స్వతంత్ర భారతి - స్వేఛ్ఛాగానం

ఏదో ఆలాలన
ఎదలో ఆవేదన

"తెప్పలెల్లి పోయాక
ముప్పు తొలగిపోయిందే
నట్ట నడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే"
ప్చ్ మనసంగీకరించదేం?

"జయ జయ ప్రియ భారతి
జనయిత్రీ దివ్యధాత్రి"
అనేందుకు గళం విడదేం?

"భరత మాత పుణ్య చరిత
భరతభూమి పుణ్యభూమి
భరత ధాత్రి అందుకొనుమిదే
పుష్పాంజలి" నర్తించనని
నా కాలు అడుగు కలపదేం?

ప్రజల చేత ప్రజల వలన
ప్రజల కొరకు పరిపాలన
ఎవరు మాత్రం అవునంటారిక?

వూరు వదిలి వాడ వదిలి
వేల జనులు ప్రాణమిచ్చి
తర తరాల దాస్యం తొలగించి
నిరంతర స్వేఛ్ఛనిచ్చినా
ముందుకు కదలదే స్వతంత్రభారతి!

మనం కాదా కదలాలి ముందు?
జనసమూహంలో ప్రక్షాళన,
యువతరంగంలో స్వచ్చంద దీక్ష
కలిసి మెలిసి సాగినపుడు వెలువడదా
వసుధైక వేదనాదం?

వీరజవాన్లు అందించిన స్వేఛ్ఛాగానం!
జైహింద్ అని జాతిపతాకం నింగికెగయదా?

నిన్న కల కాదా నేటి నిజం.

నేటి యోచన అవదా రేపటి సత్యం!

మహావృక్షమైనా జనించాలి అంకురమై,

మహాశిఖరమైనా అధిరోహణ సంభవమే,

సంకల్పం బుద్దిబలం మన మార్గదర్శకం.

మనకు మనమే కావాలి ఆదర్శనీయం.

**************************************
ఫ్రెండ్స్, If your time permits my old works along these .....

"త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా"

"స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులం!!!"

26 comments:

  1. సంకల్పం బుద్దిబలం మన మార్గదర్శకం.
    మనకు మనమే కావాలి ఆదర్శనీయం.
    జై భారత్ మాత!!

    ReplyDelete
  2. పద్మార్పిత. మీ తొలి వ్యాఖ్యకి కృతజ్ఞతలు. అవును "జై భారత్ మాత!!" అన్నదే నినాదం కావాలి. ఎన్నో Aug 15th celebrations కి ప్రదర్శనలు ఇచ్చాను. ఒకసారి నేనే పాట వ్రాసి, ఒక నృత్యంగా 20 మందిమి సాధన చేసి నర్తించి మన్ననలు పొందాము.
    "జ్యోతి జ్యోతి అందరి మదిలో వెలిగెను జ్యోతి
    ఆ దీపమె చిమ్మెను విద్యా కాంతులని"
    గుర్తు. చాలా సంవత్సరాలై జ్ఞప్తికి రాలేదు. ఈ రోజు వేకువ ఝామున 2:30am కి ఇంకా ఆఫీసు పనిలోవుండగా ఆ పాట గుర్తు చేసుకోవాలనే ప్రయత్నంలో అప్రయత్నంగా వెలికి వచ్చిన వెల్లువ ఇది.

    ReplyDelete
  3. మహావృక్షమైనా జనించాలి అంకురమై,
    మహాశిఖరమైనా అధిరోహణ సంభవమే, ..well said..
    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

    ReplyDelete
  4. ప్రస్తుతం భారతదేశంలో మరో స్వాతంత్ర్య సమర లక్షణాలు నెలకొని వున్నాయి. అప్పుడు తెల్లవాళ్ల అరాచాకాలను, బానిసత్వాన్ని ఎదురించాం. ఇప్పుడు మనవాళ్ల అవినీతిని, పెత్తందారీతనాన్ని ఎదురిస్తున్నాము. ఈ లక్ష్యాన్ని గనక మనము చేదిస్తే, మనకు మనమే ఆదర్శనీయులవుతాము. మీ స్వేచ్ఛాగానం చాలా బాగున్నది. జై హింద్.

