స్వాతంత్రమొచ్చిందని వ్రాయను గుణింతాలునేర్చి,
గణతంత్రమని హెచ్చుతగ్గుల లెక్కలేయను గణితమబ్బించి,
అంతా కలిసివుండాలన్న ఒక్క మాటా విస్మరించి,
నాదిది, నీదది అని ఇంటా బయటా వంతులాడుకుని,
దేశం కుళ్ళిందని వీధులెంట వాదులాడుకుని,
మనం కట్టిన గృహం మనమే కూల్చుకొని,
సగం నేలైన లేని దేశాన్ని నిండా జనంతో నింపేస్తూ
వున్న నీటి వనరుల వూపిరి తీసేస్తూ, వన్య ప్రాణులహరించివేస్తూ,
చెట్టు చేమలు కొట్టివేస్తూ, పొలం పుట్ర చదువులకమ్మివేస్తూ,
అమ్మ నాన్నల ఆలన పాలన పైవాడి దయకొదిలేస్తూ,
మనం అంటే అహం అని వ్యర్థ బ్రతుకు లాగిస్తూ,
పడుతూ, లేస్తూ, చస్తూ, బ్రతుకుతూ, ఇంకోసారి చెప్పేద్దామా,
బోలో స్వతంత్ర భారత్కీ జై, తల్లి భూమిభారతికీ జై, అంటూ వంచన వందనాలు?
ఎందుకంటే మనమంతా ఒక్కటే , స్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులమే!!
ఉష గారు ఒక్క నిట్టూర్పు తప్పా ఇంకేం చేయలేక పోయా మీ కవిత చదివి .. :(
ReplyDeleteనిజమే, నేనూ ఒకప్పుడు చాలా బాధపడేదాన్ని. కానీ కొందరి స్ఫూర్తితో తగు రీతీ కొందరికైనా సాయపడటం మొదలుపెట్టాకా అది కొంచం ఉపశమనమిచ్చింది. కొద్ది కొద్దిగా తను పోగేసిన $100 ఈ ఫిభ్రవరి 1కి విరాళంగా మన దేశానికి పంపుతున్న మా 9 ఏళ్ళ పాపని చూసాక నేనూ మరొకరికి అటువంటి జాగృతి కలుగచేసానని తృప్తిపడ్డాను. ఎందుకంటే తను పుట్టిందీ పెరుగుతున్నదీ విదేశాల్లోనే అయినా తనవారి మూలాలక్కడవున్నాయనీ, తనూ ఏదో విధంగా తోడ్పడాలనీ తెలుసుకుంది కదా. అది చాలు. చిన్న మార్పు పెద్ద పరిణాంఆనికి దారి తీయొచ్చు. మీ అభిప్రాయాలు చదివి నావి పంచుకునే భాగ్యం కలిగిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు.
ReplyDeleteస్వతంత్ర గణతంత్ర యంత్రజీవన తాంత్రికులమే!!
ReplyDeleteభలే
ధన్యవాదాలండి,కొత్త పాళీ గారు. నిజమే కాదాండీ, మన ఈ యాత్రికత్వపుజీవిత చేదునిజాలవి,కాదనలేం, తప్పించుకోలేం. ఎక్కడో విన్న మాట - we are not the rule makers nor breakers
ReplyDeleteఉష, మీరు చెప్పింది నిజం. ఎన్నో రోజులనుంచి నేను అనుకుంటున్న జన్య ఈ రోజు నుంచి మొదలవుతుంది bighelp.org వారి సహకారంతో. నా బ్లాగుకి వెళ్ళి చూడండి వివరాలు కోసం.
ReplyDeleteమీకు తోచిన సహాయం చేయండి.
జన్య, ఇది చాలా చక్కటి కబురు. నా యధోచిత సహాయం తప్పక చేస్తాను. మీ వీలునిబట్టి ఈ క్రింద ఇచ్చిన లింకులో వున్న నా మరో కవిత కూడా చూడండి. నేనూ కూడ మీరు వెళ్తున్న మార్గాన్ని త్వరలోనే అనుసరించగలననే అనుకుంటున్నాను. "అంకురం" అనేసినిమాలో ఒకపాటుంది. "...ముందు అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి..." అని సాగుతుంది. మీ బాటలో మరి కొన్ని అడుగులు వేరొకరివి తప్పక కలుస్తాయనే నా నమ్మకం.
ReplyDeletehttp://maruvam.blogspot.com/2009/01/blog-post_08.html
Thank you Usha.అందరము చేతులు కలిపితే అభివృద్ధి వేగంగా సాగుతుంది.
ReplyDeleteFriends: Just re-posted and this post is not open for comments! Thanks.
ReplyDelete