తోడై వస్తావా సహోద్యోగి గా?

"కవిత్వం అంటే?" నాకు నేనే వేసుకున్న ప్రశ్నని మోసుకుంటూనే, 
పదిలంగా నా 'కవితాసంకలనం' ఒకటి నీకు పోస్టులో పంపుదామని...

"Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?"

నిర్లిప్తం గా సమాధానం కొరకు వేచిన చెవులతో 
ఇన్నేళ్ళగా ఎన్నో-నవ్వు అద్దకాలతో- ముతకబారిన ముఖాలు,
ఉద్యోగాలు: డాలర్లలో/డాలర్ల కోసం, ఇంద్రియాలు వేలం వేసుకుని 

క్రిమి ఇబ్బంది గా కదులుతోంది లోలోపల: 
గూటి గోడలు ఎక్కుతూ జారిపడుతూ, గుండెజిగటలో కూరుకుపోతూ 

పగిలిపోగల ఆ ఒక్క గుండె చేజార్చుకున్నాను, అక్కరలేని జవాబు

నీరుగారిన ఆశలు, ప్రణాలికలు మనసులో-
దేహం లోపలా వెలుపలా ప్రవహిస్తున్న చీమూ నెత్తురు
బతుకుని ఒరుసుకుని సాగే లజ్జా, బిడియాలు - ఏ జలతత్వం తెలపాలి?

నువ్వు, నేను, తను నిజానికి ఈ మర్త్యలోకం, కదిలే జీవం 
ఏదో ఒకనాటికి Perishable
మరణ సంహిత ఇదే/ను/గా/!? 

విపత్తు ని పొట్లాల్లో చుట్టి విసిరేయగలిగితే,
విశ్వం పట్టటానికి అంతే లోతైన గొయ్యి తవ్వాలి, 

ఇదే, ఈ నానాజాతులకి నాబోటి జీవి తలపెట్టగల 
Potentially Hazardous యోచన

"Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?"

మళ్ళీ అదే నవ్వుతో, విసుగు ధ్వనిస్తూ అదే ప్రశ్న- తెప్పరిల్లాను
కానీ, I grinned back, sort of smiled...
చెప్పగల/అంగీకరించబడే మాట మెత్తగా అప్పజెప్పి

కొత్త సమాధానం కొరకు వెదుకులాట
ఈమారు నాలోని నాకు నేను వేసుకున్న ఇంకొక ప్రశ్న

పువ్వుల్లో ఏదో ఉంటుంది, పసిపాప నవ్వల్లే - ఏమిటది?
పసిపాప కన్నుల్లో దాగి ఉంటుంది వెన్నెలల్లే
సున్నితం గా, లేతగా-

లేత గాలిలో, నీరెండలో కోమలత్వం ఉన్నట్లే

అవన్నీ fragile beings, ఖచ్చితం గా విలువైనవీను

కాలం ఎంత చిక్కగా ప్రవహిస్తుంది, 
ఎన్నిటిని దాటుకుని ఎడతెరిపిలేకుండా...

ప్రశ్న వెనుక ముసురుతూ ఇంకొన్ని మరికొన్ని ఇంకెన్నో! 

అశాశ్వతం కి నిర్వచనం: ఏది? 
ఇదొక్కటీ శాశ్వతం గా దొరికితే బావుణ్ణు
కలవటం, విడిపోవటం, పోగొట్టుకోవటం, నిరీక్షించటం
నిరంతరం దేనికొరకో నశించిపోయే ఉద్వేగాలు
ఊరించే విష ఫలాలు, ఆ ఒక్క బలహీనతనీ
బలం గా చేధిస్తే - 
ఆకాశం దాచుకున్న nonperishable,
సముద్రం పొదివిపట్టిన perpetual శాంతి నిత్య సత్యమై పోదూ!?

యంత్రాలు, యాంత్రిక వైనాలు, ప్రాపంచిక పోకడలు
వీటికన్నా Potentially Hazardous వస్తువులేవి
సముదాయాలు, సమూహాలు గా అవే బండశిలలు- 
మర మనిషి గా మారిన నువ్వు, నేను, మనమంతా!

