చదువే లోకంగా చదివించిన ఘనవిద్యలెల్లా…
తిరగరాసి మరోమారు మననం చేయించె నిత్యజీవితం
వైద్యునికొరకు అప్పిచ్చువాడిని వెదికాను
అప్పుతీర్చలేక వూర్లు పట్టి ఏర్లు దాటి పరుగిడాను
మేడిపండు సమాజం పొట్టవిప్ప లోటుపాట్ల పురుగులు
లోపమెంచి చిచ్చుపెట్ట లోకులే పలుగాకులని కన్నాను
శతకాలు శతకోటి నేర్చి నీతిచంద్రికలు ప్రీతిగా వినుకుని
పన్నాగాలు పన్నేటి గోముఖవ్యాఘ్రాలను చూసి భీతిల్లా
తల్లితండ్రులందు దయలేని పుత్రులు దేశప్రగతికి వారసులు
తోబుట్టువుల మోసగించు దగాకోర్లు దండనాథులు
సదా ఈ తారుమారుల్లో సతమతమైన నా మానసం
తెలుసుకున్నదొక్కటే పాఠం - జీవితమే గురువు జీవించను నేర్పగ
వినరా అని నేనెవరినీ అడుగను, కనరా అని చాటి చెప్పను
నేర్వని పాఠాలు సాధనచేయ మనిషికో తీరుగ మారును
"సాధన చేయను" - జీవితమే సాధన, ఇక చేయను అనడంలో అర్ధం?
ReplyDeleteలేక "సాధన చేయును" అని ఉండాలా?
"సాధన చేయను" - అన్నది "సాధన చేయటానికి" లేదా "సాధన చేయాలంటే" అని ధ్వనిస్తూ వ్రాసానండి. మీరన్నాక ఆ విధంగా అర్థం కాదేమోనని అనిపించి కొంచం మార్పు చేసాను. అంటే ఎవరి సాధన వారిదే, నేర్చే పాఠాలు వేరే అని అర్థంగా రావాలి. చూడండి మరి అలా వుందా? వ్యాఖానించినందుకు వివరణ తరిచినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteనేర్వని పాఠాలు సాధనచేయ మనిషికో తీరుగ మారును
ReplyDeleteLoud Claps for u :)
జీవితమే గురువు జీవించను నేర్పగ
ReplyDeleteLearn from the mistakes of others. You can't live long enough to make them all yourself
గుర్తొచ్చింది ..బావుంది ఉష గారు
"జీవితమే గురువు జీవించను నేర్పగ" జీవితాంతం నేర్చుకోవలసిందే కదా!
ReplyDeleteచిన్నప్పటి పద్యాలను పాఠాలుగా చెప్పారు ..బావుంది
ReplyDeleteపాఠాల్ని గుణపాఠాల్ని కలిపి ఆసక్తి కరంగా దిద్దారు.
ReplyDeleteఉషాగారూ ! భలే !
ReplyDeleteపద్యాలను కవితలుగా మారిస్తే ఇంకా మధురంగా ఉన్నాయే!
ReplyDeleteబాగున్నది సుమతీ శతకం
ReplyDeleteనిజానికి శతకాలు కూడా ఆ శతకకర్తల జీవన మధనంతో వచ్చినవే కదా. అయితే వాటిలో కొన్ని అజరామరమైన పద్యాలు ఉన్నాయి.
ReplyDelete"ఉప్పుకప్పురంబు..." లాంటివి.
త్వరలోనే మీ జీవితమధనంతో రాయండొక మరువలేని మరువపుశతకం
ReplyDelete"చదివించిరి నను గురువులు..."
ReplyDeleteస్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు.
ReplyDelete* సుజ్జి, వినపడ్డాయి మీ చప్పట్లు వీనులవుందుగా. ;)
* హరే కృష్ణ, మీరు వ్రాసినది నిజమైన జీవిత సత్యం.
* పద్మార్పిత, ఆ అధ్యయనమే మనకి జీవితం పట్ల ఆసక్తిని కల్పిస్తుంది కదా?
* పరిమళం, అవును ఇది భలే పాఠం!!
* బ్లాగ్ చిచ్చు, మహేష్, సుజాత, ఇలా నేర్పించిన పాఠాల్ని నేర్చుకున్న గుణపాఠాల్ని అన్వయించుకోవటం బాగా అలవాటు. అదే ఈ కవితగా జారింది. నెనర్లు.
