విత్తుల పొత్తు విస్ఫోటం

విత్తులు వెదజల్లటమనే ప్రక్రియతో ఆకట్టుకునే ఈ పూవు పేరు డాండలయన్... గాలిగుమ్మటపు తీరుతో ఎగిసిపోతూ ఈ విత్తనాలు ఎటెటో సాగుతాయి, ఒక మెత్తని గోరువెచ్చని తడి నేల వెదుక్కుని దాగిపోతాయి, వసంతం వేళకి మొలకెత్తి పసిడి వన్నెల పూలతో మైమరిపిస్తాయి...ఎప్పుడు మొగ్గ తొడిగాయో నివ్వెరపోయిన నన్ను చూసి రవ్వంత పరిహాసం కలిపిన పరిచితమైన చనువుతో పిలిచాయి ఓ నెల క్రితం  రంగులే పేరుగా రేకలుతోనే రూపురేఖలైన విరులు ఎన్నెన్నో, అందులో త్వరపడి మరుజన్మకి 'మాయ' దారి పరుచుకుంటూ-   2 comments: