ఏకాకి

ఒకపరి పరుగాపవా
నీవెంబడి పరుగుల్లో
సొక్కి సోలిపోయె నీ సహవాసి
తొలి ప్రాయం నీ జాడకై
మలి ప్రాయం నీ నీడకై
కుప్ప కూలిపోయె నీ పిపాసి

నిట్టూర్పు సెగలు
నిస్పృహ ఘడియలు
నిదురలేమి శాపాలు
ఎన్ని కాచానిన్నాళ్ళు?

ఆనందభాష్పాభిషేకాలు
విజయదరహాసాలు
మధురానుభూతులు
ఎన్ని కానుకలిచ్చానిన్నాళ్ళు?

అనురక్తికి రక్తాశ్రుతర్పణాలు
అనుభూతికి మరణమృదంగాలు
అభిమానానికి అంతిమయాత్రలు
ఎన్ని ముక్కలుగా నిను పంచానిన్నాళ్ళు?

వెనుదిరగనంటావా? నను వీడి పోతావా?
నీవు లేని నన్ను లోకమేమంటుంది,
హృదయం లేని మనిషనేనా?
నేను లేని నీకు పేరు కూడా లేదు.
అనామికవైనా నీకు నాదే రూపం,
ఏకాకి నాకు నీతోడిదె ఏకాంతం.

42 comments:

  1. నా "నేనూ-తాను" కవితలోని బావార్ధమే ఇందులోనూ కనబడుతొందండి..అంతేనా?మనలోపలి మనిషితో మనం జరిపే ఈ ముఖాముఖి మనలో దాగున్న ఎన్నొ కొత్త కొణాలని మనకు పరిచయం చేస్తూ ఉంటుంది..

    ReplyDelete
  2. నేను లేని నీకు పేరు కూడా లేదు.
    ఈ లైన్ చూసి , తల్లి ఓ పాపాయి కోసం రాసిన కవితనేమో అనుకున్నాను మొదట.
    తృష్ణ గారి వివరణ చదివాక, మళ్లీ ఇంకోమారు చూద్దును కదా..,
    చాల చక్కగా రాసారు.
    అనురక్తికి రక్తాశ్రుతర్పణాలు
    అనుభూతికి మరణమృదంగాలు
    అభిమానానికి అంతిమయాత్రలు
    ఎన్ని ముక్కలుగా నిను పంచానిన్నాళ్ళు?

    ఈ లైన్స్ చూస్తే మీరు లోపలి హృదయం గురించి చెప్పారు అనిపిస్తుంది.
    మరి
    తొలి ప్రాయం నీ జాడకై
    మలి ప్రాయం నీ నీడకై
    ఈ లైన్స్ అర్ధం ఏమిటి,
    కొంచెం వివరించగలరు...!

    ReplyDelete
  3. "నేను లేని నీకు పేరు కూడా లేదు"....beautiful!

    ReplyDelete
  4. "నేను లేని నీకు పేరు కూడా లేదు....
    మదిని ఏకాంత వేళ చిలకగా వచ్చిన వెన్న ఈ పాదం. Hats off to u..

