సూర్యుడు చంద్రుడు వస్తూ పోతూ, చెట్లు గాలులు ఆడుతూ, పిట్టలు పిల్లలు పాడుతూ, పువ్వులు ఆకులు నవ్వుతూ కనిపిస్తారు/వినిపిస్తారు- మబ్బులు ఎగురుతూ వానలు వెదుకుతూ వస్తాయి... మరిక ఎవరో 'ఇదిగో దేవకన్నెల నాట్యాలు , గంధర్వ గానాలు, యక్షినీ మాయలు, కిన్నెర కింపురుష హొయలు, ఆకస గంగలు,' అని ఒక స్వర్గాన్ని ఎందుకు వివరించాలి, నా నిర్వచనం నాకు అందాక!? నేను నా స్వర్గపు ద్వారాలు, ఎల్లలు దాటుకుని ప్రాపంచిక పోకడల నరకం వైపు తొంగి చూడను; చూసినా ఫర్వాలేదు అక్కడ కొన్ని సాహిత్యాలు, సంగీతాలు, సుందరవనాలు స్వర్గం ఖాళీ లేదని అద్దెకి ఉంటున్నాయి, వాటితో సావాసం చేసేస్తా!
No comments:
Post a Comment