నేనో సగం, తానో సగం!

చదివిన కథల చెదురుమదురు జల్లుల్లో
ఎదలో చెల్లాచెదురుగ సొదలు.
మునిమాపులో మొలకెత్తిన గుబులు
నడిరేయికి ఊడలమర్రి. 
నీడనీడ్చుకుంటూ,  నిన్నటి కలని స్మరిస్తూ
అనుకోని జాగారం.
వెనమాటుగా ఆవరించిన వెచ్చదనం
చెప్పకనే చెప్పేటి సమాధానం,
మౌనభాష్యాల నుడికారం.
చెదరని మమతల మిథున భాగ్యం. 

మనిషి పుట్టుకలోనూ ఒంటరే చావులోనూ ఒంటరే అయినా కూడా, నడుమ ఇంకొకరుంటే చాలు, బతుకు వృత్తం పూర్తయిపోతుంది. బాధలయినా వేదనలయినా సంతోషాలయినా ఉత్సాహాలయినా ఆ వృత్తంలోనే, ఆ యిద్దరి మధ్యే. అదృష్టవంతులకే ఈ మిథున భాగ్యం సమకూరుతుందేమో.

6 comments:

  1. "మౌనభాష్యాల నుడికారం.
    చెదరని మమతల మిథున భాగ్యం." ... భలే బాగా చెప్పారు ఉష గారు.

    బ్రతుకును వెలిగించే ఈ స్నేహాన్ని గురించి సిరివెన్నెల గారు చెప్పిన ఈ పదాలు నాకు చాలా ఇష్టం
    "జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
    రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతై ఎదురవదా"
    మీరన్నట్టు ఎంతో అదృష్టవంతులకు కానీ ఈ భాగ్యం దొరకదు. అది లభించీ విలువ తెలుసుకోలేనివాళ్ళు కూడా మరికొందరు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారు, చిక్కని పంక్తులు పంచుకున్నందుకు నెనర్లు...ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల ఆ వరుసక్రమంలో నాకిష్టులైన గీత రచయితలు! ఎప్పుడో ఎక్కడో చెప్పాను సామాన్య మనసుని రంజింపజేసి, జన బాహుళ్యం ఆదరించే సినీగీతాల్లో తరిచి చూస్తె ఎంతో కవిత్వం, అపూర్వమైన పదసంపద లభ్యమౌతుందని..నేను ఏ పాట విన్నా తప్పక ఆ సాహిత్యం వెదుక్కునో, నాకుగా నేను వింటూ రాసుకునో ఆ లబ్ది పొందుతాను- అనుభూతి, అనుభవం కలగలుపుగా తెలిసిన కొన్ని ఈ భావనలు ఇలా వాటికి తగ్గ పదాల్లొ, పాదాలో, పంక్తుల్లో అమురుతున్నాయి. థాంక్యూ!

      Delete
    2. ఇక మీ రెండవ అభిప్రాయం "ఎంతో అదృష్టవంతులకు కానీ ఈ భాగ్యం దొరకదు. అది లభించీ విలువ తెలుసుకోలేనివాళ్ళు కూడా మరికొందరు." ని అనుసరించి నావో రెండు ముక్కలు- 'ఎప్పుడు ఎవరితో ఎలా ముడి పడుతుందో ఎలా ముడి వీడుతుందో తెలియని ఒక చిత్రం జీవితం కొందరికి... పడిన ముడులను ను పదిలం చేసి పడని పాద ముద్ర ల కోసం నేల బారునా నింగి అంచునా దేవులాడే కతనం కొందరిది. దొరికినదే తీసి అగుపడని చీకటి నిన్నల తొర్రలలో తోసి దానికి అర్రులు చాచే వెర్రి తనం... అటు పై అదే జీవిత విధి విధానమని మురిసేది మరి కొందరి గమ్యం.. '

      Delete
    3. ఎక్కడినుంచి మీకీ ముడిపదార్ధాలు?
      ఇలా ఎలా విడదీసి మడతేస్తారు?

      మీదే గ్రహమండీ?
      భూగృహం కాదని ఓ అణుమానం...

      Delete
    4. (అప్పు తచ్చు)
      - అలాగే పిలిచేవాళ్ళం చదువుకున్నప్పుడు...)
      భూ గ్రహం కాదని ఓ అణుమానం...

      Delete
    5. nmraobandi గారు, మీరూ రాస్తారుగా? ముదిసరకు జీవితంలోంచే వస్తుంది, అందులోని ధారణ ఆయా వ్యక్తుల అనేకానేక జీవిత పార్శ్వాలు, అంశాల మీద ఆధారపడీను, కదా! ఈ నేను సుమారు ఏడాది పాటు మూగబోయిన కలాన్ని మోసానీ మధ్యనే! మీ వ్యాఖ్యకి నెనర్లు-

      Delete