    ReplyDelete
  5. veera sekhar Aditya, ముందుగా మన్నించండి. వివరణలో క్లుప్తతకి తావీయలేను. ఇది "నాలో నేను"వంటి వచన కవిత. హృదయం, మనసు అన్నీ ఆ లోపలి మనిషికి ఇచ్చిన పేర్లు. అసలు వునికి ఈ బాహ్య రూపురేఖలు, హృదయం చేసే తలపులు, కొన్ని చేతలుగా మరతాయి. చేతనలోను, అచేతనలోను అవి మనని ప్రభావితం చేస్తూనేవుంటాయి. ఆశ, నమ్మకం ఇవి వూపిరిగా సాగినా, ఒక్కోసారి నిస్సత్తువ, అంతర్మధనం తప్పవు. కాసేపు విరామం, అలా విశ్రమించి సేదదీరుతాం. మళ్ళీ జీవన పయనం. "తొలి ప్రాయం" - బాల్యం, యుక్త వయసు కలిసిన దశ. పసితనం - ఆలోచనలు వుండవు. అసలు నేను అన్న భావనే లేదు. క్రమేణా నేను జనిస్తుంది. అపుడూ అస్పష్టత, మన అభీష్టమో, మన ఆత్మీయుల ఇష్టమో తెలియని అయోమయం. ఉదాహరణకి - మన ఫ్రెండ్ ఇష్టపడే పని చేయాలనుకుంటాము. ఇక ప్రేమ అన్నది జనిస్తే ఆ మనిషే లోకంగా బ్రతికేస్తాము. ఇంతలో ఏవో ఆశనిపాతాలు, జీవితానుభవాలు - అసలు మనకు/మనతో లేని హృదయం జాడ వెదకటం చివరగా వస్తుంది. "మలి ప్రాయం" - ఇది వాస్తవాధీన రేఖలో నడిచే దశ. మనకి వున్న పరిమితులు, అశక్తత, లోపాలు ఇవన్నీ అవగతం అయిపోతాయి, అయినా వూహల్లో విహారాలు. కొండొకచొ విలాపాలు. హృదయం మాత్రం తన వూపు ఆపదు. ప్రాయం, ప్రాప్తం ఎంచదు. గమ్యం ఒకటి గమనం ఒకటి మాదిరి జీవితం ఇక. అపుడు "మనిషి ఒక చోట, మనసొక చోట" మాదిరి. అందుకే వున్నదని తెలిసిన హృదయం ఎటు పొతే అటు పోతూ దాని నీడ పట్టుకోవాలని చూస్తాము. జీవితానుభవాలు లేనిదే అవగతం కాని భావాలివి. అయినా సగమైనా మీకు అర్థం తెలిసుంటుందని నా ఆశ. ఇలా వెల్లువవటం మరువానికి మామూలే. నెనర్లు.

    ReplyDelete
  6. ఉషా ఎంత మంచి భావన ఎంత సున్నితం గా చెప్పేరు... ఆనందభాష్పాభిషేకాలు
    విజయదరహాసాలు
    మధురానుభూతులు
    ఎన్ని కానుకలిచ్చానిన్నాళ్ళు?

    అనురక్తికి రక్తాశ్రుతర్పణాలు
    అనుభూతికి మరణమృదంగాలు
    అభిమానానికి అంతిమయాత్రలు
    ఎన్ని ముక్కలుగా నిను పంచానిన్నాళ్ళు?
    జీవితానుభూతులను హృద్యం గా మలచినా మీకివే నా అభినందనలు

    ReplyDelete
  7. Beautiful, loneliness befriends!!!

    ఏకాంతాన్నే తోడుగా వర్ణించగలిగితే జీవితంలో తోడులేని క్షణమేదీ?
    మన మనసే మనమీద మనసు పడిందనుకుంటే ప్రేమవరం లేని మనిషేడీ?

    మనసూ, మనిషీ అనేఇద్దరు కలవందే ఏకాకి నామానికి సార్ధకతేదీ?
    ఇక ఏకాకి అనేదేది?
    ఏదీ???

    ReplyDelete
  8. Hmm. Have no words. Will have to follow regularly.

    ReplyDelete
  9. ఉషా ,
    నేను అసలు కవితల జోలికి ,భారి ఆర్టికల్స్ జోలికి వెళ్ళను . వాటిని నేను తట్టుకోలేను. ఇక జీవితములో భారీలు చాలులే అనుకొని ,నాకు నేను చాలా లైట్ గురూ అనుకొని సెటిల్ ఐపోయాను . కాని అదేమిటో ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చిపడ్డాక మీవి , పరిమళం గారి కవితలు నిన్ను వదలి పోలేములే అంటున్నాయి.
    మీ ఈ కవిత చదివాక రెండు గంటలనుండి బయట బాల్కనీ లో చీకట్లో కూర్చొని ఇప్పుడే లోపలికి వచ్చి ఇది రాస్తున్నాను.మీరు ఏ వుద్దేషము తో రాసారో కాని ,
    ఇది చదవగానే ,10 సంవత్సరాల వయసులో నాన్నగారి చేయి పట్టుకొని వచ్చి,62 సంవత్సరాల వయసులో అకస్మికముగా నాన్నగారు చనిపోగా రామాయణము చదువుకుంటూ మేము వెళ్ళినప్పుడల్లా నాన్నగారితో గడిపిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఎవరితోనూ కలవక ఏకాకిగా వున్న అమ్మ,
    70 సంవత్సరాలు కలిసి జీవించిన మా అత్తగారు చనిపోతే ,తల్లిని పోగొట్టుకున్న పసివాడిలా ఆల్లాడి పోతూ నా వెనుకనే తిరుగుతూ వాళ్ళ అనుభందం గురించి చెబుతూ 5 నెలలకే ఆమెను చేరుకున్న మా మామగారు గుర్తుకు వచ్చారు.
    మలి సంద్యలో ఏవరో వకరికి వంటరితనము తప్పదుగదా !
    సారీ , మీ కవితకన్నా పెద్ద కామెంట్ రాసానా ? ఇంకా ఏదో చెప్పాలని వుంది కాని చెప్పలేక పోతున్నాను.