ReplyDelete* మురళి, నాకు మా నాన్న గారే ఆది గురువు, ఇంకా చదివిస్తూనే వుంటారు. తను చదివినవి నాకు తెలియజెప్తూనే వుంటారు. ఇక నా గురువులంతా చాలా మంచివారు. కొందరికి అనుమానం కూడా నేను లంచాలిచ్చి వారిని నాతో అలా మెసిలేలా చేసానేమోనని. కానీ నను చదివించిన గురువుల పాత్ర మాత్రం మరిచిపోను. నేర్చుకోవటం అన్న కళ వారిచ్చినదే. అందుకే జీవితాన్ని నేర్పుగా అభ్యసించగలుగుతున్నాను. నెనర్లు.
ReplyDelete* ప్రదీప్, ఆ పద్యాన్ని అందుకే విడిచాను, ఆ ముందు రెండు పంక్తుల్లోని మనుషుల్ని సదా చూస్తాము. ఆ మూడో పంక్తి కాస్త పంటి క్రింద రాయి, స్త్రీ వాదిని కదా :) ఇకపోతే మరదే మీతో వచ్చిన తంటా, కథ వ్రాయండి, గ్రంధం వ్రాయండీ నుండి ఏకంగా శతకం వ్రాసేయమంటున్నారే. అయినా మన వల్ల కావవి. ఏదో నేను, నా వనం, నా బుల్లి కవితలు. చాల్లేండివి ఈ జన్మకి.
ReplyDelete* దొ. నా. కొ. గారు, నా నవ సుమతీ శతకం మీకు నచ్చినందుకు సంతోషం. కానీ నన్నొక పెద్ద ఇబ్బందిలో పెట్టేసారే. మిమ్మల్ని మీ పూర్తి పేరుతో ఎలా సంబోధించగలను? చిన్నపుడు నాన్నగారికి జడిసి, "దొ సున్న గ డి ద " == దొంగ గాడిద ఇలా ప్రయోగాలు చేసేదాన్ని. అదే మీ మీద ప్రయత్నిస్తున్నాను. :)
ReplyDeleteచాలా బాగా రాసారండి.
ReplyDeleteఅందుకే.. చదువులు ఎలా వున్నా.. నేర్చింది ఏమీ లేకున్న..
ReplyDeleteజీవితంలో పైకి రావడానికి.. పెద్దలు ...
నొప్పించక తా నొవ్వక
escape అయి తిరుగు వాడు expert సుమతీ
అన్నారు.. బాగుంది ఉష గారు.
ఉష గారూ!
ReplyDeleteమీరు మలచిన తీరు చల బాగుంది.... ఇలా పద్యాలతో కవిత ... భావము చక్కగా అమిరిందండి!
మూలనున్న ముసలమ్మలే రామ కోటి రాయగా లేనిది ఇంత విద్వత్తు పెట్టుకుని మీరు రాయలేరా ? మరీ చోద్యం కాకపోతే...
ReplyDelete(మూలనున్న ముసలమ్మలు నా మీద దాడికి రారాదని, ఏదో మాండలీకం కొద్దీ వాడానని అంతే కానీ వారిపై నాకు ఎలాంటి చిన్న చూపూ లేదనీ తెలియజేసుకుంటున్నా)
"సదా ఈ తారుమారుల్లో సతమతమైన నా మానసం
ReplyDeleteతెలుసుకున్నదొక్కటే పాఠం - జీవితమే గురువు జీవించను నేర్పగ"
ఎంత నిజం కదా చాలా బాగుంది ఉషా శతకం
* తృష్ణ, వెన్నెల, నా బ్లాగుకి సాదర స్వాగతం. ఈ కవిత నచ్చినందుకు సంతోషం. నేను కూడా చదువరుల సద్విమర్శలు, ప్రశంసలు సమన్వయించుకునే ఎదుగుతున్నాను. నెనర్లు.
ReplyDelete* ఆత్రేయ గారు, దాదాపుగా సుమతీ శతకంలోని పద్యాలన్నీ, వేమన పద్యాలు నోటి చివర్నే వుండేవి. మీరు వ్రాసిందీ నిజమే ఆ సత్యాల ఆధారంగానే జీవితం నేర్పేవి అవగతం అవుతున్నాయి. ఎంతైనా పెద్దల మాట చద్ది మూట కదండీ!
