నిశ్శబ్దబేధి టిక్ టిక్మనే గోడగడియారం.
సెగల పొగల వీడిపోయే నీటి ఆవిరి వెంట,
పొంగి పొర్లిపోయే పాలలా నిట్టూర్పుగానం.
సెగల పొగల వీడిపోయే నీటి ఆవిరి వెంట,
పొంగి పొర్లిపోయే పాలలా నిట్టూర్పుగానం.
ముసురు కొరడాలతో గాట్లుపడిన మబ్బు,
కడలిలో దాహార్తి తీర్చుకోను పరుగులిడిన విచిత్రం.
కమ్ముకొచ్చే కలత చెంత కరిగి చెదిరే కన్నీటిశోకం,
పలుకరింపులేవీ మోసుకురాని జీవితకొలమానం.
రిక్తహస్తాల అనురక్తి, తిరిగివెళ్ళను దారి మరిచి,
దిక్కుతోచక మూసిన తలుపునే తడుతూవుంది.
కవితా, నా ప్రాణవాయువా.. నీవూ వేరు పడితే,
వెలితి పడ్డ ఆర్తి, గుండెకి వేయదా ఉరి?
కమ్ముకొచ్చే కలత చెంత కరిగి చెదిరే కన్నీటిశోకం,
పలుకరింపులేవీ మోసుకురాని జీవితకొలమానం.
రిక్తహస్తాల అనురక్తి, తిరిగివెళ్ళను దారి మరిచి,
దిక్కుతోచక మూసిన తలుపునే తడుతూవుంది.
కవితా, నా ప్రాణవాయువా.. నీవూ వేరు పడితే,
వెలితి పడ్డ ఆర్తి, గుండెకి వేయదా ఉరి?
***************************************
దాదాపుగా ఇదే మానసిక స్థితిలో రాసుకున్న ఆర్తి కవితని కాస్త తిరగతిప్పి రాసాను..