    ఉషా ,
    నేను అసలు కవితల జోలికి ,భారి ఆర్టికల్స్ జోలికి వెళ్ళను . వాటిని నేను తట్టుకోలేను. ఇక జీవితములో భారీలు చాలులే అనుకొని ,నాకు నేను చాలా లైట్ గురూ అనుకొని సెటిల్ ఐపోయాను . కాని అదేమిటో ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చిపడ్డాక మీవి , పరిమళం గారి కవితలు నిన్ను వదలి పోలేములే అంటున్నాయి.
    మీ ఈ కవిత చదివాక రెండు గంటలనుండి బయట బాల్కనీ లో చీకట్లో కూర్చొని ఇప్పుడే లోపలికి వచ్చి ఇది రాస్తున్నాను.మీరు ఏ వుద్దేషము తో రాసారో కాని ,
    ఇది చదవగానే ,10 సంవత్సరాల వయసులో నాన్నగారి చేయి పట్టుకొని వచ్చి,62 సంవత్సరాల వయసులో అకస్మికముగా నాన్నగారు చనిపోగా రామాయణము చదువుకుంటూ మేము వెళ్ళినప్పుడల్లా నాన్నగారితో గడిపిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఎవరితోనూ కలవక ఏకాకిగా వున్న అమ్మ,
    70 సంవత్సరాలు కలిసి జీవించిన మా అత్తగారు చనిపోతే ,తల్లిని పోగొట్టుకున్న పసివాడిలా ఆల్లాడి పోతూ నా వెనుకనే తిరుగుతూ వాళ్ళ అనుభందం గురించి చెబుతూ 5 నెలలకే ఆమెను చేరుకున్న మా మామగారు గుర్తుకు వచ్చారు.
    మలి సంద్యలో ఏవరో వకరికి వంటరితనము తప్పదుగదా !
    సారీ , మీ కవితకన్నా పెద్ద కామెంట్ రాసానా ? ఇంకా ఏదో చెప్పాలని వుంది కాని చెప్పలేక పోతున్నాను.

    ReplyDelete
  10. "తొలి ప్రాయం నీ జాడకై
    మలి ప్రాయం నీ నీడకై" - కవిత మొత్తంలో ఈ రెండు వాక్యాలూ నన్ను వెంటాడుతున్నాయి.
    ఇక మిగిలిన కవిత విషయంలో..

    ఆత్మ, శరీరం కలిసి ఊసులాడుకునే మధుర సమయమే ఏకాంతం.. ఏకాకి ఒంటరితానికి ఆత్మ తోడు దొరికింది ఏకాంతమయ్యింది

    ReplyDelete
  11. తృష్ణ, మీ వూహ సరైనదేనండి. ఎపుడూ తనతో వూసులాడే నేను, నేను తనలోకి కూరుకుపోతున్ననపించినపుడు ఓ లిప్తపాటు విడివడి నాలోని మనిషితో మిగిపోతానిలా, ఇదీ ఓ వృత్తం. నిజానికి నాకు ఈ లోకాన నా మనిషి కన్నా ఈ లోపలి మనిషే ఇష్టం ;)

    ReplyDelete
  12. లక్ష్మీ, చాలాకాలానికి రాక, సంతోషం.
    సుజ్జీ, నెనర్లు
    NOBody, Yep I bet you find value in time spent here not for my posts in deed, but for the knowledge shared by all friends that visit Maruvam. Please do come. Thanks

    ReplyDelete
  13. పద్మార్పిత, వర్మ, మీ ఎంపిక ""నేను లేని నీకు పేరు కూడా లేదు" బాగుంది, అది చెప్పే ఆ హృదయాన్ని లొంగదీస్తాను. మళ్ళీ అయ్యో బెదిరింపనుకుంటుందేమోనని తల్లడిల్లుతాను. ;) థాంక్స్.