ReplyDelete* భావన, అదే చిత్రం కదా, నా తరమా భవసాగర మీదను అనేంతగా విసిగించే జీవితమే రోజుకొక పోకడతో క్రొత్త పాఠం చెబుతుంది. అసలు శతకం అన్న ఆలోచనగా వ్రాయకపోయినా ఈ కవిత ఓ లఘుశతకంగా మీ అందరి మాటల్లో రూపు సంతరించుకుంది. అదే జీవితంలో వింత. నెనర్లు.
ReplyDelete* ప్రదీప్, భలే, విద్వత్తు అంటూ నన్నో విదుషీమణిని చేసేసారు. ;) ఏమన్నా బాగుందా ఇది. ఇపుడు ఎంతమంది స్వాభిమానాన్ని దెబ్బ తీసారో కదా, ఈ ఆముదం చెట్టుని [మరువం/నన్ను] ఒక మహా వృక్షంగా అభివర్ణించి. అయినా ఇలా మునగచెట్టు ఎక్కించటం తగునా? అది విరిగే లోపు దూకాలి. నాకు ఎక్కటం, దూకటం మాత్రమే వచ్చు. అయినా మీరనే ఆ బోటి ముసలమ్మలు [స్వర్గీయ మా నాయనమ్మ, అమ్మమ్మా గార్లకు క్షమాపణలతో ;) వారంటే నాకు ఎనలేని ఇష్టం నిజానికి] అలా చెట్లు, గోడలు ఎక్కి దూకుతానని లబోదిబో మనేవారు. కబాడీ ఆటల్లో దెబ్బలు కొట్టుకుంటానని, అయ్యో దీనికి పెళ్ళెలా అవుతుందా అని తెగ బాధపడిపోయేవారు. నాతో ఆడే మగకుంకలకి మాత్రం ఏ బాధాలేదు. అంచేత నేను చెప్పొచ్చేదేమంటే ముసలమ్మలు రామకోటి వ్రాయరు, నావంటి [పి టి] ఉషల వెంటబడి వెనక్కి లాగుతూ వుంటారు. కనుక ఇపుడు నేను శతక కర్తని కావటానికీ ఆ ముసల(మ్మలు/(య్యలు) అడ్డుగోడలట! అయినా మనం అక్కడికి ఓ నాడు చేరతాం. అపుడు మీ నానుడి/మాండలీకం మనకి ఎదురువస్తుంది. హ హ హ్హా ...
ReplyDeleteఉష గారు,
ReplyDeleteఇది చాలా అన్యాయమండీ,మిమ్మల్ని ఆముద వృక్షమనే సాహసం చేస్తానా? అసలు కలలో కూడా రాని ఆలోచన అది. మునగచెట్టు ఎక్కించాను అన్నారు, సరే ఇది ఒప్పుకుంటా. ఆ ఆముదం మాత్రం ఒప్పుకోను.
నిజమే ఆ దరికి చేరిననాడు ఆ నానుడి నాకు ఎదురొస్తుంది.
మొత్తానికి మీరు శతకకర్త కాను అంటారు. దానికి తప్పు మీది కాదు అని వేరొకరిపై తోసేసారు. భలే
'ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పింపగన్' - తప్పుకున్నా, తప్పుకోజూసినా, తప్పించుకున్నా, తప్పనిసరైనా - అంతా నేర్పించబడిన పాఠమే, ;) కనుక అంతే శతకం వద్దు, పతకం వద్దు, ముందు నన్ను దూకించండి చాలు బాబోయ్.. ;)
ReplyDeleteమిమ్మల్ని ఒకరు దూకించేదేమిటి, మీరే దూకేస్తే :)
ReplyDeleteఉష,
ReplyDeleteమీ కవిత, దానిమీద వ్యాఖలు చూసాక, సుమతీ శతకం లోని ఈ పద్యం గుర్తు వచ్చింది:
ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు, వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ
ప్రసాద్ గారు, నన్నొక మీమాంసలో పడవేసారు "పొగుడుతాండా, తిడతాండా" అని. అర్థం వివరించమని అడిగే లోపు నా చిరు ప్రయత్నమిది. తాత్పర్యం "భూమియందు XXX నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని." లోకి వెళ్ళి, ఎక్కువ తర్జన భర్జన పడకుండా, ఆ "XXX" నా వరకు/నా విషయంలోను వినయం, పరిణితి అని మనవి చేసుకుంటూ, "మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము." కొంచం స్వార్థంతో నాకు మీరిచ్చిన ప్రశంసగా భావిస్తూ, "తగవునకు వచ్చునదియే హాని" అన్నది ఇక్కడ తావు చేసుకోలేదు కనుక "పౌరుషము" చూపాల్సిన అవసరం రాలేదని నొక్కి వక్కాణిస్తున్నాను. ఇంత వివరణ అవసరమా అంటారా, మరదే కదండీ ఇంతకాలం జీవించి నేర్చిన విద్య. జీవితంలో హాస్యం వుండాల్సిందే అని సమయానుకూలంగా జొప్పిస్తుంటాను. మీ ఈ చిరు విహారాల్లో ఈపాటికి మీరది గమనించేవుంటారు. ధన్యవాదాలు.
