ ఓటమి ఎరుగకపోయినా గెలుపు కానరాకపోతే అదీ ఓ రకమైన ఓటమే నా వరకు. ఇకపోతే తన మాటలు చెప్పనా చిత్రంగా "నువ్వు సైనికురాలివి అని తెలుసు, నీకు గెలుపు తధ్యం అని తెలుసు" నిజంగా తనవే ఆ మాటలు మీ కవిత మాదిరేవున్నా . అందుకే నా worst enemy, best lover రెండూ తనే.
ReplyDeleteచాలా బాగా చెప్పారు.
ReplyDeleteసుజ్జి, చెప్పాల్సిందే చెప్పాను. చేరాల్సినవారికి చేరిందని గ్రహించాను. కొంత స్పందన వచ్చింది. అది శాశ్వత మార్పుగా పరిణమిస్తే మాత్రం అది దైవికమే కానీ నా మానవ ప్రయత్నం కాదు. ఎంత చిత్రం, చివురాకు వంటి మనసులనీ సృజిస్తాడు, బండరాళ్ళ వంటి గుండెలనీ సృష్టిస్తాడు ఆపైవాడు. ఏదైనా కానీ, కలలకి, కవితలకి, కలతలకీ స్ఫూర్తి మాత్రం ఆ తేడానుండే జనిస్తుంది. నెనర్లు.
ReplyDeleteఎందుకిలా అని, నవ్వు పరిచిన దారిలో అడుగు పడేలోపు
ReplyDeleteకన్నీటి వరద గతుకులు నింపిపోతుంది అంటూ భలే ప్రారంభించారు.
యాంత్రిక మంత్రం జపిస్తూ జీవితం ఏకాంతాన నిర్లిప్త స్వరంతో నిర్వేద గీతం పాడుతుంది అని చెప్పారు. ఇవి చాలవాండీ ఉషగారూ ప్రేమలేమిని సూచించడానికి? భలే.
నాకు ఒకటి అర్థం కాలేదు. లెక్కకందని చింతలకి లేదు భారమితి ??? ఏం చెబుదామనుకున్నారు? చింతల భారానికి మితి లేదనా?
రాఘవ, ఎంత మంచి వారు మీరు. నా వ్యధతో అంగీకరించారు.
ReplyDeleteభా.రా.రె, గమనించారా? నా చిరకాల మిత్రులు వచ్చేసారోచ్.
రాఘవ, భారమితి అన్నది "భారమితి ద్వారా వాతావరణ పీడనాన్ని కొలుస్తారు." అనుసరించి కొలమానం ప్రయోగాన వాడాను. అంటే చింతల పీఢన కొలిచే వీలు లేదని. అసలే తెలుగులో మన శక్తి తక్కువ. ఈ ప్రయోగాల్లో కాసింత వైవిధ్యం కోసం తపన. వెరసి ఒక్కోసారి సూటిగా అందవవి. తరిచినందుకు ధన్యవాదాలు.
చూస్తున్నా చూస్తున్నా..అన్నీ గమనిస్తూనేవున్నా.
ReplyDeleteచూస్తూ చూస్తూ భా.రా.రె. చివరి బెంచీకి బదిలీ ఆయె, [ఇక వెనుకెవరూ లేరట! ;) ]
ReplyDeleteవస్తూ వస్తూ నా వాళ్ళు పండుగ వేడుక తెచ్చారె [ఆనంద్ రాఘవ ల పునరాగమన సంబరమిది! ;) ]
మిగిలివారూ నావారే నవ్వుల పూవులు పంచేనే
నన్ను వదిలిన దిగులు నా ఎదుటి వారికీ ఈయనులే... కనుక మనమంతా ఒకటే భా.రా.రె, వున్నది ఒకటే స్నేహ వర్గం, మన వాదం సాహిత్యం....;) చక్కని అనుభూతి మిగిల్చిన ఘడియలివి. కృతజ్ఞతలు.
ప్రతీ పాదం ఎన్ని ప్రశ్నలడిగిందో చదువుతుంటే.ప్రారంభం,ముగింపు చాలా చాలా బాగున్నాయి.కాదు కాదు...మొత్తం కవిత చాలా చాలా బాగుంది.
ReplyDeleteరాధిక, జీవితాల్లోని వ్యధల్లో చాలా భావ సామీప్యం వుంటుందేమో, అందుకే సంతోషం కన్నా పంచుకుంటే సగం తీరే వ్యధకి మాత్రం సన్నిహితులు మాట కలపటం అన్నది మీ వ్యాఖ్య మరోమారు నిరూపించింది. వీలైతే ఈ వ్యధని వదిలించుకుని నేను ఉల్లాసంగా వ్రాసుకున్న కవిత "నన్ను మరణించనీయవవి!" కూడా చూడండి. నెనర్లు.
ReplyDelete"ఇందుకు అని ఏ ఒక్కరైనా వివరించరా? ప్రేమలేమి అని నాతో అంగీకరించరా?"
ReplyDelete-- ఏ ఒక్కరూ వివరించరు, ప్రేమ లేమి అని అంగీకరించ తోడు ఒక్కరు వచ్చినా ప్రేమ ఉన్నట్టేగా... అంగీకరించకపోయినా ప్రేమ లేమి లేదని అన్నట్టేగా
==
పైనదే నా అసలు స్పందన, కానీ ఇన్ని స్పందనలు చూసాక నా అసలు స్పందన దాచెయ్యాలేమో
ప్రదీప్, వాహ్, ఏమి తాత్పర్యం బోధించారు. ఆ భావ వీచిక నన్ను వదిలిపోయాక ప్రేమ పిపాసినిగా కాక ప్రేమ యాచకురానైనా సరే ఆ లేమిని దూరం చేసుకోవాలనిపించింది. ఒకరి ఆరోపణ నాకు ఆశింపు అధికం అవుతుంది, అందని ఎత్తులు ఎక్కాలనుకుంటున్నాను అని. అయినా ఇందరు తోడుండగా నాకేమి లేమి, అంతా కలిమే... దాయొద్దు, వున్నదంతా విప్పితేనే కదా నా వనమంతా విరాజిల్లేది. కృతజ్ఞతలు - మీ సమయానికి, అభివందనం మీ విశ్లేషణకి.
ReplyDelete