ఆకలిదప్పులున్నవాడు
నిద్రాహారాలు మాననివాడు
దినపత్రిక వదలనివాడు
ఆమడ దూరం పరుగిడలేనివాడు
ఆలోచనలెరుగనివాడు
ఆటపాటలకి పెదరాయుడు
మాటల కోటలు కట్టెడివాడు
నవ్వుతొ పడగొట్టే వట్టి కోతలరాయుడు
కంటిచూపుకి దొరకనివాడు
కంటినీటికి కరగని వాడు
దాకలో కూరకి నోరూరెడివాడు
చేతికందితే చిలిపి ఆకతాయి వాడు
వూరు బలాదూర్ వాడి తీరు
చినుకు రాలితే బజ్జీకి హోరు
వొడిన వాలితే మహాజోరు
సగటు జీవితాన వాడికి జోహారు
మనసు వెలితిగా వుందంటే
నాకు చేతినిండా పనుందనెడి ఘనుడు
మాట నిలుపుకోను మోసగాళ్ళకి మోసగాడు
ఆవారా ఈవారా వాడు అతి సామాన్యుడు!
నానీ, బుజ్జి, చంటీ, పెదబాబు, కన్నా - ఎవరో!
అతడెవరూకి అసలు సమాధానం వీడేనా? ;)
**********************************
నిజానికి నా చుట్టూ గమనించే ఎందరో "అతడు" లకి ప్రతీక ఈ సామాన్యుడు. నా అతడెవరు? అన్న ప్రశ్నకి కొంచం వ్యంగ్యం, హాస్యం కలబోసి వ్రాస్తే - సరళమైన భాషలో, సాదా సీదాగా, సామాన్యునిగా వచ్చిన వాడు - వీడూ తక్కువ కాదు, అందరివాడు, అందరివంటివాడు, మీవాడు. ;) ఏమంటారు?
మీ జగపతి బాబు (సామాన్యుడు) కేక ... చాల చక్కగా వివరించారు.... ..మీకు తెలుగు బాష మీద పట్టు చాల ఎక్కువే .. ధన్య వాదములు
ReplyDelete"సామాన్య" అంటే
ReplyDeleteసః + మాన్య ? ( గౌరవించ దగిన వాడు)
సమ + అన్య ? ( అన్యులను సమం గా చూసే వాడు)
సామన + య ? ( సమానత్వానికి తీసుకు వెళ్ళేవాడు)
ఎలా తీసుకున్నా వాడు ప్రధమా విభక్తి లో సామాన్యుడే నండోయ్!
:) బాగుంది. బాగా నవ్వుకున్నాను.
ReplyDelete'అతడెవరు' కవిత లో పద ప్రయోగం బాగుంది. అర్ధం అయ్యీఅవనట్లు ఉంది.
కొన్ని పదాలకు అర్ధం తెలియదు.
అమ్మో...ఇలా రహస్యాలు చెప్పేస్తే ఎలాగంటా?
ReplyDeleteగొప్పవాడు సామాన్యుడిలా ఉంటే మహాత్ముడిని చేస్తారు
సామాన్యుడు సామాన్యుడిలా ఉంటే ఇలా గేలి చేస్తారు
ఇక త్రిశంకు స్వర్గమేమైనా ఉంటే చూడండి, అందులో నివాసానికి పోతాము
కానీ "కవిత చదవమంటే చూడాలి నాన్పుడు" -- ఇది మాత్రం అతకలేదు, పంటికింద రాయిలా వచ్చింది ఈ వాక్యం
వారు సహ సామాన్యులే :)
ReplyDeleteసామాన్యుడు- జగపతి బాబు.
ReplyDeleteఅందరివాడు- చిరంజీవి.
అతడు-మహేష్ బాబు కదాఆఆఆఆ.............. నాకు తెలిచిపోయిందీ.................. :-)
బాగుందండీ..
ReplyDeletehahaha..
ReplyDeleteఉష.. ఇలా నిజాలే చెప్తా ఎలాగమ్మా?? మనచుట్టూ ఉన్న సామాన్యులు ఉడుక్కోరూ? ఉన్నది చెప్తే ఎవరికైనా ఉలుకే మరి!! :)
ఉష గారు.. లెస్స పలికారు.!