ReplyDelete'ఇచ్చునదే విద్య' = వేరొకరికి ఇవ్వవలసినది లేదా ఇవ్వదగినది అనే తాత్పర్యం తీసుకోవాలి.మిగతా అన్వయం ఎవరి దృక్కోణం లో వాళ్ళు చేసుకొవచ్చు...
ReplyDeleteప్రసాద్ గారు, ఇది ఉభయతారకంగా వుందండి. మళ్ళీ తొంగిచూసి మరోసారి అర్థం వివరించినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteమీరు రాసే ప్రతి కవిత మాకు చదువు నేర్పుతున్నట్లుగా వుంటోంది. ఇంతమందిని చర్చలోకి రాబట్టిన కవితా శక్తిని చూస్తుంటె సాహిత్యానికి వున్న విలువ అర్ధమవుతోంది. హేట్స్ ఆఫ్ టు యు మేడం.
ReplyDeleteఒక్క మాటలో చెప్పాలంటే పైన అందరి అభిప్రాయాలే నావీ కూడా
ReplyDeleteవర్మ గారు, రచయితతో పాటు చదువరులు కూడా ఆసక్తిగా చర్చింతగలినపుడే కదా మీరన్న నిండుదనం వచ్చేది. అంచేత కవితలోని ఆత్మ తో పాటు మీ అందరి మనోభావాలు కూడా ఇక్కడ సూత్రధారులు. కవితల విషయం మాట్లాడుతున్నాము కనుక http://parnashaala.blogspot.com/2009/06/blog-post_16.html ఒకసారి చూడండి. మహేష్ గారి బ్లాగిది. ఎంతోమంది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అక్కడ. నా పట్లమీరు వ్యక్తం చేసిన సధబిప్రాయానికి ధన్యవాదాలు. ఇపుడు పుట్టలోకి పోయిన ఫీలిగ్ [ఇంతకు మునుపే చెట్టు దిగాను కదా!] ఏ పుట్టలో ఏ పాముందో? ;)
ReplyDeleteనేస్తం, మరిదే ఆలస్యంగా రావటం, ఓ చిన్నమాట చెవినేసి పరిగెట్టేయటం. అదంతా ఆట పట్టించటమే కానీ, మీకున్న ఆ తీరికలేని పనుల్లో ఇలా పలుకరించిపోవటమే తొలకరి జల్లంత హాయి. పాత చింత కాయ పచ్చడి మహా రుచి, ఆరోగ్యకరం, మరువంలో మీ తొలినాటినుండి నేటి వరకు మీ వ్యాఖ్యలు నాకూ అంతే బలాన్నిస్తాయి. నెనర్లు.
ReplyDeletevery good!
ReplyDeletehammayya finally succeeded in sending a comment! hip hip hurrah!
ReplyDeleteయే.... యేహేహే .. భళా, అశ్వినిశ్రీ, పట్టుబట్టి ఆ పట్టు మంకుపట్టుచేసి పట్టినపట్టు ఉడుంపట్టుచేసి అ పట్టు మీద హఠమేసి ముడి బిగదీసి.. హమ్మయ్యా నాకు తెలిసిన ఉపమానాలన్ని వాడేసా, కనుక ఇంత చేసైనా, సరే మరువాన్ని సాధించినందుకు, అందుకో ప్రియ సఖి నా అభివందన నీరాజనం! :) చాలా సంతోషమండి. మీరు వస్తారని తెలుసు, అయినా ఈ గుర్తు మిగల్చటం అదో తుత్తి... ఈ కవిత మెచ్చినందుకు ధన్యజీవిని హిమకుసుమ వనమాలి[ని?]...
ReplyDelete