'కూన' రాగం...

నవ్వు కొమ్మన పూచిన చిరువెలుగు,
చెప్పదా చీకటి రోదనకి వీడ్కోలు.

పండువెన్నెల నింపిన కంటిదీపాలు,
పలుకవా కాంతికోలాటానికి ఆహ్వానం.

గుప్పిట దాచిన మురిపెపు మూటలు,
పాడదా ముద్దులొలుకు గారాబం.

రేకు తెరతీసి కన్నుగీటిన కుసుమం,
అద్దదా పసిడి పుప్పొడి పరాగం.

మమత, మాతృత్వం పేనిన పాశం,
కాదా మగువ మనుగడకి ఆధారం.

ప్రకృతిలో జీవం పోతపోసిన వైనం,
మరికాదా అమ్మతనపు ఆనవాలు.