ReplyDeleteబాగుందండి:):)
ReplyDeleteసామాన్యుడ్ని అసామాన్యుడిగా చేసారు. బాగుంది మీ కవితా కవచం. ఇంక యుద్ధమే..
ReplyDeleteపెదరాయుడు, కోతలరాయుడు, బలాదూర్ , మోసగాళ్ళకి మోసగాడు,సామాన్యుడు,అతడు....అబ్బో చాలామంది హీరోలని కవర్ చేసేశారు ఉషా గారు :) :)
ReplyDeleteకొంపదీసి మహేష్ బాబు కాదు కదా? LOL.
ReplyDeleteVery cool. I like the simplicity.
ప్చ్. నవ్వించిందంతే.
ReplyDeleteI'l be back with something again...
ReplyDeleteఉషమ్మా..... సూపర్... మొత్తం లోటు పాట్లన్ని ఇలా బయట పెట్టేస్తే ఎలా ;-)
ReplyDelete*** ప్రసాద్ గారు, మీరు చక్కని విభజన చేసి నా "సామాన్యుడు" అన్న శీర్షికకి ఓ నిండుదనం ఇచ్చారు. కృతజ్ఞతలు. ఈ మధ్య చూసిన Wednesday సినిమాలో ఒక సామాన్యుడు తలచుకుంటే ఏమి సాధించగలడో చక్కగా చూపారు. నా వరకు స్ఫూర్తి అన్నది ఓ moving bar అందుకే ఆ పాత్రని దృష్టిలోవుంచుకుని అలా పెట్టాను. నా నిజ నాయకుడు ఈ సామాన్యునిలోని లక్షణాలు ఓ 20 శాతం వున్నవాడు, మిగిలినవి నేను ఆపాదిస్తే ఈ కవితలో పాపాలభైరవుడై మోస్తున్నవాడు.
ReplyDelete*** ప్రభాకర్, మీ అభిమానానికి ధన్యవాదాలు.
ReplyDelete*** వెంకటరమణ, నవ్వేసారు కదా, అదే కావాల్సింది నాకూను.
*** భా. రా. రె, లెస్స పలికితివి మిత్రమా! ;)
*** మురళి, Ram, ధన్యవాదాలు.
*** ప్రదీప్, మరదే లోకం తీరు కాదటాండీ. ఇకపోతే ఆడ విశ్వామిత్రనై మీకొక త్రిశంకుస్వర్గం కట్టిస్తాను కానీ మేనక, రంభ కూడా రంగంలోకి దిగాలి మరి, హ హ హ్హా all on lighter vein, venting out the stress.... Thanks for taking the kavita as humor.
ReplyDelete*** విశ్వ ప్రేమికుడు, మీరు మూడు సమాధానాలు ఇచ్చారు కదా? multiple choice 4 is missing which is "D. None of the above" హ హ హ్హా...
ReplyDelete*** జ్యోతి, ఉలుకో ఉలిక్కిపడ్డారో మన ఘనాపాటి ఘరానా దొరలు. :)
ReplyDelete*** సుజ్జీ, ;) you know it all
*** పద్మార్పితా, నచ్చేసాడా మరి మీ వూరు పంపేయనా? ;)
*** వర్మ, ఏకంగా యుద్దమే, అమ్మో అంతలోనే ఇంత శతృత్వమా? ;) నిజానికి వాడు "అనన్యుడు, అద్వితీయుడు" ,.. సరేనా ఇంకా "శ్రేష్ఠుడు, ద్రష్ట" అని కూడా కలపనా..? సంధి చేసేసుకుందామా మరి. నెనర్లు
ReplyDelete*** పరిమళం, మరికొన్ని వదిలేసారు, చంటి, బుజ్జీ కూడా చలనచిత్ర నాయక పాత్రలే. అసలు యుగ పురుషుడు, దసరాబుల్లోడు మిగిలిపోయారు. వ్యాఖ్యల్లో జొప్పిద్దాములే అని వదిలేసా... ;)
ReplyDelete*** గీతాచార్య, అబ్బే కాదు సామీ, మహేష్ ఒకరు direct చేస్తే "అతడు" అయ్యాడు. మన "సామాన్యుడు" స్వయంభువు. ;) "కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారూ సూర్యచంద్రులు.. " గీతానికి తగినవాడు. పాపం మంచివాడే. నేనే కాస్త బద్నాం చేసా. కసి తీర్చుకున్నానోచ్...
