కంఠోపాఠం

కంటికి పొర కమ్మినాదే
కలువా మరోమారు ఆ కొలనున విచ్చవా?
మనసుకి ముసుగు కప్పినారే
ఎడదా ఈసారీ దోబూచులాడవా?
బ్రతుకుకి తెర తీసినారే
మనిషీ యేదింకోపరి నటించవా?

ఏల నీకా బేలతనం
ఎందుకా కలవరం
వూగిసలాడు లోలకం
నిన్నొదలని మోహావేశం
ఆపతరంకానిదీ పయనం
భావరాగాల కల్లోల సాగరం

అవసరం నీదగు అభినివేశం
అనివార్యం పరుల అభిజాత్యం
పునరావృతం నిను చేరు ఆశనిపాతం
పురోగమనం నీకు తగు హితవచనం
నిరంతరం నీవు చేయు అన్వేషణం
గెలుపోటమికతీతంగా జీవితానికో ఒప్పందం

23 comments:

 1. కంటికి పొర కమ్మినాదే
  కలువా మరోమారు ఆ కొలనున విచ్చవా?
  మంచి వ్యక్తీకరణ.
  జీవితం పట్ల నిబ్బరాన్ని కలుగచేసినందుకు థాంక్స్

  ReplyDelete
 2. వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు

  ReplyDelete
 3. బాగుంది కాని ఈ కవిత మీద ఇంకా వాక్యలు కోసం చూస్తున్నా ..ఇంకేమన్నా కొత్త కోణాలు దొరుకుతాయేమో చర్చ ల్లో:)

  ReplyDelete
 4. వర్మ, కవితాత్మని యథాతథంగా గ్రహించినందుకు ధన్యవాదాలు. ఒక్కోసారి మనకి మనమే నిబ్బరం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదీ అంతే! తప్పిదాలు సరిదిద్దుకోవాలి, ఆశని నిలుపుకోవాలి. ఆగని పయనాన అలుపన్నది ఎరుగక సాగిపోవాలి. తనకు తాను ఒడంబడిక చేసుకున్న జీవితమే మనకి గురువు. పాఠాలు నేర్పుతుంది. పలుకురాళ్ళు పేర్చుతుంది. నెనర్లు.

  ReplyDelete
 5. బ్రతుకుకి తెర తీసినారే
  మనిషీ యేదింకోపరి నటించవా?

  hmmmm.. !

  ReplyDelete
 6. "నిరంతరం నీవు చేయు అన్వేషణం
  గెలుపోటమికతీతంగా జీవితానికో ఒప్పందం"
  Sounds good!

  ReplyDelete
 7. నేస్తం, ఆ పనేదో మీరే చేసి పుణ్యం కట్టుకోకూడదా. అంతా వినోదం చూస్తే తెర తీసేవారెవరు అమ్మాయ్? కొత్త కోణం మీరే వెదికిపెట్టండి ప్లీజ్.

  ReplyDelete
 8. సుజ్జీ, పద కవితాపితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు అన్నాడు కదా...
  "నానాటి బ్రతుకు నాటకము
  కానక కన్నది కైవల్యము
  పుట్టుటయు నిజము, పోవుటయు నిజము,
  నట్ట నడిమి పని నాటకము
  ఎట్ట నెదుట గలదీ ప్రపంచము
  కట్ట కడపటిది కైవల్యము"
  నాది కొంచం లౌకికపరంగా మనకు మనమే స్ఫూర్తి అన్న వచనం ఇది. ఆ కైవల్యము ఆ మార్గానుసరణ తర్వాతి దశలేమో..

  ReplyDelete
 9. పద్మార్పిత, ఆ అన్స్వ్షణే లేకపోతే మొదటి ఓటమి, నిరాశలోనే ముగిసిపోతామేమో? వీటన్నిటికీ అతీతంగా ముందుకు లాగేదే స్ఫూర్తి, బ్రతుకు తనతో తను చేసుకున్న ప్రమాణం. నెనర్లు.