ఇకిప్పుడు చెప్పు, 

నీ నుంచి, నా నుంచి, మనల్ని కాపాడుకునే వృత్తిని చేపడదామా
మనమిద్దరం ఈ చిన్ని లోకాన్ని రక్షిద్దామా?

"Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?"

విశ్వాల తనిఖీ చేస్తూ - సృష్టి కోసమొక తపాలా వ్యవస్థ కనిపెడుతూ - 
మరణించే వరకు ఓ మహత్తర కార్యం నెరవేరుస్తూ...

కవిత్వమంటే జవాబు అవసరం లేని బతుకు సాగిస్తూ-

లోలోపల పగుళ్ళ సవ్వళ్ళు వినవస్తున్నాయా?
రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక నీకు త్రోవ చూపుతూ-

05/02/2014

6 comments:

 1. Replies
  1. ఎగిసే అలలు గారు, నెనర్లు. నిజానికి ఈ కవీత నన్ను చాలా వేదనకి గురిచేసి, నా భావోద్వేగాలని నేనే తట్టుకోలేని మానసిక స్థితికి గురిచేసి మరీ వెలికి వచ్చింది. అసలా బాధ వర్ణనాతీతం; ఈ కవిత ప్రేరణ ని సగ న్యాయం చేసినట్లె కానీ ఉంచుకోలేక పంపేసా. మీకు కృతజ్ఞతలు.

   Delete
 2. I don't know what to comment, I am speechless. Long ago I was a blogger with history and poetry subjects then left that these days no poetic blog attracted me. This is my first visit to ur page and to my astonishment and I could here again the BEAUTY OF SOUND OF WORDS THAT U WROTE. The rest I must enquire. Sorry that I am not logged in for short of time.
  Plz. continue.

  Sridhar
  dearsridhar@gmail.com

  ReplyDelete
  Replies
  1. Sridhar, Thanks much for that candid feedback. I would like to ask you to revisit my blog. Appreciate your words shared and am indeed content that this poem received the recognition it deserves-

   Delete
 3. ...ఇన్నేళ్ళగా ఎన్నో-నవ్వు అద్దకాలతో- ముతకబారిన ముఖాలు...
  ...గూటి గోడలు ఎక్కుతూ జారిపడుతూ, గుండెజిగటలో కూరుకుపోతూ...
  ...పగిలిపోగల ఆ ఒక్క గుండె చేజార్చుకున్నాను, అక్కరలేని జవాబు...
  ...బతుకుని ఒరుసుకుని సాగే లజ్జా, బిడియాలు...
  ...విపత్తు ని పొట్లాల్లో చుట్టి విసిరేయగలిగితే...
  ...నిరంతరం దేనికొరకో నశించిపోయే ఉద్వేగాలు
  ఊరించే విష ఫలాలు, ఆ ఒక్క బలహీనతనీ
  బలం గా చేధిస్తే...
  ...యంత్రాలు, యాంత్రిక వైనాలు, ప్రాపంచిక పోకడలు
  వీటికన్నా Potentially Hazardous వస్తువులేవి...
  ...సముదాయాలు, సమూహాలు గా అవే బండశిలలు-
  మర మనిషి గా మారిన నువ్వు, నేను, మనమంతా! ...

  సముదాయం సమూహం నుంచి విడివడి
  ఓ బండశిల చెక్కిన సెలాక్షరాలు...
  బహిర్గత పగుళ్ళ సవ్వళ్ళు...

  you are...
  a class of your own...

  ___/\___...


  ReplyDelete
  Replies
  1. Many thanks for taking time to quote the lines you liked and adding a word or two of your true appreciation, Mr. nmraobandi- This has a taken a big toll on me as I responded the first comment. I liked my own thoight as well as struggled a lot to accept the bare realities of life in this day and age too! I yet hope that few hearts could reverse those-

   Delete