ReplyDelete*** సృజన, నవ్విచటమే నా కవిత వంతు. మరో ఉద్దేశ్యం లేదిక్కడ. అయినా మీరు ఇంకా ఏమంటారో చదవాలని ప్రతీక్షిస్తాను.
ReplyDelete***** భావన, నిజాయితీగా ఒప్పుకుంటే తనకి ఓ 50% లెక్కవేయొచ్చు ఈ కళలు, ప్రేమతో 20% కి కుదించి, మిగిలిన 80% అరువు తెచ్చి పోత పోసాను. సామాన్యుడిని చేసి మీకు అప్పజెప్పాను. ;)
ReplyDeleteమీ ఆ "ఉషమ్మ" అన్న పిలుపుతో కళ్ళు చెమర్చాయి, ఎన్ని అనుబంధాలో, ఆత్మీయతలో గుర్తుకొచ్చాయి. నెనర్లు. అందుకే మీ వ్యాఖ్యకి ***** 5 stars
*** ప్రదీప్, మీరన్న పంటి క్రింద రాయో, పలుకురాయో ఏరిపారేసాను. కొంచం నాది కాని బాణీలో ప్రయత్న పూర్వకంగా వ్రాసానేమో, ముందు వచ్చిన వరసల్లో కొన్ని నాకే మనస్కరించలేదు, కానీ అలిసిన తనువూ సహకరించలేదు. అనాలోచితంగా అలాగే వదిలేసి నిద్రపోయాను. తెలవారగనే మీ వ్యాఖ్యకి ముందే సర్దాలని లేచాను. మీరు కూడా అక్కడే పట్టారు. నిజం సుమా! నెనర్లు...
ReplyDeleteబాగున్నాడు మీ సామాన్యుడు, అందరివాడన్నమాట!
ReplyDeleteమాలాంటివాళ్లకోసం అప్పుడప్పుడు ఇలా సరళమైనవి కూడా వ్రాస్తుండాండి:)
*** సిరిసిరిమువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ....;)--"బాగున్నాడు మీ సామాన్యుడు" -- ఆహా ఏమీ నా భాగ్యమూ? డిశంబరు మాసంలో ఒకసారి రవళించిందీ మువ్వ. మళ్ళీ ఇన్నాళ్ళకిలా. తప్పకుండానండి. ప్రయత్నిస్తాను. అసలు క్లిష్టత ఎక్కడదీ నా మరువపు మొలకకీ. మీకు చదవటం రాక కానీ. ;) నెనర్లు...
ReplyDeleteha ha super
ReplyDeleteఆ సామాన్యులందరూ అసామాన్యులమైన మన వాళ్ళే కదండీ. మనమే కడుపులో పెట్టుకోవాలి పాపం...
ReplyDeleteనేస్తం, నేను హ హ హ్హానే, తను కూడా [అంతకన్నా వేరే దారి లేకేనేమో...] ;)
ReplyDeleteఇంతకీ అసామాన్యమైనవాడంటారు మీ సామాన్యుడు. అంతేనా ఉష గారూ ;)
ReplyDeleteశ్రీలలిత, అంతే కదా మరి,కడుపుచించుకుంటే కాలి మీద పడుతుందని.. కదా అంటారు. :) ఇదంతా తూచ్ తూచ్ వరసేనండీ.. సామాన్యుడే సరిజోడు. కావాల్సింది అసమాన్యమైన అనురాగం. దాన్ని పెంచి పోషించేది ఏ జంటలోనైనా ఆ ఇద్దరూనే. నాకు సరీగ్గా గుర్తువుంటే మీది తొలి వ్యాఖ్యా చిలకరింపు మరువపు వనాన, సాదర స్వాగతం + ధన్యవాదాలు. నెనర్లు..