  ReplyDelete
 10. Usha Garu people often rediscover this truth again and again even then this is not kaNTHaopaaTam.

  ReplyDelete
 11. అభినివేశం,అనివార్యం , అభిజాత్యం, ఆశనిపాతం.....పదాల ప్రయోగం చాలా బావుందండీ !

  ReplyDelete
 12. **అవసరం నీదగు అభినివేశం
  అనివార్యం పరుల అభిజాత్యం
  పునరావృతం నిను చేరు ఆశనిపాతం
  పురోగమనం నీకు తగు హితవచనం
  నిరంతరం నీవు చేయు అన్వేషణం
  గెలుపోటమికతీతంగా జీవితానికో ఒప్పందం..

  great lines

  ReplyDelete
 13. * విజయమోహన్ గారు, వెంకటరమణ, భా.రా.రె, ప్రదీప్, వేణూ శ్రీకాంత్, స్పందించినందుకు ధన్యవాదాలు. +ve ధృక్పథాన్ని మరోమారు మనంతా గుర్తుచేసుకోవాలని ఈ ప్రయత్నం.

  ReplyDelete
 14. * హరేకృష్ణ, పరిమళం, మీ మీ స్పందననుసరించి పదాల్నీ, పాదాల్నీ యెంచుకున్నందుకు కృతజ్ఞతలు. నాకు నేనే నేస్తాన్ని అనుకునే సమయంలో వెలికి వచ్చే నిబ్బరం ఇది. నా పయనంలోను, అన్వేషణలోను స్ఫూర్తి నింపే స్వగతం ఇది. నెనర్లు.

  ReplyDelete
 15. గిరీష్, మీ బ్లాగులో వివరంగా వ్యాఖ్యలు వ్రాసాను. మీ స్పందనకి ధన్యవాదాలు.

  ReplyDelete
 16. "yeh jindagi ka raaj nibhaataa chalaa gayaa! har phikar ko dhuyea mein uDaataa chalaa gayaa" .... ii kavita chadavagaanea Tapiimani manasu aa paaTani gurtu cheaseasukundi.chaalaa baagundi!

  ReplyDelete
 17. "వూగిసలాడు లోలకం
  నిన్నొదలని మోహావేశం
  ఆపతరంకానిదీ పయనం
  భావరాగాల కల్లోల సాగరం "
  ఇదీ తప్పదు
  "ఏల నీకా బేలతనం
  ఎందుకా కలవరం"
  ఇదీ తప్పదు.. ఈ రెండో దానిని తప్పించుకోవటం కోసమే కదా ఉషా ఈ పరుగంతా..
  మంచి విశ్లేషణ.

  ReplyDelete
 18. అశ్వినిశ్రీ, నాకొచ్చినంతకన్నా మరింత హిందీ భాషాపరిజ్ఞానమున్న ఒకరితో మీరిచ్చిన ఆ పంక్తికి అర్థం చెప్పించుకుంటే నా కవితకి ధన్యత చేకూరినట్లనిపించింది. ఏదో అపుడపుడూ ఇలా కాసింత తమరి మన్నన పొందే వ్రాతలు నా కలం నుండి జాలువారటం నా భాగ్యం. నెనర్లు.

  ReplyDelete
 19. భావన, ఏదీ తప్పని జీవితాన దేన్నో తప్పించుకోవాలని మరిదేనికో లోబడి, తర్కవితర్కాల్లో మరింత నలిగి ఒక్కోసారి ఇదా జీవితం అని నిస్పృహ, ఒక్కోసారి ఇదే జీవితం అనే నిబ్బరం కలిగించే ఈ మనసుందే అదే మనిషికి వరమూ, శాపమూను. నాదే మునుపు వ్రాసుకున్న కవిత బ్రతుకాటలు http://maruvam.blogspot.com/2009/05/blog-post_17.html వాపోయాను. మళ్ళీ పునరావృతం ఇది. విశ్లేషణకి స్పందించినందుకు కృతజ్ఞతలు.

  ReplyDelete