కనుమరుగైన మౌనం

మాటలజడికి అలిసిన అధరం
మనసు విప్పుతున్న కూనిరాగం
అమూర్త భావన తొలిగిన సమయం
అస్పష్టపదం తొణికించిన అర్థం

ఏకాంతం సెలవడిన తరుణం
స్వగతం అలిగిన వైనం
కనురెప్ప గునిసిన మురిపెం
కదలిక వలదని కాలానికి విన్నపం

ఎదలో ఒదిగిన అపురూపచిత్రం
ఎదురుగ నవ్విన శుభముహూర్తం
ఎన్ని జన్మలదీ నిరీక్షణం
ఇన్నాళ్ళకి కనుమరుగైన మౌనం