ReplyDeleteమధురా, హమ్మయ్యా, మనసులో మాట మీరు పట్టేసారు. కాస్త మీ పరిశోధనా దృష్టి ఇక్కడ కూడా పెట్టినట్లున్నారు. ;) ఏ మాట కా మాటేను కాసింత ఈ చందాలన్నీ వున్న అందగాడు [నా కళ్ళకి మాత్రమేనని మనవి! ] ;) పాపం ఉతికి ఆరేసాం కదా పసివాణ్ణి.. నెనర్లు..
ReplyDeleteమొత్తానికి ఒక సామాన్యడిని తీసుకొని అసామాన్యుడిని చేసేశారు!! నేను కూడా (అ)సామాన్యుడనే!!గన (గట్టిగా నవ్వడం; Lolz యొక్క తెలుగు వర్షను).
ReplyDeletesaipraveen ఓహో అన్నారంట, సందు చూసుకుని అసామాన్యుడైపోదామనే ;) ఆశ దోశ... మీ "గన" కేక సుమీ.
ReplyDeleteహమ్మయ్య తెలుగులో రాసారే ఈసారి.హిహిహి..బాగుంది. ;)
ReplyDeleteసిరిసిరిమువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ......
ReplyDeleteవ్యాఖ్యలు వ్రాయటం లేదని మీ టపాలు చదవటం లేదనుకోకండి, మీ ప్రతి టపా, దానిపై వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలు పొల్లు పోకుండా చదువుతుంటాను. మీ ప్రతివ్యాఖ్యలు చూసి ఈ అమ్మాయికి ఎంత ఓపిక అని ఎప్పుడూ విస్మయం చెందుతుంటాను. వ్యాఖ్యలు వ్రాసేంత పాండిత్యం ఉండాలి కదా:)
అసలు క్లిష్టత ఎక్కడదీ నా మరువపు మొలకకీ. మీకు చదవటం రాక కానీ.....
హమ్మ్..చదవటం వచ్చు--వ్యాఖ్యానించటమే రాదు, అర్థం చేసుకోరూ!!
పైన అమ్మాయి ఎవరో నాలాంటిదే అనుకుంటాను:))
ఆ ఆ అలగలగలాగే అమ్మాయీ, బాగుండకపోతే ఎలా, మన/మగ ప్రత్యర్థి వర్గాన్ని ఉతికి ఆరేసాం కదా... ;) నాకూ బాష అదీ తెలుగు భాష వచ్చేసిందన్నమాట. "ఆనందమానందమాయే మది ఆశలనందనమాయే..." :) ;హ హ హ్హా..
ReplyDeleteసిరిసిరిమువ్వా, అదన్నమాట సంగతి మన అతిథిదేవోభవకి, వ్యాఖ్యలకి దూరం పెరిగిపోయిందేంటోనని అనుకున్నానిన్నాళ్ళు. మీరన్నమాట కారణం :) తెలుసండి కొంతమంది వ్యాఖ్యలకే వస్తారు. కవిత మనసులోని భావావేశం, వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు కాస్త విజ్ఞానం, కాసింత చతుర సంభాషణలూను. చదువరుల సమయానికి నా కృతజ్ఞత తెలపటం అలవాటు. ఏదో వ్రాతలకాయ [~వాగుడుకాయ] అనుకోండి. థాంక్స్ మళ్ళీ వచ్చివెళ్ళినందుకు....
ReplyDeleteఅబ్బొ బ్రహ్మా౦డ౦ ...భలే ఉ౦ది.
ReplyDeleteసుభద్ర, నా సామాన్యుడు అంతటి ఘనుడు కనుకనే ఇంకా ఇన్ని జేజేలు కొట్టించుకుంటున్నాడు. నాకే కుళ్ళు పుట్టేంత దొంగమొహం. ముసి ముసి నవ్వుల మొనగాడూను. :) థాంక్స్.
ReplyDelete