మేలుకున్నాక కలలు వచ్చే వేళలివి!

విశ్వం వేణువై మోవికి తాకితే
హృదయం ఆలపించే గానానికి
నిదుర రానని మొరాయిస్తే

వాగుల్లోకి జారిపడిన వెన్నెలలు
హొయలొలికించే రాతి శిలలు
పున్నాగ బూరలూదే తుమ్మెదలు
సొబగులీనే కడిమి పూలు

భాష్యాలు పంపినట్లు కలగన్నానని

గుమ్మపాల పొదుగులో తువ్వాయిలు
అమ్మవొడి ఊయలలో పాపాయిలు
ధ్వజ స్తంభపు మేడలో పావురాయిలు
ఏటి గట్లు ఎక్కి దిగుతూ బొమ్మడాయలు

స్వరాలు కట్టాయనీ కలగన్నానని

ఈ ఉదయపు ఘడియల్లో నీతో చెప్పబోతే
నీ నవ్వులో ముడిచిన నా విశ్వపు ఆనవాళ్ళతో ఎదురౌతావేమి,
చెదరని కలతో నీ ఒడిలో నిదురపుచ్చుతూ!?

2 comments:

  1. హాయిని గొలుపుతూ....బాగుంది చాలా...

    ReplyDelete
    Replies
    1. నెనర్లు అనూ. కొన్ని ప్రేరణలు సరైన పదబంధాలతో వెలికివస్తాయిలా!

      Delete