    ReplyDelete
  14. భావన, చిక్కటి గుమ్మ పాలని కమ్మటి పెరుగుగా ఎలా చేయాలండి? ఆ కిటుకు మీకే తెలుసనుకుంటాను. మరువపు మాటలకి మీతోడు కలిస్తేనే ఆ కమ్మదనం. నెనర్లు.

    ReplyDelete
  15. ఆనంద్, అంతే కదా ఏకాకి హృదయాన్ని తోడు చేసునే వేళ ఆ ఏకాంతం స్వర్గం. నాకు అరుదుగా వస్తుంది ఈ అవకాశం. తనని వదిలి రాని మది ఎపుడో ఒకసారి నా వూసులకి తొంగిచూస్తుంది. అపుడేం చెప్పాలో తెలియక నాకిలాగైనా మిగిలిపో అని వాపోవటం. అది తన దారి చూసుకు తాను పోవటం.

    ReplyDelete
  16. మాలా గారు, నిజంగా రెండు డజన్ల పంక్తుల కవిత రెండు గంటల పాటు జంటని ఎడబాసిన రెండు జంటల గురించి ఆలోచింపచేసిందంటేనే మీలోని స్పందన, సున్నితత్వం చెప్పకనేచెప్తున్నాయి. భాగస్వామిని హృదయంగా అన్వయించి మీరు పంచుకున్న ఈ అనుభవాలు నిజంగా ఆర్థ్రత అలరారు జ్ఞాపకాలు. ఆ అలల్లో నేను పలుమార్లు మునకలేసాను. మీ అభిమానం మరువం ఎప్పటికీ తన స్వంతం చేసుకోవాలని స్వార్థం పుట్టించారు. చాలా చాలా ధన్యవాదాలు. నిజానికి పాదాభివందనాలు.

    ReplyDelete
  17. ప్రదీప్, "తొలి ప్రాయం నీ జాడకై, మలి ప్రాయం నీ నీడకై" నన్ను వెంటాడే వూహల్ని తప్పించుకోను నేను వెదుక్కున్న వ్యాపకం అది. ఏకాకి-ఏకాంతం మీ మాటల్లో చక్కని సొబగులీనాయండి.

    ReplyDelete
  18. నేను చెప్పాలనుకున్నవి పైన అందరూ చెప్పేశారు.. అయినా.. ఎప్పుడూ.. మీకు అందరో చెప్పే మాటే.. మరో సారి చెబుతున్నా.. చాలా బాగుంది.. కొన్ని కొన్ని అనుభూతులని అక్షరాలలోకి అనువదించలేమేమో అనుకుంటూ ఉంటా అప్పుడప్పుడూ.. అది తప్పని నిరూపిస్తున్నారు మీరు...

    ReplyDelete
  19. నాకు మీ కవిత ఒక్కటే కాదు దానిపై జరిగే విశ్లేషణలు ,విమర్శలు ,అభినందనలతో కూడిన వాఖ్యల తో సహా చదవడం చాలా ఇష్టం :)

    ReplyDelete
  20. మురళీ గారు, మనలో మాట ;) మనసులో మాట: మునుపు ఏమి వ్రాయలన్నా నాకు ముందే దేవులపల్లో, వేటూరో, సిరివెన్నల గారో, ఆత్రేయ గారో, ఆరుద్ర గారో ఆఖరుకి కలల్లో నేనే వాడేసిన వైనంగా వుండేది. ఇప్పుడేమో బ్లాగరు మిత్రులు ఆ కోవకి చేరిపోయారు, వ్యాఖ్యలు కూడా మాటలకి కరువాచిపోతున్నాయి. ఏం చేద్దాం చెప్పండి, అలా copy cat image లో పడి బండి లాగించేయటమే. ;) మీ వ్యాఖ్య చాలా బాగుంది.. నెనర్లు.

