శుక్రవారం

Forough Farrokhzad Farsi కవితానువాదం

సందడిలేని శుక్రవారం
బావురుమంటున్న శుక్రవారం
ఇరుకైన పాతసందుల్లా వ్యాకులపెట్టే శుక్రవారం
నలతపడ్డ సోమరి తలపుల శుక్రవారం 
చీదరపెట్టే వంకరటింకర కొనసాగింపుల శుక్రవారం
అపేక్షించని శుక్రవారం
అణకువ కలిగిన శుక్రవారం

ఖాళీ గృహం
ఏకాంతగృహం
పడుచుదనపు తాకిడికి తాళం పెట్టిన ఇల్లు
సూర్యుని కల్పనలు, చీకట్లు ఒదిగిన ఇల్లు 
ఒంటరితనం, శకునం, డోలాయమానాల లోగిలి
తెరలు, పుస్తకాలు, బీరువాలు, పఠాల లోగిలి

అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది,
లోతుగా పారే ప్రవాహంలా 
అటువంటి పాడుబెట్టిన నిశ్శబ్ద శుక్రవారాల ఆత్మగుండా
అటువంటి ఉత్సాహరహిత ఖాళీ గృహపు హృదయంగుండా
అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది

Friday | originally translated from Farsi to English by Ahmad Karimi-Hakkak

Quiet Friday 
deserted Friday 
Friday saddening like old alleys 
Friday of lazy ailing thoughts 
Friday of noisome sinuous stretches 
Friday of no anticipation 
Friday of submission.

Empty house 
lonesome house 
house locked against the onslaught of youth 
house of darkness and fantasies of the sun 
house of loneliness, augury and indecision 
house of curtains, books, cupboards, picture.

Ah, how my life flowed silent and serene 
like a deep-running stream 
through the heart of such silent, deserted Fridays 
through the heart of such empty cheerless houses 
ah, how my life flowed silent and serene.

ఈమె నాకు చాలా నచ్చే కవి (కవయిత్రి అనటం నాకు నచ్చదు కనుక). ఎక్కడో గుండెల్లో ఒక నాడి, నాళం ఆమెది నాదీ ఒకటేననిపించేంత సామ్యం ఉంది మాకు.

07/02/2014

7 comments:


  1. నిజగా ఒరిజినల్ కన్నా ఒరిజినల్ గా ఉంది...
    మీరన్నట్లు మీ నాడికీ నాళానికీ సామ్యంగానే ఉంది...

    వెరసి చాలా బాగుంది...
    పొగడ్తలెక్కువైనా...
    తప్పటం లేదు...
    మీకు కాదు కదా...!!!
    రాతలకు...

    ReplyDelete
    Replies
    1. nmraobandi గారికి, ఈ అనువాదం రెండవ విడత కదా! ఆమె రాసిన ఒరిజినల్ ఎంత వరకు ఆంగ్లానువాదపు ఆత్మలోకి ఒదిగిందో ఎంత నేను అందుకున్నానో తెలియదు. మీకు కాస్తగా నా శైలి తెలుస్తుంది కనుక మీ అభిప్రాయం ఇలా ఉందని అనుకుంటున్నా! నెనర్లు కాక ఏమీ చెప్పను!? :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  2. మీకు కాస్తగా నా శైలి తెలుస్తుంది కనుక
    మీ అభిప్రాయం ఇలా ఉందని అనుకుంటున్నా...

    నిజాయితీగా చెబుతున్నా...
    నేను కూడా ఆ విధంగానే అనుకున్నా...
    పరిచయమైన మీ శైలి నాతో అలా పలికించిందేమోనని...

    మళ్ళీ మళ్ళీ చదివాక...
    నాకున్న చిన్న ఆలోచనా పరిధిలో
    (ఇంగ్లీష్ నుంచి తెలుగుకి)
    ఆత్మ అద్భుతంగా ఒదిగిందని అనుకుంటున్నా...

    ఒక చిన్న సంశయం ...
    'flowed' 'సాగింది'
    లేక సాగుతోంది (continuity)...
    అని చిన్న డౌట్...
    i may not be right...
    just a little suspicious...

    (prayed, not to be mistaken
    as a corrector but a solicitor
    (vinnavinchukonevaadu maatram)

    ReplyDelete
    Replies
    1. Thanks again! This is my 5th poem as per translations, I knew I have a long way to go before I can even say I do such jobs- Yeah perhaps 'సాగింది' or 'సాగుతోంది' could have been better word. I saw yet another translation of the same poem (coincidentally done on same day by one of literary friends Mr. Nauduri Murty. His wording is "ఆహ్! నా జీవితం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఎలా సాగిపోయిందో!". Appreciate your feedback. Feel free to share your views. For short of time my time in blogs is reduced to 10-15min each day, so that might result in delayed response. nenarlu!

      Delete
    2. thank you ma'm for the reception...

      Delete
  3. Just felt placing here few of the comments from the Kavisangamam FB group members:

    Nauduri Murty: Usharani garu, Your translation is certainly better than mine.

    Srinivas Vasudev: కొంతమంది విమర్శకులకి రిపిటీషన్ నచ్చదు. అది ప్రొజాయిక్ అవుతుందని వాదిస్తారు. ఓ లిస్ట్ లా తయారవుతుందట. నాకా పట్టింపుల్లేవుకానీ ఈ భాగం నచ్చింది ""ఇరుకైన పాతసందుల్లా వ్యాకులపెట్టే శుక్రవారం
    నలతపడ్డ సోమరి తలపుల శుక్రవారం "

    Katta Srinivas: కొన్ని పదాలను తెలుగీకరించటంలో నైపుణ్యం,సౌందర్యాత్మక దృష్టుల మేళవింపు మీ యిద్దరినుంచీ తెలుసుకోవాలి. కవిత రాసేయడం కంటే అనువాదం మనసు పెట్టి చేయడం మరింత కష్టమనే విషయం చెపుతున్నట్లు.

    Usha Rani: K Nauduri Murty gaaru, You're way too modest that the dilettante in me just bows down humbly. i am a dwarf standing on the shoulders of giants, sir!!! Thanks for the kind words from you though!

    Krishna Mohan Mocherla: hmm... Good one ... but this should be on Monday ... The only happiest day create by GOD in a week is Friday ... Monday is not created by GOD. Hence I will read this replacing the Friday with Monday

    Usha Rani K: True, we are forced and learn to live in the TGIF "Thank God It's Friday" culture, right? I used to sing for many years "Sunday Bloody Sunday" but not in its true spirit but as put in a perspective of life that sucks and week days creep in to weekend so I was on run 24X7.

    Kavi Yakoob: కవిత, మీరు చేసిన అనువాదం గొప్పగా ఉన్నాయి మరువం ఉష గారు !

    Karimulla Ghantasala: Really good poem and a worthy translation. Kudos.

    Usha Rani K: మీ అందరి స్పందనలకి, అభిప్రాయాల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహానికి నెనర్లు! ఈ కవి మహత్యమే ఆ అనువాదానికి అబ్బిన తేజస్సు-

    ReplyDelete