    ReplyDelete
  5. చాలా బాగా చెప్పారు. మనలో ఉన్న నైరాశ్యాన్ని వదిలించుకొని నిజమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం ముందుకు కదలాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నా సహచరుడు బ్లాగులో చిన్నది రాసాను చూడగలhttp://sahacharudu.blogspot.com/

    ReplyDelete
  6. సంకల్పం బుద్దిబలం మన మార్గదర్శకం.
    మనకు మనమే కావాలి ఆదర్శనీయం.
    inspiring

    స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. మురళి, ఒకరికి మదిలో ఆలోచన వచ్చింది అంటే మరొకరికి దాన్ని తప్పక సాధ్యం చేసే సంకల్పం, శక్తి వుంటాయంటారు. ఆ శక్తి యుక్తి కల మానవులు మహనీయులు వస్తున్నారు, ఇకపై వస్తారు కదా... నెనర్లు.

    ReplyDelete
  8. saipraveen స్వేచ్ఛాగానం రావాలంటే ఆ పరిస్థితులు సంభవించాలి, ప్రయత్నానికి సంఘటిత నాదం రావాలి, పరిస్థితులు అనుకూలించాలి. మన హక్కు తో పాటు బాధ్యత నేరవేర్చాలి. ఏదో లోపం మన ఆచరణలో అది సరైననాడు అనీ సమకూరతాయి. స్వాతంత్ర పోరాటం నలుమూలలా వ్యాపించిన దీపం, మా నానమ్మవంటి 5 వ తరగతి మాత్రమే చదివిన వారికీ కూడా ఆ ఉద్యమ దీప్తి పూర్తి అవగతం. మా తాతగారు తనవంతుగా అందులో పాల్గున్నారు. మరి ఇప్పుడు ఎంత మంది ప్రేరణ పొందుతున్నాము? ఎంత మంది అవినీతిని నిలవరిస్తున్నాము? This is very subjective. I bring up these to make at least some to contemplate and dwell over their own thoughts. నా వంతు కృషి గురించి త్వరలో. నెనర్లు.

    ReplyDelete
  9. వర్మ, అవును ముందుకు అడుగు పడాలి ఒకరిది అపుడు మరిన్ని అడుగుల అనుచరణ, ఆచరణ సాధ్యం. జాగృతి రావాలి జాగరూకత రావాలి జనప్రగతి రావాలి. అన్నిటికి ముంది సంకల్పం రావాలి, సాధన రావాలి. స్వతంత్రం ఒక్కనాటి పోరాటం కాదు 2-3 తరాలు ఆ దాస్య విముక్తికి ప్రాణత్యాగం చేసారు. భారతావని స్వేఛ్ఛకి ప్రణమిల్లారు, మనచేతికి ఇచ్చారు ఆ ఫలాన్ని. ఎంత కుళ్ళిందీ అన్నది సమాజం అంటే మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కనీసం విత్తు నాటి ముందు తరానికి మరో అంకురాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనది.

    ReplyDelete
  10. హరే కృష్ణ, talking of inspriration - Swami Vivekananda's words along that..
    "You are the creator of your own destiny.
    Be not afraid of anything. You will do marvelous work. The moment you fear, you are nobody.
    All power is within you; you can do anything and everything. Believe in that. ..."
    ***************************************
    yep, life is all about getting inspiration and making dreams, ambitions come true. That takes a lot of determination, hardship yet worth it. Thanks for all support you give, reading adding comments and often times making me rethink before replying you. You open an avenue always.

    ReplyDelete
  11. భా.రా.రె, ధన్యవాదాలు. If your time permits my old works along these .....
    "త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా" http://maruvam.blogspot.com/2009/01/blog-post_08.html
    "స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులం!!!" http://maruvam.blogspot.com/2009/01/blog-post_26.html

    ReplyDelete
  12. >>మరి ఇప్పుడు ఎంత మంది ప్రేరణ పొందుతున్నాము? ఎంత మంది అవినీతిని నిలవరిస్తున్నాము? This is very subjective. I bring up these to make at least some to contemplate and dwell over their own thoughts.