    ReplyDelete
  21. నేస్తం, అందుకే "రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ" అని ఆడ పి. యెల్. నారాయణ మాదిరి పాట పాడేది నేను ;) విశ్లేషణలు ,విమర్శలు ,అభినందనలతో నేనే కాదు అందరం కలిసి ఎదుగుతామనే. I personally feel like making Maruvam as an avenue for sharing than me presenting. I only add comments to keep the momentum up and have the responses rolling so that more get benefited. Give and get. Live and learn. నెనర్లు.

    ReplyDelete
  22. బాబోయ్ ఈ పాదాభివందనాలేమిటండీ !
    మీరు ఘంభీరం గా రాసారని ఏదో ఘంభీరంగా బిల్డప్ ఇచ్చాను.అదేదో నొక్కివక్కాణిచినట్లు రెండు సార్లు వచ్చింది .ఎలా వచ్చిందో నాకైతే తెలీదు .నేనే పాపం ఎరుగను !
    ఏదేదో వూహించేసుకొకండి . మనదంతా చల్తే ఫిర్తే టైప్ అండీ బాబూ . అప్పుడప్పుడూ ఆప్యాయంగా పలకరించే మీ అభిమానం చాలు నాకు. మీ పూతోటలోని పూలు చాలు. ఈ వందనాలతో ఘాభరా పెట్టేయకండి ప్లీజ్ .
    మీ అభిమానానికి థాంక్ యు .

    ReplyDelete
  23. మాలా గారు, నిజానికి దీన్నే నాడి చూడటం అంటారు. మీకేమో అది తెలియలేదు. ;) కాళ్ళు పట్టి క్రిందకి లాగటం సినిమాల్లో కూడా చూడలేదన్నమాట. నా ఒక్క మాటకి ఎంత గాబరాగా ఎన్ని మాటలు గుమ్మరించారో చూసారా? హమ్మయ్యా, --1 from the count of పాదాభివందనాల జాబితా! ;) ఇకనేం మనమిక దోస్తులం. ఈ మాట ముందుగా చెప్పారు కాదేమి మరి.నా పూదోట మాలిని మీరే ఇక, వ్రాసిచ్చేసా తీసేసుకోండి. నెనర్లు.

    ReplyDelete
  24. అయ్య బాబోయ్ !పాపం మాల బకిరి !

    ReplyDelete
  25. .....ఇప్పుడేమో బ్లాగరు మిత్రులు ఆ కోవకి చేరిపోయారు, వ్యాఖ్యలు కూడా మాటలకి కరువాచిపోతున్నాయి. ఏం చేద్దాం చెప్పండి.....

    ఉషగారూ
    వింటున్నా ..... వింటున్నా.... :-))

    బొల్లోజు బాబా

    ReplyDelete
  26. చాలా చక్కగా చెప్పారు, క్లుప్తంగా చెప్పి వుంటే ఇన్ని విషయాలు చెప్పేవారుకారేమో.
    మీ వివరణతో, చాలా విషయాలు తెలుస్తున్నాయి, మీ కవిత కంటే మీ విశ్లేషణనే ఎక్కువ విజ్ఞానాన్ని పంచుతుంది.
    మీరు ఇంత చక్కగా బోలెడు విషయాలు చెప్తే ఇంకా చాలా సందేహాలు వచ్చేలా వున్నాయి మాకు.
    నొప్పక, వివరిస్తారని కోరుకుంటూ..

    ReplyDelete
  27. మాలా గారు, all part of చల్తే ఫిర్తే టైప్ అండీ బాబూ ;)
    veera sekhar Aditya, వివరణ నచ్చింది అన్నారు ఆనందం. ఇకపై "వివరిస్తారని కోరుకుంటూ.." అన్నారు తప్పక ఆ అవకాశం మీరివ్వాలే కానీ, నాకు తెలిసుండాలే కానీ వివరించను నాకు మరింత ఆనందం.