    చాలా బాగా చెప్పారు. మీ వ్యాఖ్యా నన్ను ఈ విషయమ్మీద కులంకషంగా ఆలోచించే విధంగా చేసింది. నెనర్లు.

    ReplyDelete
  13. saipraveen, That is the reaction and realization I expect of anyone that spend a couple of minutes of time here. Thanks for checking back. And I strongly hope, that "Hum Honge Kamyab - we shall overcome one day" and as per the feelings about our motherland ...

    Saare Jahan Se Achchha
    - Muhammad Iqbal

    Better than the entire world, is our Hindustan,
    We are its nightingales, and it (is) our garden abode

    If we are in an alien place, the heart remains in the homeland,
    Know us to be only there where our heart is.

    .

    .

    ReplyDelete
  14. "మనం కాదా కదలాలి ముందు?
    జనసమూహంలో ప్రక్షాళన,
    యువతరంగంలో స్వచ్చంద దీక్ష
    కలిసి మెలిసి సాగినపుడు వెలువడదా
    వసుధైక వేదనాదం?"

    మహాద్భుతమైన మాటలు చెప్పారు. నేను అనుసరిస్తున్నది అదే. ఎవరికి వారే స్వయం శక్తివంతులయి, స్వయందీక్షాపరులయితే భారత జాతి ఎన్నటికీ తిరుగులేని శక్తే.

    జయహో!

    ReplyDelete
  15. "సంకల్పం బుద్దిబలం మన మార్గదర్శకం.
    మనకు మనమే కావాలి ఆదర్శనీయం."

    I like these words.

    ReplyDelete
  16. గీతాచార్య, "నేను అనుసరిస్తున్నది అదే. ఎవరికి వారే స్వయం శక్తివంతులయి, స్వయందీక్షాపరులయితే భారత జాతి ఎన్నటికీ తిరుగులేని శక్తే." very nice to hear that. యువ శక్తి అలా దృఢంగా వుంటే తప్పక మనదే గెలుపు.మా నాన్నగారు పరిచిన మార్గాన పయనిస్తూ నాదైన స్వయంప్రతిపత్తి, సేవానిరతి నేనూ పాటిస్తున్నాను. నాకంటూ ఒక ఆశయం ఆ మార్గాన కార్యక్రమం నడిపిస్తున్నాము. విద్యకి మా వరకు పెద్ద పీట. ఆపై వ్యక్తిత్వవికాసం. ఈ awareness తీసుకురావాలనే మా ప్రయత్నం. మేము అక్కడ వున్నామా లేదా అన్నది కాకుండా మా వలన ఎంత సహకారం అందించగలుగుతున్నామన్నదే మా లక్ష్యం.

    ReplyDelete
  17. సృజన, , ఆ రెండు పంక్తుల్లోనే అసలు స్ఫూర్తి వుంది కదా. మనమంతా ఆ బాటలో పయనించాలి మరో పదిమందికి ఆదర్శం కావాలి. ఇంతకు మునుపు అన్నవే నా మాటలు.
    మన వెనుకతరం మాదిరే మనంకావద్దా ముందుతరానికి మార్గదర్శకం?
    వినరా మన విజయగాథలు రానున్న తరం? కృషితో నాస్తి దుర్బిక్ష్యం.
    నెనర్లు..

    ReplyDelete
  18. మనం ఎదుగుతున్నా మన్నది నిజం. నైతికంగానా అన్నది సందేహం... ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే ఆలోచించుకోవలసిన విషయం.


    పదండి పోదాం ముందుకు. జై భారత మాత... :)

    ReplyDelete
  19. ప్రతి వాక్యం చాలా బాగుంది ఉష :)

    ReplyDelete
  20. ప్రజాస్వామ్యం ఒక సాంప్రదాయం- రాజ్యాంగం ఒక సంస్కృతి గా మారనన్నినాళ్ళూ, ఎన్ని స్వాంతంత్ర్యదినోత్సవాలు జరిపినా ఎన్నిసార్లు జై కొట్టినా పెద్ద తేడా రాదు.

    ReplyDelete
  21. స్వతంత్ర భారతి - స్వేఛ్ఛాగానం : విశ్వప్రేమికుడు, నేస్తం, ధన్యవాదాలు. జీవితంలో ఎదిగేది ఆశ/లక్ష్యంతో, నైతికంగా ఎదిగేది ఆశయంతో, ఆ రెండిటినీ సమన్వయం చేస్తూ ఆచరణ సాధ్యమయేది సమర్థులకే. ఆ సామర్థ్యం రావాలంటే విద్య, జాగృతి జనజీవనంలో భాగం కావాలి. అన్నీ ముడివడిన అంశాలు. ఆ రోజూ వస్తుందనే ఇప్పటికి విస్వాశంవుంచుకుందాము. నెనర్లు.

    ReplyDelete
  22. స్వతంత్ర భారతి - స్వేఛ్ఛాగానం: మహేష్, "ప్రజాస్వామ్యం ఒక సాంప్రదాయం- రాజ్యాంగం ఒక సంస్కృతి" గా మారాలంటే సామాన్యుని పాత్ర ఏమిటి. నా వంతు కృషి చేసినంత కాలం, ఇప్పటికీను నేను ఎదుర్కున్నవివి. "ఎందుకే మగరాయుడిలా ఈ గోలలు నీకు?" "పుట్టుకొచ్చింది ఝాన్సీ లక్ష్మి హక్కు కోసం పోరాడను" "ఊరంతా ఓ దారి అయితే, ఉలిపి కట్టెది ఓ దారి అని నీకెందుకే కొత్త మాట" ఇక అవినీతి అరికట్టటానికి నేను చేసిన ఏ ప్రయత్నమూ సాగనివ్వరు చుట్టూ జనాలు. ప్రభుత్వమిచ్చే నష్ట పరిహారంలో సంతకం తో పాటు ఎకరానికి ఇంతని డబ్బు కొట్టేసే కరణం, కళ్ళ సైగతో లంచం నిర్ణయించే రిజిస్ట్రారు వీళ్ళు పోయినేడు నాను బాధించిన వ్యక్తులు. అంతకు మునుపు air port లో నా hand luggage ప్రక్కకి తీసుకుపోయి అందులో ఏమీ లేవన్నా బెదిరించి డబ్బు వసూలు చేసిన చిరుద్యోగి, నెల ముందు చేయించుకున్న బెర్తులున్నా, సామాను సరిపడే బరువున్నా, పిల్లలిద్దరితో పడుతూ లేస్తూ సర్ధుకుంటుంటే ఒకటికి పది సార్లు మీద మీద పడి ఓ విధమైన ఏహ్యభావం కలిగించిన టి సి. పాస్పోర్ట్ వెరిఫికషన్ కని వచ్చి మచ్చలేని ఉద్యోగ జీవితం వున్న నాన్నగారి వద్ద లంచం తీసుకుంటున్నా నా నోరు నొక్కి పక్కకి లాక్కెళ్ళినవారే కానీ నాకు తోడు వచ్చినవారే లేరు. ఇవి కొన్నే నేను చవి చూసిన అనుభవాలు. ఇలా ఎంతమంది ఎన్నిసార్లు అధమబడ్డాక మన ప్రజాస్వామ్యం మనకి ఇచ్చే హక్కుని అనుభవిస్తామో? తిరగ రాయాల్సిన ఆ రాజ్యాంగం ఇంకెన్నాళ్ళు రాజ్యమేలుతుందో..

    ReplyDelete
  23. నిరాశలోంచీ పోరాటం పుడితే అదే వస్తుంది. నైరాశ్యమే మిగిలి వైరాగ్యం వస్తే అదే ఉనికికి అంతం. స్పూర్తికి చరమగీతం.

    ReplyDelete
  24. జయ జయ ప్రియ భారతి
    జనయిత్రీ దివ్యధాత్రి....

    ReplyDelete
  25. *** మహేష్, స్ఫూర్తి వదులుకోలేను కనుకనే ఈ గీతాలు గానాలు చేసేది, ఆచరణలు, ఆశయాల అమలు చేసేది. ఆ రోజు వరకు నావంతు మరిచిపోను. నెనర్లు.
    *** పరిమళం, అంతేనండి మన జై జై నాదాలే నినాదాలై ఒకనాటికి సంపూర్ణ స్వాతంత్ర్యం వస్తుంది. నెనర్లు.

    ReplyDelete