    ReplyDelete
  28. బాబా గారు, ఆయనతో పాటే వ్యాఖ్యానించకుండా మౌనంగా వెళ్ళేవార్లూ, "వింటున్నా ..వింటున్నా .." అన్నారా నేనేమో "కంటిని మీ పదకట్టు కలన కంటిని" అంటున్నాను. ;) అవునూ అసలు గురిపెట్టని నా మాటబాణం మీకెలా తగిలింది సార్? ఏదైతే అదయ్యింది కానీ మీరు మాత్రం కదిలివచ్చారు. ఈ మధ్య ఒకప్పుడు శాస్త్రవేత్తనని గుర్తుకొచ్చి పరిశీలన మొదలెట్టానులెండి. ఆ వారా నా మాటల్ని విడమరిచి తరిచాను. ఆలకించండి.
    "ఇప్పుడేమో బ్లాగరు మిత్రులు ఆ కోవకి చేరిపోయారు, వ్యాఖ్యలు కూడా మాటలకి కరువాచిపోతున్నాయి" అన్నది వ్యాఖ్యలు వ్రాద్దామన్నా మనకన్నా ముందుగా ఎవరో ఒకరు వ్రాసేయటం, మనకీ అవే తిరిగి చెప్పక తప్పదని అన్నాను. అలాగే తరిచి తర్కించే వారూ కరువైపోతున్నారు. సద్విమర్శ లేనిదే ఎలా ఎదుగుతాం అనన్నమాట. :) అలాగే ఈ వేగంలో వరవడి బ్రతుకుల్లో ఎంతని సమయం వెచ్చించగలం అన్నదీ ఓ ప్రశ్నే. ఒకటి మానితేనే ఒకటన్నట్లువుంది ఈ కేటాయింపు. కనుక వ్యాఖ్యల్ని కవితలోని గాఢతకి కొలమానంగా అనుకోకూడదు అని తీర్మానించాను. అయినా అయినవారి మాట ఆత్మీయం కాదా?
    ప్రజాకవి కాళోజీ గారి కవితలోని రెండు పంక్తులు నా వ్యాఖ్యలో దొర్లగానే ఓ ఉరుములా గర్జించారు మిమ్మల్ని ఎలా మరవగలనండి? ;) అలాగే ఈ "వింటున్నా" నన్ను ఏమి విన్నారో అని ఆలోచింపచేసింది చాలాసేపు. నెనర్లు...

    ReplyDelete
  29. ఉషా,

    ఏకాకి నాకు నీతోడిదె ఏకాంతం.

    “ఏకాంతం” అంటే కోరుకుని ఒంటరిగా ఉండడం. బలవంతం గా ఉన్నప్పుడు దాన్నే "ఒంటరితనం" అంటారు.

    ఆ "కోరికే" ఏకాకి ని ఏకాంతం చేస్తుంది. తోడు ఇస్తుంది.
    ఆ కోరికని జయించ గలిగితే దాన్నే "కైవల్యం" అంటారు.

    ఏది ఏమైనా నా చేత వ్యాఖ్య రాయించ గలిగింది ఈ ఏకాకి కవిత! బాగుంది.

    ReplyDelete
  30. ప్రసాద్ గారు, ""ఏకాకి" sounded like that it is going to be one of the BEST and most inspiring poems of yours. Trust me, it is lovely. " ఇది నాకు చాలా అత్మీయులైన ఒకరి వ్యక్తిగత అభిప్రాయం [sent to me in am email]. ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే మీరు "ఏది ఏమైనా నా చేత వ్యాఖ్య రాయించ గలిగింది ఈ ఏకాకి కవిత! బాగుంది." అని వ్యాఖ్యానించటం వలన. మొదటిసారి మీకు నచ్చింది. ఏకాకి గా వుండే నాకు ఈ మధ్యనే మరో సహవాసి తోడై అది ఇరువురి మానసిక సహచర్యం గా మారింది. అనేకానేక చర్చల్లో, విజ్ఞాన సముపార్జనలో, మానసిక అండదండల్లో కలిసి ఎదుగుతున్న ఆ బంధం వలనే సాధారణ జీవితం అనుభవిస్తూ ఈ ఆధ్యాత్మికోన్నతి సాధించగ ఆ పరిణామంలోకి ఇపుడిపుడే వస్తున్నాను. ఈ దశ, ఈ గమనాలు అన్నీ దైవికం కావచ్చు. మానవ యత్నం నా నుండి, సాధన ఫలం అటునుండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  31. ఏమైనా సీత (ఉష ) మంచి బాలిక అనుకున్నాను ,రవితేజ అనుకోలేదు సుమా !

    ReplyDelete
  32. మాలా గారు, ఏకాకి సీతనేనండి కాకపోతే ఓల్గా గారి "విలుకత్తె సీత" ని. ;) ఇక రవితేజ అంటే ఇష్టం. ఎందుకు అన్న విషయంలో ఎందరితోనో వాదించి నెగ్గి {రామాయణంలో ఓ పిడకల వేట:- చెప్పానో లేదో నాకు essay writing, debate, elocution లో state level awards వచ్చాయి కూడా నిజంగా. మా DEO గారు దగ్గరుండి Bournvita తాగించి మరీ ప్రోత్సాహించారప్పట్లో. స్కూల్ విసిట్స్ కి వచ్చినపుడు "ఏదా పాప" అని వెదుక్కుని చూసి వెళ్ళేవారు. } So back to topic ఇంకా నెగ్గుతాను అని నొక్కి చెప్తూ, ఇంకా ఇంకా మీకు నన్ను చూస్తే వాడేనేమో ఈ మారుపేరుతో బ్లాగు నడిపేది అనిపిస్తాను చూడండి మరి. ;) ఇక నన్నసలు మరవరు, ఇక ఏకాకిగా ఏముండగలను మీరు తోడుండగా... నెనర్లు...

    ReplyDelete
  33. అభేదాన్ని అందంగా చెప్పారు..ముందనుకున్నా విరహ కవితేమోనని..ఆఖరి లైన్లో విషయం తెలిసిపోయింది.. :)

    ReplyDelete
  34. శివ, మావాడికి చెప్పేసా మహాప్రభో అందరికీ అర్థమయిన నా ప్రేమానురాగాలు, విరహవిలాపాలు నీకు చేరకపోతే నా కర్మ అని వదిలేస్తా అని. కాస్త దారిన పడ్డాడు. అంచేత మన బాణీ ఇపుడు మారింది. ;) jokes apart ఈ కవితకి మూలమైన మనస్థితి చాలా అరుదుగా వస్తుంది. నన్ను నేను కోల్పోతున్నాననో, నాకు నన్ను మిగుల్చుకోవాలనో ఈ ఏకాంత విన్నపాలు. నెనర్లు.

    ReplyDelete
  35. భా.రా.రె, ఇదన్యాయం. హాజరు వేయించుకుని గోడ దూకేసారు. ప్చ్. ;) నన్ను మళ్ళీ ఏకాకిని చేసేసారు. jk Thanks for giving roll call. నెనర్లు.

    ReplyDelete
  36. నేను లేని నీకు పేరు కూడా లేదు.....
    నీవు లేని నాకు, ప్రాణము లేదు..

    ReplyDelete
  37. "నేను", నిజమే కదండి హృదయం/మనసు లేని మనిషి విగతజీవి వంటి వాడే. ఆ మరణసదృశ్య జీవితమూ వ్యర్థమే. అందుకే కదా మనసు చిక్కబట్టుకుని మనకి మనం మిగిలే ఈ ప్రయత్నాలు. ఏకాకి ఏకాంతాన చేయు యోచనలూను. నెనర్లు.

    ReplyDelete
  38. "ఆనందభాష్పాభిషేకాలు
    విజయదరహాసాలు
    మధురానుభూతులు
    ఎన్ని కానుకలిచ్చానిన్నాళ్ళు?"
    చాలా అందంగా చెప్పారండీ....
    దోసిలి చాలదేమో అందుకొనేటందుకు!

    ReplyDelete
  39. పరిమళం, అంతే కదా మరి మన మనసుకి ఆనందం కల్గించటానికేగా ఆలోచనలు, ఆచరణలూను. "ఏకాకి" మనకి తనేగా తోడు. ఆలస్యంగా నైనా తీరిక చిక్కించుకుని అన్నీ చదివారు. ధన్యవాదాలు.

    ReplyDelete